సంపాదకీయం

అధినాయక గణం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లోక్‌సభ ఎన్నికల తరువాత ‘భారతీయ జనతాపార్టీ’ లేని ‘కూటమి’- ఫ్రంట్- కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలదని ప్రచారం చేస్తున్న వారిలో రెండు రకాలవారున్నారు. కాంగ్రెస్ లేకుండా మిగిలిన ‘భాజపా’ వ్యతిరేక దళాలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం మొదటి ‘శ్రేణి’ లక్ష్యం. కాంగ్రెస్‌ను కలుపుకొని ‘కూటమి’ని కట్టి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని చెబుతున్నవారు రెండవ ‘శ్రేణి’... ఉభయ శ్రేణుల మధ్య గల సమానత్వం ఎన్నికల తరువాత మళ్లీ ‘్భజపా’ ప్రభుత్వం ఏర్పడడం లేదన్నది! ఏ ఒక్క రాజకీయ పక్షానికి కూడ తనంతతానుగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగిన ‘సంఖ్యాధిక్యం’రాదన్నది, రాకూడదన్నది వర్తమాన ఎన్నికల ప్రచారంలో వినిపిస్తున్న ‘్భజపా’ వ్యతిరేక ధ్వని! సిద్ధాంత నిబద్ధత, కార్యక్రమ నిష్ఠ, విధాన స్పష్టత, అనుశాసన సమాచరణ రాజకీయ పక్షానికి వౌలిక లక్షణాలన్నది రాజనీతి.. ఇలాంటి ఒక పక్షం తనంతతానుగా ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసినట్టయితే పరిపాలన అవిచ్ఛిన్నంగా అవిరళంగా కొనసాగుతుందన్నది ప్రజాస్వామ్య రాజ్యాంగ నిర్మాతల అభిప్రాయం. ఇది ప్రస్తుతం గతమైంది. ఒకే పార్టీకి లోక్‌సభలో ‘సంఖ్యాబాహుళ్యం’ లభించినట్టయితే ఆ పార్టీ ‘నియంతృత్వ’ పాలనను సాగిస్తుందన్నది మన దేశంలోని అత్యధిక రాజకీయ పక్షాల అభిప్రాయం. ఈ అభిప్రాయం గత మూడు దశాబ్దులుగా ప్రస్ఫుటించి విస్తరిస్తోంది. వివిధ పక్షాలు కలసిన ‘కూటమి’ప్రభుత్వం సుస్థిరంగా మనుగడ సాగించలేదని, ఈ ప్రభుత్వంలో సైద్ధాంతిక వైరుధ్యాలు, విధాన విభేదాలు నిహితమై ఉంటాయని, ఇలాంటి ప్రభుత్వం ఏ కార్యక్రమాన్ని కూడా అమలు చేయలేదని, అభివృద్ధి స్తంభించి పోతుందని విశే్లషణలు, వ్యాఖ్యలు జరిగినట్టు 1960వ, 1970వ దశకాల నాటి రాజకీయ చరిత్ర చెబుతోంది. 1967 నాటి ఎన్నికల తరువాత అనేక రాష్ట్రాలలో ఏర్పడిన సిద్ధాంత సారూప్యం లేని పక్షాల మిశ్రమ మంత్రివర్గాలు అర్ధాంతరంగా కుప్పకూలిపోవడం చరిత్ర. సంకీర్ణ రాజకీయాలు, మిశ్రమ ప్రభుత్వాలు సైద్ధాంతిక సాంకర్యాన్ని మాత్రమే సాధించాయి. రాజకీయ సంక్షోభాన్ని పునరావృత్తం చేశాయి. ఇలాంటి ‘కల్తీ’ని ప్రజలు నిరసించినందువల్లనే 1972నాటి శాసనసభ ఎన్నికలలో వోటర్లు కాంగ్రెస్‌కు అఖండ విజయం చేకూర్చారు. కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వాల వైఫల్యాల కారణంగానే 2014నాటి లోక్‌సభ ఎన్నికలలో ఒకే పార్టీకి- భాజపాకు లోక్‌సభలో స్పష్టమైన సంఖ్యాధిక్యం లభించింది! కానీ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడడం ఆదర్శవంతమైన రాజ్యాంగ పరిణామం అన్న ప్రచారం ఇప్పుడు మళ్లీ పుంజుకొంది. ‘భాజపా’పట్ల వ్యతిరేకతకు ప్రాతినిధ్యం వహించగల ఏకైక జాతీయ రాజకీయ పక్షం లేకపోవడం ఇందుకు కారణం! ‘‘భాజపా ఓడిపోవాలి. కానీ మేము స్వయంగా లోక్‌సభలో మెజారిటీ సాధించలేము.’’ అని భావిస్తున్న రాజకీయ పక్షాలవారు కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడడం గొప్ప ‘ఆదర్శ వ్యవస్థ’కాగలదన్న ప్రచారాన్ని మళ్లీ మొదలుపెట్టారు!
‘్భజపా’కు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ప్రజల మన్ననలను పొందగల, లోక్‌సభలో ‘సంఖ్యాబాహుళ్యాన్ని’ తనంతతానుగా సాధించగల ప్రత్యామ్నాయ పక్షం లేకపోవడం ఈ ‘కూటమి’రాజకీయాలకు ప్రాతిపదిక. 1980 దశకం చివరి వరకు కాంగ్రెస్ పార్టీకి ‘ప్రత్యామ్నాయం’ కాగలగిన ఏకైక రాజకీయ పక్షం లేదు. అప్పటివరకు జరిగిన ‘కూటమి’ రాజకీయాలకు అదీ ప్రాతిపదిక! 1990వ దశకంలో ‘భాజపా’ప్రత్యామ్నాయంగా ఎదిగింది. ఈ ‘ఎదుగుదల’ కాంగ్రెస్ ‘తరుగుదల’.. కానీ ఈ రెండు పార్టీల మధ్య రాజకీయాలు వోటర్లు ‘ద్విధా సమీకృతం’కావడం 2014వరకు నడిచిన చరిత్ర. ఈ కాలవ్యవధిలో సైతం ‘భాజపా’కు కాని కాంగ్రెస్‌కు కాని లోక్‌సభలో సంఖ్యాబాహుళ్యం లేదు. 1991-1996 సంవత్సరాల మధ్య, 2004- 2014 సంవత్సరాల మధ్య ప్రభుత్వాన్ని నడిపిన కాంగ్రెస్‌కు, 1998నుంచి 2004వరకు ప్రభుత్వాన్ని నిర్వహించిన భాజపాకు లోక్‌సభలో ‘సంఖ్యా బాహుళ్యం’-మెజారిటీ- లేదు. ‘కూటమి’ ప్రభుత్వాలను ఈ పార్టీలు నిర్వహించాయి. ‘కూటమి’లో చిన్న ‘పార్టీ’ల బలం పెరిగినప్పుడు అస్థిరత పెరగడం, ఊహాగానాలు ఊపందుకొనడం, ఈ చిన్న పక్షాల బలం తక్కువ అయినప్పుడు అస్థిరత స్థాయి తగ్గడం ఈ ప్రభుత్వాల చరిత్ర. ‘ఇలా తోకలు కుక్కలను ఆడించడమన్న’ రీతిలో సంకీర్ణ రాజకీయం జరిగిపోవడంతో 1999లో ‘భాజపా’ ప్రభుత్వం కూలిపోయింది. 2008లో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోయినంత పని అయ్యింది! కనీసం రెండువందల స్థానాలన్న ఒక పెద్ద పార్టీ నాయకత్వంలో ‘కూటమి’ఏర్పడితే అది నిర్వహించే ప్రభుత్వం కొంతకాలం మనగలుగుతుంది. లేనట్టయితే 1996-1998 సంవత్సరాల మధ్య హెచ్‌డి దేవెగౌడ, ఇంద్రకుమార్ గుజ్రాల్ ప్రభుత్వాల నాటి ‘కథ’ పునరావృత్తం అవుతుంది. రాజకీయ ప్రయోజనాలనుకాక జాతీయ ప్రయోజనాలను కోరుతున్న వోటర్లు ఈ పునరావృత్తిని కోరుకోవడం లేదు.
లోక్‌సభలో సంఖ్యాబాహుళ్యాన్ని కాని, కనీసం రెండువందల కంటె ఎక్కువ స్థానాలను సాధించగల అవకాశం ప్రస్తుతం ‘్భజపా’కు మాత్రమే ఉండడం నిష్పక్ష పరిశీలకులు నిరాకరింపజాలని నిజం. 1989వరకు ఇలాంటి శక్తి కాంగ్రెస్‌కు మాత్రమే ఉండేది. 2014 తరువాత ‘భాజపా’కు మాత్రమే ఈ శక్తిఉంది. ‘భాజపా’కు వ్యతిరేకంగా ‘కూటమి’ని కట్టదలచినవారు సమీక్షించుకోదగిన వాస్తవం ఇది. ‘పది, పాతిక, పదహారు, రెండు’ లోక్‌సభ స్థానాలను పొందగలిగిన ఇరవై లేదా అంతకంటె ఎక్కువ పక్షాలు ఏర్పాటుచేసే సంకీర్ణ ప్రభుత్వంలో నాయకత్వం ఎవరిది? సమన్వయం సాధ్యమా?? వీటికంటె ముందు సమాధానం లభించదగిన ప్రశ్న ఈ ‘అనేక పక్షాల కూటమి’కి లోక్‌సభలో ‘సంఖ్యాధిక్యం’- మెజారిటీ- సమకూడడం సాధ్యమా? కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయంగా ఒకే పార్టీ- భాజపా- అవతరించింది. ‘భాజపా’కు అఖిల భారత స్థాయిలో మరో ప్రత్యామ్నాయ జాతీయ పక్షాన్ని ఏర్పాటుచేయవచ్చు. వివిధ ప్రాంతాలకు పరిమితమై ఉన్న వివిధ పక్షాలు కలసిపోయి ఒకే జాతీయ పక్షంగా ఎందుకు అవతరించరాదు? గతంలో ఇలా వివిధ పక్షాలు విలీనమై ఒకే పక్షంగా అవతరించిన చరిత్ర ఉంది. 1975లో ‘స్వతంత్ర పార్టీ’, ‘భారతీయ క్రాంతిదళ్’ తదితర ఏడు పార్టీలు కలసిపోయి ‘భారతీయ లోక్‌దళ్’ ఏర్పడడం చరిత్ర. ఈ ‘్భరతీయ లోక్‌దళ్’, భారతీయ జన సంఘం, ‘పాత కాంగ్రెస్’గా చెలామణి అయిన కాంగ్రెస్‌లోని ఒక ప్రధాన వర్గం, ‘సోషలిస్టు పార్టీ’, ప్రజాస్వామ్య కాంగ్రెస్ కలిసిపోయి 1977లో ‘జనతాపార్టీ’గా ఏర్పడినాయి. ఆ తరువాత ఇంత పెద్దఎత్తున పార్టీల విలీనం జరిగిన చరిత్ర లేదు! ‘జనతాపార్టీ’ 1979 నుండి ముక్కలుచెక్కలు కావడం చరిత్ర. ‘సిద్ధాంతం’కంటె వ్యక్తిగత ఆధిపత్యం ప్రాధాన్యం వహించడం ఆ చీలికకు కారణం. వివిధ ప్రాంతాల నాయకులు వివిధ స్థాయిల నాయకులు సొంత పార్టీని వదలిపెట్టి ‘‘ప్రత్యేక పక్షాల’ను నెలకొల్పుకొంటుండడానికి అది మొదలు. ఏదో ఒక లక్ష్యసాధన కోసం లేదా ఒక విలక్షణ సిద్ధాంతాన్ని వ్యాప్తిచేయడం కోసం ప్రత్యేక రాజకీయ పక్షాలు, ప్రాంతీయ రాజకీయ పక్షాలు ఏర్పడిన సందర్భాలున్నాయి. కానీ పుంఖానుపుంఖాలుగా పుట్టుకొని వచ్చిన ‘వ్యక్తిగత’ ప్రాబల్య పక్షాలతో పోల్చినప్పుడు ఇలాంటి ‘విలక్షణ’ పక్షాల సంఖ్య చాలా తక్కువ. ఈ ‘విలక్షణ’ పక్షాలు సైతం ‘కుటుంబ’ పక్షాలుగా మారిపోతుండడం చరిత్ర. తండ్రీ కొడుకులు కోడళ్లు కూతుళ్లు అల్లుళ్లు మనుమరాళ్లు మనుమలు ఈ ఉద్యమ పక్షాలను, సిద్ధాంత పక్షాలను సొంత ఆస్తులుగా మార్చుకొని ఉండడం బహిరంగ రహస్యం.
అందువల్ల ప్రతి చిన్న పార్టీలోను ‘ఆధిపత్యం’ అధినాయకుని, అతని లేదా ఆమె వారసుల చేతులలో ఇరుక్కొని ఉంది. ఇలాంటి ఐదారు, పది పదిహేను ప్రాంతీయ పక్షాలు లేదా చిన్న పక్షాలు కలసిపోయి ఒక పెద్ద జాతీయ పక్షంగా ఏర్పడితే ‘ప్రత్యామ్నాయం’ సహజంగా సిద్ధిస్తుంది. కానీ కలసిపోవు.. కలసిపోయినట్టయితే ఈ పది పదహైదు పక్షాల అధి నాయకులలో ఒక్కరికి మాత్రమే అధినాయకత్వం దక్కుతుంది. మిగిలిన వారు అతనిని అనుసరించాలి. గౌరవించాలి! ఇది దేశంలోని వివిధ పక్షాల అధినాయకులకు ఇష్టం లేదు. అందువల్లనే ఇన్ని పార్టీలు పరిఢవిల్లుతున్నాయి. ఈ పక్షాల-్ఛప్పన్న దళాల- అధినేతలు ‘కూటమి’ పేరుతో మిశ్రమ మంత్రివర్గం ఏర్పాటు పేరుతో ఢిల్లీ సమావేశాలు జరుపడం చరిత్ర. ఈ చరిత్ర కొనసాగడం వీరి అభిమతం. ఇలా కొలువుతీరుతున్న ప్రాంతీయ నేతలకు తాము ఒక్కొక్కరు ఒక ప్రత్యేక దేశానికి అధినేతలమన్న అనుభూతి కలుగుతూ ఉండవచ్చు.. విలీనమై ఒకే జాతీయ పక్షంగా ఏర్పడితే ఈ ‘అనుభూతి’ దక్కదు.. ఇదీ రాజకీయ సమాఖ్య స్ఫూర్తి! ఇది ‘రాజ్యాంగ సమాఖ్య’ స్ఫూర్తికంటె విలక్షణమైనది!!