సంపాదకీయం

ట్రంపుదొర ‘కంపు..’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తథాకథిత- సోకాల్డ్- కశ్మీర్ సమస్య పరిష్కారానికి వీలుగా మన దేశానికీ పాకిస్తాన్‌కూ మధ్య ‘పంచాయతీ’ చేయడానికి అమెరికా అధ్యక్షుడిగా చెలామణి అవుతున్న డొనాల్డ్ ట్రంప్ అనే దురహంకారి ఉవ్విళ్లూరుతుండడం దశాబ్దుల వ్యూహాత్మక దురాక్రమణ ప్రృవత్తికి అనుగుణం.. శతాబ్దుల తరబడి ఇతర దేశాలను దోపిడీ చేసి, ఆ అక్రమ ఆర్జనతో తెగబలిసిన ఐరోపా జాతులు ఇతర దేశాల అంతర్గత వ్యవహారాలలో జోక్యం చేసుకొనడం ఈ ప్రవృత్తి. శతాబ్దుల పాటు ప్రపంచ దేశాలను దురాక్రమించిన ఐరోపా జాతులు గత శతాబ్దిలో ‘తోక ముడిచిన తోడేళ్లు’ కావడం చరిత్ర. భౌతిక దురాక్రమణ సాధ్యం కాదని గ్రహించిన ఐరోపా జాతులు వ్యూహాత్మక దురాక్రమణకు పూనుకొనడం నడుస్తున్న చరిత్ర. అక్రమ రాజకీయ ప్రమేయం, దౌత్య దౌర్జన్యం, రెండు దేశాల మధ్య తగవులు పెట్టడం, ఉభయ దేశాలకూ ఆయుధాలను సరఫరా చేయడం, ఉభయ దేశాల మధ్య సయోధ్య కుదిర్చే పేరుతో మధ్యవర్తిత్వం వహించడం ఐరోపా జాతుల ఉమ్మడి వారసత్వం. ఈ ఉమ్మడి వారసత్వానికి గత శతాబ్ది ఆరంభం నుంచి ‘అమెరికా’ ఓ ప్రతినిధి. క్రీస్తుశకం పదహారవ శతాబ్ది నుంచి అమెరికాలో చొఱబడిన ఐరోపాలోని వివిధ జాతుల దుండగులు అనాదిగా అమెరికాలో నివసించిన స్వజాతిని నిర్మూలించారు, స్వజాతీయ అమెరికా ప్రజలను శతాబ్దిపాటు సామూహికంగా హత్యచేశారు. ఇలా అమెరికాలోని స్వజాతిని నిర్మూలించిన వివిధ జాతుల ఐరోపా హంతకులు అమెరికాలో తాము కొత్త జాతిగా అవతరించడం చరిత్ర. ఇలా పదిహేడవ శతాబ్ది చివరి నాటికి అమెరికాలో వివిధ ఐరోపా జాతుల కలయికతో ఒక కొత్త సంకర జాతి ఏర్పడింది. ఆ సంకర జాతి అమెరికాలో ‘స్వజాతి’గా కొనసాగడం అప్పటి నుంచీ ఇప్పటివరకూ నడుస్తున్న చరిత్ర. అందువల్ల ఉమ్మడి ఐరోపా అమానవీయ, దురహంకార స్వభావానికి అమెరికా సమష్టిస్వభావం వారసత్వపు పరాకాష్ఠ. ఇతర దేశాల ప్రభుత్వాలను చులకన భావంతో చూడడం అమెరికా దురహంకార దౌత్యనీతిగా మారింది. ఈ స్వభావం డొనాల్డ్ ట్రంప్ ‘తోడేలు ముఖం’ ద్వారా మరోసారి ప్రస్ఫుటించింది. మనకూ పాకిస్తాన్‌కూ మధ్య ‘పంచాయతీ పెద్ద’గా వ్యవహరించడం తనకిష్టమన్నది ట్రంప్ చెప్పిన మాట! పాకిస్తాన్ ప్రధానమంత్రిగా చెలామణి అవుతున్న ప్రచ్ఛన్న జిహాదీ బీభత్సకారుడు ఇమ్రాన్ ఖాన్‌తో అమెరికా రాజధాని వాషింగ్‌టన్‌లోని తన అధికార నివాసం- వైట్‌హౌస్-లో సోమవారం చర్చలు జరిపిన సందర్భంగా ట్రంపుదొర ఈ మధ్యవర్తిత్వ ప్రతిపాదనను వెళ్లగక్కడం ఆశ్చర్యం కాదు.. ‘మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడ ఇలా తనను మధ్యవర్తిత్వం వహించమని కోరినట్టు’ డొనాల్డ్ ట్రంప్ నిర్భయంగా, నిర్లజ్జగా పచ్చి అబద్ధం చెప్పడం అతగాడి దిగజారుడుతనానికి నిదర్శనం...
కశ్మీర్ వ్యవహారాన్ని అంతర్జాతీయం చేయడానికి పాకిస్తాన్ ప్రభుత్వం ఏళ్లతరబడి యత్నిస్తోంది. మన దేశానికీ పాకిస్తాన్‌కూ మధ్య ఏర్పడి ఉన్న అన్ని వివాదాలను ఉభయ దేశాల ప్రభుత్వాలు ద్వైపాక్షికంగా మాత్రమే పరిష్కరించుకోవాలని 1972నాటి సిమ్లా ఒప్పందం నిర్దేశిస్తోంది. ఈ ద్వైపాక్షిక వ్యవహారంలో మూడవ దేశం ప్రమేయం కాని, ఇతర దేశాల ప్రమేయం కాని ఉండరాదన్నది ‘సిమ్లా ఒప్పందం’లోని వౌలికమైన నిబంధన. పశ్చిమ పాకిస్తానీ జిహాదీ పాలకుల అణచివేత చర్యలకు నిరసనగా తూర్పు పాకిస్తాన్‌లో ప్రజా ఉద్యమం మొదలైంది. 1970 నాటి ఈ ఉద్యమం ‘బంగ్లాదేశ్’ స్వతంత్ర ఉద్యమంగా మారింది. మన దేశపు సైన్యాలు బంగ్లాదేశ్- తూర్పు పాకిస్తాన్-లోకి చొచ్చుకొని వెళ్లి బంగ్లాదేశ్‌ను పశ్చిమ పాకిస్తాన్ పైశాచిక కబంధ బంధం నుంచి విముక్తం చేశాయి. 1971లో స్వతంత్ర బంగ్లాదేశ్ అవతరించింది. ఈ నేపథ్యంలో మన ప్రభుత్వ దయాభిక్షను కోరుతూ అవశేష పాకిస్తాన్ పాలకుడు జుల్ఫికర్ అలీ భుట్టో మన దేశానికి వచ్చాడు. 1971లో స్వతంత్ర బంగ్లాదేశ్ ఏర్పడిన వెంటనే పాకిస్తాన్‌లో సైనిక నియంత యాహ్యాఖాన్‌కు పదవీచ్యుతి కలిగింది. భుట్టోకు అధికారం దక్కింది. ఆ నేపథ్యంలో మన దేశానికి వచ్చిన భుట్టో అప్పటి మన ప్రధాని ఇందిరాగాంధీని ప్రాధేయపడి ‘సిమ్లా’ ఒప్పందాన్ని కుదుర్చుకున్నాడు. సిమ్లా ఒప్పందం ఫలితంగా 1948నుంచి ఐక్యరాజ్యసమితి పరిధిలో అపరిష్కృతంగా ఉండిన తథాకథిత కశ్మీర్ సమస్య ద్వైపాక్షిక సమస్యగా మారింది. ఐక్యరాజ్యసమితి ప్రమేయం నుంచి, అంతర్జాతీయ మధ్యవర్తిత్వ వైపరీత్యం నుంచి ‘కశ్మీర్ సమస్య’ విముక్తమైంది. అయినప్పటికీ మాట తప్పిన పాకిస్తాన్ పదే పదే అంతర్జాతీయ వేదికలపై ‘కశ్మీర్’ను ప్రస్తావిస్తూనే ఉంది. గతంలో కూడ అమెరికా అధ్యక్షులు ‘కశ్మీర్’పై మధ్యవర్తిత్వం వహించానికి ఉవ్విళ్లూరారు.
పాకిస్తాన్‌ను ‘దువ్వడం’లో భాగంగా మాత్రమే అమెరికా అధ్యక్షులు ఇలా పాకిస్తాన్ కోరిక మేరకు మధ్యవర్తిత్వం వహించడానికి ముచ్చటపడ్డారు. ఇమ్రాన్ ఖాన్ ‘పగటికల’ మేరకు ట్రంప్ కూడ మధ్యవర్తిత్వాన్ని వహించడానికి ముస్తాబు కావచ్చు, మన ప్రభుత్వం వారి తిరస్కృతికి గురికావచ్చు. కానీ డొనాల్డ్ ట్రంప్ మరింత ముందుకువెళ్లి ఇలా పచ్చి అబద్ధాన్ని చెప్పడమే విచిత్ర వికృత ‘వినూతన’ విపరిణామం. నరేంద్ర మోదీ కూడ మధ్యవర్తిత్వాన్ని కోరాడన్న అబద్ధం చెప్పడం ద్వారా ట్రంప్ మన దేశాన్ని అవమానించాడు, చులకన చేశాడు. ‘ట్రంప్ మాటల’ను దురహంకార ఉన్మాది చేసిన మతిలేని ప్రేలాపన అని తమంత తాముగా నిర్ధారించుకోవడం దేశ ప్రజల కర్తవ్యం. కానీ కొంత మంది రాజకీయవేత్తలు ‘నిజమేనా?’ అని ప్రభుత్వాన్ని నిలదీయడం సిగ్గుచేటైన వ్యవహారం! పాకిస్తాన్‌కూ మన దేశానికీ మధ్య వౌలిక సమస్య ‘కశ్మీర్’కాదు.. వౌలిక సమస్య- ఏకైక సమస్య-పాకిస్తాన్ ప్రభుత్వం 1947 నుంచి మన దేశానికి వ్యతిరేకంగా నిర్వహిస్తున్న జిహాదీ బీభత్సకాండ. అసలు పాకిస్తాన్ ఏర్పడడానికి ‘ప్రాతిపదిక’యే జిహాదీ బీభత్సకాండ. క్రీస్తుశకం 712వ సంవత్సరంలో అరబ్బీ బీభత్సకారుడు మహమ్మద్ బిన్ కాసిమ్ అఖండ భారతదేశంలోని సింధు ప్రాంతంలోని ‘దేవల’ పట్టణంలోకి చొరబడి సాగించిన హత్యాకాండ ‘జిహాదీ’ పైశాచిక కాండకు ఆరంభం. 1947 నాటి మహమ్మదాలీ జిన్నా ముఠా పరాకాష్ఠ.. ప్రపంచంలోని అన్ని ఇతర మతాలను నిర్మూలించి ఇస్లాం మతాన్ని ఏకైక మతంగా నిలబెట్టడం ‘జిహాదీ’ లక్ష్యం. శతాబ్దుల తరబడి ఈ లక్ష్యసాధన కోసం ‘జిహాదీ’లు బీభత్సకాండను సాగిస్తున్నారు. ఈ ‘జిహాదీ’ బీభత్సకాండ స్వభావాత్మకమైనది. ఇది మరే ఇతర ఘటనలకో లేదా పరిణామానికో ప్రతిక్రియగా ఆరంభమైనది కాదు. ఈ స్వభావాత్మక జిహాదీ బీభత్సకాండ ఫలితంగానే అఖండ భారతదేశం ముక్కలైంది, పాకిస్తాన్ ఏర్పడింది, కశ్మీర్‌లోకి పాకిస్తాన్ కిరాయి మూకలు, సైనిక దళాలు 1947 అక్టోబర్‌లో చొఱబడ్డాయి, కశ్మీర్ కల్లోలగ్రస్తమైంది, మూడవ వంతు జమ్మూ కశ్మీర్ పాకిస్తాన్ దురాక్రమణకు గురి అయింది. మన అధీనంలో మిగిలిన జమ్మూ కశ్మీర్ సైతం నిరంతరం రక్తసిక్తం అవుతోంది, లక్షలాది హిందువులు కశ్మీర్‌లోయ నుంచి తరిమివేతకు, హత్యాకాండకు గురి అయ్యారు. అందువల్ల సమస్య పేరు- జిహాదీ బీభత్సకాండ! సమస్య పేరు ‘కశ్మీర్’ కాదు..
ఇలా పాకిస్తాన్ ప్రేరిత బీభత్సకాండ మాత్రమే మనకూ పాకిస్తాన్‌కూ మధ్య ఉన్న సమస్య. ఈ బీభత్సకాండ ప్రధానంగా కశ్మీర్‌లో చెలరేగింది, కొనసాగుతోంది. పాకిస్తాన్ దురాక్రమిత జమ్మూ కశ్మీర్‌ను మనం తిరిగి స్వాధీనం చేసుకున్నట్టయితే జిహాదీ బీభత్సకాండ తీవ్రత తగ్గుతుంది. కానీ జిహాదీ బీభత్సకారులు తమ లక్ష్యం నెరవేరేవరకు హత్యాకాండ మానరు. వారి లక్ష్యం ఎప్పటికీ నెరవేరదు. ఆవులన్నింటినీ హత్యచేయడం తోడేళ్లకు సాధ్యం కాదు. అందువల్ల తోడేళ్లు దూకుతూనే ఉంటాయి. ప్రపంచం నుండి ఇస్లామేతర మతాలను నిర్మూలించడం జిహాదీలకు సాధ్యం కాదు. అందువల్ల జిహాదీలు దాడి చేస్తూనే ఉంటారు. ఎప్పటికప్పుడు సాయుధ చికిత్సలు చేయడం ద్వారా మన ప్రభుత్వం వారిని నియంత్రించడమే పరిష్కారం..