సంపాదకీయం

విదేశీయ ‘వోటర్’లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లోక్‌సభ ఎన్నికల ‘మతప్రదాన’-పోలింగ్- ఘట్టం సమీపిస్తున్న సమయంలో అక్రమ ప్రవేశకుల సమస్య చర్చకు రావడం సహజం! దశాబ్దుల తరబడి బంగ్లాదేశ్ నుంచి చొరబడిన అక్రమ ప్రవేశకులు ‘సక్రమ భారతీయులు’గా మారిపోతుండడం దశాబ్దుల కుట్ర. అక్రమ ప్రవేశకులను వోటర్ల జాబితాలకెక్కించి వారి ‘వోట్ల’ను పొందడానికి రాజకీయ పక్షాలవారు కొందరు కృషిచేసినట్టు కూడ ప్రచారమైంది! అందువల్ల స్థానికులుగా చెలామణి అయిపోయి ‘రేషన్’ ‘ఓటర్’ ‘ఆధార్’ వంటి గుర్తింపులను పొంది బ్యాంకులలో ఖాతాలను తెరచి భారతీయులుగా చెలామణి అవుతున్న లక్షల ‘అక్రమ ప్రవేశకుల’ను ఇకపై గుర్తించడం బహుశా సాధ్యం కాదు. కానీ 2018 వరకు అస్సాంలో అక్రమ ప్రవేశకులని నిర్ధారణ జరిగిన వారిలో అత్యధికులు కనిపించకుండా పోయారన్నది వైచిత్రిక పరాకాష్ఠ. వీరంతా స్థానిక ప్రజలు- భారతీయ పౌరులు-గా చెలామణి అవుతూ ఉండవచ్చు. ఇలాంటి నిర్ధారిత అక్రమ ప్రవేశకులు బంగ్లాదేశీయులు కావచ్చు, బర్మా నుంచి ఇతర దేశాల నుంచి చొరబడినవారు కావచ్చు! కానీ 2018 మార్చివరకు అస్సాంలోని న్యాయమండలులు తొంబయి ఒక్క వేల ఆరువందల తొమ్మిది మందిని అక్రమ ప్రవేశకులని నిర్ధారించాయట! వీరిలో డెబ్బయి రెండువేల నాలుగు వందల ఎనబయి ఆరుగురు కనిపించడం లేదన్నది సర్వోన్నత న్యాయస్థానంలో వెల్లడైన వైపరీత్యం! స్థానికులలో కలసిపోయిన- భారతీయులుగా చెలామణి అవుతున్న- ఈ డెబ్బయి రెండున్నర వేల మందిని పసికట్టి పట్టుకొనడానికి ‘మీరు ఏం చేశారు..?’ అని సర్వోన్నత న్యాయస్థానం సోమవారం అస్సాం ప్రభుత్వాన్ని అడిగిన ప్రశ్నకు సమాధానం లభించవలసి ఉంది! కనపడకుండాపోయిన అక్రమ ప్రవేశకులు న్యాయ మండలుల తీర్పులు వెలువడిన వెంటనే కాని అంతకుముందుగానే కాని ‘‘జారుకొని’’ఉంటారని దేశవ్యవహారాల మంత్రిత్వశాఖ వారు నివేదించడం మరో విడ్డూరం. అంటే న్యాయ మండలులు విచారణ జరుపుతుండిన సమయంలో సంబంధిత నిందిత అక్రమ ప్రవేశకులు ప్రభుత్వ నిర్బంధంలో లేరన్నమాట! విచారణ సమయంలో వారిని ఎందుకని నిర్బంధించి ఉంచలేదు? కనీసం తీర్పులు వెలువడిన వెంటనే న్యాయ మండలుల ప్రాంగణంలోనే వారిని పోలీసులు నిర్బంధించి ఉండాలి! ఈ సంగతిని అస్సాం ప్రభుత్వం కాని కేంద్ర ప్రభుత్వం కాని పట్టించుకొనక పోవడం విచిత్రం! దశాబ్దుల తరబడి దాదాపు రెండు కోట్ల మంది బంగ్లాదేశీయులు మన దేశంలోకి చొరబడినట్టు ప్రచారమైంది. కానీ నిర్ధారిత అక్రమ ప్రవేశకులు కేవలం తొంబయి వేలని నిర్ధారణ కావడమే విస్మయకరం. వీరిలో డెబ్బయివేల మందికి పైగా తప్పించుకొని జనంలో కలిసిపోయారు! అయితే మిగిలిన దాదాపు ఇరవై వేల మంది ప్రభుత్వ నిర్బంధ గృహాలలో ఉండాలి! అస్సాంలోని ఆరు నిర్బంధ గృహాలలో ప్రస్తుతం ఎనిమిది వందల ఇరవై తొమ్మిది మంది నిర్ధారిత అక్రమ ప్రవేశకులు మాత్రమే ఉన్నారని ప్రభుత్వం సర్వోన్నత న్యాయస్థానానికి నివేదించింది. వీరుకాక జైలుశిక్షను ముగించిన మరో నూట పదహైదు మంది అక్రమ ప్రవేశకులు కూడ ఈ నిర్బంధ గృహాలలో ఉన్నారు. ఇలా ‘తప్పించుకొని పోని’ దాదాపు ఇరవై వేల మందిలో సైతం దాదాపు వెయ్యి మందిని మాత్రమే ప్రభుత్వం అస్సాంలో నిర్బంధించింది. మిగిలిన దాదాపు పంతొమ్మిది వేల మంది ఎక్కడ ఉన్నారన్న వివరాలను ప్రభుత్వం సర్వోన్నత న్యాయస్థానంలో దాఖలుచేసిన ‘ప్రమాణ పత్రం’ అఫిడవిట్‌లో వెల్లడి కాలేదు. ‘కొండను తవ్వి ఎలుకను పట్టబోయారు’.. తోడేళ్లు తప్పించుకున్నాయి!
అస్సాంలోని ‘అనిర్ధారిత అక్రమ ప్రవేశకులు ఎంతమంది?’అన్న సర్వోన్నత ప్రధాన న్యాయమూర్తి రంజన్ గగోయి ప్రశ్నకు ప్రభుత్వం సమాధానం చెప్పలేదు. సమాధానం చెప్పవలసిన అస్సాం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమవారం సర్వోన్నత న్యాయస్థానంలో ఉపస్థితుడు కాకపోవడం పట్ల ప్రధాన న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేయడం వేఱుకథ! కానీ సర్వోన్నత న్యాయస్థానం ప్రస్తావించిన ‘‘అనిర్ధారిత అక్రమ ప్రవేశకుల’’గురించి నిర్ధారణ జరపడం ప్రభుత్వాలకు సాధ్యమా? అన్నది మరో ప్రశ్న. ఈ ‘అనిర్ధారిత అక్రమ ప్రవేశకులు స్థానికులతో కలసిపోయి’ దేశ పౌరులుగా చెలామణి అవుతూ ఉండవచ్చునన్నది సర్వోన్నత న్యాయస్థానం చేసిన వ్యాఖ్య! బంగ్లాదేశ్‌నుంచి చొరబడిన అక్రమ ప్రవేశకుల వివరాలతో 2012 అక్టోబర్‌లో అస్సాం ప్రభుత్వం నివేదిక-వైట్‌పేపర్-ను విడుదల చేసింది. 1971వ సంవత్సరానికి పూర్వం తూర్పు పాకిస్తాన్- బంగ్లాదేశ్- నుంచి వచ్చి అస్సాంలో తిష్ఠవేసిన అక్రమ ప్రవేశకులను పసికట్టడం సాధ్యం కాదని ఆ ‘పత్రం’లో పేర్కొన్నారు. వారందరూ భారతీయ పౌరులుగా దశాబ్దుల క్రితమే నమోదై పోయారట. 1971 తరువాత చొరబడిన బంగ్లాదేశీయులను మాత్రమే పసికట్టగలమని నివేదికలో పేర్కొన్నారు. ఇలా దశాబ్దుల క్రితమే భారతీయులుగా మారిన విదేశీయులు వోట్లువేస్తూ ఉండడం మన ఎన్నికల చరిత్ర...
బంగ్లాదేశ్ నుంచి చొరబడిన ‘‘అక్రమ ప్రవేశకుల సంఖ్య కోటిన్నర’’అని ఆ తరువాత రాజ్యసభలో కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అస్సాంలో ముస్లిం జనాభా విపరీతంగా పెరిగిపోతుండడానికి ఇదీ కారణమని అనేకసార్లు నిర్ధారణ జరిగింది! అక్రమ ప్రవేశకుల సంఖ్య ఇంకా ఎక్కువన్నది అనధికార ప్రచారం. ఈ కోటిన్నర మందిలో ఎంతమంది ‘వోటర్లు’గా మారిపోయారన్నది ఎవరు ఎప్పుడు ఎలా నిర్ధారిస్తారు? సమాధానం లేదు. బెంగాల్‌లోకి సైతం అక్రమ ప్రవేశకులు లక్షల సంఖ్యలో చొరబడ్డారు. ఇలా చొరబడిన వారిలో అనేక మంది అస్సాం నుంచి బంగ్లాదేశ్ నుంచి బయటపడి దేశమంతటా విస్తరించడం కూడ నడచిన కథ, నడుస్తున్న వ్యథ. వీరంతా ‘వంగ’-బెంగాలీ- భాషను మాట్లాడుతారు. అందువల్ల వీరంతా పశ్చిమబెంగాల్ నుంచి వివిధ రాష్ట్రాలకు వచ్చి స్థిరపడిన భారతీయులుగా చెలామణీ కాగలిగారు. వీరందరూ వోటరులు. గతంలో వోట్లువేశారు. ఈ ఎన్నికలలో సైతం వేయనున్నారు. ఎవరు పూనుకోవాలి? వీరు భారతీయులు కాదని ఈ ముదిరిపోయిన స్థితిలో ఎలా నిరూపించాలి! బంగ్లాదేశీయులు చొరబడిపోతుండడంతో అస్సాంలో సాంస్కృతిక వైపరీత్యాలు, జనాభాలో అసంతులనం ఏర్పడుతోందని 2014 డిసెంబర్‌లో అప్పటి సర్వోన్నత న్యాయమూర్తులు రంజన్ గగోయి, ఆర్‌ఎఫ్ నారిమన్ వ్యాఖ్యానించారు! ఇలా ఆందోళనలు వ్యక్తం అవుతూనే ఉన్నాయి. అక్రమ ప్రవేశకులు చొరబడుతూనే ఉన్నారు. అక్రమ ప్రవేశకులను పసికట్టి స్వదేశాలకు తరలించడానికి వీలుగా కేంద్ర ప్రభుత్వం అస్సాంలో ‘దేశ పౌరుల జాతీయ సంచిక’- నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్- ఎన్‌ఆర్‌సి-ను రూపొందించింది. గత జూలైలో రూపొందిన ముసాయిదా ప్రకారం అస్సాంలో నివసిస్తున్న వారిలో దాదాపు నలబయి లక్షల మందికి భారతీయ పౌరసత్వం లభించలేదు. ఇలా లభించనివారు అందరూ అక్రమ ప్రవేశకులే అయినప్పటికీ, అక్రమ ప్రవేశకులందరూ పట్టుబడినట్టు కాదు! కానీ ఈ అక్రమ ప్రవేశకులను దేశంలోనే ఉండనివ్వాలని కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, వామపక్షాలు, సమాజ్‌వాదీ పార్టీ తదితర పక్షాలవారు అరచి ఆర్భాటించారు. ‘ఎన్‌ఆర్‌సి’ తుది ముసాయిదా రూపొందించేసరికి కేవలం పది లక్షల అక్రమ ప్రవేశకులు మాత్రమే ధ్రువపడనున్నట్టు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి! అక్రమ ప్రవేశకులు పౌరులుగా చెలామణి అవుతూ ఎన్నికలలో వోట్లు వేయగలుగుతుండడం దేశ భద్రతకు, జాతీయ హితానికి పెద్ద కన్నం..
బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా ప్రవేశించినవారి సంఖ్య కేవలం కొన్ని వేలు మాత్రమేనని 2012లో దిగ్విజయసింగ్ అనే కాంగ్రెస్ నాయకుడు ‘‘చారిత్రక ప్రకటన’’ చేసి ఉన్నాడు!! ఇలా లక్షల అక్రమ ప్రవేశకులను మన దేశంలోనే ఉంచి పౌరసత్వం కల్పించాలని కోరుతున్న ఇలాంటి దేశ వ్యతిరేకులు బంగ్లాదేశ్ నుండి పాకిస్తాన్ నుండి తరిమివేతకు గురైన శరణార్థులకు- నిస్సహాయ హిందువులకు మాత్రం భారతీయ పౌరసత్వం ఇవ్వరాదని కోరుతున్నారు..