ఉత్తరాయణం

సొసైటీలకు పోస్టలు స్థలాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాకు తెలిసి విశాఖపట్టణంలో పోస్టలు డిపార్ట్‌మెంటు వారి భూములు నాలుగు ఉన్నాయ. సీతమ్మధార వద్ద హెచ్‌బి కాలనీ, ఆంధ్రా విశ్వవిద్యాలయం పోస్టాఫీసువద్ద, బుచ్చిరాజు పాలెం, కంచరపాలెం హైవే నుండి పారిశ్రామిక ఎస్‌బిఐకి వెళ్లే దారిలో ఇవి ఉన్నాయ. ఇవికాక ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని జిల్లాల్లో పోస్టలు భూములు ఉన్నాయ. వాటిని కాపాడవలసిన బాధ్యత ఆయా జిల్లాల పోస్టలు సూపరింటెండెట్ల మీద, 4,5 జిల్లాలకు అధికారు లైన పోస్టు మాస్టరు-జనరల్సు మీద ఉంది.
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వం భూములు, ఇళ్లు ఇస్తుంది. కేంద్రం అలా ఇవ్వదు కాబట్టి, పైన చెప్పిన నాలుగు పోస్టలు స్థలాలను పోస్టలు కో-ఆపరేటివ్ బిల్డింగ్ సొసైటీలకు ఇవ్వాలి. ఈ విషయంలో ఎమ్మెల్యేలు, ఎంపీలు కలుగజేసుకోవాలి.
- ఎ.వి.జి. కృష్ణ, విశాఖపట్టణం (9618304663)
నరకానికి నకలు
గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి పేదల పాలిట నరకంగా మారింది. మందుల కొరత తీవ్రంగా ఉన్నం దున బయట కొనుక్కోమని చీటీలు రాసి ఇచ్చి పంపిం చేస్తున్నారు. ఎక్స్‌రే, స్కానింగ్ మిషన్లు ఎప్పుడు పనిచేస్తా యో ఎవ్వరికీ తెలియదు. డాక్టర్లు సమయ పాలన పాటిం చనందున రోగులు వారికోసం గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తోంది. ఇన్ పేషంట్ల అడ్మిషన్ల కోసం, మంచం కోసం దండిగా లంచాలు ఇస్తేనే పని జరుగుతోంది. ఇచ్చు కోలేని వారికి వరండాలో పక్కన నేల మీద దుప్పట్లు వేసి పడుకోబెట్టేస్తున్నారు. యాక్సిడెంట్లు, ఎమర్జెన్సీ కేసుల పట్ల సిబ్బంది తీవ్ర అలక్ష్యం కనబరుస్తున్నారు. కొన్ని కేసులలో బయట తమకు అనుబంధిత ప్రైవేటు ఆసుపత్రులలో అడ్మిట్ అవమని స్వయంగా డాక్టర్లే సల హాలు ఇస్తున్నారు. అంత ఖర్చు భరించలేకనే కదా నిరుపేదలు ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చేది. పేదల అవసరాన్ని కూడా సొమ్ము చేసుకోవడం ఎంత దారుణం?
ఇక్కడ మార్చురీల వద్ద శవాన్ని ఇచ్చేందుకు రోగుల వద్ద నుండి అధిక మొత్తంలో సొమ్ములు వసూలు చెయ్య డం చూస్తుంటే లోకంలో అసలు మానవత్వం అనేది ఉన్నదా అన్న అనుమానం కలుగు తోంది. అసుపత్రిలో ఇప్పటి వరకు కుక్కలు, పిల్లులు, పందులు, ఎలుకలు యదేచ్ఛగా సంచరిస్తూ రోగులకు ప్రత్యక్ష నరకం చూపుతున్నాయ. ఇటీవల ఏకంగా రెండుసార్లు విష సర్పాలు ఆపరేషన్ థియేటర్లలోకి చొరబడి రోగులను కాటు వేసిన ఉదంతాలను గమనిస్తే, ఈ ఆసుపత్రిలో ఎటువంటి దయనీయ పరిస్థితులు నెలకొన్నాయో ఇట్టే అర్థమవుతుంది. జిల్లా వాసులకు అందుబాటులో ఉన్న ప్రభుత్వ పెద్దాసుపత్రి ఇదే కావడంతో రద్దీ చాలా ఎక్కువగా ఉంటుంది. ఆసుపత్రిలో నెలకొన్న తీవ్ర అపారిశుద్ధ్య పరిస్థితుల వలన ఆరోగ్యంగా ఉన్నవారు కూడా ఆసుపత్రిని దర్శిస్తే చాలు అనారోగ్యం పాలు కావడం ఖాయం.
- ఎం. కనకదుర్గ, తెనాలి
ఖమ్మంలో ట్రాఫిక్ సమస్య
ఖమ్మం కార్పొరేషన్ పరిధిలో రహదారుల వెడల్పు చేయడంలో విధించిన ట్రాఫిక్ నిబంధనల ఇబ్బందులు నెలల తరబడి కొనసాగుతూనే ఉన్నాయ. రహదారులు వెడల్పు చేయడానికి ప్రధాన కూడళ్లలో సర్కిళ్లు పరిమితికి మించి నిర్మించడం వల్ల ట్రాఫిక్ సమస్య ఉత్పన్నమవు తోంది. ఇల్లందు క్రాస్ రోడ్డులో ఏరియాకు మించి సర్కిల్ ఏర్పాటు చేశారు. దీనివల్ల మలుపుల వద్ద రోడ్డు ఇరుకుగా మారి ట్రాఫిక్ స్తంభించడం పరిపాటిగా మారింది. సర్కిల్ పూర్తయనప్పటికీ రోడ్డు విశాలంగా లేకపోవడం వల్ల సమస్య యథాతథంగా ఉండనుంది. అందువల్ల సర్కిళ్ల పరిమాణం తగ్గించాలి. రోడ్ల విస్తరణ పనుల్లో కూడా విపరీత జాప్యం చోటు చేసుకోవడం కూడా సమస్యకు కారణమవుతోంది. అందువల్ల సర్కిళ్ల కుదింపు, రోడ్డు పనులను మరింత వేగంగా పూర్తి చేసే విధంగా జిల్లాకు చెందిన మంత్రివర్యులు, అధికార్లు చర్యలు తీసుకోవాలి.
-అయనం రఘురామారావు, ఖమ్మం
విద్యార్థులకు నైతిక విలువలు నేర్పాలి
సమాజ పరిస్థితులు రానురాను మారిపోతుండటం వల్ల, విద్యార్థులకు పాఠశాల స్థాయ నుండే నైతిక విలువలకు అధిక ప్రాధాన్యతనివ్వాలి. నీతి కథలతో కూడిన వివిధ మాసపత్రికలను పాఠశాలలకు తప్పని సరిగా పంపాలి. విద్యార్థులచే వాటిని చదివింపజేయాలి. భాషా వాచకాలకు అనుబంధంగా విధిగా నీతి కథలను చేర్చాలి. పురాణ గాథలకు ప్రాధాన్యతనివ్వాలి. స్నేహ భావం, త్యాగగుణం, వినయం, సత్ప్రవర్తన, అరిషడ్వర్గాల ను జయంచడం, స్ర్తీలను గౌరవించడం మొదలైన ఉత్తమ గుణాలను పెంపొందించేలా ఈ కథలు ఉండాలి.
- సరికొండ శ్రీనివాసరాజు, హైదరాబాద్
తాగునీటి సమస్యను పరిష్కరించండి
లింగంపల్లి దగ్గర ఉన్న చందానగర్ హుడా కాలనీ ప్రజలకు చాలా రోజులుగా నీళ్లు సరిగ్గా రావడం లేదు. పైగా ఐదారు నెలల నుండి బయట రూ.35 లకు ప్లాస్టిక్ క్యాన్ కొనుక్కోవలసి వస్తున్నది. అంతేకాదు ఇంటి పనులకు నీరు సరిపోక ఇబ్బందులు పడాల్సి వస్తోంది. ఇంటికి బంధువులు వస్తే నీటికి మరింత ఇబ్బందులు తప్పడంలేదు. కార్పొరేషన్ అధికార్లు ఈ ప్రాంతానికి నీటి సరఫరాపట్ల నిర్లక్ష్యం వహించడం వల్లనే ఇక్కడి ప్రజలకు నీటి సమస్య తీరడం లేదు. ఇక ముందు వచ్చేది వేసవికాలం. పరిస్థితి మరింత దారుణంగా ఉంటుందని చెప్పడానికి పెద్దగా ఆలోచించాల్సిన పనిలేదు. అందువల్ల ఈ సమస్యను పరిష్కరించి ఈ ప్రాంతవాసుల తాగునీటి సమస్యను తీర్చాలని కోరుతున్నాం.
- చోడవరపు విజయ్‌కుమార్, చందానగర్, హైదరాబాద్