సబ్ ఫీచర్

పేదరిక నిర్మూలనలో బ్యాంకుల పాత్ర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆర్థికాభివృద్ధితోపాటు సాంఘిక న్యాయం సాధించాలని మన ప్రణాళికలు ఆశించాయి. అయితే, ఈ దిశగా ప్రగతి ఆశించిన స్థాయిలో లేదు. ఈ రెండు లక్ష్యాల సాధనలో బ్యాంకులు కీలకపాత్ర పోషించవలసి వుంది. ఈ కారణం గానే 1969లో 14 వాణిజ్య బ్యాంకులు, 1980లో మరో ఆరు బ్యాంకులు జాతీయం చేయడం జరిగింది. ఇందువల్ల గ్రామ ప్రాంతాలలో బ్యాంకు శాఖల సంఖ్య బాగా పెరిగింది. 1969లో మొత్తం శాఖలలో గ్రామీణ శాఖల శాతం 22 మాత్రమే. 1990 నాటికి ఇది 58కి పెరిగింది. ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులు 2013-14లోనే 7,300 శాఖలను ప్రారంభించాయి. అయితే బ్యాంకింగ్ రంగం ప్రగతిలో అనేక లోపాలు కనపడుతున్నాయి. 2011 జనాభా లెక్కల ప్రకారం దేశంలో 24.67 కోట్ల కుటుంబాలు వుంటే వీటిలో 14.48 కోట్ల (58.7 శాతం) కుటుంబాలకే బ్యాంకింగ్ సౌకర్యాలు అందుబాటులో వున్నాయి.
బ్యాంకులు సమ్మిళిత వృద్ధి దిశగా అనేక పథకాలను అమలుచేశాయి. కొన్ని వర్గాలకు, కార్యక్రమాలకు తక్కువ వడ్డీ రేటుకే రుణాలు సమకూర్చడం జరిగింది. (తారతమ్య వడ్డీరేట్ల పథకం), బిజినెస్ కరస్పాండెంట్ల వ్యవస్థ, ఎన్జీఓల సహాయంతో సూక్ష్మ రుణాలు సమకూర్చడం. స్వయం సహాయక సంఘాలు ఏర్పరచడం, సాంకేతిక సంస్థల స్థాపన వీటిలో ముఖ్యమైనవి.చాలా పథకాలు అమలుపరచినా కేవలం 14 శాతం మంది వయోజనులు మాత్రమే బ్యాంకు రుణాలు పొందుతున్నారు. గ్రామీణ ప్రాంతాలలో ఇది 9.5 శాతం మాత్రమే. దేశంలో 15కోట్ల రైతు కుటుంబాలు వుంటే, వీటిలో 73 శాతానికి అధికారిక పరపతి సంస్థలు అందుబాటులో లేవు.సూక్ష్మ రుణాల రంగంలో బ్యాంకులు కీలక పాత్ర పోషిస్తున్నాయి. స్వయం సహాయక సంఘాలు ఏర్పడ్డాయి. వీటిని బ్యాంకు శాఖలతో అనుసంధానం చేయడం జరిగింది. సూక్ష్మ రుణాల పద్ధతితో గ్రూపు లీడరు రుణాలు చెల్లింపుకు బాధ్యుడు. ప్రతి గ్రూపు పొదుపుకి ప్రాధాన్యం ఇస్తుంది. ఈ మొత్తానికి కొన్ని రెట్లు రుణాలు లభిస్తాయి. గ్రూపు సభ్యులకు తగు శిక్షణ ఇవ్వబడుతుంది. వారు ఆదాయాన్నిచ్చే కార్యక్రమాలు చేపడతారు. ఈ విధంగా బ్యాంకులు బాధ్యతలు తగ్గుతాయి.ఇటీవల కాలంలో సూక్ష్మ రుణాల రంగంలో అనేక అవాంఛనీయమైన ధోరణులు బయటపడ్డాయి. దీనికి ప్రధాన కారణం, పొదుపుకి ప్రాధాన్యం ఇవ్వకుండా కేవలం రుణాలపైనే దృష్టిపెట్టడం. ఆదాయాన్నిచ్చే కార్యక్రమాలు చేపట్టకుండానే లబ్దిదారులనుండి బలవంతంగా బాకీలు వసూలుచేయడం. అసలు సూక్ష్మరుణాల ఆశయాలను తుంగలో తొక్కడం జరిగింది.
మొత్తం పరపతిలో 40 శాతం ప్రాధాన్యతా రంగాలకు సమకూర్చాలి. వీటిలో ముఖ్యమైనవి. వ్యవసాయం, సూక్ష్మ, చిన్న పరిశ్రమలు, విద్య, ఎగుమతులు, ఇండ్ల నిర్మాణం. అయితే, రుణ మాఫీల పట్ల బ్యాంకులు కష్టాల్లో పడ్డాయి. మొండి బకాయిలు విపరీతంగా పెరిగాయి. రుణ మాఫీ, రుణాల పునర్వ్యవస్థీకరణ వల్ల 2013-14లో బ్యాంకులపై పడిన భారం రూ.42,447 కోట్లు.సమ్మిళిత వృద్ధి సాధించడానికి 2014 ఆగస్టు 14న ప్రధాని మోదీ ‘జనధన్ యోజన’ను ప్రకటించడం జరిగింది. ఇది ఆగస్టు 28నుండి అమలులోకి వచ్చింది. 2015 మే 23నాటికి ఖాతాల సంఖ్య 14.99 కోట్లకు చేరుకుంది. డిపాజిట్లు రూ.15,798 కోట్లకు చేరుకున్నాయి. ప్రతి కొత్త ఖాతాదారుడికి ఒక పొదుపుఖాతా, రూ.5,000 ‘ఓవర్ డ్రాఫ్ట్’ ఖాతా తెరిచారు. అయితే, సొమ్ము మొత్తాన్ని ఖాతాదారులు జీవన స్థితిగతులను మెరుగుపరచడానికి ఉపయోగించాలి. నిరుపేదలకు ఏడాదికి రూ.12 ప్రీమియంపై రెండు లక్షల రూపాయల ప్రమాద బీమా (ప్రధానమంత్రి సురక్షా బీమా యోజన) ఏర్పాటుచేశారు. ఒక ముఖ్య విషయం గుర్తించుకోవాలి. కేవలం బ్యాంకు నిధుల ద్వారానే ఒక ప్రాంతం అభివృద్ధి చెందదు. ఆ ప్రాంత అభివృద్ధి శక్తిని, అవకాశాలను పెంచాలి. ముఖ్యంగా వౌలిక సౌకర్యాలను కల్పించాలి. ఇది ప్రభుత్వ బాధ్యత. ఒక ప్రాంతం బ్యాంకు పరపతిని ఎంతవరకు ఉపయోగించుకోగలదో పరిశీలించాలి. దీని ఆధారంగానే పరపతి సమకూర్చాలి.

- డా.ఇమ్మానేని సత్యసుందరం