మెయన్ ఫీచర్

ఉగ్రవాదాన్ని సమైక్యంగా ఎదుర్కోవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వేయేండ్లుగా భారత్ ఉగ్రవాదుల దాడికి గురిఅవుతూనే ఉంది. ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్, అమెరికా, బ్రిటన్, రష్యా, సిరియా, ఇరాక్, సౌదీ అరేబియాలకు కూడా విస్తరించింది. ఉగ్రవాదానికి హిందూ, ముస్లిం, క్రైస్తవ భేదాలు లేవు. ఇదొక పిశాచ తాండవం. ఇదొక భస్మాసుర హస్తం!! ‘‘బాబూ! ఉగ్రవాదం చాలా దుర్మార్గమైనది. తల్లిగా నిన్ను ఆజ్ఞాపిస్తున్నాను. అర్థిస్తున్నాను. ఐఎస్‌ఐఎస్ కార్యకర్తగా పనిచేయవద్దు. కావాలంటే మనం ఈ పట్టణం వదిలిపెట్టి వెళ్లిపోదాము’’అని కొడుకును ఓ తల్లి అర్ధించింది. అంతే! కొడుకు తల్లిని హత్యచేశాడు. ఇది పురాణ కథ కాదు. మధ్యయుగాలనాటి సంఘటన అంతకంటే కాదు. 2016 జనవరి 9వ తేదీనాడు జరిగింది. రాకా అనే పట్టణం సిరియాలో ఉంది. అందులో లీనా అనే వనిత పనిచేస్తూ ఉంది. ఆమె స్వస్థలం తబాకా. ఈమె వయస్సు నలభై సంవత్సరాలు ఈమెకు ఇరవై సంవత్సరాల కొడుకు ఉన్నాడు. అతని పేరు ఆలీ ఫకర్. అతడు ఐసిస్ ఉగ్రవాద కార్యకలాపాలు కొనసాగిస్తున్నాడు. వాటిని నిరోధించాలని లీనా ప్రయత్నించింది. అంతే ఆలీ తన తల్లిని బహిరంగ ప్రదేశంలో అందరూ చూస్తుండగా మెయిల్ సర్వీస్ భవన మైదానంలో తుపాకీతో కాల్చి చంపాడు. ప్రస్తుతం రాకా నగరం ఐసిస్ ఆక్రమిత ప్రాంతంలో ఉంది. ఇక్కడ వీరు ఖలీఫా రాజ్యం స్థాపించారు. (డిఫాక్టో రూల్.) ఈ సంఘటనను సామాజిక కార్యకర్తలు కొందరు ఆ దేశంలో ఖండించారు. మరి భారతదేశంలోని మాన వ హక్కుల సంఘాలవారు స్ర్తివాద రచయిత్రులు ఎందుకు ఖండించలేదు? ఎందుకు తమ పురస్కారాలు తిరస్కరించలేదు?? ఎందుకంటే ఈ పనిచేసింది నరేంద్రమోదీ ప్రభుత్వం కాదు- ఐసిస్ కార్యకర్త. ఈ ఉగ్రవాద సంస్థకు భారతదేశంలోని కొన్ని రాజకీయ పార్టీలు బహిరంగంగా మద్దతును ప్రకటించాయి.
మరో సంఘటన చూపండి: పఠాన్‌కోట వద్ద జైషే మహమ్మద్ సంస్థకు చెందిన ఉగ్రవాదులు 31 డిసెంబరు 2015నాడు దాడిచేసి భారత వైమానిక దళానికి చెందిన అమాయకులను పొట్టన పెట్టుకున్నారు. జైషేమహమ్మద్ సంస్థ అధినేత వౌలానా మసూద్ అసద్ ఒక క్యాసెట్‌ను జనవరి 2016నాడు పాకిస్తాన్‌లో విడుదల చేశాడు. దానిని తమ వెబ్‌సైట్‌లో ఉంచాడు. భారత ప్రభుత్వం ఇక మరణించే తమ సైనికుల శవాలను వరుసగా లెక్కబెట్టుకుంటూ కూర్చోవాలి అని అందులో ఉంది. పఠాన్‌కోటపై జరిగిన దాడిని మసూద్ ప్రశంసించాడు. మరణించిన ఉగ్రవాదులు ముజాహిద్దీన్‌లు అని అభివర్ణించాడు. అమరవీరులు అని ఈమాటకు అర్థం.
‘‘మేము విజయవంతంగా భారత సైనికులను చంపాము. వారిలో అంతర్జాతీయ పతకాలు గెలుచుకున్న సుబేదార్ ఫతేసింగ్, ఎన్‌ఎస్‌జి లెఫ్టినెంట్ కల్నల్ నిరంజన్ సహా ఎంతోమందిని మేము మట్టుపెట్టాము’’ అని గర్వంగా మసూద్ ఆడియో సమాచారం ద్వారా వెల్లడించాడు. అసలు భారత్‌లోకి మేము ప్రవేశపెట్టిన ఉగ్రవాదుల సంఖ్య కూడా సరిగ్గా తెలియని దుర్గతిలో భారత్ ఉంది’’ అని మసూద్ పాకిస్తాన్‌లోని పంజాబ్ రాష్ట్రంనుండి పేర్కొన్నాడు. కాశ్మీరులో భారత్ సైన్యం మా ముజాహుదీన్‌లను చంపినందుకు ఇది ప్రతీకార చర్య- అని అన్నాడు. ఈ ప్రకటన చూచి కొందరు ఆశ్చర్యపడ్డారు. వారికి చరిత్ర తెలియదు. అందుకని ఇంత విద్రోహమా? అనుకుంటున్నారు. 1948లో తెలంగాణ ప్రాంతం విముక్తం కాకముందు కాశింరజ్వీ ఇలాంటి ప్రకటన చేశాడు. క్లారియన్ అనే పత్రిక ద్వారా ప్రతిరోజూ భారత ప్రభుత్వంపై ఇలాగే ఇత్తెహదుల్ మజ్లీస్ విషం కక్కేది. వేద మంత్రాలు ఆగిపోతాయి. బ్రాహ్మణుల యజ్ఞోపవీతాలు కత్తిరింపబడతాయి అని ఏడవ నవాబు ఉస్మాన్ ఆలీఖాన్ ఒక ఉర్దూ కవిత వ్రాశాడు (చూడండి: వందేమాతరం రామచంద్రరావు వీరభద్రరావుగారి ఆంగ్ల రచన హైదరాబాదుపై పోలీసు చర్య.)
కాశ్మీరు అనాదిగా భారత్‌లో అంతర్భాగం. అందాల కాశ్మీరును ఉగ్రవాదులు రక్తపుమడుగులలో నింపారు. దాల్ సరస్సువద్ద కుంకుమ పూలు సహజ ఉషోదయ అరుణోదయ కాంతులు నేడు కన్పడవు. అదొక పీనుగుల పెంట. ఉగ్రవాదులు కరాళ వికటాట్టహాస నృత్యరంగస్థలం. కాశ్మీరు మాత్రమేకాదు ఆక్రమిత కాశ్మీరు మొత్తం నేడొక శ్మశాన వాటికను తలపిస్తున్నది. క్రిస్ట్ఫర్ అనే ఆస్ట్రేలియన్ రచయిత కాశ్మీరుపై ఒక ఆంగ్ల గ్రంథం వ్రాస్తూ పాకిస్తాన్‌వల్ల కాశ్మీరీయులు పొందుతున్న కష్టాలను ఏకరువు పెట్టారు. ఆక్రమిత కాశ్మీరులో ఎలా స్వేచ్ఛ లేదో తెలియజేశారు. అంతేకాదు గిల్గిత్ కాశ్మీరు ప్రజలకు ఓటుహక్కు అంటే ఏమిటో తెలియదు. ఈ మానవ హక్కుల సంఘంవాళ్లు ఏం చేస్తున్నారు?? భారతదేశంలోని సూడో సెక్యులరిష్టులు ఈ దుర్మార్గాన్ని ఎందుకు ఖండించరు? పురస్కార తిరస్కార వీరులకు ఈ దురాక్రమణ దృష్టిలోకి రాలేదా?? గిల్గిత్ పాకిస్తాన్ మహారాజా హరిసింగ్‌కు చెందిన భూభాగం. అది పాకిస్తాన్‌లో ఎలా అంతర్భాగం అవుతుంది?
మాల్దాలో మైనారిటీవర్గానికి చెందిన దేవాలయంపై జనవరి 2016లో దాడిచేస్తే దాడికి ఈ అరాజకాన్ని అరికట్టడానికి ధైర్యం చేయలేదు. కారణం ఓటుబ్యాంకు రాజకీయం. ఈ చిచ్చు 2016 జనవరి 9వ తేదీకి బిహారులోని పూర్ణిమాకు వ్యాపించింది. దానిని నితీశ్‌కుమార్ ఎందుకు అదుపుచేయలేకపోయారు?? విచిత్రమేమంటే ఈ మత కల్లోలాలను బిజెపి మినహా మరే రాజకీయ పార్టీ ఖండించడం లేదు. గిల్గిత్-ముజఫరాబాద్‌లలో లక్షల మంది రోడ్లమీదికి వచ్చి మమ్మల్ని చైనాకు అమ్మవద్దు- మాకు పాకిస్తాన్ నుండి స్వేచ్ఛకావాలి అనటం నిజమా కాదా?? గిల్గిత్ పాకిస్తాన్‌లో నేడు రూల్ 73 కింద వారి స్వంత భాష సంస్కృతులను అణచివేసింది.
పఠాన్‌కోటపై జరిగిన దాడిలో ఇంటి దొంగలు సర్వీందర్‌సింగ్‌తోబాటు బిఎస్‌ఎఫ్ 52 బెటాలియన్ జవాను ఒకరు పట్టుబడ్డారు. ఇంకా ఎందరు జయచంద్రులు అరబ్బీ ప్రభువులు దేశంలో ఉన్నారో తెలుసుకోవాలి. లాహోరు వెళ్లి నరేంద్రమోదీ నవాజ్‌షరీఫ్‌గారి తల్లిగారికి నమస్కరించటం నితీశ్‌కుమార్‌కు నచ్చింది. కాని లల్లూప్రసాద్‌యాదవ్‌కు నచ్చలేదు. అంటే భారతదేశంలో అందరు తమతమ రాజకీయ ప్రయోజనాల దృష్ట్యా దేశ విదేశాంగ విధానాలను అంచనావేసుకుంటున్నారని తాత్పర్యం. ఇలాంటి దేశభక్తిలేని దేశం కాబట్టే వేయేండ్లు విదేశీయులు పాలించగలిగారు.
పఠాన్‌కోటపై పాకిస్తాన్ దాడి ఆకస్మికంగా భావోద్రేకాలతో జరుగలేదు. పకడ్బందీ పథకంప్రకారమే నిర్వహించారు. కారులో ఉగ్రవాదులు భారత సరిహద్దులలోకి ప్రవేశించారు. అంతకుముందే ఆయుధాలు పఠాన్‌కోట వైమానిక స్థావరంలోకి ప్రవేశించడం ఆశ్చర్యకరమైన విషయం. సైనిక దుస్తుల్లో ఉగ్రవాదులు విమానాశ్రయంలోకి వస్తుంటే సెక్యూరిటీ గుర్తించలేకపోయింది. స్థావరం చుట్టూ పది అడుగుల ఎతె్తైన గోడ ఉంది. అది దూకి లోపలికి వచ్చారని నమ్మలేము. అంటే చాలాకాలంగా ఇక్కడి వ్యక్తులతో సత్సంబంధాలు కొనసాగించుకున్నవారే ఇలా చేయగలిగారు. లేకుంటే అంత భారీస్థాయి మందుగుండు సామాను ఎలా ఎయిర్‌బేస్‌లోకి వచ్చింది? మరో సంఘటన చూద్దాము. మాల్దా, బంగ్లాదేశ్ సరిహద్దులో ఉంది. అక్కడికి ఉగ్రవాదులు భారీఎత్తున ప్రవేశించటం చాలా సులభం. ఉత్తరప్రదేశ్‌లో ఎవరో ఉపన్యాసం ఇచ్చారు. బెంగాల్‌లోని మాల్దాలోని మైనారిటీలకు కోపంవచ్చి నేషనల్ హైవేపైకి వచ్చారు. వీరి సంఖ్య లక్షాయాభైవేలు. వీరు చేసిన మొదటి పని పోలీసుస్టేషను తగలబెట్టడం. అంటే భారత రక్షణ వ్యవస్థమీద దాడి అని అర్థం. పోలీసుస్టేషనులోని నేరస్థుల రికార్డులన్నీ దగ్ధమైనాయి. చూస్తుండగానే బిహారులోని సెక్యులర్ వీరులు బెంగాల్‌లోకి ప్రవేశించి ప్రజలను రెచ్చగొట్టారు. జెడియు పార్టీ యంపి బిహారు నుండి బెంగాల్‌కు ఎందుకు వచ్చినట్లు? క్షణాలల్లో మాల్దా మంటలు పూర్ణిమా చేరాయి. ఇలా ఎందుకు జరిగింది? అంటే బెంగాల్‌లో త్వరలో ఎన్నికలు రాబోతున్నాయనేది ప్రధానాంశం. ఏదో తాత్కాలిక ఉద్రేకాలలో ఈ సంఘటనలు జరుగలేదు. ఐదురోజులకు ముందే వాల్‌పోస్టర్స్ వేశారు. కరపత్రాలు పంచిపెట్టారు. అంటే ఇది పథకం ప్రకారం జరిగిందని తెలుస్తున్నది కదా? యు.పి.లో అజంఖాన్ బిహారులోని గులాం అయి లాబీలకు ఈ మాల్దా సంఘటనతో ఏం పని? మమతాబెనర్జీ మాట్లాడుతూ లా అండ్ ఆర్డర్ అదుపులోనే ఉన్నదని 144వ సెక్షన్‌ను విధించారు అని చెప్పింది. దీనిని మత కల్లోలంగా కాక బి.ఎస్.ఎఫ్. జవాన్లకు స్థానికులకు మధ్య జరిగిన గొడవగా ఆమె చిత్రీకరించారు. ఇది నిజమేనా?
ఎప్పుడు అయినా దానికి కానిదానికి విమర్శలు చేసే లల్లూయాదవ్‌లు అరవింద్‌కేజ్రీవాలాలు ఇప్పుడు ఎందుకు మాట్లాడటం లేదు? ఎందుకంటే ఈ దాడులు నిర్వహించింది మాల్దాలోని ముస్లిములు వారికి మద్దతునిచ్చింది ఉగ్రవాదులు. నిజనిర్ధారణ కమిటీని దీదీ మాల్దాలోకి ప్రవేశించకుండా తిప్పికొట్టింది. ఇది తగునా?? లోగడ దాద్రీ ఘటనలో మరో సెక్యులర్ పూజారులు విపరీతంగా స్పందించారు. యాభై మంది పురస్కారాలు తిరస్కరించారు. మాల్దా ఘటనకు ఒక్కరూ పురస్కారం తిరస్కరించలేదు. ఇక్కడ మానవ హక్కులకు భంగంకలిగినా ఎవరూ పట్టించుకోలేదు. కారణం మాల్దా మారణహోమంలో పాల్గొన్న లక్షాయాభైవేల మంది, ముస్లిం మైనారిటీ వర్గానికి చెందినవారు. ఇలా మెజారిటీ- మైనారిటీ అంటూ ప్రజలను విభజించి చూడటం తగునా??
హిందువులు చేసే నేరం ముస్లిములు చేస్తే సుమహారం అవుతుందా?? మానవులంతా చట్టంముందు ఒకటి కాదా?? టర్కీలోని ప్రముఖ నగరం ఇస్తాంబుల్‌లో సెంట్రల్ పాయింట్‌లో జనవరి 12 మధ్యా హ్నం ప్రధానమైన టూరిస్టు సెంటర్లో ఐఎస్‌ఐ ఉగ్రవాదులు బాంబులు పేల్చారు. దీనివల్ల భారీ నష్టం వాటిల్లింది. ఎన్‌క్వైయిరీలు జరిపిన తర్వాత దోషులను శిక్షిస్తామని ప్రభుత్వం అనడం రొటీన్‌గా జరుగుతుంటాయి. కానీ మానవుని మస్తిష్కంలోని ఈ విధ్వంసానికి అంతం లేదా? పఠాన్‌కోట్‌లో జరిగిన దారుణానికి సాక్ష్యాలు చూపిస్తే ఈ సాక్ష్యాలు బలంగా లేవు అని నవాజ్‌షరీఫ్ తీర్పునిచ్చారు. దీనికి ప్రపంచ అధినేతలు ఏమంటారు? మొన్న ఆఫ్రికాలో బాంబులు పేలాయి. నిన్న ఇండోనేసియా దద్దరిల్లింది. ఇవ్వాళ హర్యానాలో అబ్దుల్ సమీ అనే అల్‌ఖైదా ఉగ్రవాదిని అరెస్టు చేశారు. ఈ విధ్వంసానికి అంతం ఎప్పుడు? రాజకీయాలకతీతంగా అంతా సమైక్యంగా ఎదుర్కోవలసిన సమయమిది.

చిత్రం... మాల్డా విధ్వంసకాండ దృశ్యం

- ముదిగొండ శివప్రసాద్