సబ్ ఫీచర్

స్ట్ఫా సెలక్షన్ పరీక్షల్లో అన్యాయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కేంద్ర ప్రభుత్వ వ్యవస్థలో అత్యున్నతమైన సివిల్ సర్వీసులకు ఎంపిక పరీక్షలను రాజ్యాంగ సంస్థ అయిన యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహిస్తుంది. అయితే, సివిల్ సర్వీసు తరువాత క్రమంగా క్రింది స్థాయిలయిన గ్రూప్-బి, గ్రూప్-సి, గ్రూప్-డి ఉద్యోగాలను పార్లమెంటరీ చట్టం ద్వారా ఏర్పడిన ‘స్ట్ఫా సెలక్షన్ కమిషన్’ జాతీయ స్థాయిలో పోటీ పరీక్షలను నిర్వహించటం ద్వారా భర్తీ చేస్తుంది. ప్రతి సంవత్సరం వేల సంఖ్యలో ఉండే పోస్టుల భర్తీకి ఇరవై లక్షల పైచిలుకు అభ్యర్థులకు క్రమం తప్పకుండా పరీక్షలు నిర్వహించి, నిర్ణీత కాల వ్యవధిలో క్లిష్టమైన ప్రక్రియను దశాబ్దాలుగా నిర్విరామంగా పూర్తి చేస్తున్న కమిషన్ కృషి అత్యంత అభినందనీయం.
కానీ ఈ పరీక్షలలో హిందీయేతర రాష్ట్రాల అభ్యర్థులకు పరోక్షంగా అన్యాయం జరుగుతోంది. రాజ్యంగ సూత్రాల ప్రకారం జాతి, మత, కుల, లింగ, భాషా, ప్రాంతీయ ప్రాతిపదికన ఏ ఒక్కరికీ అన్యాయం జరగకుండా చూడటం ఎంత అవసరమో... ఆ అంశాల వలన కొందరికి మేలు జరగటం కూడా అంతే నిషిద్ధం! కమిషన్ పరీక్షలలో ప్రశ్నపత్రాలు ఇంగ్లీష్ మాధ్యమంతోపాటు కేవలం హిందీ మాధ్యమంలోనే ఉంటున్నాయి. దీనివలన హిందీ మాతృభాషగా గల అభ్యర్థులు జనరల్ ఇంగ్లీషు మినహా మిగిలిన సబ్జెక్టులలో ఇతర మాతృభాషల అభ్యర్థుల కంటే ఎంతో సులువుగా ప్రశ్నలను అర్థం చేసుకోగలుగుతున్నారు. వెనువెంటనే సరైన సమాధానాన్ని గుర్తించటానికి కూడా ఇది ఎంతో ఉపయోగపడుతోంది. ఇతర అభ్యర్థులు-ప్రశ్నలను ఇంగ్లీషులో చదివి, అర్థం చేసుకోవటానికే ఎక్కువ సమయం వెచ్చించాల్సి వస్తోంది. సమయమే అత్యంత కీలకమైన ఈ పరీక్షలలో (రెండు గంటలు అంటే కేవలం 120 నిమిషాలలో 200 ప్రశ్నలు చదివి, అర్థం చేసుకుని, జవాబులు చదివి - సరియైన జవాబు గుర్తించాల్సి ఉంటుంది) హిందీయేతరుల విజయావకాశాలు దారుణంగా దెబ్బతింటున్నాయి. కేవలం పావు మార్కు తేడాతో వేల ర్యాంకులు వెనకబడిపోవటం ఈ పరీక్షలలో సర్వసాధారణం. దీనిని సరిదిద్ది... సరైన రాజ్యాంగ స్ఫూర్తిని ఆచరించాలంటే... ప్రశ్నపత్రాలు ఆంగ్లం, హిందీలతోపాటు మాతృభాషా మాధ్యంలో కూడా ఇవ్వాలి. అప్పుడే అందరికీ సమానమైన న్యాయం జరుగుతుంది.
ఇప్పటికే రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డులు ఈ విధానాన్ని అనుసరిస్తున్నాయి. నిరుద్యోగ యువత, విద్యార్థి సంఘాలు అన్ని నియామక పరీక్షలలోనూ దీనికై కృషి చేయాలి. అడగనిదే అమ్మయినా పెట్టదుకదా! ఇందుకై స్ట్ఫా సెలక్షన్ కమిషన్, కేంద్ర ప్రభుత్వ సిబ్బంది శిక్షణా శాఖలకు విన్నపాలు పంపించాలి. ఫోన్ మెసేజ్‌లు, సోషల్ మీడియాలు ఈ విషయంలో బాగా ఉపయోగపడతాయి. రాష్ట్ర ప్రభుత్వం పార్టీలకు అతీతంగా పార్లమెంటు సభ్యులు దీనికై కృషి చేయాలి. ముఖ్యమంత్రులు ఈ దిశగా దృష్టి పెట్టేట్టుగా ప్రయత్నం చేయాలి. మాతృభాషోద్యమం తన లక్ష్యాలతో దీనిని కూడా చేర్చుకోవాలి.
‘మా రాకతో జాబు ఖాయం’ అని ప్రచారం చేసుకొని అధికార పగ్గాలు చేపట్టిన ప్రభుత్వాలు ఉద్యోగ భర్తీ ఊసే ఎత్తని ఈ విచిత్ర సమయంలో రాబోయే నాలుగైదు సంవత్సరాలలో లక్షల కొద్దీ కేంద్ర ప్రభుత్వోద్యోగులు రిటైర్‌మెంటు కానున్న ప్రస్తుత తరుణంలో ఈ అన్యాయం పునరుక్తి కాకుండా పోరాడటం యువత తక్షణ కర్తవ్యం! ఒక సంవత్సరం జరిగే రిక్రూట్‌మెంట్‌లో తటస్థించే అసమతుల్యత - ఆ సంవత్సరంతో ఉద్యోగ వయోపరిమితి దాటిపోయే వారిని శాశ్వతంగా నిరుద్యోగులుగా మార్చటమే కాదు - దాదాపు మూడు దశాబ్దాలు (ఎంపికైన వారి మొత్తం సర్వీసు) ఆ అన్యాయాన్ని కొనసాగిస్తుంది. అందుకే - వివేకానంద స్వామి చెప్పిన త్రిరత్నాలు - ‘‘లేవండి - మేల్కొనండి - లక్ష్యం సాధించే వరకూ ఆగకండి’’ అన్నవి ఇప్పుడు ఆచరణీయాలు.

- బొల్లాప్రగడ వెంకట పద్మరాజు