ఉత్తరాయణం

చిన్నకారు రైతులను ఆదుకోవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రతిరోజూ మనం తీసుకునే ఆహారంలో తగినన్ని ఆకు కూరలు చేర్చడం ఆరోగ్యానికి మంచిదన్న సంగతి మనం దరికీ తెలిసిందే. అయతే నేడు ఈ ఆకుకూరలను పండిం చే చిన్నకారు రైతుల పరిస్థితి అత్యంత దయనీయంగా ఉంది. ముఖ్యంగా శ్రీకాకుళం, విజయనగరం పరిసర ప్రాంతాల్లో ఈ ఆకు కూరలను ‘పొందర’ కులానికి చెంది న రైతులు ఎక్కువగా పండిస్తున్నారు. కానీ ప్రస్తుత పరి స్థితుల్లో ఆకుకూరల పెంపకం లాభదాయ కంగా లేకపోవడంతో పొట్టకూటి కోసం రైతులు పట్టణాలకు వలసపోతున్నారు. మరికొందరు ఉన్న వూరిని వదల్లేక, మరే ఇతర పనులు చేయలేక ఆకుకూరలను సాగుచేస్తూ వచ్చిన ఆదాయంతో మళ్లీ వాటినే సాగుచేస్తూ బతుకు లీడుస్తున్నారు.
పంటలను కాపాడుకోవడానికి వాడే క్రిమి సంహారక మందులు, రసాయన ఎరువుల ధరలు ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోవడంతో, పెట్టుబడులు ఎక్కువై, రాబడి తక్కువై వీరి జీవితాలు దుర్భరంగా మారుతు న్నాయ. కావున ఈ విషయంపై ప్రభుత్వం కాస్త దృష్టిపెట్టి ఈ రైతులకు తగిన ప్రోత్సాహకాలు అందించాలి.
-పెయ్యల శ్రీనివాసరావు, అలికాం, శ్రీకాకుళం
తెలుగుపై పట్టు సాధించాలి
పత్రికల భాషలో చాలా మార్పులు రావాలని ఓ వేదిక మీద భూమి సంపాదకులు ఎం.వి.ఆర్ శాస్ర్తీగారు తమ అవేదనను వ్యక్తం చేశారు. దేశభాషలందు తెలుగు లెస్స అని సగర్వంగా స్పష్టీకరించిన శ్రీ కృష్ణదేవరాయల వాక్కును మనవారు తమ పలుకుబడిలో అనేక నిరాధార మార్పులు తీసుకువస్తున్నారు. ముఖ్యంగా టి.వి. యాం కర్లు, తెలుగు వార్తలు చదివేవారు, ‘విధ్య’, ‘్భృందం’, ‘విధ్యుత్తు’, ..ఇలా వత్తులు లేని పదాలకు వత్తులు తగిలించి భాషను అపభ్రంశం చేస్తున్నారు. ఋక్కును.. రుక్కుగాను, గుఱ్ఱాన్ని, గుర్రంగాను, రాయడం కూడ తప్పే. తెలుగు బోధకులు ముందుగా భాషమీద పట్టు సాధించాలి. ఇప్పటికే తెలుగు మృతభాష కాబోతు న్నదన్న వదంతులు ప్రచారంలో ఉన్నాయ. తక్షణ చర్య లు తీసుకోకపోతే అనుమానాలు ధ్రువపడే ప్రమాదం ఉంది. తెలుగు భాషను పరిరక్షించాలి. అందుకు భాషావేత్తలు మరింత కృషి చేయాలి.
- ఎన్. రామలక్ష్మి, సికిందరాబాదు
సంస్కృతిని కాలరాయవద్దు
హిందూ సంప్రదాయలను కొందరు కాలరాస్తు న్నారు. మంగళసూత్రం తీసేసి తప్పుడు పనులు చెయ్యమని కొం దరూ, అసలు మట్టెలు, మంగళసూత్రాలు వేసుకోవద్దనీ, స్ర్తీలు తమకి ఇష్టం వచ్చిన రీతిలో బ్రతకొచ్చని, ఏమైనా చేసుకోవచ్చని వాదిస్తున్నారు. ఇలా చేస్తే భారతీయ సంస్కృతి దెబ్బతింటుంది. మన సంస్కృతిని నిలబెట్టేది స్ర్తీలే. కనుక ప్రతి మతంలో స్ర్తీలు ఆ మత పద్ధతుల్ని పాటించాలి. హిందూ స్ర్తీలు నల్లపూసలు, కుంకుమ, గాజు లు, మంగళసూత్రాలు విధిగా ధరించాలి. మత ఛాంద సవాదులకు, నాస్తికులకు దూరంగా ఉండాలి. స్వేచ్ఛపేరు తో సంస్కృతిని దెబ్బతీయరాదు.
- వి. అన్నపూర్ణ, విశాఖపట్నం
ఇంగ్లీషు స్పీకింగ్ క్లాసులు నిర్వహించాలి
నేడు దాదాపు అన్ని సంస్థల్లో ఇంగ్లీషులో నైపుణ్యం కావాలని అడుగుతున్నారు. కనుక ప్రతీ స్కూలులో ఓ పిరియడ్ ఇంగ్లీషు స్పీకింగ్ క్లాసు ఉండాలి. తెలుగు ప్రథమ భాషగా ఉండాలి. తెలుగులో పాఠశాల సమయం తర్వాత మాట్లాడాలి. ఇంగ్లీషు స్పీకింగ్ పోటీలు పెట్టి విజేతలకు బహుమతులివ్వాలి. ప్రభుత్వాలు ఇంగ్లీషు టీచర్లకు తగిన ప్రోత్సాహం ఇవ్వాలి. శ్రద్ధ ఉంటేనే ఏదైనా సాధ్యం. విద్యార్థులు చదువుపై శ్రద్ధ చూపాలి.
- వి. విరించి, కంచరపాలెం
అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేయాలి
తూర్పుగోదావరి జిల్లా ముఖ్యపట్టణమైన కాకినాడలో ప్రభుత్వ కోర్టులకు, ఆసుపత్రికి దగ్గరగా ప్రభుత్వం నిర్మించిన డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ భవనం, సభలకు, సమావేశాలు జరపడానికి అనువుగా ఉంది. అంబేద్కర్ భవనంలో సెంట్రల్ ఏ.సి. ఏర్పాటు చేయడం వల్ల, అందులో నిర్వహించే కార్యక్రమాలకు చాలా ఉపయో గకరం. దీనికితోడు ప్రస్తుతం భవనానికి ముందున్న అంబేద్కర్ విగ్రహం చిన్నదిగా ఉంది. అందువల్ల దాన్ని తొలగించి భవనానికి తగ్గట్టుగా పెద్ద కాంశ్య విగ్రహాన్ని నిర్మించాలి.
- మందపల్లి సత్యం, రామచంద్రపురం
సభను అడ్డుకోవడం అప్రజాస్వామికం
చట్టసభలలో నిమిషానికి కొన్ని లక్షలు ఖర్చు అవుతుంది. సభ్యుల వసతి, జీతాలు కోట్లలో వుంటుంది. ఇది ప్రజల సొమ్ము. గనుక ప్రజలకు నష్టం జరుగకుండా సభలను జరపాలి. కాలాన్ని సద్వినియోగం చేసుకొని ప్రజలకు సహాయపడాలి.
- అందా వెంకట సుబ్బన్న, మైదుకూరు