సంపాదకీయం

ఉమ్మడి శత్రువు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కేరళ అడవులలోను, పశ్చిమ కనుమలలోను వేల రకాల మొక్కలు, తీగలు, ఇతర వృక్షజాతులు లక్షల ఏళ్లుగా పరస్పర పరిపోషకాలుగా వికసించాయి. ఒక మొక్క తాను ఎంతగా ఎదిగినప్పటికీ మరో మొక్క కు హాని కలిగించక పోవడం చరిత్ర. ఈ చరిత్రకు కొన్ని దశాబ్దులుగా విఘాతం కలుగుతున్నట్టు శాస్తవ్రేత్తలు కనిపెట్టారు. విదేశాల నుంచి వచ్చిపడిన కొన్ని ‘జాతుల’ మొక్కలు, తీగలు స్థానికంగా పెరిగిన వృక్షజాలానికి నష్టం కలిగిస్తున్నాయట. ఆఫ్రికా, అమెరికా ఖండాల అడవులలోని ఈ కొత్త మొక్కలు ఇతర ‘వృక్షజాలాన్ని’ హత్య చేస్తున్నాయన్నది ప్రచారమైన వైపరీత్యం. మొక్కలను, గడ్డిని, ఇతర హరిత జీవజాలాన్ని జంతువులు భోంచేస్తున్నాయి. అలాగే జంతువులను దిగమింగే మొక్కలు కూడ భూమిమీద అక్కడక్కడ ఉన్నాయట. మన దేశంలో ‘స్వజాతి’ జంతుజాలానికి హాని కలిగించే ‘విజాతి’ జంతుజాలం కూడ విస్తరించిపోయిందట. నూట యాబయి ఏడు రకాలకు చెందిన ఈ ‘విజాతి’ గగన చరాలు, జల చరాలు, భూచరాలు తాము మాత్రమే మిగిలి తమ ‘జాతి’కే చెందిన స్థానిక ప్రాణులను పరిమార్చుతున్నాయట! అంటే ఈ కొత్తరకం చేపలు విస్తరించినచోట స్థానికంగా అనాదిగా పెరిగిన చేపలు అంతరించిపోవడం ఒక ఉదాహరణ మాత్రమే.. ఇలా మొక్కలను వృక్షజాలాన్ని హతమార్చే మొక్కలు, స్థానిక ‘‘స్వజాతి’’ జంతుజాలాన్ని దిగమింగుతున్న స్థానికేతర ‘‘స్వజాతి’’ జంతుజాలం మన దేశంలో విస్తరించడం ‘జీవ వైవిధ్యాన్ని’ భంగపరుస్తున్న విపరిణామ క్రమం. దీనికి సమాంతరంగా భారత జాతీయ సమాజంలో కొనసాగుతున్న మరో విపరిణామక్రమం ‘్భషా వైవిధ్యాలు’ ధ్వంసం అవుతుండడం! భాషా వైవిధ్యం ధ్వంసం అయిపోతుండడం వల్ల అసంఖ్యాక వైవిధ్యాల, అసంఖ్యాక వైవిధ్య సంస్కారాల సమాహారమైన ‘అద్వితీయ’ భారతీయ సంస్కృతి ధ్వంసమైపోతోంది. ఈ సాంస్కృతిక విధ్వంసకాండకు కారణం బ్రిటన్ దురాక్రమణ సమయంలో మన దేశంలోకి విస్తరించిన ఆంగ్ల భాష! ఆంగ్ల భాష కూడ అన్ని ఇతర భాషల వలె విద్యకున్న అక్షర రూపాలలో ఒకటి. ఆంగ్ల భాష కూడ అన్ని భారతీయ, భారతీయేతర భాషల వలెనే ‘సరస్వతీ’మాత స్వరూపం. భారతీయులు కూడ ఆంగ్ల భాషను అభ్యసించవచ్చు. కానీ కేరళ అడవులలోకి చొరబడిన విదేశీయ విచిత్ర ‘లతాగుల్మ వృక్షజాలం’- తీగెలు, పొదలు, చెట్లు- స్థానిక సతత హరిత అటవీ ప్రాంతాన్ని ధ్వంసం చేశాయి, చేస్తున్నాయి. ఆంగ్లభాష అన్ని భారతీయ భాషలను చంపేస్తోంది. అమెరికా, ఆఫ్రికా, ఆస్ట్రేలియా ఖండాలలోని అనేక అనాది స్థానిక భాషలను ఒక్కొక్క ఐరోపా భాష చంపివేయడం క్రీస్తుశకం పదహైదవ శతాబ్ది నుంచి నడచిన చరిత్ర! ఆయా ఖండాలలోని ఆయా అనాది భాషల ఆనవాళ్లు కాని, ఆయా భాషల ప్రాతిపదికగా వికసించిన జీవన సంస్కారాల అవశేషాలు కానీ, ఐరోపా భాషలు ‘చొఱబడిన’ చోట మిగలలేదు. మన దేశంలో ఈ ‘హత్యాకాండ’ ఇంకా పూర్తికాలేదు. భారతీయ భాషలను హత్యచేసి ఆంగ్లభాషను మాత్రమే మన దేశంలో ఏకైక భాషగా వ్యాప్తిచేయడానికి ఆంగ్లేయులు ఆరంభించి వెళ్లిన కుట్ర కొనసాగుతోంది. కేంద్ర ప్రభుత్వం రూపొందించి ఆవిష్కరించిన ‘జాతీయ విద్యావిధానం’- నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ- ఎన్‌ఇపి- ముసాయిదాపై ‘వివాదం చెలరేగుతోందన్న’ ప్రచారానికి ఇదీ నేపథ్యం...
ఐదు దశాబ్దుల తరువాత ఇప్పుడు మళ్లీ కొత్తగా ‘జాతీయ విద్యా విధానం’ రూపొందిందట. ఇది ముసాయిదా మాత్రమే. అందరి అభిప్రాయాలను సేకరించిన తరువాత మాత్రమే ముసాయిదాకు తుది రూపునివ్వనున్నట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ ముసాయిదాలో ‘విద్యావ్యవస్థను మెరుగుపరచడానికి’, ‘బోధన పద్ధతులను సంస్కరించడానికి’, ‘పాఠ్య ప్రణాళికను వర్తమాన భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా పరివర్తన చేయడానికి’, ‘మాతృభాషలను శిశు తరగతి స్థాయి నుంచి పనె్నండవ తరగతి వరకు నిర్బంధంగాను, ఐచ్ఛికంగాను విద్యార్థులు అధ్యయనం చేయడానికి’ వలసిన వివిధ ప్రతిపాదనలను చేశారట! దేశమంతటా ప్రతి బడిలోను ‘పూర్వ ప్రాథమిక’- ఎల్‌కేజీ, యూకేజీ- ప్రాథమిక స్థాయిల నుంచి విద్యార్థులకు మూడు భాషలను మప్పాలన్నది మరో ప్రధాన అంశం. ఇలా మూడు భాషలను నేర్పించే- త్రిభాషా బోధన- విధానాన్ని నిజానికి బ్రిటన్ విముక్త భారతదేశంలో దశాబ్దుల తరబడి అమలు జరిపారు, అమలు జరుపుతున్నారు. అమలు జరుపని బడుల సంఖ్య 1968కి పూర్వం చాలా తక్కువ. 1968నాటి జాతీయ విద్యావిధానానికి ఈ ‘త్రిభాషాసూత్రం’కూడ ఒక ప్రాతిపదిక! ఈ జాతీయ విద్యావిధానం రూపొందిన తరువాత త్రిభాషాసూత్రం మూలపడింది. తమిళనాడులోను, హిందీ భాషను మాట్లాడే ప్రాంతాలలోను ఇంగ్లీషును, మాతృభాషను మాత్రమే ‘బడుల’లో బోధించడం కొనసాగిన వైపరీత్యం.
ఇలాంటిచోట ఆంగ్లం, మాతృభాష తప్ప మరో భారతీయ భాషను మాట్లాడలేని విద్యావంతులు తయారయ్యారు. క్రమంగా హిందీ భాషా ప్రాంతాలలోను, తమిళనాడులోను ఉన్నత పాఠశాలలలో మాత్రం మూడు భాషలను బోధించడం ఆరంభమైంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వంటిచోట్ల మూడవ తరగతి నుంచి కొన్ని రోజులు, ఐదవ తరగతి నుంచి కొన్ని ఏళ్లు, ఆరవ తరగతి నుంచి కొన్ని ఏళ్లు ‘త్రిభాషా’బోధన సూత్రం అమలు జరిగింది. కానీ ‘వాణిజ్య పాఠశాలలు’- ‘విదేశీయ జాతుల విచిత్రపు మొక్కల’వలె విస్తరించిన తరువాత ప్రభుత్వాలకు విద్యావ్యవస్థపై పట్టుతప్పింది. ‘త్రిభాషా’ బోధన సిద్ధాంతం మాత్రమే కాదు, ఇంగ్లీషు మాతృభాషను మాత్రమే బోధించే పాఠశాలలు మిగిలాయి. ఈ పాఠశాలల్లో మాతృభాష కూడ బోధించని దుస్థితి దాపురించింది. పూర్వ ప్రాథమిక, శిశు-నర్సరీ- స్థాయి మూడేళ్ల వయసు పిల్లలకు ఆంగ్లం తప్ప మరో భాషను నేర్పడం లేదు. ఫలితంగా మూడేళ్లవరకు మాత్రమే అంతోఇంతో తెలుగును, భారతీయ భాషలను మాట్లాడిన ‘బుడుతలు’ ఆ తరువాత ఆంగ్లంతో సంకరమైన ‘మాతృభాష’ను మాట్లాడుతున్నారు. విభక్తులు, క్రియా పదాలు మాత్రమే మాతృభాషలలో మిగిలాయి. ‘‘మార్నింగ్ టైమ్‌లో మమీ కిచెన్‌లో బిజీగా ఉంటుంది..’’- ఇదీ పిల్లలు మాట్లాడుతున్న తెలుగు. వీరు పెద్దయిన తరువాత ‘కాల్ చేస్తున్నాను..’ అంటూ మాతృభాషలను సజీవంగా కాల్చేస్తున్నారు. ఇంగ్లీషు వ్రాయడం తప్ప ఏ భారతీయ భాషను కాని వ్రాయలేనివారు అక్షరాలను గుర్తుపట్టడానికి శ్రమపడి కూడి, కూడి చదువుతున్నవారు ఉన్నత విద్యావంతులుగా చెలామణి అవుతున్నారు. ‘త్రిభాషా బోధన’, ఆంగ్లభాష ఏకైక భాషగా విస్తరించడం- ఈ రెండింటి మధ్య దశాబ్దుల అంతరం ఏర్పడి ఉంది. రెండు భాషలను బోధిస్తున్న పాఠశాలల్లో మొదటి భాష ఇంగ్లీషు. రెండవ భాష ‘స్పెషల్ ఇంగ్లీషు’. ఇలా ఆంగ్లభాష ‘మొక్కలను భోంచేస్తున్న విదేశాల మొక్కవలె’ భారతీయ భాషలను హత్యచేసి ఆరగించింది. ‘‘ఈ మాతృభాషా హననకాండ నుంచి విముక్తి లేదా?’’అని జాతీయ ఆత్మ రోదిస్తోంది. భరతమాత విలపిస్తోంది. నూతన జాతీయ విద్యావిధానాన్ని -ముసాయిదాను- కేంద్ర ప్రభుత్వం ఆవిష్కరించడానికి ఇదంతా నేపథ్యం!
ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం వారి ‘ముసాయిదా’లో ‘త్రిభాషాసూత్రం’ కనిపించగానే మూడవ భాష పేరుతో ‘హిందీ’ని తమ నెత్తిన రుద్దుతున్నారన్న ప్రచారం తమిళనాడులో మళ్లీ మొదలైందట. బెంగాల్‌లో కూడ మొదలైందట, విదేశాల నుంచి వచ్చిన ఆంగ్ల భాష ఒకటిన్నర శతాబ్దికిపై మన నెత్తికెక్కి తొక్కినప్పటికీ హాయిగా సహించిన మనం మన మాతృభాషను తప్ప మరో స్వజాతీయ- భారతీయ భాష ఉనికిని సహించలేకపోతున్నాము! హిందీ అయినా తమిళమైనా తెలుగు అయినా, కశ్మీరీ అయినా, అస్సామీ భాష అయినా సింహళ భాష అయినా ‘త్రివిష్టప’ భాష అయినా భారత జాతీయ భావజాలం ఒక్కటే. ఈ భాషల దారిలో సహస్రాబ్దులుగా వికసించిన సంస్కృతి ఒకటే, జాతీయ ఒకటే! ఆంగ్లభాష ద్వారా వికసించిన భావజాలం ఐరోపా వికృతి! భారతీయులు భారతీయులుగా జీవించడానికి భారతీయ భాషలు దోహదం చేశాయి. భారతీయులు ఐరోపా మనస్సుతో సాంకర్యం చెందడానికి దోహదం చేసింది. ఈ వాస్తవం గ్రహించినట్టయితే ఒక భారతీయ భాషను మాట్లాడేవారు మరో భారతీయ భాషను వ్యతిరేకించరు. భారతీయ భాషలకు ఉమ్మడి శత్రువు ఆంగ్లం.