సంపాదకీయం

దిక్కు తెలియని దారి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిర్మాణోం కే పావన్ యుగ్ మే హమ్ చరిత్ర నిర్మాణ కరే- నిర్మాణాలు జరుగుతున్న సమయంలో మనం సౌశీల్యాన్ని నిర్మిద్దాము-అన్నది ఒక హిందీ కవి చెప్పిన మాట! రహదారుల నిర్మాణం నిరంతరం కొనసాగుతున్న సమయంలో ఇలా ప్రజల సౌశీల్యం కూడ పెంపొందడం సమాంతర పరిణామం కావాలన్నది మానవీయ స్ఫూర్తి. సౌశీల్యం లేని వాహన చోదకుల వల్ల నిరంతరం రహదారి ప్రమాదాలు జరుగుతున్నాయి. సౌశీల్యం లేని మానవ పిశాచాలు రహదారుల పక్కన పొంచి ఉన్నాయి, అబలలను లైంగిక అత్యాచారాలకు బలిచేసి హత్య చేస్తున్నాయి. సౌశీల్యం లేని పోలీసులు, సౌశీల్యం లేని అధికారులు, సౌశీల్యం లేని వ్యాపారులు, సౌశీల్యం లేని విద్యావంతులు, ‘సౌశీల్యం’ అన్న మాట కూడ వినని రాక్షసుల వంటి లైంగిక బీభత్సకారులు, దొంగలు, హంతకులు రహదారులను నిరంతరం ఆవహించి ఉన్న ఘోర ప్రమాదాలు! రెండు వాహనాలు పరస్పరం ఢీకొనడం ప్రమాదం.. కానీ చరిత్ర హీనులు, నేరప్రవృత్తికల నరరాక్షసులు జన జీవన ప్రస్థానాన్ని ఢీకొంటుండడం ఘోర భయంకర ప్రమాదం! ఈ రెండు ప్రమాదాలలో మొదటిదాన్ని నిరోధించడానికి ‘జాగరూకత’ చాలు! కానీ రెండవ దాన్ని నిరోధించడానికి ‘జాగరూకత’ చాలదు, మానవులు పిశాచాలుగాను, రాక్షసులుగాను మారకుండా నిరోధించడానికి, మానవులు మానవులుగా జీవించడానికి వీలుగా నిరంతర నిర్నిద్రతో సౌశీల్య నిర్మాణం జరగాలి! ఇలా జరగకపోవడం వల్లనే ధార్మిక పథంపై జరుగవలసిన జీవనప్రస్థానం నిరంతరం దాడులకు గురిఅవుతోంది, ప్రమాదగ్రస్తం అవుతోంది, ప్రమాదపు గోతులలో పడిపోతోంది! రహదారుల నిర్మాణం జరుగుతోంది, రహదారుల వెడల్పు పెరుగుతోంది, ఎదురు ఎదురుగా వాహనాలు వేగంగా వచ్చి పరస్పరం ఢీకొనకుండా ‘ఏకదిశా ప్రస్థాన’- ఒన్ వే- పథాలు ఏర్పడి ఉన్నాయి. ఇంకా ‘క్షిప్రచలన దోహక’ పథాలు- ఎక్స్‌ప్రెస్‌వేస్- ‘హరిత పథాలు’- గ్రీన్ కారిడార్ హైవేస్- వంటివి ఏర్పడిన ఆర్భాటం జరుగుతూనే ఉంది! అయినప్పటికి ప్రతిరోజూ సగటున దాదాపు పనె్నండు వందల రహదారి ప్రమాదాలు జరుగుతున్నాయట. ప్రతి గంటకు సగటున పదిహేడుగురు రహదారి ‘్ఢ’లకు బలై అకాల మృత్యువు పాలవుతున్నారట! చరిత్ర నిర్మాణ సమాంతర కార్యక్రమం జరగడం లేదు. అందువల్లనే తాగుబోతులు, నిర్లక్ష్య భయంకరులు, రాక్షసానందం పొంద దలచినవారు వాహనాలను ‘్ఢ’ కొడుతున్నారు, ‘పల్టీ’ కొట్టిస్తున్నారు. జాతీయ మహాపథాలకు ఇరువైపులా బాలికలపై, యువతులపై, మహిళలపై, అబలలపై జరుగుతున్న లైంగిక అత్యాచారాలను ‘చట్టాల’ నిర్మాణం ఆపడం లేదు. 2012లో ‘నిర్భయ’ జరిగిన భయంకర లైంగిక అత్యాచారం తరువాత, ‘చట్టం’ మరింతగా పదునెక్కింది. కానీ ఈ ఏడేళ్లలో అంతకుపూర్వం కంటె అధికంగా అబలలపై అత్యాచారాలు పెరిగిపోయాయి. శంషాబాద్ సమీపంలో పశువైద్యురాలు అత్యాచారానికి, హత్యకు గురికావడం ఈ పాశవికత్వానికి నరరాక్షసత్వానికి పరాకాష్ఠ. శంషాబాద్‌లో ‘రావణకాండ’ కొనసాగిన సమయంలోనే వరంగల్లు హనుమకొండ సమీపంలో ఒక ప్రధాన రహదారిపై పంతొమ్మిది ఏళ్ల బాలిక ‘పుట్టినరోజు పండుగ’ నాడే అత్యాచారానికి, హత్యకు గురైపోయింది! భౌతిక నిర్మాణాలతో సమాంతరంగా సమాజ సంస్కార నిర్మాణం జరుగకపోవడం జాతీయ ప్రస్థానాన్ని ఢీకొడుతున్న నిరంతర ప్రమాదం...
జాతీయ మహాపథాల- నేషనల్ హైవేస్- నిర్వహణ ప్రమాణాలను, భద్రతను పెంపొందించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన ఈనెల ఒకటవ తేదీన జరిగిన సమీక్షా సమావేశంలో నిర్ణయించారట! నిర్వహణ ప్రమాణాలను పాటించడంలోను, భద్రతావ్యవస్థను పటిష్ఠం చేయడంలోను వివిధ ‘జాతీయ మహాపథాల’కు స్థాయిలను కూడ నిర్ణయిస్తారట! మొదటి స్థానంలోను ద్వితీయ, తృతీయ స్థానంలోను వ్యవస్థీకృతం కాగల రహదారులకు ప్రశంసాపత్రాలను ప్రదానం చేస్తారట! కానీ ఎప్పటికప్పుడు రహదారుల నిర్వహణ ప్రమాణాలు, భద్రత ప్రమాణాలు పతనమైపోతుండడం దశాబ్దుల వైపరీత్యం. అటల్‌బిహారీ వాజపేయి ప్రధానమంత్రిత్వంలోని భారతీయ జనతాపార్టీ ప్రభుత్వం 1998- 2004 మధ్యకాలంలో రహదారుల అభివృద్ధికి విస్తరణకు వివిధ పథకాలను రూపొందించింది. జాతీయ ‘మహాపథాల’ను ఆరువరసల, ఎనిమిది వరుసల ‘క్షిప్రచలన దోహక పథాలు’- ఎక్స్‌ప్రెస్‌వేస్-గా రూపొందించాలన్న పథకం, గ్రామ గ్రామాలకు పక్కాగా రహదారులను నిర్మించే పథకం వంటివి అప్పుడే రూపొందాయి. ఆ తరువాత నరేంద్ర మోదీ ప్రధానమంత్రిత్వంలోని ‘్భజపా’ ప్రభుత్వం ‘హరిత పథాల’-గ్రీన్ కారిడార్ రోడ్స్-ను రూపొందించే పథకాన్ని కూడ ఆవిష్కరించింది. కానీ ఈ విస్తరణ, ఆధునీకరణలతోపాటు ‘్భద్రత’ నిర్వహణ ప్రమాణాలు మెరుగుపడలేదన్నది ఒకటవ తేదీ నాటి సమీక్షా సమావేశానికి విచిత్రమైన నేపథ్యం. జాతీయ మహాపథాలపై జరిగిన ప్రమాదాల కారణంగా 2014లో దాదాపు నలబయి ఏడువేల మంది మృత్యువుపాలుకాగా, 2018లో ఇలాంటి అకాల మరణగ్రస్తుల సంఖ్య దాదాపు యాబయినాలుగు వేలకు పెరిగిందట...
‘ఎక్స్‌ప్రెస్ వేస్’ ఏర్పడినచోట్ల వాహనాలు పరస్పరం ఎదురుపడి ఢీకొనే ప్రమాదం తప్పింది. అయినప్పటికీ లారీలు, బస్సులు, కార్లు, మోటారు సైకిళ్లు ప్రమాదాలకు గురిఅవుతూనే ఉండడానికి కారణం ఏమిటి? ప్రభుత్వేతర రంగాల వాహనాలు మితిమీరిన వేగంతో నడుస్తుండడం ఒక ప్రధాన కారణం. గంటకు రెండువందల కిలోమీటర్లు, నూటయాబయి కిలోమీటర్లు పయనించిన ‘‘ప్రయివేట్’’వాహనాలు అదుపుతప్పి గోడలను, స్తంభాలను, ‘డివైడర్’లను ఢీకొంటున్నాయి. మన దేశపు రహదారులకు విదేశాల నుంచి చొఱబడిన ‘వోల్వో’ వంటి బస్సులు పనికిరావని అనేకసార్లు ధ్రువపడినప్పటికీ ప్రభుత్వం ఈ విదేశాల బస్సుల దిగుమతిని నిషేధించడం లేదు, నిరోధించడం లేదు. ‘ఏకదిశా ప్రస్థాన పథాలు’ ఏర్పడిన తరువాత ప్రమాదాలు మరింతగా పెరగడానికి కారణం ఈ విదేశీయ బస్సులను ‘చోదకులు’-డ్రైవర్స్- మితిమీరిన వేగంతో నడిపేస్తుండడం. రాష్ట్ర ప్రభుత్వాల నిర్వహణలోని బస్సులలో వేగాన్ని నియంత్రించే వ్యవస్థలను ఏర్పాటుచేసి ఉన్నారు. ఇలాంటి ‘వ్యవస్థ’ ప్రభుత్వేతర వాహనాలలో ఎందుకని ఏర్పడలేదు. తప్పతాగి ఊగుతూ, తూగుతూ, నిద్రపోతూ వాహనాలను నడుపుతున్నవారు ‘రహదారి’ఘోరాలకు కారణమవుతున్నారు. జాతీయ మహాపథాలకు ఇరువైపులా ఐదువందల మీటర్ల వెడల్పున ఉన్న ప్రదేశాలలో మద్యం దుకాణాలు ఉండరాదని సర్వోన్నత న్యాయస్థానం తీర్పుఇచ్చిన తరువాత రెండేళ్లు గడిచిపోయాయి. కానీ ఈ తీర్పును రాష్ట్ర ప్రభుత్వాలు చాలాతెలివిగా వమ్ముచేయగలిగాయి. సర్వోన్నత న్యాయస్థానంవారే ఆ తరువాత ‘నిబంధనను’ కొంతమేరకు సడలించడానికి అంగీకరించారు. ఫలితంగా మద్యం దుకాణాలు జాతీయ మహాపథాల వెంట దాదాపు యథాతథంగా కొనసాగుతున్నాయి. అబలలపై లైంగిక అత్యాచారాలు నానాటికీ ఎక్కువ అవుతుండడానికి మద్యం కూడ ఒక ప్రధాన కారణం...
కొన్ని జాతీయ మహాపథాలు మన దేశంలో అనాదిగా కొనసాగుతున్నాయి. వాటినే బ్రిటన్ దురాక్రమణ సమయంలో పేర్లు మార్చి వ్యవస్థీకరించారు. కన్యాకుమారి నుంచి వారణాసి వరకు ఏర్పడి ఉన్న ‘‘నేషనల్ హైవే’’ ఇలాంటి ప్రాచీన పథాలలో ఒకటి. ఈ మహాపథాలలో తీర్థయాత్రికులు, వ్యాపారులు, సైనికులు, సందర్శకులు నిర్భయంగా పయనించడం చరిత్ర. యాత్రికుల బృందాలలోని అబలలు లైంగిక అత్యాచారాలకు గురిఅయిన చరిత్ర మనకు లేదు. ఇందుకు కారణం విద్యార్థులకు, విద్యావంతులకు విద్యాలయాలలోను, సామాన్య ప్రజలకు వివిధ ప్రచార మాధ్యమాల ద్వారాను మానవీయ సంస్కారాలను మప్పిన వ్యవస్థ సమాజ నిహితం కావడం పల్లెపదాల ద్వారా, వ్యవసాయ గీతాల ద్వారా, కోలాటాల ద్వారా, భజనల ద్వారా, వివిధ దృశ్యరూపకాల ద్వారా భారతీయ సంస్కారాలను, మానవీయ సంస్కారాలను సామాన్య ప్రజలు పొందగలిగిన చరిత్ర మనది. ఈ ‘చరిత్ర’ను బ్రిటన్ బీభత్స పాలకులు ధ్వంసం చేశారు... ఇంకా పునరుద్ధరణ జరగలేదు!