సబ్ ఫీచర్

కీలకం కానున్న మేక్ ఇన్ ఇండియా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మన దేశంలో శాస్తవ్రేత్తలకు కొదవ లేదు. ఎంతో ఉన్నతమైన పరిశోధనలు వీరు చేస్తున్నారు. అయితే సమస్య ఎక్కడ వస్తున్నదంటే, శాస్తవ్రేత్తలు చేస్తున్న పరిశోధనా ఫలితాలు కేవలం సైన్స్ పత్రికలలో ప్రచురణలకే పరిమితం అవుతున్నాయి. అవి ప్రజలకు చేరడం లేదు. పాలకులు కూడ వివిధ రంగాలలో పరిశోధకులకు తగిన ప్రోత్సా హం ఇవ్వడం లేదు. అందువలన, ఎక్కువ మంది పరిశోధనల వైపుకు వెళ్ళడం లేదు. పదవోన్నతులు, ఉన్నత స్థాయికోసం పరిశోధనలు చేసేవారే ప్రస్తుతం మన దేశంలో ఎక్కువగా ఉన్నారు. ఈ పరిస్థితులను మార్చడానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ శ్రీకారం చుట్టారు. ప్రధాని ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘‘మేక్ ఇన్ ఇండియా’’ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి కృషిచేస్తున్నారు. ఆధునిక శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకొని, మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ప్రజల ప్రాథమిక అవసరాలలో విద్య, వైద్యాలు అత్యంత కీలకమైనవి. అయితే, దురదృష్టం ఏమిటంటే ఆయా రంగాలలో ప్రభుత్వ ప్రోత్సాహంతో ప్రైవేటు సంస్థలు వేళ్ళూనుకుపోయాయి. దీంతో విద్య వైద్యం సామాన్య ప్రజలకు అందుబాటులో లేకుండాపోయాయి. మంచి వైద్యంను ప్రజలందరికీ అందుబాటులోకి తీసుకురావడానికి ప్రధాని మోదీ మేక్ ఇన్ ఇండియా ద్వారా ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం మన దేశంలో పలు అంటువ్యాధులను నిరోధించే వ్యాక్సీన్లు అందరికీ అందుబాటులో లేకపోవడం వల్ల సాలీనా పలువురు చిన్నారులు మృత్యువాత పడుతున్నారు. మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం ద్వారా అతి తక్కువ ధరకు అంటువ్యాధులు, ఇతర ఇన్‌ఫెక్షన్స్‌ను నిరోధించే వ్యాక్సీన్‌లు తయారుచేయనున్నారు. ఎవరైనా జబ్బు పడి, ఆసుపత్రికి వెళితే అక్కడ చేయిస్తున్న వివిధ రకాల పరీక్షల వలన, పలువురు అప్పులపాలు అవుతున్నారు. పేద ప్రజలు పరీక్షలు చేయించుకోవడానికి ఆర్థిక స్థోమత లేక జబ్బుతో బాధపడుతూ, జబ్బును ముదరపెట్టుకొంటున్నారు. అతి తక్కువ ధరకు స్కానింగ్, ఎం.ఆర్.ఐ. వంటి పరీక్షలను చేయడానికి అవసరమైన పరికరాల తయారీకి మేక్ ఇండియా కార్యక్రమంలో ప్రాధాన్యం ఇస్తున్నారు. ప్రస్తుతం మందుల తయారీ రంగంలో బహుళ జాతి సంస్థలదే పెత్తనం. ఈ కంపెనీలు ఎక్కువ ధరలకు మందులను విక్రయిస్తూ అధిక లాభాలను గడిస్తున్నాయి. మందుల తయారీ రంగంలో బహుళజాతి సంస్థల మోనోపలీని బ్రేక్ చేయడంకోసం జనరిక్ మందులను ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నది. దేశవ్యాప్తంగా ఇప్పటికే పలు ప్రాంతాలలో జనరిక్ మందుల షాపులు ఏర్పాటుచేశారు. భవిష్యత్‌లో వీటి సంఖ్యను మరింతగా పెంచి, ప్రజలందరికీ నాణ్యమైన వైద్యంను అందుబాటులోకి తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తున్నది.
ప్రస్తుతం దేశం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలలో పారిశుద్ధ్యలోపం ఒకటి. పారిశుద్ధ్య లోపం వలన పలువురు అనారోగ్యానికి గురవుతున్నారు. పారిశుద్ధ్యం యొక్క అవసరాన్ని ప్రజలకు తెలియచెప్పి, వారిని చైతన్యపరచడంకోసం ప్రధాని నరేంద్రమోదీ స్వచ్ఛ్భారత్ కార్యక్రమాన్ని చేపట్టారు. స్వచ్ఛ్భారత్‌ను మేక్ ఇన్ ఇండియాతో అనుసంధానం చేస్తున్నారు. వ్యర్థ పదార్థాల నుంచి ఇంధనం, ఇతర పదార్థాలను తయారుచేయడానికి మేక్ ఇన్ ఇండియా కార్యక్రమంలో తగిన ప్రాధాన్యం ఇవ్వనున్నారు. దీనివలన బయోడీగ్రేడల్ ప్లాస్టిక్స్ తగ్గిపోతాయి. భూ కాలుష్యం చాలావరకు తగ్గిపోతుంది. పరిశ్రమలలోని వ్యర్థాలు పర్యావరణంకు హాని కలుగకుండా చేయడానికి సన్నాహాలు, లోకాస్ట్ టాయిలెట్స్‌వలన పారిశుద్ధ్య పరిస్థితులు మరింత మెరుగుకానున్నాయి.
ప్రస్తుతం మన దేశంలో వ్యవసాయం తీవ్ర సంక్షోభంలో ఉంది. నష్టాలకు మారుపేరుగా మారిన వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడానికి ‘‘మేక్ ఇన్ ఇండియా’’ ద్వారా ప్రయత్నిస్తున్నారు. వ్యవసాయం జెనెటిక్ ఇంజనీరింగ్‌ను వినియోగించడం వలన పంట దిగుబడి పెరగడమే కాకుండా, పెట్టుబడి తగ్గుతుంది. సేంద్రీయ ఎరువుల వినియోగంను ప్రోత్సహిస్తున్నారు. చిత్తశుద్ధితో పనిచేస్తే ‘మేక్ ఇన్ ఇండియా’ కార్యక్రమం దేశాభివృద్ధిలో కీలక పాత్ర వహించే అవకాశాలు ఉన్నాయి.

- పి.మస్తాన్‌రావు