ఉత్తరాయణం

ప్రయోజనం లేని చట్టం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాల్‌మనీ కాల్‌మనీ.. అంటూ ప్రకంపనలు సృష్టించింది ఓ ఉదంతం... అప్పిచ్చిన వారంతా దుర్మార్గులని తీసుకొన్నవారు పత్తిత్తులు అన్న భావనకు వూతమిచ్చింది మీడియా. వ్యవసాయం గిట్టుబాటు కాదు తనకున్న కాడెద్దులు ఎకరం నేలతో తనకు ఆత్మహత్యే గతి... ఈ స్థితిలో వ్యవసాయం భారమైన పరిస్థితిలో తన ఎకరా పొలం అమ్మి సగం బ్యాంకులో వేసుకొన్నాడు డిపాజిట్టుగా.. మి గతా సగం ప్రయివేటు వ్యక్తులకు రూపాయిన్నర వడ్డీకిచ్చాడు.. ఆ వడ్డీకి తీసుకొన్నవారు ఈ డబ్బుతో ఉల్లిపాయలు వ్యాపారం చేస్తున్నారు.. అందరికి తెలుసు ఉల్లి ఏ రేటున వుంటుందో.. నేడు చంద్రబాబు, జగన్ లాటి వారి వత్తిడిపై ‘అప్పులు కట్టకండి వడ్డీలు ఇవ్వొద్దు’ అగితే లెంపమీద కొట్టండి అనడం నిజంగా అరాచకత్వమే కదా! పెద్ద వడ్డీలకు అప్పులు చేసి దర్జాగా బాధ్యతలకు దూరంగా దుబారాగా జులాయిగా తిరిగే వారికి ఈ చట్టం లాభమేమోగాని వాస్తవానికి ఈ చట్టంవల్ల ఒనగూరేదేమీ లేదు అని మనవి.
- సుసర్ల రమాదేవి, తాడేపల్లిగూడెం
రిజర్వేషన్లు ఇంకా ఎన్నాళ్ళు
మొట్టమొదట రాజ్యాంగం ఏర్పరిచినపుడు వెనుకబడిన కులాలు, వర్గాలకు అభ్యున్నతికై రిజర్వేషన్లు కల్పించడం ముదావహం. కానీ 68 ఏళ్ళు గడిచాయి. కానీ వెనుకబడిన, చితికిన బ్రతుకులు అగ్రవర్ణాలలో కూడా ఉన్నాయి. అదీ కాక ప్రతిభాశాలురు అన్ని కులాల్లోనూ ఉన్నారు. కాబట్టి ఆర్థికం గా వెనుకబడిన వారిని, ప్రతిభావంతులను ప్రోత్సహిస్తూ రిజర్వేషన్లు నిలిపివేయవలసిన సమయం ఆసన్నమైంది.
- పట్టిసపు శేషగిరిరావు, విశాఖపట్నం
నీరు అపురూపం
మానవాళికి అవసరమైన నీరు ఇప్పుడొక అపురూ పమైన వనరుగా మారిపోయంది. ఆధునిక జీవన శైలి, మితిమీరిన పారిశ్రామిక వృద్ధి, వనరుల వాడకం పట్ల నియంత్రణ కొరవడిన కారణంగా దేశంలో నీటికి తీవ్రం గా ఎద్దడి ఏర్పడుతోంది. కేంద్ర, జలవనరుల శాఖ తాజా అధ్యయనం ప్రకారం సగానికి పైగా నదుల్లో నీరు తాగ డానికి, నాలుగోవంతు నదుల్లో నీరు స్నానం చేయడానికి పనికి రాకుండా పోయాయ. గత దశాబ్దకాలంలో నీటి కాలుష్యం మూడింతలు పెరిగి నీటిపై ఆధారపడ్డ మానవాళి, పశు పక్ష్యాదుల ఆరోగ్యాలతో ఆటలాడుకుం టోంది. ఉత్తర, మధ్య భారతం మినహా దేశంలో భూగర్భ జల నీటిమట్టం 57 శాతం పడిపోయాయ. నీటి వరనులను పరిరక్షిం చేందుకు, నిర్దేశించిన వాల్టా చట్టం అమలులో దారుణంగా విఫలమైంది. వర్షాలు అధికంగా కురిసే మాసాలలో ప్రజల భాగస్వామ్యంతో నీటి సంర క్షణ కార్యక్రమాలను విస్తారంగా చేపట్టాలన్న సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాలు బేఖాతరు అవుతున్నాయ. మరోవైపు ఆస్ట్రేలియా, న్యూజిలాండత్, దక్షిణాఫ్రికా వంటి దేశాలు నీటి వనరుల సంరక్షణను జాతీయ ఎజెండాగా అమలు పరుస్తూ దుర్వినియోగం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నాయ. సింగపూర్‌లో కురిసిన వర్షం 100 శాతం భూగర్భంలోకి ఇంకిపోయే విధానం అమలు లో ఉంది. ప్రతి నీటిబొట్టును జాగ్రత్తగా వాడుకోవాలన్న ఉద్దేశంతో వృధాను నివారించే చర్యలతో పాశ్చాత్య దేశాలు ప్రగతి పథంలో ముందుకు దూసుకెళుతుంటే, చర్చలు, సమావేశాలు, ప్రణాళికలు, అంటూ మన దేశంలో ప్రభుత్వాలు కాలహరణం చేస్తున్నాయ.
- ఎం. కనకదుర్గ, తెనాలి
అగ్రవర్ణ పేదలకు ఆసరా ఇవ్వండి
ఆంధ్రప్రదేశ్‌లో రిజర్వేషన్ విధానం తప్పుడు పద్ధతు ల్లో అమలు జరుగుతోంది. ధనికులే రిజర్వేషన్ సదుపా యాన్ని పొందుతున్నారు. కులం ఆధారంగా కల్పించే రిజర్వేషన్ విధానం లోపభూయష్టంగా ఉంది. కేవలం ఏ ఒక్క కులానికో కార్పొరేషన్‌లో రిజర్వేషన్లు కల్పించమని కాదు ప్రజలు తెలుగుదేశం ప్రభుత్వానికి అధికారం కట్టబెట్టింది. ఆ కులం మాదిరిగానే మిగిలిన ఓసీ కులా ల్లోని పేదవారందరికి రిజర్వేషన్ సదుపాయం కల్పించాలి. బ్రాహ్మణులు, కమ్మ, రెడ్డి, కాపు, వెలమ, క్ష త్రియ కులాల్లో కూడ బీదవారున్నారు. ఓసీ కులస్తులం దరికి ఉత్తర ప్రదేశ్‌లో ఉన్నమాదిరిగా రిజర్వేషన్లు కల్పించండి. ఇప్పుడు ఏ కులం మరో కులం చేతుల్లో అణగి మణగి ఉండటం లేదు. ఇప్పుడు అన్ని కులాలూ ఒక్కటే. బీదలు, ధనికులు అన్ని కులాల్లోనూ ఉన్నారు.