సంపాదకీయం

బీభత్స నిరోధకం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బీభత్సకాండను నియంత్రించడానికి, నిరోధించడానికి, నిర్మూలించడానికి ప్రభుత్వం సాగిస్తున్న భద్రతాప్రస్థానంలో ఇది మరో ముందడుగు, ఉగ్రమూకల పాలిట ‘పిడుగు’.. వివిధ రకాల బీభత్సకాండను కొనసాగిస్తున్న హంతకులను వ్యక్తిగత స్థాయిలో ‘బీభత్సకారుడు’గా నిర్ధారించడానికి శుక్రవారం రాజ్యసభ ఆమోదించిన ‘బిల్లు’ వీలు కల్పిస్తుండడం ఈ ముందడుగు. లోక్‌సభ ఇదివరకే ఆమోదించిన ఈ ‘అక్రమ కలాపాల నిరోధక శాసనం’- అన్ లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్- యుఏపీఏ- ‘ఉపా’- సవరణ విధేయక- అమెండ్‌మెంట్ బిల్-ను రాజ్యసభ కూడ ఆమోదించింది కనుక ఇది రాష్టప్రతి ఆమోదం పొంది చట్టం కావడం ఇక లాంఛనం. ఇన్ని సంవత్సరాలుగా మన దేశం వివిధ రకాల బీభత్సపుముఠాలు నిర్వహిస్తున్న హత్యాకాండకు బలి అయినప్పటికీ, ప్రభుత్వాలు ఈ ముఠాలను మాత్రమే నిషేధించాయి. కానీ ప్రత్యేకంగా హంతకుడిని పేరుపెట్టి ‘బీభత్సకారుడ’ని ప్రకటించలేదు. ఇదీ దశాబ్దుల వైపరీత్యం. ఈ కొత్త ‘సవరణ’వల్ల ఇక ఒక్కొక్క హంతకుడిని ప్రత్యేకించి బీభత్సకారుడు- టెర్రరిస్టు- అని ప్రభుత్వం నిర్ధారించి ప్రకటించడానికి వీలు కలుగుతుంది. ఐక్యరాజ్యసమితి వారు వివిధ దేశాల ప్రభుత్వాల వారు దశాబ్దులుగా ఇలా ‘ముఠా’లను మాత్రమేకాక ‘హంతకుల’ను పేరుపెట్టి ‘టెర్రరిస్టులు’గా ప్రకటిస్తున్నారు. మన ప్రభుత్వాల రాజకీయ నిర్వాహకులకు ఇన్ని దశాబ్దులుగా ఈ ‘్ధ్యస’ కలుగకపోవడం విచిత్రమైన వ్యవహారం. ఇప్పుడైన కేంద్ర ప్రభుత్వానికి ఈ ఆలోచన కలగడం ముదావహం. క్రీస్తుశకం 1967 నుంచి యాబయి మూడేళ్లుగా అమలులోఉన్న ‘ఉపా’చట్టం ప్రకారం ప్రభుత్వం వివిధ బీభత్స సంస్థలను వివిధ సమయాలలో నిషేధించింది, బీభత్స సంస్థలుగా ప్రకటించింది. 2009 జూన్‌లో ప్రభుత్వం ‘్భరత మావోయిస్టు కమ్యూనిస్టు పార్టీ’ని భీభత్సపు ముఠాగా ప్రకటించింది, నిషేధించింది. 2003లో ‘సిమి’ని కూడ బీభత్స సంస్థగా ప్రకటించి నిషేధించింది. కానీ ఈ సిమి- స్టూడెంట్స్ ఇస్లామిక్ మూవ్‌మెంట్ ఆఫ్ ఇండియా-కు చెందిన ‘జిహాదీ బీభత్సకారులు’ ‘కొత్త సంస్థల’ను కనిపెట్టారు. కొత్త సంస్థలను ఏర్పాటు చేశారు. పాకిస్తాన్ ప్రభుత్వ విభాగమైన ‘ఐఎస్‌ఐ’- ఇంటర్ సర్వీసెస్ ఇంటలిజెన్స్- పాకిస్తాన్ నుంచి అనేక పేర్లున్న ‘ముఠాల’ హంతకులను మన దేశంలోకి ఉసిగొల్పి ఉంది. ‘సిమి’వారు ఈ పాకిస్తానీ హంతక ముఠాలలో చేరారు, మరికొందరు కొత్త ముఠాలుగా ఏర్పడినారు. ‘ఇండియన్ ముజాహిదీన్’ అందులో ఒకటి మాత్రమే. వివిధ రకాల పేర్లుపెట్టుకున్న జిహాదీ హంతక ముఠాలు మన దేశంలో ప్రత్యేకించి జమ్మూ కశ్మీర్‌లోను దండిగా ఉన్నాయి. అందువల్ల నిషిద్ధ సంస్థల దుండగులు మరో సంస్థ పేరుతో చెలామణి అయ్యారు లేదా కొత్త సంస్థలను స్థాపించారు. దీనివల్ల బీభత్స నిరోధక ప్రభుత్వ విభాగాల వారికి, పోలీసులకు ‘టెర్రరిస్టుల’ను విడివిడిగా పసికట్టి పట్టుకొనడానికి, న్యాయస్థానాల ముందు నిలపడానికి సకాలంలో వీలు కావడం లేదు..
ఇప్పుడు ప్రభుత్వం ఇలా చట్టాన్ని సవరించడం వల్ల వ్యక్తిగత స్థాయిలో హంతకులను గుర్తించి వారిని టెర్రరిస్టులుగా నిర్ధారించడానికి వీలు కలుగుతుంది. అలా నిర్ధారిత బీభత్సకారులు ఏ సంస్థలో ఉన్నప్పటికీ వారిని గుర్తించడానికి, నిర్బంధించి విచారించడానికి వీలు కలుగుతుంది. దీనివల్ల బీభత్స వ్యతిరేక న్యాయప్రక్రియ వేగవంతం అవుతుంది. ఇనే్నళ్ల తరువాత ప్రభుత్వ రాజకీయ నిర్వాహకులకు ఈ సంగతి స్ఫురించడం ఆలస్యంగానైనా జరిగిన శుభ పరిణామం. 1967లో రూపొందిన చట్టానికి 2004లోను, 2008లోను, 2013లోను సవరణలు జరిగినప్పటికీ అత్యంత కీలకమైన, వౌలికమైన ఈ అంశాన్ని ప్రభుత్వాలు విస్మరించడం విచిత్రం. మేధావులు, మాధ్యమాల విశే్లషకులు, ప్రతిపక్షాల వారు పట్టించుకోలేదు. బహుశా వారికి తోచలేదు. ఇప్పుడు ప్రభుత్వానికి తోచింది, ఇలా తోచడానికి నేపధ్యం ఐక్యరాజ్యసమితి వారు బీభత్సముఠాలను మాత్రమే కాక ప్రత్యేక వ్యక్తులను సైతం ‘ప్రపంచ బీభత్సకారులు’గా గుర్తించి ఆధికారికంగా ప్రకటిస్తూ ఉండడం. ఐక్యరాజ్యసమితి దశాబ్దుల తరబడి ‘వ్యక్తులను ఇలా టెర్రరిస్టులు’గా ప్రకటించింది. వివిధ దేశాలలోని ‘ముఠాల’ను ‘బీభత్సపు తండా’లుగా సమితి గుర్తించడం చరిత్ర. ఇలా ‘సమితి’ అభిశంసనకు గురి అయిన ముఠాలవారు ఆ ముఠాను వదలిపెట్టి కొత్త పేరుతో మరో ముఠాను స్థాపించారు. పాకిస్తాన్‌లో అనేకానేక ‘ముఠాలు’ పుట్టుకొని రావడానికి ఇదీ కారణం. ‘సమితి’ ‘లష్కర్ ఏ తయ్యబా’ను బీభత్సపుముఠాగా ప్రకటించింది. నిషేధించాలని పాకిస్తాన్ ప్రభుత్వాన్ని కోరింది. కానీ ఈ నిషేధం అమలు జరుగకముందే ‘లష్కర్ ఏ తయ్యబా’ ‘జిహాదీ’ల నాయకుడు హఫీజ్ సరుూద్ మరో ‘ముఠా’ను స్థాపించాడు. ఆ ముఠా పేరు ‘జమాత్ ఉద్ దావా’. ఇది ఉదాహరణ మాత్రమే. పాకిస్తాన్‌లోనే కాదు వివిధ దేశాలలో బీభత్సపు ‘ముఠా’లవారు పేర్లుమార్చుకొని యథావిధిగా కలాపాలు సాగిస్తున్నారు. ‘ముఠా’లను నిషేధించడం వల్ల ప్రయోజనం లేదని హంతకులను ప్రత్యేకించి పేరుపెట్టి బీభత్సకారులుగా ప్రకటించాలని ‘సమితి’ పాఠం నేర్చుకుంది. ఈ దశాబ్దుల ‘పాఠం’ మన ప్రభుత్వ నిర్ణయానికి ఇప్పుడు మార్గదర్శకం....
జిహాదీ హంతక ముఠాలను ఇతర ఉగ్ర సంస్థలను నిషేధించినప్పుడు మళ్లీ ఆయా ముఠాలలోని హంతకులను పేరుపెట్టి బీభత్సకారులుగా ప్రకటించవలసిన అవసరమేమిటన్న సందేహానికి ఈ ‘ఘటనాక్రమం’ సమాధానం. ఈ సందేహం సామాన్యులకు రావచ్చు. ప్రభుత్వం సమాధానం చెప్పి అవగాహనను పెంపొందించవచ్చు. కానీ 1967లో ఈ చట్టాన్ని చేసిన, ఆ తరువాత సవరణలను చేసిన కాంగ్రెస్ ప్రముఖులకు కలుగడమే విచిత్రం. దేశ వ్యవహారాల మంత్రిగా పనిచేసిన కాంగ్రెస్ నాయకుడు పళనియప్పన్ చిదంబరం వంటి కాంగ్రెస్‌లోని మేధావులకు కలగడం మరింత విచిత్రం. జూన్ ఇరవై నాలుగవ తేదీన కేంద్ర మంత్రివర్గం ఈ సవరణను, మరికొన్ని సవరణలను ‘ఉపా’లో చేయాలని నిర్ణయించినప్పటినుంచి సమాధానాలు లభిస్తున్నప్పటికీ సందేహాలు మాత్రం సర్దుమణగలేదు. లోక్‌సభలో జూలై ఇరవై నాలుగవ తేదీన ఈ ‘విధేయక’పై చర్చ జరిగిన తరువాత కాంగ్రెస్ తదితర విపక్షాలు నిరసనగా సభనుంచి నిష్క్రమించడం ‘సందేహాలు సద్దుమణగని’ చిత్తవృత్తికి నిదర్శనం. ‘టెర్రరిస్టు’ను ‘టెర్రరిస్టు’అని పిలవడం పట్ల ఈ విపక్షాలకు ఎందుకు అభ్యంతరం? రాజకీయ విభేదాలకు అతీతంగా రాజ్యాంగబద్ధమైన అంశాల పట్ల ఏకాభిప్రాయం కలగడం పరిణత ప్రజాస్వామ్య వ్యవస్థ లక్షణం. జాతీయ హితకరమైన అన్ని విషయాలలోను ప్రభుత్వ, ప్రతిపక్షాల మధ్య ఏకాభిప్రాయం ఉండాలన్న ‘ఆదర్శం’ గురించి అన్ని పార్టీలవారు నిరంతరం ప్రవచిస్తున్నారు. కానీ ‘ఆచరణ’ మాత్రం ఇందుకు పూర్తివిరుద్ధంగా ఉంది. 2004లోను, 2008లోను, 2013లోను ప్రభుత్వం ‘ఉపా’ను సవరించింది. ఆ సమయాలలో ప్రభుత్వ రాజకీయ నిర్వాహకులు కాంగ్రెస్ పార్టీ వారు. ప్రతిపక్షంలో ఉండిన తాము అప్పుడు ఆ సవరణలను సమర్ధించిన సంగతిని ‘్భరతీయ జనతాపార్టీ’వారు ఇప్పుడు గుర్తుచేస్తున్నారు. కానీ ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ ఎందుకని ప్రస్తుత సవరణలకు అభ్యంతరం చెప్పారు? ప్రభుత్వం చేసిన సవరణలను జాతీయతత్త్వ నిష్ఠతోకాక రాజకీయ ప్రయోజన నిష్ఠతో కాంగ్రెస్ వారు ఎందుకని అంచనావేశారు??
దశాబ్దుల తరబడి మన దేశంలో రకరకాల లక్ష్యాలతో ‘టెర్రరిస్టులు’ తమ కలాపాలను సాగిస్తున్నారు. వీరిలో చైనా మద్దతుతో రక్తపాతం సృష్టిస్తున్న మావోయిస్టులు, పాకిస్తాన్ ప్రభుత్వం ఉసిగొల్పుతున్న ‘జిహాదీ’లు దేశ ప్రజల భద్రతకు సమష్టిహితానికి అత్యంత ప్రమాదకరంగా మారి ఉన్నారు. అందువల్ల కఠినమైన చట్టాలను అమలుజరుపడం అంతర్గత భద్రతకు సరిహద్దుల రక్షణకు అనివార్యం కానీ కాంగ్రెస్ వంటి పార్టీలు ఈ కఠిన చర్యలను దశాబ్దులుగా వ్యతిరేకిస్తుండడం ‘జాతీయ వైపరీత్యం.. 2002లో ‘్భజపా’ ప్రభుత్వం రూపొందించిన ‘బీభత్స నిరోధక చట్టాన్ని’- ప్రివెన్షన్ ఆఫ్ టెర్రరిజమ్ యాక్ట్- పోటా-ను 2004లో ‘కాంగ్రెస్’ ప్రభుత్వం రద్దుచేసింది. అట్టి ప్రవృత్తికి పునరావృత్తి ‘ఉపా’ సవరణ ‘బిల్లు’పట్ల నేటి కాంగ్రెస్ వైఖరి!!