సంపాదకీయం

విద్వేష వారసత్వం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అయ్యవారు ఏమి చేస్తున్నాడు?- అన్న ప్రశ్నకు సమాధానం ‘‘అబద్ధాలను వ్రాసి దిద్దుకుంటున్నాడు..’’అన్నది! నూతన ‘జాతీయ విద్యా విధానం’- నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ- ఎన్‌ఇపి- ముసాయిదాలో సోమవారం హడావుడిగా జరిగిన ‘‘మహా పరివర్తన’’ ఈ సామెతను మరోసారి స్ఫురింప చేస్తోంది. పాఠశాలలలో ‘త్రిభాషా బోధన’ సూత్రం ప్రకారం హిందీ భాషను ఒకటవ తరగతి నుంచి తప్పనిసరిగా బోధించాలన్నది మొదట ప్రచారమైన ముసాయిదా. ఈ ముసాయిదాలోని ఈ తప్పనిసరి హిందీ బోధన నియమాన్ని తొలగించాలని కోరుతూ తమిళనాట, మరికొన్నిచోట్ల ఉద్యమాలు ఉవ్వెత్తున ఎగసిపడే ప్రమాదం ఉందని సోమవారం ప్రచారం జరిగింది. ఈ ప్రమాదానికి జడిసి ‘ముసాయిదా’ను రూపొందించినవారు, కేంద్ర ప్రభుత్వం వారు ముసాయిదా నుంచి ఈ ‘తప్పనిసరి హిందీ బోధన’ నియమాన్ని తొలగించడం ‘‘ఇలా దిద్దుకోవడం’’. ఇలా ముసాయిదాను దిద్దినవారు కేంద్ర ప్రభుత్వ విద్యావిభాగం వారా? ముసాయిదాను రూపొందించిన కె.కస్తూరిరంగన్ అధ్యక్షతన ఏర్పడిన అధ్యయన సంఘం వారా? అన్నది స్పష్టం కాలేదు. ‘‘ఇది కేవలం ముసాయిదా మాత్రమే.. అందరితోను చర్చించి తుది నిర్ణయం తీసుకుంటాము’’- అని కేంద్ర ప్రభుత్వం చెప్పినట్టు ఆదివారం ప్రచారమైంది. ‘‘తప్పనిసరి హిందీ బోధన- అన్న అంశం పొరపాటున ముసాయిదాలోకి చొఱబడింది’’-అన్నది ప్రభుత్వం సోమవారం మాట మార్చిన తీరు! ‘‘అబద్ధం వ్రాసి దిద్దుకోవడం ఇదీ.. అంతేకానీ తప్పనిసరి హిందీ బోధన జరగాలని నిర్ణయించడం, ఆ తరువాత ఈ నిబంధనను రద్దుచేయడం కాదు!’’ నిజానికి ఇలా హిందీని ఒకటవ తరగతి నుంచి పిల్లలకు బోధించాలని ముసాయిదాలో చేర్చడం భారతీయ భాషా సమన్వయానికి దోహదం చేయగల పరిణామం. హిందీ భాషను బడి పిల్లలకు తప్పనిసరిగా బోధించనక్కరలేదని హడావుడిగా నిర్ణయించడం, ముసాయిదాను మార్చడం ఆంగ్లభాషా దాస్యం కలిగించిన దుష్ప్రభావ ఫలితం! అందువల్ల నిజానికి ముసాయిదాను దిద్దినవారు ‘‘నిజాన్ని వ్రాసి అబద్ధంగా దిద్దుకున్నారు..’’ హిందీ భారతీయ భాష, ఆంగ్ల భాష విదేశీయ భాష! విదేశీయ భాషను ఒకటవ తరగతి నుంచి మాత్రమే కాదు, అంతకు పూర్వం నుంచి కూడ శిశువులకు నేర్పుతున్నవారు భారతీయ భాష అయిన ‘హిందీ’ని మాత్రం ఎందుకు నేర్పరాదంటున్నారు? ఆంగ్ల భాషను అతిగా ప్రేమిస్తున్నవారు ‘హిందీ’ని ఎందుకు ద్వేషిస్తున్నారు??
దీనికి సమాధానం మన దేశాన్ని శతాబ్దుల తరబడి దురాక్రమించిన బ్రిటన్ దుర్జనులు ఒకే జాతికి చెందిన భారతీయులను రెండు ‘‘పరస్పర విరుద్ధమైన కృత్రిమ జాతులన్న’’ భ్రమను కల్పించడానికి జరిపిన కుట్ర. ఈ కుట్ర ఇప్పటికీ కొనసాగుతుండడం జాతీయ వైపరీత్యం! ఈ కుట్ర కొనసాగుతోందన్న ధ్యాస కూడ మన విద్యావంతులలో అత్యధికులకు లేదు. అనాదిగా ‘ఆసేతు శీతనగం’ నివసించిన ప్రజలు కొలంబో నుంచి కైలాస పర్వత పర్యంతం విస్తరించి ఉండిన అఖండ భారత భూమిపై పుట్టిపెరిగినవారు ఒకే ‘జాతి’గా వికసించడం చరిత్ర. బ్రిటన్ దురాక్రమణదారులు తమ ‘కృత్రిమ కల్పనల’ ద్వారా వింధ్య పర్వత దక్షిణ ప్రాంతం వారు ‘ద్రావిడ జాతి’ వారని ప్రచారం చేశారు. వింధ్యకు ఉత్తర భాగాన ఉన్న భారతీయులు ‘ఆర్య’ జాతివారని నిర్ధారించారు. ఈ ‘ద్రావిడ జాతి’ వారు, ‘ఆర్య జాతి’ వారు పరస్పరం శతాబ్దుల పాటు కొట్టుకొని చచ్చారన్న మరో భయంకర అబద్ధాన్ని కూడ బ్రిటన్ దుర్జనులు ప్రచారం చేశారు. పాఠశాలలలో, విశ్వవిద్యాలయాలలో దీన్ని బోధించారు. భారతీయులు తాము ‘‘ఒకే జాతివారమన్న’’ వాస్తవాన్ని క్రమంగా విస్మరించి, ‘‘కొట్టుకు చచ్చిన రెండు విభిన్న జాతులకు చెందిన వారమన్న’’ శాశ్వత భ్రాంతికి గురికావాలన్నది బ్రిటన్ వారి కుట్రకు లక్ష్యం. ఈ లక్ష్యం చాలావరకు నెరవేరింది. మేధావులుగాను, ఉన్నత విద్యావంతులుగాను చెలామణి అవుతున్న వారిలో తొంబయి శాతం మంది ప్రస్తుతం బ్రిటన్ దుర్జనులు కల్పించిన ఈ కృత్రిమ ‘‘ద్విజాతి సిద్ధాంతాన్ని’’ విశ్వసిస్తున్నారు. అంటే అనాదిగా లేదా కొన్ని సహస్రాబ్దులుగా ఉత్తర భారత దేశస్థులు ‘ఆర్యజాతి’ అనీ, దక్షిణ భారతీయులు ‘‘ద్రవిడ జాతి’’ వారని ఈ తొంబయి శాతం మంది నమ్ముతున్నారు. ఈ తొంబయి శాతం మేధావులలో అత్యధికులు బ్రిటన్ కుట్ర ధ్యాస లేనివారు, అనభిజ్ఞులు- ఇగ్నోరెంట్స్- అమాయకులు! వారికి కుట్ర గురించి తెలీదు- కానీ మిగిలినవారు ఆంగ్లేయులకు మానసిక బౌద్ధిక వారసులు, దుర్బుద్ధితో బ్రిటన్ దుండగులు ఆరంభించిన కుట్రను కొనసాగిస్తున్న దేశద్రోహులు.. జాతి వ్యతిరేకులు! మొదట ‘ద్రావిడ జాతి’ వారు మన దేశానికి విదేశాల నుంచి వచ్చారు. వారు అప్పటికి ఈ దేశంలో ఉండిన అనాగరికులను నిర్మూలించారు, ‘మొహంజోదారో నాగరికము’ను ఏర్పాటు చేశారు. ఆ తరువాత వచ్చిన ఆర్యజాతి వారు ద్రావిడులను వింధ్య పర్వతాల దక్షిణ భాగానికి తరిమివేసి తాము ఉత్తర భారతమంతా విస్తరించారు, ‘మొహంజోదారో నాగరికత’ను ధ్వంసం చేసి ‘వేద నాగరికత’ను ప్రారంభించారు..!- అన్న బ్రిటన్‌వారి కుట్రను ప్రస్తుతం ఈ దేశ వ్యతిరేకులు అమలు జరుపుతున్నారు. తమిళనాడులో హిందీ భాషా విద్వేషాన్ని, మరికొన్ని ప్రాంతాలలోని భాషా ‘ఉన్మాదాని’కీ ఇదీ నేపథ్యం.
తమ కుట్రను కొనసాగించడంలో భాగంగా బ్రిటన్ దురాక్రమణదారులు కృత్రిమ భాషా కుటుంబాలను కల్పించారు. అనాదిగా అన్ని భారతీయ భాషలూ సంస్కృత భాషా కుటుంబానికి చెందినవి! అన్ని భారతీయ భాషలూ సంస్కృత భాషకు రూపాంతరాలుగా వికసించాయి. అందువల్లనే ‘‘జనని సమస్త భాషలకు సంస్కృత భాష...’’ అన్న వాస్తవం తరాలుగా, యుగాలుగా భారతీయ భాషా సంప్రదాయమైంది. కానీ బ్రిటన్ దుండగులు భారత జాతిలో వైరుధ్యాలు కల్పించి శాశ్వతంగా ఈ ఒకే సనాతన జాతిని ‘‘పరస్పరం కలహించుకొనే రెండు జాతులుగా’’విడగొట్టే కుట్రలో భాగంగా ‘‘కృత్రిమ భాషాచరిత్ర’’ను రచించారు. ‘‘దక్షిణ భారత భాషలు ద్రవిడ భాషలనీ, ఉత్తర భారత భాషలు వివిధ ఆర్య భాషా కుటుంబాలకు చెందినవనీ’’ క్రీస్తుశకం 1858లో పచ్చి అబద్ధాన్ని ‘‘చారిత్రక వాస్తవం’’గా ప్రచారం చేశారు. ఈ కృత్రిమ సిద్ధాంతకర్త బిషప్ కాల్డ్‌వెల్! భారతదేశ స్వజాతీయుల మధ్యలేని వైరుధ్యాలను ఉన్నట్టుగా కల్పించడానికి 1750 ప్రాంతంలో విలియమ్ జోన్స్, 1834లో టిబి మెకాలే అన్న ఆంగ్లేయులు- బ్రిటన్ దేశ భక్తులు- ‘కృషి’చేశారు. మూడవవాడు ఈ బిషప్ కాల్డ్‌వెల్. ఈ ముగ్గురికీ ‘కారల్ మార్క్స్’ పేరు చెప్పుకొని బ్రిటన్ విముక్త భారత్‌లో బ్రిటన్ మానసిక వారసత్వాన్ని కొనసాగిస్తున్న ‘‘వర్గ ద్వేష, వర్గ సమర సిద్ధాంతవాదులు’’ తోడయ్యారు!! ఈ దుష్టచతుష్టయం కుట్ర తమిళనాట ద్రవిడ ఉద్యమానికి ప్రాతిపదిక. ద్రవిడ ఉద్యమ సిద్ధాంతకర్తలు, ద్రవిడ రాజకీయ పక్షాలలోని అత్యధికులు మాత్రమే హిందీ బోధనను వ్యతిరేకిస్తున్నారు. సాధారణ తమిళ ప్రజలకు హిందీ భాష పట్ల వ్యతిరేకత లేదు, వారు స్వచ్ఛందంగా హిందీ భాషను నేర్చుకుంటున్నారు.
ఆంగ్లేయుల దురాక్రమణ కొనసాగిన సందర్భంగా ఆర్య ద్రావిడ జాతుల సిద్ధాంతాన్ని నిరాకరిస్తూ, దాని డొల్లతనాన్ని తేటతెల్లం చేస్తూ అనేక మంది భారతీయులు పరిశోధక గ్రంథాలను, వ్యాసాలను వ్రాశారు. ఎప్పటికప్పుడు వాస్తవాన్ని పునఃప్రచారం చేశారు. కానీ దుర్మార్గులైన ఆంగ్లేయులు, వారి మానస పుత్రులు అప్పటి నుండి ఇప్పటివరకూ ఈ ‘జాతీయ సమైక్య సత్యం’ విస్తృతం కాకుండా అడ్డుకున్నారు, అడ్డుకుంటున్నారు. వివేకానంద స్వామి, అంబేద్కర్ వంటి జాతీయ మహాపురుషులు ‘‘ఆర్యులు, ద్రావిడులు’’అన్న భిన్న జాతులవారు లేరన్న వాస్తవాన్ని పునరావిష్కరించారు. ఈ వాస్తవం ‘‘ఈ దేశంలో ఉన్నది ఒకటే జాతి- భారత జాతి! ఉన్నది ఒకటే భాషా కుటుంబం- అది సంస్కృత భాషా కుటుంబం, ఒకే ‘బ్రాహ్మీ’ లిపి నుంచి సింహళ భాష నుంచి త్రివిష్టప భాష- టిబెట్ భాష- వరకుగల అన్ని భారతీయ భాషలకూ ‘లిపి’ ఏర్పడింది. ‘ద్రవిడ’ అన్నది భౌగోళిక నామం, అది ‘జాతి’ని నిర్దేశించదు, ‘ఆర్య’ అన్నది గుణవాచకము. ‘ఆర్య’జాతి లేదు. ‘ఆర్యుడు’ అని అంటే సంస్కారవంతుడు. సంస్కారవంతులందరూ ఆర్యులే! ఇదీ వాస్తవం. ఇదే వాస్తవం...!