సంపాదకీయం

సౌష్ఠవ భారతం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం శుభారంభం చేసిన ‘సౌష్ఠవ భారత్’- ఫిట్ ఇండియా- ఉద్యమ స్ఫూర్తికి ‘జాతీయ క్రీడాదినోత్సవం’ సముచిత నేపథ్యం. మానవ జీవన సౌష్ఠవానికి క్రీడలు సనాతనమైన, అంటే శాశ్వతమైన ప్రతీకలు. ప్రతీకలు మాధ్యమాలు, లక్ష్యం సర్వసమగ్ర వికాస జీవన ప్రస్థానం. ‘‘జీవేమ శరదశ్శతం’’- వంద ఏళ్లు జీవించగలగడం- వేదద్రష్టల ఆకాంక్షలోని ఒక అంశం మాత్రమే! నందామ శరదశ్శతమ్- నూరేళ్లు ఆనందంగా గడిపెదము- మోదామ శరదశ్శతమ్- నూరేండ్లు తృప్తిగా ఉందాము-, అజీతాస్యామ శరదశ్శతం- అనేక ఏళ్లపాటు ఓటమిని పొందము- అన్నవి వేద ద్రష్టల మరిన్ని ఆకాంక్షలు. ఈ ఆకాంక్షలన్నింటికీ వౌలిక ప్రాతిపదిక పటిష్టంగా ఉండడం. ఈ పటిష్ఠత కేవలం శారీరకమైనది మాత్రమే కాదన్నది వేదద్రష్టల ఆకాంక్ష.... ఈ పటిష్ఠత, ఈ సౌష్ఠవం భౌతిక బౌద్ధిక మానసిక ఆర్థిక సాంస్కృతికమైనది. ‘‘్భవామ శరదశ్శతమ్- వంద ఏళ్లు సౌష్టవంగా ఉందాము- అని కోరిన మహనీయులైన జాతీయ మార్గదర్శకులైన మహాఋషులు శరీర సౌష్ఠవంతోపాటు మానసిక సౌష్టవాన్ని కూడ నిర్దేశించారు. అందువల్లనే ‘‘నూరేళ్లు మంచి విషయములను వినుచుందుము’’- శ్రుణువామ శరదశ్శతమ్-, ‘‘ప్రబ్రవామ శరదశ్శతమ్- మంచి విషయాలను ప్రచారం చేద్దాము- అని కూడ వాస్తవాన్ని భారత జాతీయ జీవన సత్యాన్ని మహర్షులు ఆవిష్కరించారు. మంచి విషయాలను వినడం, చెప్పడం ప్రచారం చేయడం ఆచరించడం సాంస్కృతిక సౌష్ఠవం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కార్యక్రమ ప్రారంభం సందర్భంగా శారీరిక సౌష్ఠవం గురించి మాత్రమేకాక, సమాజ సౌష్టవం గురించి జాతీయ సౌష్టవం గురించి, సాంస్కృతిక సౌష్టవం గురించి కూడ ధ్వనింప చేశాడు. ‘‘ఇనుప కండరాలు ఉక్కు నరాలు కలిగిన యువకులను’’కోరిన వివేకానందస్వామి ‘‘వజ్ర సంకల్పం’’ ఉన్న యువకులను కూడ ఆకాంక్షించాడు. ‘‘ఇనుప కండరాలు ఉక్కు నరాలు’’ శారీరక సౌష్టవాన్ని పెంపొందిస్తున్నాయి, ఇది భౌతికమైన సౌష్టవం. ‘‘వజ్ర సంకల్పం’’ బౌద్ధిక మానసిక దారుఢ్యం, ఇది సాంస్కృతిక సౌష్టవం. సౌష్టవం భారతీయ జనజీవన స్వభావంగా అనాదిగా వికసించింది. దీన్ని వివేకానందస్వామికి పూర్వం, వివేకానందస్వామి తరువాత అనేక మంది పునరుద్ఘాటించారు, నరేంద్ర మోదీ గురువారం దేశ రాజధానిలో పునరావిష్కరించాడు. క్రీడాకారులు క్రీడాకారిణులు ఇలా ఉక్కు నరాలవారు, ఇనుప కండరాలవారు, సాధించాలన్న వజ్ర సంకల్పం కలవారు- పి.వి.సింధు వంటి సర్వశ్రేష్ఠ క్రీడాకారిణులు ఇలాంటి వజ్ర సంకల్పులు. ప్రధాని అభివర్ణించినట్టు పివి సింధు ‘‘్భరతజాతి గౌరవ ప్రతీక’’- ప్రయిడ్ ఆఫ్ ఇండియా-!’’ భారతీయ క్రీడాపటిమకు పతాక! ఈ ప్రతీకలు ఈ పతాకలు ప్రస్ఫుటించడానికి, అంబర సీమలను అధిరోహించడానికి కారణం ‘సౌష్ఠవం’- శరీర దారుఢ్యం, సడలిపోని సంకల్పం! అందువల్లనే క్రీడాదినోత్సవంనాడు, పివి సింధు ప్రపంచ క్రీడాసామ్రాజ్య విజయ నేపధ్యంలో, ఈ ‘‘సౌష్టవ భారత ఉద్యమం’’ ఆరంభంకావడం విజయసోపాన పథం... రాష్టప్రతి నుంచి ‘ఖేల్త్న్ర’, ‘ద్రోణాచార్య’, ‘అర్జున’ వంటి పురస్కార గ్రహీతలైన క్రీడాకారులు జాతీయ విజయ ధ్వజాలు, సౌష్టవానికి సజీవ రూపాలు, పటిష్ఠ భారత పునర్ నిర్మాణ ప్రస్థాన పథంలో స్ఫూర్తిని వెలిగిస్తున్న దీపాలు...
సౌష్టవాన్ని పరిరక్షించుకొనడం మన దేశంలో అనాది జీవన విధానమన్నది నరేంద్ర మోదీ మరోసారి ఆవిష్కరించిన సనాతన వాస్తవం. శతాబ్దులపాటు ఈ ‘సౌష్టవం’ సన్నగిల్లిపోవడానికి ఏకైక కారణం ఈ జీవన విధానం పట్ల మక్కువలేని విదేశీయుల దురాక్రమణ, విదేశీయ బీభత్సకారులు పాలకులుగా చెలామణి కావడం. ఈ బీభత్స పాలకులు విదేశాలనుంచి వచ్చిపడిన జిహాదీలు, వీరి దాడుల ఫలితంగా భౌతిక సౌష్టవం నీరుకారిపోయింది. దేశ స్వరూపానికి వైకల్యం దాపురించింది. ఐరోపానుంచి ప్రధానంగా బ్రిటన్ నుంచి వచ్చిపడిన దురాక్రమణకారులు బౌద్ధిక బీభత్సకారులు. వీరి పెత్తనం కారణంగా భారత జాతీయ స్వభావ సౌష్ఠవం సన్నగిల్లి పోయింది....
నోటిలోన కోరలున్న / నిశాచరులు ‘జిహాదీ’లు / కరచి కరచి ప్రాదేశిక / సౌష్ఠవాన్ని చెరచినారు! / నిలువెల్లా కోరలున్న / నిశాసురులు ‘తెల్ల’దొరలు / తరచి తరచి స్వాభావిక / సౌష్ఠవాన్ని విరిచినారు!!
వసిష్ఠుడు సౌష్ఠవం.... దిలీపుడు సౌష్ఠవం.... పాండమధ్యముడు అర్జునుడు సౌష్ఠవ సిద్ధికి ప్రతిరూపం! యదుకుల కృష్ణుడు, ఆదిశంకరాచార్యుడు, ఛత్రపతి శివాజీ, వివేకానందుడు, నేతాజీ సుభాష్ చంద్రవసు... యుగయుగాల సౌష్ఠవ వికాసంలో వందల వేల లక్షల కోట్లు ప్రతీకలు! విదేశీయుల ‘‘పాలన’’ విదేశీయుల బీభత్స జాతీయ జనజీవన సౌష్ఠవాన్ని వికృతపరిచాయి. అందువల్ల జరుగుతున్నది నిజానికి అంకురార్పణ కాదు... పునరుద్ధరణ! సూర్యోదయానికి పూర్వం నిద్రలేవడం సౌష్ఠవ జీవన పునరుద్ధరణకు నూతన శ్రీకారం. మాతృభూమి పట్ల మమకారం, జీవజాలం పట్ల ప్రకృతి పట్ల మమకారం సాంస్కృతిక సౌష్ఠవం. ప్రతి కణం పటిష్ఠంగా ఉన్నప్పుడు స్వరూప సౌష్టవం.... సమస్త సృష్టిలోని కణాలు, మానవులు జంతువులు వృక్షాలు పరస్పరం ముడివడి ఉన్నాయి. ఒక కణం గాయపడితే మరో కణం రోదిస్తుంది. కాలు తెగితే శరీరానికి వైకల్యం, వేలు తెగినా వైకల్యమే!!
ఇలా ‘సౌష్ఠవం’ కేవలం ఒక పరిమిత రంగానికి పరిమితం కాలేదు. ‘సౌష్ఠవ భారతం’, ‘స్వచ్ఛ భారతం’ ‘సమృద్ధ భారతం’ ‘అజేయ భారతం’ పరస్పరం ముడివడి ఉన్నాయి. ఇవన్నీ సర్వసమగ్ర విభవ భారత వికాసక్రమంలో పువ్వులు, ఆకులు, పండ్లు, పరిమళాలు.... ధ్యాన్‌చంద్ వంటి జాతీయ వీరులు క్రీడాసౌష్టవాన్ని ప్రస్ఫుటింపచేసి ఉండవచ్చు, చంద్రశేఖర్ అజాద్ వంటి స్వాతంత్య్ర వీరులు సమర సౌష్ఠవ ప్రతిరూపాలు కావచ్చు! వివేకానందుడు సాంస్కృతిక సౌష్టవ ప్రతినిధి కావచ్చు... మహాత్మాగాంధీ స్వదేశీయ భావ సౌష్ఠవ పునరుద్ధరణకు కృషిచేసి ఉండవచ్చు! సర్వసమగ్ర సౌష్టవం భారత జాతీయ జీవన సౌష్ఠవం! ‘‘చెడు చూడకు చెడు వినకు చెడు చెప్పకు’’అన్న ప్రబోధం ‘‘మంచిని నూరేళ్లు విందాము, మంచిని ప్రచారం చేద్దాము’’అన్న వేద నాదాల ధ్వనికి ప్రతిధ్వని! ఈ మానసిక సౌష్టవం పెంపొందించడానికి క్రీడా సౌష్టవం దోహదకరం. జయించి తీరాలన్న క్రీడాస్ఫూర్తి వివిధ జీవన రంగ సమర ప్రాంగణాలలో విజయానికి దోహదం చేయగల మానసిక సౌష్టవం. క్రీడలలో ప్రస్ఫుటించే పట్టుదల, ఏకాగ్రత, నియమ పాలన, సమ్యక్ దృష్టి, విజయనిష్ఠ నిజానికి విస్తృత జీవనప్రస్థాన లక్ష్యసాధనకు పురికొల్పే పాఠాలు! అందువల్ల నైపుణ్యం, పటిమ, విజయం, బలం, ఆయుధం, క్రీడా ఉపకరణం- ఇవన్నీ సాధనాలు మాత్రమే. జాతీయ జీవన సమష్టి హితం లక్ష్యం. ఇదీ సాంస్కృతిక సౌష్టవం, జాతీయ వౌలిక స్వభావం!! అందువల్ల ‘క్రీడ’ జీవన ప్రస్థాన లక్ష్యసాధనకు అనాదిగా మాధ్యమం! ప్రతి జాతి, ప్రతి దేశం ఇలా ‘సమష్టి హిత సౌష్టవం’ సాధించడం విశ్వహితం, వసుధైక కుటుంబం... అందువల్ల ఆయుధం- మాధ్యమం- నైతిక లక్ష్యసాధనకు దోహదం చేయాలి, దుష్టవ్యూహ సాఫల్యానికి దోహనం చేయరాదు... ‘‘యుద్ధాల విజయం క్రీడల మైదానంలో నిర్ధారణ కావడం’’ అన్న నిజం ఇది... ఇదీ సౌష్టవం!!
బ్రహ్మాస్త్ర ప్రయోగదక్షులైన సమరయోధులు యోగక్రీడాసాధన చేసిన సౌష్ఠవ వంతులు. అణ్వస్త్ర నిర్మాణ ప్రయోగ పాటవం సాధించిన వీరులు నిరంతరం సూర్య నమస్కారాలు చేసిన క్రీడాకారులు. సూర్యోదయ సమయంలో నిద్రపోతున్న సోమరిపోతులు గ్రహించవలసిన సాంస్కృతిక పాఠం ఇది, జీవన గుణపాఠం ఇది. సూర్యునికంటె ముందు లేచి యోగాసనాలు వేయడం, సూర్య నమస్కారాలు చేయడం శరీర సౌష్ఠవం పెంపొందడానికి వౌలిక మార్గం! ‘‘నాన్య పంథా అయనాయ విద్యతే’’- మానవ జీవన ప్రస్థానానికి మరో ‘బాట’లేదు- అని అన్నట్టు శారీరక మానసిక సౌష్ఠవ వికాసానికి ‘యోగం’కంటె భిన్నమైన మరో వౌలిక మార్గం లేదు, ‘యోగం’ క్రీడ...యోగ విద్య సమర విద్య యోగ సాధన జీవన లక్ష్యసాధన... యోగం ‘సౌష్ఠవ భారతమ్’..
***