ఉత్తరాయణం

వంచన పాక్ నైజం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దశాబ్దకాలం తర్వాత పాకిస్తాన్ గడ్డపై అడుగు పెట్టిన తొలి ప్రధాని నరేంద్ర మోదీ. ఈ దౌత్యం సఫలీకృతం కావాలిన ఇరుదేశాల నాయకులు వాంఛించినా, దీన్ని ప్రజాస్వామ్యం ముసుగులో సాగుతున్న సైనిక పాలన సాధ్యం కానివ్వడం లేదన్నది పరమసత్యం. ఒకపక్క అనేక శిఖరాగ్ర సమావేశాల్లో మోదీ-నవాజ్‌లు కరచాల నాలు చేసుకుంటున్న సమయంలోనే కాశ్మీర్‌లో కాల్పులు జరిపి మన సైనికులను పొట్టన పెట్టుకుంటున్న సంఘట నలు చోటు చేసుకుంటున్నాయ. నిజంగానే పాక్ మన స్నేహాన్ని కోరుకున్నట్లయతే దావూద్ ఇబ్రహీంను ఇప్పటికే మనకు అప్పగించి ఉండేది.
-ఎన్. రామలక్ష్మి, సికిందరాబాద్
బిల్లుల ఆమోదానికి చర్యలు
రాజ్యసభలో పాలకపక్షానికి మెజారిటీ లేపోవడం వల్ల విపక్షాలు సభను సరీగ్గా సాగనీయక స్తంభింపజేస్తు న్నాయ. దీనివల్ల ప్రజలకు ఉపయోగపడే అనేక బిల్లులు సభ ఆమోదం పొందకనే పెండింగ్‌లో పడిపోతున్నాయ. దీనివల్ల సభా నిర్వహణకు వెచ్చిస్తున్న కోట్లాది రూపా యల ప్రజాధనం ఎందుకూ కొరగాకుండా పోతున్నది. సభ సజావుగా నడిపించడానికి వీలైన నిబంధనలు మన రాజ్యాంగంలో పొందుపరచకపోవడమే ఈ దుస్థికి కారణంగా తోస్తున్నది. కేవలం అతిముఖ్యమైన బిల్లుల ఆమోదం కోసం ఉభయ సభల సంయుక్త సమావేశం ఏర్పాటు చేసే వీలు మాత్రమే రాజ్యాంగం కల్పిస్తోంది. అయతే అధికార పక్షానికి మెజారిటీ లేని స్థితి రాజ్యసభలో ఉండి, ముఖ్యమైన బిల్లులు సభ ఆమోదానికి నోచని పరిస్థితి ఉత్పన్నమైనప్పుడు రాష్టప్రతి కలుగజేసుకొని అటువంటి బిల్లులు సభ ఆమోదించ డానికి వీలుగా చర్యలు తీసుకునే వెసులుబా టు ఉండాలి. అదేవిధంగా విధాన మండలి ఉన్న రాష్ట్రాల్లో గవర్నర్లు కలుగజేసుకోవాలి. ఈ సందర్భంలో పాలక, ప్రతిపక్ష పార్టీలను సమావేశ పరచి అవసరమైన సలహాలు, సూచనలు ఇచ్చే వెసులుబాటును రాష్టప్రతి, గవర్నర్లకు కల్పించాలి. ఇది సాధ్యం కాకపోతే, లోక్‌సభ లేదా రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించిన బిల్లులను పార్లమెంట్ ఆమోదించినట్టుగా పరిగణించాలి. ఇందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలి. లేని పక్షంలో అధికార, విపక్ష రాజకీయ క్రీడలో బలయ్యేది ప్రజలు మాత్రమే.
- బుద్ధా రామారావు, పాయకరావుపేట
ఎన్నాళ్లీ అక్రమాలు?
వ్యాపారం చేసుకుంటామని వచ్చిన ఈస్టిండియా కంపెనీవారు మెల్లగా మన దేశాన్ని కబళించి రెండు వంద ల సంవత్సరాలు మనల్ని పాలించింది. తాజ్‌మహల్ లాంటి అద్భుతమైన కట్టడాన్ని నిర్మించిన మనవాళ్లు, ఆఫ్టరాల్ రాజధానిని నిర్మించలేరా? మన ఇంజనీర్లతో రాజధానిని నిర్మించుకోలేమా? సింగపూర్ వారే అవసరమా? అడిగేవారు లేరనే కదా..ఎన్నాళ్లీ అక్రమాలు?
- లోకపావని, సత్యనారాయణపురం, విజయవాడ
అందుబాటులోకి ఆధ్యాత్మిక సాహిత్యం
క్రైస్తవుల తరహాలో ఆధ్యాత్మిక సాహిత్యాన్ని హిందువులందరికీ అందుబాటులో తెచ్చేందుకు తిరుపతి తిరుపతి దేవస్థానం (టి.టి.డి) తగు చర్యలు తీసుకోవాలి. కోట్లాది రూపాయల ఆదాయం లభిస్తున్న టి.టి.డి. చిన్నచిన్న పుస్తకాలను ఉచితంగా పంపిణీ చేయాలి. ఇలా చేస్తే కొంతవరకు అయినా సమాజంలో నైతిక విలువలు ఏర్పడతాయి. క్రైస్తవులు తమ మతానికి సంబంధించి సాహిత్యాన్ని ముద్రిస్తూ కేవలం తమ మతం వారికే కాకుండా ఇతర మతాల వారికి కూడా ఉదారంగా పంచుతున్నాయి. ఈ విషయమై టి.టి.డి. పరిశీలన చేసి ఆధ్యాత్మిక సాహిత్యాన్ని ఉదారంగా (లేదా) తక్కువ ధరలకు పంపిణీ చేయాలని కోరుతున్నాను.
- చందన రవీంద్ర, పొందూరు
అంధులను ఆదుకోవాలి!
విధి వంచితులైన అంధులను సోదరభావంతో ఆదుకోవలసిన సమయం ఆసన్నమైంది. ఈ ప్రజాస్వామ్య భారతదేశంలో లక్షలాది అంధులు గడ్డుజీవనం గడుపుతున్నారు. కళ్లులేని కబోదులకు ప్రభుత్వపరంగా సకల సౌకర్యాలు కల్పించాలి. అంధులు ఉన్నత విద్యావంతులు కావడానికి ఇతోధికమైన విద్యాసౌకర్యాలు కల్పించాలి. విద్యనభ్యసించిన నిరుద్యోగ అంధులకు ప్రభుత్వపరంగా 10 శాతం ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. విద్యలేని అంధులకు గౌరవ వేతనంగా ఐదువేల రూపాయలు ప్రతినెలా మంజూరుచేయాలి. అలాగే గృహవసతి కల్పించాలి. అంధుల ఆర్థికాభివృద్ధికోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేకమైన నిధులను కేటాయించాలి. అంధులకోసం ప్రత్యేకమైన సేవలను అందించడంకోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకు రావాలి. ఇక కూడుగుడ్డకు పనికిరాని పనులకోసం కోట్లాది ప్రజాధనాన్ని వ్యయపరచకుండా ప్రజలకు మేలుచేసే కార్యాలకు ఉపయోగించాలి.
- రంగినేని జగదీశ్వరుడు, కొల్లాపూర్