సంపాదకీయం

విద్రోహ జ్వాలలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఢిల్లీ ఈశాన్య ప్రాంతంలో భద్రతను కట్టుదిట్టం చేయాలని ఢిల్లీ ఉన్నత న్యాయస్థానం ఆదేశించడం నాలుగురోజులుగా చెలరేగుతున్న వికృత విధ్వంసకాండ ఫలితం, భయానక బీభత్సకాండ ఫలితం! ‘‘శరణార్థులకు మన దేశపు పౌరసత్వం కల్పించాలన్న మానవీయ శాసనాన్ని’’ వ్యతిరేకిస్తున్నవారు వారాల తరబడి జరుపుతున్న అల్లర్లకు పరాకాష్ఠ ఈ విధ్వంసకాండ... ఈ మారణకాండ... ఈ బీభత్సకాండ, ఈ పైశాచిక కాండ! ఇరవై మూడవ తేదీన రాజుకున్న ఈ విద్రోహకాండ ఇరవై నాలుగవ తేదీనుంచి భయానక దావానలంగామారి ఢిల్లీ ప్రజలను ముంచెత్తింది. ఈ రాక్షస కాండకు ఇరవై మందికి పైగా బలయిపోయారు. రతన్‌లాల్ అనే ‘ప్రధాన రక్షక భటుడి’- హెడ్ కానిస్టేబుల్-ని దుండగులు తలపై కొట్టి చంపడం ఉద్యమం పేరుతో జరుగుతున్న పైశాచిక క్రీడకు ఒక నిదర్శనం మాత్రమే! అమిత్‌శర్మ అన్న ఉన్నత పోలీసు అధికారిని సైతం దుండగులు తీవ్రంగా గాయపరచడం ‘‘పథకం ప్రకారం జరుగుతున్న భయానక బీభత్సకాండ’’కు నిదర్శనం. ఈ పథకం భారత రాజ్యాంగ వ్యవస్థను వ్యతిరేకిస్తున్న చైనా తొత్తులైన ప్రచ్ఛన్న బీభత్సకారులది, పాకిస్తాన్ కొమ్ముకాస్తున్న జిహాదీ పైశాచిక మూకలది! విశ్వవిద్యాలయాల ప్రాంగణాలలో సంవత్సరాల తరబడి పాతుకొనిపోయి ఉన్న ఈ చైనా తొత్తులు, పాకిస్తాన్ అనుకూల ముఠాలు ప్రచ్ఛన్న బీభత్సకారులు. ‘పౌరసత్వ సవరణ చట్టం’- సిటిజెన్‌షిప్ అమెండ్‌మెంట్ యాక్ట్- రూపొందిన వెంటనే ఈ ప్రచ్ఛన్న బీభత్సకారులు రంగప్రవేశం చేశారు. ఈ చట్టాన్ని వ్యతిరేకించడం నెపం... దేశాన్ని కల్లోలగ్రస్తం చేయడం లక్ష్యం! అందువల్ల ‘‘వ్యతిరేక ఉద్యమం’’ పేరుతో దేశ వ్యతిరేక కుట్రను సాగిస్తున్నవారు ఈ ఢిల్లీ హత్యాకాండకు పథకాన్ని రూపొందించారు! పథకం ప్రకారం జరిగిన ఈ అల్లర్లలో ప్రత్యక్ష బీభత్సకారులు కూడ చేరిపోయారన్నది స్పష్టం. రెండువందల మందికి పైగా గాయపడడం, వేల మంది ఇళ్లువదలి పారిపోవలసి రావడం ఈ విద్రోహ పథకానికి నిదర్శనాలు! కేవలం ఆవేశపూర్వకంగా లేదా తత్కాల ఉద్రేకంతో అల్లర్లకు పూనుకున్నవారు ఇంతటి రాక్షసకాండను జరుపలేరు. అంకిత్‌శర్మ అన్న నిఘా విభాగపు ఉద్యోగి మృతదేహం బుధవారం ఒక కాలువలో లభించిందట! అంటే పోలీసులను, నిఘా విభాగం ఉద్యోగులను హత్యచేయాలన్న పథకాన్ని విద్రోహులు ముందే రూపొందించుకున్నారన్నమాట! అందువల్ల ఈశాన్య ఢిల్లీ ప్రాంతంలో నాలుగురోజులుగా జరిగిన దౌర్జన్యకాండ ఇరువర్గాల మధ్య జరిగిన తాత్కాలిక సంఘర్షణ కాజాలదు! ప్రశాంతిని భంగంచేసి రక్తపాతం కల్పించాలన్న లక్ష్యంతో పొంచి ఉన్న చైనీయ, పాకిస్తానీ సమర్థక దేశ విద్రోహులకు ఇప్పుడు అవకాశం లభించింది... జమ్మూకశ్మీర్‌లో సైనికులపై, పోలీసులపై విద్రోహులు రాళ్లురువ్వడం దశాబ్దుల చరిత్ర... ఇటీవల- మూడువందల డెబ్బయ్యవ రాజ్యాంగ అధికరణం రద్దయిన తరువాత- జమ్మూకశ్మీర్‌లో రాళ్లురువ్వే అవకాశాలు బాగా తగ్గిపోయాయి. అందువల్ల ఆ విద్రోహులలో కొందరు బహుశా దేశ రాజధానిలోకి చొఱబడి తిష్ఠవేసి ఉండవచ్చు!
దాదాపు ఆరు సంవత్సరాలుగా మన అంతర్గత భద్రత పెంపొందుతోంది. చైనా సరిహద్దులలో చైనా దళాలు జరుపుతున్న చొఱబాట్ల తీవ్రత తగ్గింది. జమ్మూకశ్మీర్, ఈశాన్య ప్రాంతాలు ‘కల్లోల గతం’నుంచి విముక్తమై కుదుటపడుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం పనితీరుతో అవినీతి కలాపాలు ఏర్పడడం లేదు. అంతర్జాతీయంగా మన ప్రతిష్ఠ పెరుగుతోంది. ప్రధానంగా మిత్ర దేశాలతో సంబంధాలు మరింత మెరుగయ్యాయి. అందువల్ల మన దేశం అంటే గిట్టని దేశాలవారు, దశాబ్దుల తరబడి తమ విధానాలలో భారత వ్యతిరేకత నిహితమై ఉన్న దేశాలవారు మన దేశాన్ని అప్రతిష్ఠపాలు చేయడంకోసం వేచి ఉన్నారు! ఏదో ఒక ‘సాకు’కావాలి! ఆ ‘సాకు’ ప్రాతిపదికగా మన దేశానికి వ్యతిరేకంగా ప్రకటనలు చేయడానికి పొంచి ఉన్నారు, అంతర్జాతీయ వేదికలపైన, వీలైతే ఐక్యరాజ్యసమితిలోను మన దేశానికి వ్యతిరేకంగా తీర్మానాలను చేయడానికి ఈ దేశాలవారు యత్నిస్తున్నారు. ఇప్పుడు ఈ వ్యతిరేకులకు రెండు సాకులు దొరికాయి. మొదటిది రాజ్యాంగంలోని మూడువందల డెబ్బయ్యవ అధికారణం రద్దు... రెండవది పౌరసత్వ సవరణ చట్టం! ఈ రెండు అంతర్గత వ్యవహారాలను అంతర్జాతీయం చేయడం ద్వారా మన దేశానికి ‘‘మనశ్శాంతి లేకుండా చేయాలన్న’’ది ఈ వ్యతిరేక దేశాల పన్నాగం...
ఈ పన్నాగంలో భాగంగానే మలేసియా, టర్కీ వంటి దేశాలు బాహాటంగా మన దేశంపై విషం కక్కుతున్నాయి. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో జమ్మూకశ్మీర్ గురించి చర్చించడానికై చైనా గత డిసెంబర్‌లో తీర్మానాన్ని ప్రతిపాదించింది. తీర్మానం చర్చకు రాలేదు. అది వేఱుకథ... కానీ మన అంతర్గత వ్యవహారాలలో జోక్యంచేసుకోవాలన్న చైనా పథకం ధ్రువపడింది. ‘పౌరసత్వ సవరణ చట్టం’పట్ల వ్యతిరేకతను ప్రదర్శిస్తున్నవారికి మద్దతుగా ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి అంటోనియో గుదరెస్ వ్యాఖ్యలు చేయడం అక్రమ ప్రమేయానికి మరో సాక్ష్యం! ‘ఐరోపా సమాఖ్య’ పార్లమెంటులో భారత వ్యతిరేక తీర్మానం ప్రస్తావనకు రావడం మరో ‘అక్రమ ప్రమేయం’. జమ్మూకశ్మీర్‌ను చర్చించడానికై ‘ఇస్లాం మత రాజ్యవ్యవస్థలున్న దేశాల కూటమి’ ప్రత్యేక సమావేశం ఏర్పాటుచేయడానికి పాకిస్తాన్ ఇప్పటికీ ప్రయత్నాలను కొనసాగిస్తూనే ఉంది! అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మన దేశానికి వచ్చి వెళ్లాడు. ఆయన పర్యటన ప్రారంభం కావడానికి రెండు రోజులముందు అమెరికా ప్రభుత్వ ‘‘అంతర్జాతీయ మత స్వేచ్ఛా వ్యవహారాల’’ ఉప సంఘంవారు ఒక నివేదికను వెల్లడించారు. ఈ నివేదికలో మన ‘పౌరసత్వ సవరణ చట్టం’ గురించి వ్యతిరేక నిర్థారణలు చేశారు! ఇలా విదేశాలలో మన దేశం పట్ల దుష్ప్రచారం జరుగుతోంది. ఈ దుష్ప్రచారానికి దేశంలో ‘పౌరసత్వ సవరణ చట్టాని’కి వ్యతిరేకంగా జరుగుతున్న అర్థరహితమైన అతార్కికమైన, అన్యాయమైన ప్రచారం మరింత దోహదం చేస్తోంది! పాకిస్తాన్ ఇస్లాం మత రాజ్యాంగ వ్యవస్థ! ఇస్లాం మతోన్మాదులైన జిహాదీలు ఒకవైపు, పాకిస్తాన్ ప్రభుత్వం మరోవైపు ‘ఇస్లాం మతేతరుల’ను వివిధ బీభత్సకలాపాలకు బలిచేస్తుండడం క్రీస్తుశకం 1947నుంచి నడుస్తున్న చరిత్ర! లక్షల మంది ఇస్లామేతరులు ఈ దశాబ్దులలో హత్యకు గురిఅయ్యారు. మరికొన్ని లక్షల మంది ఇస్లాం మతేతరులు తరిమివేతకు గురిఅయినారు. అలా తరిమివేతకు గురిఅయినవారు శరణార్థులై వచ్చి మన దేశంలో తలదాచుకుంటున్నారు. అఫ్ఘానిస్థాన్ నుంచి, బంగ్లాదేశ్ నుంచి కూడ ఇలా ఇస్లాం మతేతరులు పారిపోయి ప్రాణావశిష్టులై మన దేశంలో శరణార్థులయ్యారు! ఇలాంటి వారికి మన దేశ పౌరసత్వం కల్పించడం మానవీయ కలాపం మాత్రమేకాదు, మన ప్రభుత్వ నైతిక బాధ్యత కూడ! ఎందుకంటె అఖండ భారత్ వివిధ సమయాలలో ముక్కలుచెక్కలు కాకుండా ఉండినట్టయిటే ఈ శరణార్థులు సహజంగానే మన దేశపు పౌరులు...
వాస్తవం, కఠోర సత్యం ఇంత స్పష్టంగా ప్రస్ఫుటిస్తున్నప్పటికీ పౌరసత్వ సవరణ చట్టాన్ని ఎందుకు కొందరు వ్యతిరేకిస్తున్నారు?? ఈ వ్యతిరేకులు పరోక్షంగా పాకిస్తాన్‌ను సమర్థిస్తున్నారు!! తరిమివేస్తున్న పాకిస్తాన్ జిహాదీలను, ప్రభుత్వాన్ని ఈ ‘‘వ్యతిరేకులు’’ ఎందుకని తప్పుపట్టడం లేదు? పాకిస్తాన్‌లోను ‘బంగ్లా’లోను ఈ శరణార్థులను బతకనీయలేదు! మన దేశంలో కూడ వారికి శాశ్వత ఆశ్రయం దొరకకపోతే, ‘అఖండ భారత’ పౌరులైన ఈ శరణార్థులు ఎక్కడికి పోవాలి...??