సంపాదకీయం

బొగ్గు ‘పొగలు’ తగ్గవా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బొగ్గు తవ్వకాలను నిర్నిబంధంగా విదేశీయ వాణిజ్య సంస్థలకు అప్పగించాలని కేంద్ర మంత్రివర్గం నిర్ణయించడం విచిత్రమైన పరిణామం! బొగ్గు వినియోగం తగ్గించడంవల్ల పర్యావరణ పరిశుభ్రత పెరుగుతుందన్నది ‘పారిస్ ఒప్పందం’ స్ఫూర్తి. ఐక్యరాజ్యసమితి పర్యవేక్షణలో కుదిరిన ఈ ఒప్పందంలో మనదేశం భాగస్వామి. 2016 సెప్టెంబర్‌లో మనదేశం ఈ ఒప్పందాన్ని ధ్రువీకరించింది. వాతావరణ కాలుష్యాన్ని తగ్గించడం ద్వారా ప్రపంచ ‘ఉష్ణోగ్రత’ మితిమీరి పెరగకుండా నిరోధించడం పారిస్ ఒప్పందం ఇతివృత్తం. ఉష్ణోగ్రతలు పెరుగుతుండడంవల్ల మంచు శిఖరాలు, సముద్రాలలో మంచు శకలాలు కరగిపోతున్నాయి, సముద్రాల నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. సముద్ర నీటిమట్టం పెరుగుదలవల్ల వివిధ దేశాలలోని తీరప్రాంతాలు, కొన్ని చిన్న దేశాలు శాశ్వతంగా జలదిగ్బంధం అయ్యే ప్రమాదం పొంచి ఉన్నదన్నది ధ్రువపడిన వాస్తవం! కానీ ఈ ప్రమాదాన్ని అతిగమించవచ్చు, జలమయమయ్యే ప్రాంతాలనుంచి జనావాసాలను బయటికి శాశ్వతంగా తరలించవచ్చు! ఉష్ణోగ్రతలు పెరుగుతుండడానికి సముద్రాల నీటిమట్టం పెరగడం సూచిక మాత్రమే! అసలు ప్రమాదం ఉష్ణోగ్రత పెరుగుదలకు తట్టుకోలేని అనేక జీవజాతులు అంతరించిపోవడం, జీవవైవిధ్య సమతుల్యం నశించడం. మానవాళి మనుగడ, ప్రగతి జీవ వైవిధ్య సమతుల్యంపై ఆధారపడి ఉన్నాయి. అందువల్ల సముద్ర తీర ప్రాంతాలు, సముద్రంలోని దీవులు ముంపునకు గురికావడం కంటె ‘జీవ వైవిధ్యం’దెబ్బతినడం మరింత భయంకరమైన ప్రమాదం! అందువల్ల ఉష్ణోగ్రత పెరుగుదలను, ఈ పెరుగుదలకు కారణమైన కాలుష్యాన్ని నియంత్రించడం నిరోధించడం నిర్మూలించడం ‘ప్రపంచ పర్యావరణ పరిరక్షక సూత్రం’. కాలుష్యం పెరగడానికి విస్తరించడానికి ‘బొగ్గులు’కాలడం ఒక ప్రధాన కారణం, ప్లాస్టిక్ వినియోగం మరో ప్రధాన కారణం. పారిశ్రామిక వ్యర్థాలు నీటిలోను, ఉపరితలంలోను నిండిపోతుండడం మరో కారణం! మానవ జీవన విధానం అతి ప్రధాన కారణం. ఇలా వివిధ కారణాలవల్ల పర్యావరణంలో విస్తరిస్తున్న కాలుష్యం స్వచ్ఛతను బలికొంటోంది. ‘బొగ్గు వ్యర్థాల’ను నిరోధించడం గురించి అంగీకారం కుదరనందువల్లనే గత డిసెంబర్‌లో స్పెయిన్ రాజధాని మాడ్‌రిడ్‌లో పదహారు రోజులపాటు జరిగిన ‘అంతర్జాతీయ పర్యావరణ’ చర్చలు విఫలమయ్యాయి. ‘పారిస్ ఒప్పందం’ అమలుజరుపడంలో భాగంగా జరిగిన ఈ చర్చలు ‘‘బొగ్గు వ్యర్థాల’’ను అదుపుచేయడానికి ఉపకరించకపోవడం అగ్ర రాజ్యాల దుస్తంత్రం...కావచ్చు! కానీ బొగ్గు వాడకాన్ని తగ్గించి ఇతర ఇంధనాలను విరివిగా ఉపయోగించాలన్నది మన ప్రభుత్వం సైతం అంగీకరించిన ‘‘స్వచ్ఛ పర్యావరణ సూత్రం’’. ఈ స్థితిలో బొగ్గు బొరియల- కోల్ బ్లాక్స్-ను తవ్వడానికి వీలుగా విదేశీయుల పెట్టుబడుల- ఫారిన్ డైరక్ట్ ఇనె్వస్ట్‌మెంట్- ఎఫ్‌డిఐ-ను కోరడం విచిత్ర పరిణామం కాదా??
ప్రశాంత మహాసాగరం- పసిఫిక్ ఓషన్-లో ‘కిరివటి’అన్న చిన్న దేశం నెలకొని ఉంది. చిన్న చిన్న ద్వీపాల సమూహం ఈ దేశం. ఎనిమిది వందల పదకొండు చదరపు కిలోమీటర్ల ఈ దేశం జనాభా లక్షా పదహైదు లక్షలు. ముప్పయి రెండు ద్వీపాల సముదాయమైన ఈ దేశానికి పదకొండు వందల నలబయి మూడు కిలోమీటర్ల సముద్ర తీరం ఉందట. ఈ ద్వీపాలు ఎంత చిన్నవో దీనివల్ల ఊహించుకోవచ్చు. ఈ ద్వీపవాసులకు తగినంత ఆహారం ఈ ద్వీపాలలో లభించడం లేదట. అందువల్ల ‘కిరివటి’ప్రభుత్వం ‘్ఫజీ’ దేశంలో ఆరువేల ఎకరాల భూమిని కొని అక్కడ వ్యవసాయం చేయిస్తోందట. సగటున ఈ ‘కిరివటి’ దేశపు ఉపరితలం సముద్రపు నీటిమట్టానికి కేవలం ఆరు మీటర్ల ఎత్తున నెలకొని ఉందట! అందువల్ల సముద్రపు నీటిమట్టం పెరిగినట్టయితే తమ దేశం సముద్ర జలాలతో నిండిపోతుందని ఆ దేశం ప్రభుత్వం 2015 ఆగస్టులో ‘‘పారిస్ సదస్సు’’లో పాల్గొంటూ ఉండిన దేశాల ప్రభుత్వాలకు తెలియచేసింది. అందువల్ల సముద్రపు నీటిమట్టాన్ని పెంచే ‘ఉష్ణోగ్రత’ పెరగకుండా నిరోధించాలని ‘కిరివటి’ ప్రభుత్వం ప్రపంచ దేశాలకు విజ్ఞప్తిచేసింది. బొగ్గు కాలుష్యంవల్లనే ప్రధానంగా ఉష్ణోగ్రత పెరుగుతోందని, అందువల్ల కొత్తగా బొగ్గు గనుల- కోల్ బ్లాక్స్-ను ఏర్పాటుచేయరాదని ‘కిరివటి’ ప్రభుత్వం కోరింది. బొగ్గు తవ్వకాలను క్రమంగా తగ్గించివేయాలన్నది ‘కిరివటి’ ఆకాంక్ష. ఇంధన తైలం, ఇంధన వాయువులు కాలినప్పటికంటె బొగ్గు కాలడంవల్ల మరింత ఎక్కువగా కాలుష్య తరంగాలు ఏర్పడుతున్నాయట. పశ్చిమ బెంగాల్‌లోని ‘ఘోరమర’అన్న దీవి క్రమంగా జలగ్రస్తం అవుతోందట. ఈ దీవి బంగాళాఖాతంలో గంగానది కలిసేచోట నెలకొని ఉంది. ఈ ద్వీప నివాసులు ఇతర ప్రాంతాలకు తరలిపోతున్నారట. కేరళలోని కొల్లమ్ జిల్లాలో కూడ ఈ దీవి క్రమంగా జలమయం అవుతోందట!!
బ్రిటన్ దురాక్రమణ కొనసాగిన సమయంలో మన దేశంలో ప్రభుత్వేతర సంస్థలు బొగ్గు తవ్వకాలను జరిపేవి. 1973వరకు ఈ పద్ధతి నడిచింది. 1973లో కేంద్ర ప్రభుత్వం బొగ్గు గనులను జాతీయకరణ చేసింది. ఫలితంగా ప్రభుత్వరంగ వాణిజ్య సంస్థ ‘కోల్ ఇండియా’దేశంలోని బొగ్గు గనుల నిర్వహణను చేపట్టింది. అయితే కేవలం ‘విద్యుత్ ఉత్పాదక’ పరిశ్రమలకు, సిమెంటు, ఉక్కు పరిశ్రమలకు విక్రయించడానికి బొగ్గును తవ్వే పనిని ప్రభుత్వేతర సంస్థలకు కూడ అప్పగించారు. అయితే ప్రధానంగా తవ్వకాలను కోల్ ఇండియా నిర్వహించడం చరిత్ర. ఇలా ప్రభుత్వరంగ సంస్థ, పరిమిత ప్రయోజనాలకోసం ప్రభుత్వేతర సంస్థలు బొగ్గును తవ్వినప్పటికీ అవసరాలకు తగినంత బొగ్గు ఉత్పత్తికాలేదు. ప్రధానంగా థర్మల్ విద్యుత్ ఉత్పత్తికేంద్రాలకు బొగ్గు అవసరం ఎక్కువగా ఉంది! అందువల్ల అణు విద్యుత్తు, సౌర విద్యుత్తు, జల విద్యుత్తు, వాయు విద్యుత్తు ఉత్పత్తులు బాగా పెరిగేవరకు విద్యుత్ ఉత్పత్తికోసం ‘బొగ్గు’ను కాల్చక తప్పనిస్థితి ఏర్పడింది. ఒకప్పుడు దేశంలో బొగ్గును కాల్చి నీటిని మరిగించి ‘ఆవిరి’ ఇంధనం ద్వారా బస్సులను నడిపారట. తరువాత బస్సులకు ‘డీజెల్’ నూనె ఇంధనమైంది. దశాబ్దులపాటు రైళ్లను ప్రధానంగా ఆవిరి యంత్రాల- స్టీమ్ ఇంజన్‌లు- ద్వారానే నడపడం చరిత్ర. ఈ ‘బొగ్గు’బస్సులు ఎప్పుడో అంతరించాయి, ‘బొగ్గు’రైళ్లుకూడ కనుమరుగయ్యాయి. రైళ్లలో బొగ్గును వాడిన సమయాలలో బొగ్గు దొంగతనాలు విరివిగా జరిగేవి. ఇదంతా గతం. ఇళ్లలో వంటలకు, నీరు కాచడానికి బొగ్గు వాడడం కూడ ఇప్పుడు దాదాపు ఆగిపోయింది. పల్లెపల్లెకూ వంట ‘ఇంధనం వాయువు’ సరఫరా అవుతుండడం ప్రభుత్వం సాధించిన సంక్షేమం! కానీ రైళ్లలో బొగ్గు ఉపయోగం, బొగ్గు దొంగతనాలు ఆగిపోయిన తరువాతనే 2012లో అతి పెద్ద బొగ్గు దొంగతనం బయట పడింది. చరిత్రలోనే అతి పెద్ద అవినీతి అది. బొగ్గు బొరియలను కేటాయించిన ప్రభుత్వ నిర్వాహకులు భారీగా అవినీతికి పాల్పడినారన్నది ఆరోపణ. దాదాపు లక్ష ఎనబయి ఆరువేల కోట్ల రూపాయల ‘దొంగతనం’ అది. రెండువందల నాలుగు కేటాయింపులను సర్వోన్నత న్యాయస్థానం ఆ తరువాత రద్దుచేయడం చరిత్ర...
‘ప్రపంచీకరణ’ విస్తరిస్తున్నకొద్దీ అవినీతి కూడ విస్తరిస్తోందనడానికి ఈ ‘బొగ్గు’అవినీతి భాగం! అందువల్ల విదేశీయ సంస్థలు సైతం బొగ్గు తవ్వకాలకు పూనుకున్నట్టయితే అవినీతి మరింత విస్తరించే ప్రమాదం లేకపోలేదు. 2018లోనే ప్రభుత్వం బొగ్గు గనులను తవ్వకాలను ప్రభుత్వేతరులకు అప్పగించే కార్యక్రమాన్ని మొదలుపెట్టింది. అంతవరకు పరిమిత ప్రయోజనాలకోసం మాత్రమే ప్రభుత్వేతరులు బొగ్గు తవ్వగలిగేవారు. 2018నుంచి ఈ పరిమితులను ప్రభుత్వం సడలించింది. విదేశీయ సంస్థలు కూడ బొగ్గు బొరియలలోకి చొఱబడడానికి రంగం సిద్ధంకావడం ప్రభుత్వం వారి సరికొత్త నిర్ణయం...