ఉత్తరాయణం

చేతబడి హత్యలు పట్టవా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గత ఏడాది జనవరి 1 నుంచి డిసెంబరు 31 వరకూ ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో చేతబడి హత్యలకు ఎందరు బలైపోయారో అన్న విషయమై తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఆయా మండల తాహశీల్దార్లతోనూ, గ్రామ కార్యదర్శులతో సర్వే జరిపించాలి. చిల్లంగి పేరిట, బాణామతి, చేతబడి, మంత్రాలు వేస్తున్నారన్న నెపంతో ఎంతమందిని జల సమాధి చేశారు. ఎంతమందికి నాలుకలు కోశారు? వివస్త్రుల్ని చేసి ఎంత మందిని ఊరేగించారు? ఎంతమందికి మరుగుతున్న వేడి నూనెలో చేతులు ముంచి హింసించారు? ఎంతమందికి గ్రామ బహిష్కరణ చేశారు. ఎంతమంది చేత మలమూత్రాలు త్రాగించారు. ఎంతమందిని వాతలుపెట్టి హింసించారు. సజీవ దహనానికి ఎంతమంది బలైపోయారు? మొదలైన అంశాలపై సర్వేజరపాలి. ఆయా వివరాలను ప్రభుత్వం ప్రత్యేక వెబ్‌సైట్‌లో వారివారి ఫొటోలతోసహా ఉంచేలా ఇద్దరు ముఖ్యమంత్రులు చర్యలుతీసుకోవాలి. ఈమేరకు జి.ఓ.ను జారీచేయాలి. ఈ ఏడాది చేతబడి హత్యలు, హింసలు లేని గ్రామాల జాబితాను కూడా తయారుచేయాల్సిన అవసరం ఉంది.
భారత రాజ్యాంగం ఆర్టికల్ 51ఏ.(హెచ్) విభాగం 4 ప్రకారం ‘శాస్ర్తియ స్పృహను, మానవతా వాదాన్ని పరిశీలనాతత్త్వాన్ని సంస్కరణను పెంపొందించుకోవటం ప్రతీ భారతీయుని విధి’. అందుకే భారతీయులందరూ పై విషయాల్ని గుర్తుంచుకొని అంధ విశ్వాసాల నిర్మూలనకు, చేతబడి హత్యలు, నరబలుల నిర్మూలనకు శాస్ర్తియ దృక్పధం వ్యాప్తికి, అందరూ కృషిజరపాలి. తెలంగాణలోనూ ఆంధ్రప్రదేశ్‌లోనూ ఉన్న మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అన్ని జిల్లాల్లోని జిల్లాపరిషత్ చైర్మన్‌లు అందరూ మూఢ నమ్మకాల నిర్మూలనకు కృషిచేయాలి. మహారాష్ట్ర మాదిరిగా మూఢనమ్మకాల నిరోధక చట్టం తెలంగాణలోనూ, ఆంధ్రప్రదేశ్‌లోను తీసుకువచ్చేందుకు ప్రజాప్రతినిధులు గట్టి కృషిజరపాలని.
ఈమధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు విజయనగరం జిల్లాలో రెండుదఫాలు పర్యటించి బహిరంగ సభల్లో పాల్గొని ప్రసంగించారు. కానీ తన ప్రసంగంలో చేతబడి హత్యల గురించి, నర బలుల గురించిగానీ ప్రస్తావించకపోవడం విచారకరం.
భారత నాస్తిక సమాజం రాష్టక్రమిటీతోనూ, ఆంధ్ర ప్రదేశ్ హేతువాద సంఘం, నాస్తిక కేంద్రం, జనవిజ్ఞాన వేదిక, మానవవికాస వేదిక, చార్వాకాశ్రమం నిర్వహకులతో ఆంధ్ర ప్రదేశ్ సి.ఎం., మరియు తెలంగాణ సి.ఎం.లు సమావేశం జరిపి మూఢ నమ్మకాల నిరోధక చట్టం గురించి దాని ఆవశ్యకత గురించి చర్చించాలి.
- శీరపు శ్రీనివాసరావు, శృంగవరపుకోట
పూసల కులస్థుల బతుకులు దయనీయం
రాష్టవ్య్రాప్తంగా వున్న పూసల కులస్థుల బతుకులు చాలాదీనంగా వుంటున్నాయి. వీరు తాళాలు, బ్యాటరీలు, గొడుగులు వంటివి బాగుచేస్తూ జీవనం గడుపుతున్నారు. ప్రభుత్వం వీరిని బీసీలుగా గుర్తించినప్పటికి, వీరు సంచారం చేస్తూ గుడారాలు వేసుకొని జీవనం వెళ్లబుచ్చుతున్నారు. ఒక్కొక్కసారి ఇవేమీ లేకుండా ఫుట్‌పాత్‌ల మీద వానకు ఎండకు ఇబ్బందులు పడుతున్నారు. వీరికి ఓటు హక్కు నెలనెలా రేషన్ పొందే సౌకర్యం వున్నప్పటికీ ఇంతవరకు సొంత గూడు లేకపోవడం శోచనీయం. కంప్యూటర్ యుగంలో కూడా వీరు ఇలాంటి దయనీయ స్థితిలో వుండటం శోచనీయం. వీరి జీవితాలలో వెలుగురావడానికి ప్రభుత్వం కృషిచేస్తే బాగుంటుంది.
- షేక్ అస్లాం షరీఫ్, శాంతినగర్
బాబోయ్.. వార్షిక తనిఖీలు!
విద్యాశాఖలో ఉన్నత పాఠశాలల వార్షిక తనిఖీలు టీచర్లకు భారంగా మారాయి. హైస్కూళ్ళలో వార్షిక తనిఖీలు జిల్లా ఉప విద్యాధికారులు చేస్తారు. ఒక్కొక్క వార్షిక తనిఖీకి ఆయా పాఠశాలలు నలభైవేల రూపాయలవరకూ ఖర్చుచేయాల్సి వస్తోంది. ఇందులో పాతిక వేల వరకూ తనిఖీ అధికారికి, వాళ్ళ సిబ్బందికి ఇవ్వాల్సి వస్తోంది. కొందరైతే కానుకల రూపంలో డిమాండ్ చేస్తున్నారు. ఉదాహరణకు తూ.గో.జిల్లా కాకినాడ డివిజన్ పరిధిలోగల ఉప్పాడ కొత్తపల్లి గ్రామ ఉన్నత పాఠశాల వార్షిక తనిఖీ నిమిత్తం వచ్చిన అధికారణి పదివేలు విలువచే ఉప్పాడ పట్టుచీర, వరలక్ష్మీ రూపు (బంగారంది)ను డిమాండ్ చేయడంతో ఆ పాఠశాల ఉపాధ్యాయులు చందాలు వేసుకుని సమర్పించుకున్న విషయం పత్రికల్లో రావడం పలువుర్ని ఆశ్చర్యపరచడమే కాకుండా విద్యాశాఖలో అవినీతి ఏ స్థాయికి చేరిందో చాటి చెబుతోంది. ఒక ఉప విద్యాధికారి నెలలో కనీసంపది పాఠశాలలైనా వార్షిక తనిఖీ చేస్తారు. అంటే నెలకు రెండు లక్షలు పైనే అక్రమ సంపాదనన్నమాట. ఈ భారం అంతా ఆయా పాఠశాలల టీచర్లే భరించాల్సి వస్తోంది. ఎదురు తిరిగితే ఇక ప్రశాంతంగా ఉద్యోగం చేసుకోనివ్వరు. అందుకే ఎవరితో చెప్పకోవాలో తెలియని పరిస్థితి అధికారులకు అనుకూలంగా మారింది.
- తేతలి వెంకట కృష్ణారెడ్డి, అనపర్తి,తూ.గో.జిల్లా
జువెనైల్ ఎవరు?
నిర్భయ అత్యాచార బాల నిందితుడి శిక్ష పూర్తయి విడుదలైన సందర్భం సంచలనం సృష్టిస్తున్నది. అతగాడికి ప్రభుత్వం పదివేల రూపాయలు ఇచ్చి, స్థలం చూపి టైలర్ షాపు పెట్టుకు జీవించమన్నది. ఘోర అత్యాచార నిందితునికింత గౌరవమా? చట్టప్రకారం మైనరును జువనైల్ అని కఠిన శిక్షలు వేయకపోవడం అపచారమే. ఇటువంటివారు జువనైల్ ఎలా అవుతారు? కామప్రకోపం ప్రస్తుత జీవన విధానం, విద్యావిధానం, టెక్నాలజీ పెరుగుదల కారణాలవల్ల పదహారేళ్ళకే పరిమళిస్తున్నది. నిర్భయ కేసులో ఈ మైనరనబడే నిందితుడు పరమ క్రూరంగా, నీచంగా ప్రవర్తించాడని కదావార్త. అతను చేసిన నేరం వల్ల ఒక అభాగిని జీవితం బుగ్గి అయపోయంది. ఇతగాడు మరోనేరం చేయడన్న నమ్మకం ఎక్కడిది? కాబట్టి అతనికి యావజ్జీవ శిక్ష వేసి ఏ శుభముహూర్తాన విడుదల చేయకూడదు. చట్టం ఏం చెప్పినా ఇది న్యాయ, ధర్మాలకు సంబంధించినది.
- ఎన్.రామలక్ష్మి, సికిందరాబాద్