సంపాదకీయం

నేపాల్‌కు చైనా ‘రైలు’..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నేపాల్‌లో చైనా ప్రభుత్వ వాణిజ్య దురాక్రమణ కొనసాగుతుండడం మన ఉత్తరపు సరిహద్దుల భద్రతకు మరింత విఘాతకరమైన విపరిణామ క్రమం! ఈ అ‘క్రమం’లో భాగం నేపాల్ ప్రభుత్వానికీ చైనా ప్రభుత్వానికీ మధ్య కుదిరిన ‘ఇనుప దారి’ ఒప్పందం. గత ఆదివారం కుదిరిన ఈ ‘ఒప్పందం’ప్రకారం టిబెట్‌లోని ‘జ్యీరామ్’ నగరం నుంచి నేపాల్ రాజధాని ఖాట్మండూ వరకు డెబ్బయి కిలోమీరట్లమేర ‘ఇనుప దారి’- రైలుమార్గం-ని నిర్మిస్తారట! క్రీస్తుశకం 1959నుంచి త్రివిష్టపం- టిబెట్- చైనా ‘కమ్యూనిస్టు’ నియంతృత్వ ప్రభుత్వ దురాక్రమణలో కొనసాగుతోంది. రెండువేల ఏళ్లకు పైగా స్వతంత్ర దేశంగా ఉండిన ‘టిబెట్’ను చైనా దిగమింగడంలో ‘్భరత, టిబెట్’ సరిహద్దు ‘్భరత, చైనా’ సరిహద్దుగా మారింది. ఫలితంగా మన ఉత్తరపు సరిహద్దుకు చైనా దురాక్రమణ ప్రమాదం ఏర్పడింది, ఈ ప్రమాదం 1962లో వాస్తవమైంది. మన దేశానికీ చైనాకు మధ్యనుండిన ‘స్వతంత్ర త్రివిష్టప దేశం’ చైనా దురాక్రమణకు గురి అయిన మూడేళ్లకే చైనా మన దేశంలోకి చొఱబడింది. మన లడక్‌లోని ముప్పయి ఎనిమిది చదరపు కిలోమీటర్ల భూభాగం, ఉత్తర కశ్మీర్‌లోని ఆరువేల చదరపు కిలోమీటర్ల భూమి చైనా అక్రమ అధీనంలో ఇప్పటికీ అలమటిస్తున్నాయి. ఇందుకు కారణం ‘టిబెట్’ను చైనా దిగమింగడం. టిబెట్‌ను చైనాకు ‘‘అప్పగించడం’’ చైనా దురాక్రమణను సమర్ధించడం అప్పటి మన ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ ఒడిగట్టిన ‘హిమాలయ మహాపరాధం’. ఈ తప్పిదం వల్ల చైనా దురాక్రమణ ప్రమాదం మనకు దశాబ్దులుగా వ్యవస్థీకృతమైపోయింది. 2001లో చైనా ప్రభుత్వం ‘‘చైనా టిబెట్’’ సరిహద్దునుంచి ‘నేపాల్ టిబెట్’ సరిహద్దువరకూ రైలుమార్గాన్ని నిర్మించడం మొదలుపెట్టింది. టిబెట్‌లో ఉత్తరపు కొస నుంచి దక్షిణం కొస వరకు మూడువేల కిలోమీటర్ల రైలుమార్గాన్ని చైనా పదేళ్లలో నిర్మించింది. భూటాన్ సరిహద్దువరకు, మన అరుణాచల్‌ప్రదేశ్ సమీపం వరకూ ఈ రైలుమార్గాన్ని విస్తరించింది. ఇదంతా మనదేశానికి వ్యతిరేకంగా చైనా జరుపుతున్న దురాక్రమణ కలాపం! టిబెట్‌లోని ప్రాకృతిక సంపదను, భూగర్భ ఖనిజ సంపదను, అపురూప భూఖనిజ ధాతువులను- రేర్ అర్త్ మినరల్స్- దశాబ్దులపాటు కొల్లగొట్టి తెగ బలిసిన చైనా సైనిక కలాపాల కోసం విపరీతంగా ఖర్చుపెడుతోంది. సైనిక బలగాలను, ఆయుధ సామగ్రిని మన సరిహద్దులవరకు వేగవంతంగా తరలించుకొని రావడానికి వీలుగా చైనా ‘టిబెట్’పొడవునా రైలుమార్గాలను నిర్మించింది. టిబెట్ విస్తరించిన భూభాగంలో మన సరిహద్దులలో సైనిక వ్యవస్థలను ఏర్పాటుచేసిన చైనా నేపాల్, భూటాన్ విస్తరించి ఉన్న భూభాగంలోకి సైతం చొఱబడి మన సరిహద్దుల వరకూ విస్తరించాలని యత్నిస్తోంది. అంటే ‘్భరత నేపాల్’ ‘్భరత భూటాన్’ సరిహద్దులవరకు వ్యూహాత్మకంగాను భౌతికంగాను వాణిజ్యపరంగాను చొచ్చుకురావడం చైనా లక్ష్యం. ఈ ‘దుస్తంత్రం’లో భాగస్వామి కావడానికి భూటాన్ ఒప్పుకోదు, నేపాల్ కూడ పదేళ్ల క్రితం వరకు ఒప్పకోలేదు...
కానీ నేపాల్‌లో చైనా కమ్యూనిస్టుపార్టీ చంకబిడ్డలైన ‘మావోయిస్టుల’ ప్రాబల్యం విస్తరించిన తరువాత నేపాల్‌లోకి చొఱబడిపోవడం చైనాకు చాలా సులభమైపోయింది. ఇప్పుడీ ‘రైలుమార్గం’ నిర్మాణం ఒప్పందం ఈ దురాక్రమణ సౌలభ్యానికి సరికొత్త ఉదాహరణ. పదకొండవ, పనె్నండవ తేదీలలో మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో మహాబలిపురంలో ‘ఇష్టాగోష్ఠి’ నిర్వహించిన చైనా అధ్యక్షుడు పదమూడవ తేదీన నేపాల్‌కు చేరుకున్నాడు. నేపాల్ ప్రధానమంత్రి ఖడ్గప్రసాద్ శర్మ ఓలీతో చైనా అధ్యక్షుడు ఝీజింగ్ పింగ్ జరిపిన చర్చల తరువాత ఈ ‘రైలుమార్గ’ నిర్మాణపు ఒప్పందం కుదిరిందట. దీనితోపాటు నేపాల్‌లో వౌలిక సదుపాయాల వ్యవస్థలను నిర్మించేందుకు మొత్తం ఇరవై ఒప్పందాలు కుదరడం చైనా చొఱబాటు విస్తరించిపోతోందనడానికి నిదర్శనం. ఖడ్గప్రసాద్ శర్మ ఓలీ నేపాల్ మార్క్సిస్టు లెనినిస్టు కమ్యూనిస్టు పార్టీకి చెందినవాడు. నేపాల్ మావోయిస్టు కమ్యూనిస్టుపార్టీ అధినేత పుష్పకమల్ దహల్ ప్రచండ పదేళ్లకు పైగా నేపాల్ ‘రాజకీయ గతి’ని నిర్దేశించగలుగుతుండడం చైనా వ్యూహంలో భాగం. 1995లో నేపాల్ కమ్యూనిస్టుపార్టీ మావోయిస్టుపార్టీగా, మార్క్సిస్టు లెనినిస్టు పార్టీగా చీలిపోవడం చైనా షడ్యంత్రంలో భాగం. మావోయిస్టు పార్టీవారు ఎనిమిదేళ్లపాటు సాయుధ బీభత్సకాండను జరిపారు. ఈ బీభత్సకాండకు పదమూడు వేల మంది బలైపోయారు. నేపాల్‌లో ఏకపక్ష కమ్యూనిస్టు నియంతృత్వ వ్యవస్థను ఏర్పాటుచేయడం ఈ బీభత్సకాండ లక్ష్యం. ఇదే సమయంలో ‘మార్క్సిస్టు లెనినిస్టుపార్టీ’ వారు ప్రజాస్వామ్య- బహుళపక్ష- రాజ్యాంగ ప్రక్రియను సమర్ధించారు. 2005 తరువాత మావోయిస్టులు కూడ ‘ప్రజాస్వామ్య రాజ్యాంగ ప్రక్రియ’లో భాగస్వాములు కావడం కూడ చైనా వ్యూహంలో భాగం...
గత పదేళ్లకు పైగా ‘మావోయిస్టులు-మార్క్సిస్టులు’ పాలించిన సమయంలో చైనా ‘చొఱబాటు’ పెరుగుతోంది. నేపాలీ కాంగ్రెస్ పాలించిన సమయంలో యుగాలు, తరాలుగా కొనసాగుతున్న విధానం అమలుజరుగుతోంది. ఈ విధానం భారత్‌తో మైత్రి! ఇలా చైనా నేపాల్‌లో వ్యూహాత్మకంగాను, ఆర్థికంగాను విస్తరించిపోతుండడం 1949నాటి, 1950నాటి ‘్భరత నేపాల్’ ఒప్పందాల స్ఫూర్తికి విరుద్ధం. ఈ ఒప్పందాలు భారత్‌తో నేపాల్‌కు కొనసాగుతున్న చారిత్రక భౌగోళిక ఆర్థిక సాంస్కృతిక సమానత్వానికి సరికొత్త ధ్రువీకరణలు! 1949నాటి ఒప్పందం వాణిజ్యం, రవాణా, రాకపోకలకు సంబంధించినది. ఈ ఒప్పందం ప్రకారం నేపాల్‌కు విదేశాల నుంచి దిగుమతయ్యే వస్తుసామగ్రి మన దేశం గుండా రవాణా అవుతోంది. నేపాల్‌నుంచి జరిగే ఎగుమతులు మన ఓడరేవుల గుండా విదేశాలకు సరఫరా అవుతున్నాయి. గత పదేళ్లలో ఈ వ్యవస్థను భగ్నం చేయడానికి చైనా అనేక ప్రయత్నాలు చేసింది. ఇప్పుడీ రైలుమార్గాన్ని నిర్మించడం నేపాల్‌ను మన దేశం నుంచి మరింత దూరం చేయడానికి భాగం! గత ఏడాది నేపాల్‌లోని ఉభయ కమ్యూనిస్టు పార్టీలు కలిసిపోయినట్టు ప్రచారమైంది. గత పదేళ్లలో ‘కమ్యూనిస్టుల’ పాలనలో చైనాతో నేపాల్ కుదుర్చుకున్న కొన్ని ఒప్పందాలను ఆ తరువాత ‘నేపాలీ కాంగ్రెస్’ ప్రభుత్వం రద్దుచేసింది. భవిష్యత్తులో మళ్లీ నేపాలీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినట్టయితే ఈ ‘రైలుమార్గం ఒప్పందం’కూడ రద్దుకావచ్చు! కాకపోవచ్చు!! కానీ ఈ ‘ఒప్పందాలు’ ప్రతీకలు మాత్రమే! నేపాల్‌ను మన దేశం నుంచి దూరంగా జరపడానికి చైనాచేస్తున్న కుట్ర కొనసాగుతుండడం వౌలికమైన అంశం. 1950నాటి ‘్భరత నేపాల్’ ఒప్పందం మైత్రికి, శాంతి భద్రతలకు సంబంధించినది. భారత నేపాల్ దేశాల భద్రత పరస్పరం ముడివడి ఉందన్న తరతరాల వాస్తవానికి 1950నాటి ఒప్పందం ధ్రువీకరణ. ఇలా ఈ రెండు ఒప్పందాలను నేపాల్‌లోని ‘మావోయిస్టు-మార్క్సిస్టు’ ప్రభుత్వం ఏకపక్షంగా నీరుకార్చివేస్తోంది. మన ప్రభుత్వం దాదాపు పదహైదు ఏళ్లకు పైగా వహిస్తున్న ఉదాసీనతకు ఫలితం ఇది!
బ్రిటన్ దురాక్రమణ మొదలయ్యేవరకు నేపాల్ అఖండ భారతదేశంలో భాగం. బ్రిటన్ రాజకీయ ఆర్థిక బీభత్సకారులు మొత్తం భారత్‌ను కబళించినప్పటికీ ‘నేపాల్’, ‘్భటాన్’ప్రాంతాలు వారికి లొంగలేదు. బ్రిటన్ దురాక్రమణకు గురికాకుండా ‘స్వతంత్రం’గా మనుగడ సాగించగలిగిన ‘అఖండ భారత’ప్రాంతాలు నేపాల్, భూటాన్! బ్రిటన్ దురాక్రమణ ముగిసిన తరువాత ‘యథాపూర్వస్థితి’ ఏర్పడి ఉండినట్టయితే నేపాల్, భూటాన్‌లు మన దేశంలో అంతర్భాగమయి ఉండేవి! కానీ ‘యథాపూర్వ స్థితి’ ఏర్పడలేదు. ఇది మరో చారిత్రక వైపరీత్యం. నేపాల్, భూటాన్‌లు స్వతంత్ర దేశాలుగానైనా మనుగడ సాగించడం అభిలషణీయం... కానీ చైనా ప్రభుత్వం-టిబెట్టును ఆక్రమించినట్టే నేపాల్‌ను, భూటాన్‌ను కూడ దిగమింగడానికి గుట్టుచప్పుడు కాకుండా కుట్రను సాగిస్తోంది. ‘మా చేతికి టిబెట్ అరచేయి, లడక్, నేపాల్, సిక్కిం, భూటాన్, అరుణాచల్ ఐదువేళ్లు’’- అని చైనా కమ్యూనిస్టులు ప్రకటించి ఉన్నారు. ఈ కుట్రలో భాగం ఆదివారం నాటి ఒప్పందం!!