ఉత్తరాయణం

భద్రాద్రి వివాదానికి తెరదించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భద్రాచలంలో ముక్కోటి ఏకాదశి సందర్భంగా 10 రోజులపాటు ప్రదర్శించిన దశావతారాలలో శ్రీరాముడు ఒక్కొక్క రోజు ఒక్కొక్క అవతారంలో అలంకరింపబడినాడని ప్రతికలలో చదివి, సీతారాముల పేర్లు మార్చలేదు కదా అని చాలా సంతోషించాము.
అయితే జనవరి 1వ తేదీన ‘‘శ్రీ లక్ష్మీ తాయారు అమ్మవారికి’’ అభిషేకం చేసి, పూజలు చేసినట్లు పత్రికల్లో రాసారు. ఈ లక్ష్మీ తాయారు వారి పేరు దేవస్థానం వారు ఇచ్చిన సమాచారంలో ఉందా? లేక పత్రికా విలేకర్లు గతంలో ఇచ్చిన సమాచారం ఆధారంగా రాసారో మాకర్థం కావడం లేదు. భద్రాద్రిలో రాముడు దేవుడు అయితే అమ్మవారు సీతాదేవి అవుతుంది. కానీ లక్ష్మీతాయారు అవుతుందా? శ్రీరామచంద్రుడు ఏకపత్నీవ్రతుడు కదా. సీతాదేవీ పేరును గాక, ఇంకొక పేరును ఆయన ఇష్టపడతాడా? అని భక్తులకు అనుమానం కలుగుతోంది.
భద్రాద్రిలో భక్త రామదాసుగా పేరుగాంచిన శ్రీ కంచర్ల గోపన్న శ్రీరాముని ఆలయం కట్టి ప్రభుత్వ సొమ్ము దుర్వినియోగం చేసినాడని, ఆయనను నిజాం నవాబు తానీషా జైలులో పెట్టించినాడు. కొంతకాలానికి తానీషాకు, రామలక్ష్మణులు కలలో కనిపించి, రామదాసు ఖజానాను కట్టవలసిన సొమ్ము ఇచ్చివేయగా, తానీషా ఆశ్చర్యపడి వెంటనే రామదాసుగారిని జైలునుంచి విడుదల చేయడమే కాక, ప్రతి సంవత్సరం శ్రీరామనవమికి జరిగే సీతారాముల కళ్యాణానికి ముత్యాల తలంబ్రాలు, పట్టు వస్త్రాలు సమర్పించడం ఆచారంగా చేసాడు. మనకు స్వాతంత్య్రం వచ్చేవరకు తానీషా వంశంవారు ఆ ఆనవాయితీని అమలు జరిపారు. నైజాం సంస్థానం భారతదేశంలో విలీనమైన తర్వాత అదే ఆచారాన్ని తెలంగాణ ప్రభుత్వం, తర్వాత ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం, తిరిగి ప్రస్తుత తెలంగాణ ప్రభుత్వం కొనసాగిస్తున్నాయి. చరిత్రలో ముస్లిం రాజుల చేత శతాబ్దాలుగా కానుకలందుకున్న వాడు బహుశా భారతదేశంలో భద్రాద్రి రాముడొక్కడేగాని, మరొకరు ఎవరూ ఉండి ఉండరు. అటువంటి ప్రఖ్యాతి గాంచిన సీతారాముల పేర్లు గురించి తరచుగా మీడియాకు ఎక్కవలసిన దుస్థితి తాపురించినందుకు రామభక్తులందరూ సిగ్గుతో తలవంచుకొనవలసిన పరిస్థితి దాపురించింది. గత నవంబు 10వ తేదీన ‘ఆంధ్రభూమి’లో ఇదే అంశంపై నేను రాసిన వ్యాసం ప్రచురితమైంది. దీనికి పండితులు కూడా స్పందించి భద్రాద్రిలో ఉన్నది సీతారాముడేనని రాసినారు.ఇప్పటికైనా తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ దీనిపై కల్పించుకొని ఈ వివాదానికి తెరదించాలి.
- చావలి పాండురంగారావు, సెల్: 8985985942
మన దుస్థితి ఎప్పటికి మారేను?
1948 జనవరిలో లక్షలాది మంది హిందువులను ఊచకోత కోసి అలసిపోయిన పాకిస్తాన్‌కి రూ.55 కోట్లు బహుమతిగా ఇవ్వాలని, ఇవ్వకపోతే తిండి మానేస్తాననని నిరాహార దీక్ష చేసిన గాంధీ అంశ మన నాయకుల్లో ఉన్నట్టున్నది. వాజ్‌పేయి లాహోర్ వెళ్లి విందు భోజనం చేసి వచ్చిన మరునాడే కార్గిల్ యుద్ధం మొదలైంది. ప్రస్తుత ప్రధాని మోదీ రష్యా పర్యటన ముగించుకొని తిరుగు ప్రయాణంలో ఆకస్మికంగా పాక్‌ను సందర్శించి వచ్చిన వారం రోజుల్లోనే పఠాన్‌కోట్ సంఘటన. ఇస్లాం పక్షపాతి అయిన కాంగ్రెస్ అధికారంలో ఉన్నా, ఇప్పుడు భాజపా అధికారంలో ఉన్నా మనదేశ దుస్థితి ఇంతే. పాక్‌కు బుద్ధి చెప్పడం కంటే స్నేహహస్తమే మేలని తలచే ప్రవృత్తి ఉన్నంతకాలం ఈ దౌర్భాగ్యం ఇలాగే కొనసాగుతూనే ఉంటుంది.
- శేషగిరిరావు, ధవళేశ్వరం
జంబ్లింగ్ విధానంతో అయోమయం
జంబ్లింగ్ విధానం ఒక అయోమయ వ్యవహారం. ఇప్పటివరకు ఈ వ్యవస్థను అమలు జరపకుండా, కేవలం పరీక్షల సమయంలో పెడితే పిల్లలు ఏవిధంగా ప్రిపేర్ అవుతారు? అటు ఇంటర్ పరీక్షలు, జెఈఈ, ఎమ్‌సెట్..ఏ పరీక్షలకు ప్రిపేర్ అవ్వాలో అర్థం కాకుండా ఉంది. విద్యార్థులకీ, అటు ప్రాక్టికల్స్‌కీ ప్రాధాన్యత ఇవ్వకుండా ఎక్కువ దృష్టి సిలబస్ మీద కేంద్రీకరిస్తూ ప్రభుత్వం అప్పటికప్పుడు నిర్ణయం తీసుకుంటే ఎలా? ప్రభుత్వం వారు ఈ విధానాన్ని వచ్చే సంవత్సరం నుండి అమలు చేస్తే పిల్లలు ముందుగానే జాగ్రత్త పడతారు. ఈ టెన్షన్ సమయంలో ముందుగా భయం పట్టుకొని పీడించేది ప్రాక్టికల్స్ అని విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం విద్యార్థుల సమస్యను గుర్తించి, ఈ విధానంలో మార్పులు చేపట్టాలి. అసలే తీవ్రమైన ఒత్తిడిలో ఉన్న విద్యార్థులను ఈవిధంగా ప్రభుత్వం ఇబ్బందులకు గురి చేయడం సబబు కాదు.
- వై. అనసూయ, గుంటూరు
హైందవం సనాతనం
హిందూమతాన్ని సనాతన ధర్మం అన్నారు. ప్రకృతిలో దైవాన్ని దర్శించేది హిందూమతం. మొక్కలు, గిరులు, నదులు, సర్పాలు, విగ్రహాలను పూజించే మతం హిందూమతం. విగ్రహాన్ని పూజించడం వల్ల ఏకాగ్రత పెరుగుతుంది. పద్ధెనిమిది పురాణాల పఠనం వల్ల క్రమశిక్షణ, భక్త్భివం, పరోపకార బుద్ధి వంటి మంచి లక్షణాలు అలవడతాయి. జ్ఞానం కూడా హిందూమతం గ్రంథాల వలన సిద్ధిస్తుంది. కానీ నేడు మతం కూడ ఓ వ్యాపారం అయింది. కొందరు మత ఛాందస వాదులు, తమ మతాన్ని పెంచుకోవడం