సంపాదకీయం

స్వభావ విప్లవం..?!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విద్యారంగంలో విప్లవాత్మక సంస్కరణలు జరగడానికి రంగం సిద్ధం అవుతుండడం సమాంతర పరిణామం. ఎన్నికల ప్రక్రియ ప్రచారపు హోరు సద్దుమణిగింది. ఉత్కంఠ కూడ కొంత తగ్గిపోయింది. యథాపూర్వంగా మరో ఐదేళ్లు కేంద్ర ప్రభుత్వాన్ని ‘భారతీయ జనతాపార్టీ’ నిర్వహించగలదన్న ‘నిర్ధారణ’ ఈ ఉత్కంఠ తగ్గిపోవడానికి ప్రాతిపదిక. మత ప్రదాత-వోటర్-ల మనోభీష్టాన్ని ఆదివారం ఆవిష్కరించిన ‘‘నిష్క్రమణ ఫలితాలు’’- ఎగ్జిట్‌పోల్స్- ఈ నిర్ధారణ చేశాయి. అందువల్ల విద్యారంగ సంస్కరణలు రానున్న ఐదేళ్లలోనైనా భారతీయ భావాలను విద్యార్థులకు మరింతగా మప్పడానికి దోహదం చేయాలి. ‘భాజపా’ దశాబ్దుల తరబడి సైద్ధాంతిక ప్రత్యామ్నాయంగా రూపొంది ఉంది. బ్రిటన్ విముక్త భారత్‌ను దశాబ్దుల తరబడి నిర్వహించిన కాంగ్రెస్ సిద్ధాంతానికి ‘్భజపా’ సిద్ధాంతం జాతీయ స్థాయిలో ప్రత్యామ్నాయం! కానీ గత ఐదేళ్లలో ఈ ప్రత్యామ్నాయం జాతీయ విద్యారంగంలో ప్రస్ఫుటించలేదు. బ్రిటన్ దురాక్రమణకారులు మన నెత్తికెత్తిపోయిన విద్యావిధానమే ప్రధానంగా ఇప్పటికీ మన విద్యాలయాలను నడిపిస్తుండడం నడుస్తున్న వైపరీత్యం. అందువల్ల విద్యారంగంలో ఏవో మార్పులు సంభవిస్తాయని ప్రచారం జరిగినప్పుడల్లా ‘బ్రిటన్ భావదాస్యం’నుంచి మనకు విముక్తి లభించడానికి అంకురార్పణ జరుగవచ్చునన్న ఆశ చిగురించడం సహజం. డెబ్బయి ఏళ్లుగా ఈ ఆశ అంకురిస్తూనే ఉంది! ‘అంకురాలు’ పల్లవించి, వికసించి, పరిమళించడం లేదు. విద్యారంగంలో సంస్కరణలు కేవలం స్వరూపానికి పరిమితం కావడం ఇందుకు కారణం. ‘స్వభావ’ సంబంధమైన విద్యాసంస్కరణలు ఇప్పటికీ ‘ఎండమావి’లోని తీయని నీళ్లుగా మిగిలి ఉన్నాయి. క్రీస్తుశకం 1834లో థామస్ బి.మెకాలే అన్న బ్రిటన్ మేధావి రూపొందించి మన దేశంలో ప్రవేశపెట్టిన విద్యావిధాన స్వభావం ఐరోపా జీవస్వభావం... భారతీయులను ఐరోపీయ జీవన విధాన బద్ధులను చేయడం మెకాలే విద్యావిధాన లక్ష్యం. మన దేశంపై బ్రిటన్ పెత్తనం చెలాయించినంతకాలం ఈ విద్యావిధానం అమలు జరిగినందువల్ల భారతీయ మనః ప్రవృత్తిని ఐరోపావారి భావజాలం ప్రభావితం చేసింది. బ్రిటన్‌వారు నిష్క్రమించిన తరువాత మనం ఈ ప్రభావ బంధంనుంచి బయటపడి ఉండాలి. భారతీయ విద్యార్థుల, భారతీయ విద్యావంతుల మనఃప్రవృత్తిని, బుద్ధిని భారతీయ భావజాలం ప్రభావితం చేయడానికి వీలైన రీతిలో మన విద్యావిధానాన్ని సంస్కరించుకొని ఉండాలి! కాంగ్రెస్ వారి సుదీర్ఘ పాలనలో ఆ పని జరగలేదు. ప్రత్యామ్నాయంగా అవతరించిన ‘్భజపా’ పాలనలో కూడ ఇంతవరకు ‘‘అంకుర దశలోని సంస్కరణలు’’ చిగురించిన జాడ లేదు! పాఠశాలలలో విద్యాశాలలలో ‘వందేమాతరం’ గీతాన్ని పాడడం ఇప్పటికీ జాతీయ సంప్రదాయంగా వ్యవస్థీకృతం కాకపోవడం ఈ ‘‘జాడ లేకపోవడానికి’’ నిదర్శనం. రాజకీయ రంగ ప్రస్థానం ప్రధాన పరిణామం. అందువల్లనే విద్యా సంస్కరణల విప్లవం సమాంతర పరిణామం!
కేంద్రీయ ఉన్నత పాఠశాల విద్యామండలి- సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్- సిబిఎస్‌ఇ-వారు పదవ తరగతి పరీక్షలలో సృజనాత్మక సమాధానాలను వ్రాసే విద్యార్థులను ప్రోత్సహించాలని నిర్ణయించిందట. ఇరవై ‘మార్కుల’ ఏక పద సమాధాన ప్రశ్నల- ఆబ్జెక్టివ్ కొశె్చన్స్- విభాగంలోను, అరవై ‘మార్కుల’ ‘సుదీర్ఘ సమాధాన ప్రశ్నల’- థియరీ- విభాగంలోను సృజనాత్మక- క్రియేటివ్- సమాధానాలను విద్యార్థులు వ్రాయడానికి వీలుగా ‘ప్రశ్నల రీతి’ని సంస్కరించనున్నారట. అలాగే ఇరవై ‘మార్కుల’ ‘అంతర్గత పరీక్షల’ పద్ధతిలోకూడ మార్పులు చేయనున్నారట. సృజనాత్మకత- క్రియేటివిటీ- అంటే ఏమిటన్నది ‘‘బ్రహ్మ పదార్థం ఏమిటన్నంత’’ సులభతరమైన లేదా కష్టతరమైన సమస్య. విద్యార్థులు తమ పాఠ్యప్రణాళిక పరిధికి లోబడి ప్రశ్నలకు సమాధానాలు వ్రాస్తారు. ఈ పరిధిలోనే వారు సృజనాత్మక నైపుణ్యాన్ని ప్రదర్శించాలి. ఇది మొదటి అంశం. గణితం, రసాయన శాస్త్రం, భౌతిక శాస్త్రం, జీవశాస్త్రం- జంతుశాస్త్రం, వృక్షశాస్త్రం- వంటి పాఠ్యవిభాగాలలో సైతం సృజనాత్మక రీతిలో సమాధానాలు వ్రాయడం విద్యార్థులకు నేర్పుతారేమో? భాషలు, చరిత్ర వంటి సాంఘిక శాస్త్రాల పరీక్షలలో సృజనాత్మక సమాధానాలు వ్రాయడం కొంత సులభం కావచ్చు! సృజనాత్మకతకు స్పష్టమైన పరిధి లేదు, సృజనాత్మకత నిరంతర విస్తృతి! విద్యార్థి ‘సృజనాత్మకత’ అని భావించిన దాన్ని ‘పరీక్షకుడు’ సృజనాత్మక అని భావించినప్పుడే లక్ష్యం నెరవేరుతుంది. లేనట్టయితే గొప్ప గందరగోళం ఏర్పడుతుంది. ‘సృజనాత్మకత’ను ఒక ప్రత్యేక పాఠ్యాంశం బోధించవచ్చు. అంతేకాని నిర్దిష్ట పాఠ్యాంశాలను చదివి పరీక్షలు వ్రాయడంలో ‘సృజనాత్మకత’ ఏమిటి?? అన్న ప్రశ్నకు సమాధానం లభించవలసి ఉంది!
జాతీయ విద్యా పరిశోధన శిక్షణ మండలి - నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రయినింగ్- ఎన్‌సిఇఆర్‌టి- వారు పాఠ్యప్రణాళికలో సంస్కరణలు చేయాలని భావిస్తున్నారట. ప్రయోగాత్మక అధ్యయనం- ఎక్స్‌పెరిమెంటల్ లెర్నింగ్- అన్నది ‘ఎన్‌సిఇఆర్‌టి’ వారు ప్రచారం చేస్తున్న పదజాలం. అధ్యయనానికి, ప్రయోగాత్మక అధ్యయనానికి తేడా ఏమిటన్న ప్రశ్నకు సమాధానం లభించవలసి ఉంది. పదునాలుగేళ్ల తరువాత ‘పాఠ్య ప్రణాళిక’ మార్గదర్శక నియమాలను ‘ఎన్‌సిఇఆర్‌టి’ సవరించనున్నదట. ‘జాతీయ పాఠ్యాంశ ప్రణాళిక’- నేషనల్ కర్రికులమ్ ఫ్రేమ్‌వర్క్- ఎన్‌సిఎఫ్-ను ఇప్పుడు సమీక్షిస్తారట! ఈ ‘ఎన్‌సిఇఆర్‌టి’ సంస్కరణలు కూడ స్వరూపానికి- బోధనా పద్ధతులకు, పరీక్షాపద్ధతులకు-మాత్రమే పరిమితం కానున్నాయా?? లేక విద్యాస్వభావ పరివర్తనకు సంబంధించిన మార్పులు జరుగనున్నాయా? బ్రిటన్ దురాక్రమణ సమయంలో మన విద్యాస్వభావం మారిపోయింది. అనాదిగా భారతీయ విద్యలో విద్యార్థులకు సంస్కారాన్ని విజ్ఞానాన్ని పెంపొందించాయి. ఇదీ సనాతన-శాశ్వత- భారతీయ విద్యాస్వభావం! బ్రిటన్ దురాక్రమణ ఫలితంగా మారిపోయిన విద్యలు కేవలం విజ్ఞానాన్ని మాత్రమే పెంపొందిస్తున్నాయి. ‘సంస్కారం’ సంగతి బ్రిటన్‌వారు ప్రవేశపెట్టిన విద్యకు తెలీదు. అందువల్లనే విద్యావంతులలో అతితక్కువ మందికి మాత్రమే భారతీయత పట్ల ధ్యాస ఏర్పడుతోంది. సంస్కారవంతమైన జీవన ప్రవృత్తి ఏర్పడుతోంది. కానీ అత్యధికులు భారతీయత ధ్యాసలేని, సంస్కార శూన్యులయిన కేవల విజ్ఞానవంతులు. వీరిలో అత్యధికులు ‘విబుధ దైత్యులు’- చదువుకున్న రాక్షసులు-!! ఈ చదువుకున్న దైత్యులు అన్ని సార్వజనిక, సామాజిక క్షేత్రాలలోని అవినీతిపరులు, హంతకులు, బీభత్సకారులు, దేశ విద్రోహులు... మాతృభూమి పట్ల, మాతృ సంస్కృతి పట్ల మమకారం లేనివారు...
అదిగో అక్కడ నిలుచున్నవాడు
‘ఆత్మ’ను హత్యచేసి
ఆవురావురుమని ఆరగిస్తున్నాడు!
‘‘ఇది నాది’’అని ‘‘నా జాతి’’అని
మదిలో భావించనివాడు వాడు!
మాతృదేశ మమకార జ్వాల
రగలని గుండెలవాడు వాడు..
పరభూములపై పరుగులు తీసి
పాదాలు కాల్చుకున్నవాడు వాడు....
ఇలాంటి వారంతా ‘ప్రముఖులు’గా చెలామణి అవుతుండడానికి ఏకైక కారణం మన విద్యావిధానంపై బ్రిటన్ దురాక్రమణ సమయంలో పడిన ‘ముద్ర’లు తొలగకపోవడం. డెబ్బయి ఏళ్లకు పైగా జరుగుతున్న ‘సంస్కరణలు’ విద్యారంగాన్ని ‘బ్రిటన్-మెకాలే’ విష ప్రభావంనుంచి విముక్తం చేయలేకపోయాయి! విజ్ఞానంతోపాటు భారతీయ సంస్కారాలను, నైతిక నిష్ఠను, సామాజిక నిబద్ధతను-జాతీయ భావస్ఫూర్తిని పెంపొందించగల విద్య మళ్లీ వికసించడం స్వభావ విప్లవం! ఈ స్వభావ విప్లవం గురించి జవహర్‌లాల్ నెహ్రూకు ఆయన రాజకీయ వారసులకు పట్టలేదు. అందువల్లనే దేశభక్తి సైతం కృతకంగా మారింది, కేవలం రాజకీయానికి పరిమితమైంది. సంస్కృతి భూమికగా దేశభక్తి వికసించడం ఈ దేశపు జాతీయ విద్యాస్వభావం! దేశభక్తి-మాతృభూమి పట్ల మమకారం- మిగిలిన సంస్కారాలకు ప్రాతిపదిక! అందువల్ల ఈ వౌలిక సంస్కారం వికసించడానికి సంస్కరణలు విద్యావ్యవస్థలో జరగాలి. మరో ఐదేళ్లపాటు పరిపాలించడానికి అవకాశం లభించనున్న ‘్భజపా’ నాయకత్వంలోని ప్రభుత్వం ఇప్పుడైనా ఈ ‘‘విద్యా స్వభావ పరివర్తన’’ గురించి, విద్యలలో భారతీయత పునరుద్ధరణ గురించి కార్యాచరణకు నడుం బిగించాలి!