సంపాదకీయం

విధాన వైపరీత్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాహుల్‌గాంధీ ‘వాచాల ప్రహసనాలు’ ప్రతీకలు మాత్రమే! జిహాదీ బీభత్సకారులను మన దేశంలోకి ఉసిగొల్పుతున్న పాకిస్తాన్ పట్ల, ఇలా ఉసిగొల్పడాన్ని అత్యంత జుగుప్సాకరమైన రీతిలో సమర్ధిస్తున్న చైనా పట్ల మన ప్రభుత్వ రాజకీయ నిర్వాహకులు దశాబ్దుల తరబడి అనుసరిస్తున్న మెతక వైఖరి అసలు వైపరీత్యం. మసూద్ అఝార్ అనే పాకిస్తానీ బీభత్సకారుడిని, మానవ రక్తం తాగడం ప్రవృత్తి అయిన పిశాచ స్వభావుడిని రాహుల్‌గాంధీ ‘‘గారు’’ అని గౌరవించడం మన భద్రతకు విఘాతకరమైన విపరిణామం. కానీ దశాబ్దుల తరబడి మన విధానంలోనే పాకిస్తాన్ పట్ల చైనా పట్ల ఇలాంటి ‘గౌరవం’ నిహితమై ఉంది. అనభిజ్ఞతకు రాజకీయ విదూషకత్వానికి సజీవ స్వరూపంగా చిత్ర విచిత్ర రాజకీయ ప్రకటనలను గుప్పిస్తున్న రాహుల్‌గాంధీ ఈ 'ధ్వని’ని ‘వాచ్యం’ చేశాడు.... అంతే! నిజంగా మన ప్రభుత్వ విధానం వాస్తవానికి అనుగుణంగా ఉండినట్టయితే పాకిస్తాన్ ప్రభుత్వాన్ని బీభత్స వ్యవస్థగా దశాబ్దుల క్రితమే ప్రకటించి ఉండాలి, సకల విధమైన సంబంధాలను రద్దుచేసుకొని ఉండాలి! పాకిస్తాన్‌ను బహిరంగంగా సమర్ధిస్తున్న చైనాతో తెగతెంపులు చేసుకొని ఉండాలి! అలాంటిదేమీ జరగలేదు. అందువల్లనే పాకిస్తాన్, చైనా ఇలా ప్రవర్తించడానికి ప్రాతిపదిక ఏర్పడింది. తమ బీభత్స స్వరూపాన్ని ఎంత బహిరంగంగా ప్రవర్తించినప్పటికీ, తమ బీభత్స స్వభావాన్ని ఎంతగా స్ఫురింపచేసినప్పటికీ భారత ప్రభుత్వం తమతో తెగతెంపులు చేసుకోబోదన్న గొప్ప ధీమా పాకిస్తాన్‌కు, చైనాకు ఏర్పడిపోయింది. మసూద్ అఝార్ అనేవాడు నడిపిస్తున్న ‘జాయిష్ ఏ మొహమ్మద్’ ముఠా పాకిస్తాన్ ప్రభుత్వం ఏర్పాటుచేసిన ‘తోడేళ్ల ప్రాంగణాల’లో ఒకటి మాత్రమే. అందువల్ల ప్రధానంగా శిక్షించవలసింది పాకిస్తాన్ ‘‘ప్రభుత్వం’’గా చెలామణి అవుతున్న భయంకర జిహాదీ బీభత్స వ్యవస్థను, ఈ వ్యవస్థకు వెన్నుదన్నుగా నిలచి ఉన్న చైనా ప్రభుత్వాన్ని! ‘‘మంచి పనిలో కాని, దుర్మార్గంలో కాని చేసిన వాడు, చేయించినవాడు, ప్రేరేపించినవాడు, ఆమోదించినవాడు సమాన భాగస్వాములు’’. - కర్తా, కారయితాచైవ, ప్రేరకశ్చాను మోదకః, సుకృతే దుష్కృతేశ్చైవ చత్వార? సమభాగినః-! జిహాదీ బీభత్సకాండను చేయిస్తున్నది పాకిస్తాన్ ప్రభుత్వం, మన దేశంలోకి జిహాదీ తోడేళ్లను ఉసిగొల్పుతున్నది పాకిస్తాన్ ప్రభుత్వం.... ఈ దుశ్చర్యను సమర్ధిస్తున్నది చైనా ప్రభుత్వం! 2014 మే 26వ తేదీ తరువాత మన ప్రభుత్వ రాజకీయ నిర్వాహకులు మెతక వైఖరిని విడనాడడం ఆరంభమైంది. దశాబ్దుల తరబడి ‘వాస్తవ అధీనరేఖ’- లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్- ఎల్‌ఏసి- ను అతిక్రమించి దాదాపు ప్రతి రోజూ ఎక్కడో ఒకచోట చొరబాటు జరిపిన చైనా దళాల పట్ల మన ప్రభుత్వం ఉపేక్ష వహించింది. 2014 మే 26 తరువాత మన 'భారత్ టిబెట్ సరిహద్దు పోలీసులు’- ఐటిబిపి- చైనా దళాలను మెడలు పట్టి గెంటుతూ వెళ్లి ‘రేఖ’ ఆవలికి దాటించడం ఆరంభమైంది....
ఇదే రీతిలో జమ్ముకశ్మీర్ పడమటి ప్రాంతంలోని ‘అధీన రేఖ’- లైన్ ఆఫ్ కంట్రోల్- ఎల్‌ఓసి- ను దాటి వెళ్లి మన రక్షణ దళాలను మూడుసార్లు ‘సాయుధ చికిత్స’- సర్టికల్ స్ట్రయిక్ జరిపారు. ఇదంతా మన రక్షణ విధానంలో ప్రస్ఫుటిస్తున్న దృఢతరమైన వైఖరి. కానీ దీనివల్ల మాత్రమే చైనా వైఖరిలో కాని పాకిస్తాన్ విధానంలో కాని మార్పులు రావు. ‘‘మీ విధానం మారనంతవరకూ మీతో మాకు వాణిజ్యం వద్దు, దౌత్యం వద్దు, చర్చలు వద్దు, మైత్రి వద్దు....’’ అని పాకిస్తాన్‌కు కాని చైనాకు కాని మన ప్రభుత్వం ఇప్పటికీ చెప్పలేకపోతోంది. ఇజ్రాయిల్‌కూ ఈజిప్టుకూ మధ్య 1979 వరకూ దౌత్య సంబంధాలు లేవు. చర్చలు జరగలేదు ‘‘ఇజ్రాయిల్‌ను ధ్వంసం చేయడం’’ అన్న లక్ష్యాన్ని విడనాడుతున్నట్టు ఈజిప్ట్ ప్రకటించిన తరువాత మాత్రమే ఇజ్రాయిల్ ఈజిప్టుతో చర్చలను జరపడానికి అంగీకరించింది. ఇజ్రాయిల్‌ను ధ్వంసం చేయరాదని, మనుగడ సాగించే అధికారం ఇజ్రాయిల్‌కు ఉందని, ఇజ్రాయిల్ వ్యతిరేక బీభత్సకాండకు స్వస్తి చెపుతున్నామని ప్రకటించిన తరువాతనే ‘పాలస్తీనా విమోచన సంస్థ’- పిఎల్‌ఓ- తో ఇజ్రాయిల్ చర్చలు జరిపింది, స్వయంప్రత్తికల పాలస్తీనా ఏర్పాటునకు అంగీకరించింది. చిన్న ఇజ్రాయిల్ సాధించగలిగిన 'భద్రత’ను పెద్దదైన మన దేశం కూడ సాధించగలదు...
ఇలాంటి చారిత్రక, భౌగోళిక, రక్షణ ధ్యాస రాహుల్‌గాంధీ వంటి ‘ఆషామాషీ’ రాజకీయవేత్తలకు లేకపోవడం ఆశ్చర్యం కాదు, దిగ్విజయసింగ్ వంటి జాతిహితం పట్టని రాజకీయ జీవులకు లేకపోవచ్చు! కానీ పరిణతి చెందిన రాజకీయవేత్తలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ నిర్వాహకులు మేధావులు సైతం పాకిస్తాన్ పట్ల కొంత ‘మన్నన’ను చైనా పట్ల ఘన గౌరవాన్ని ప్రకటిస్తుండడం, ప్రదర్శిస్తుండడం విచిత్ర వ్యవహారం! అనభిజ్ఞుడైన- ఇగ్నోరెంట్- రాహుల్‌గాంధీ మసూద్ అఝార్ గాడిని ‘అఝార్ మసూద్‌గారు’ అని పిలవడం ప్రమాదకరమైన ప్రవృత్తికి నిదర్శనం కావచ్చు! కానీ తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలతో సహా వివిధ రాష్ట్రాల ప్రభుత్వాలు చైనా వాణిజ్య దురాక్రమణను ప్రోత్సహిస్తుండడం, కేంద్ర ప్రభుత్వం, చైనా పెట్టుబడులకు తలుపులను తెరచి ఉంచడం మరింత ప్రమాదకరమైన దీర్ఘకాల వైపరీత్యం! అఝార్ మసూద్ కంటె అఝార్ మసూద్ వంటి వారిని సమర్ధిస్తున్న చైనా ప్రభుత్వం వందల వేల రెట్లు ప్రమాదకరం! చైనా వారి సంప్రదాయ వైద్యం మన దేశంలోని పులులను భోంచేసింది, భోంచేస్తోంది. చైనాలో తయారవుతున్న ‘మందుల’కు పులుల చర్మాలు, గోళ్లు, దంతాలు అవసరమట! దశాబ్దుల తరబడి చైనా ప్రభుత్వం మన దేశంనుండి ఈ ‘పులి’ పదార్థాలను దొంగరవాణా చేయించుకొంటోంది. మన ప్రభుత్వం ఆధికారికంగా చర్చించింది, విజ్ఞప్తి చేసింది, నిరసన తెలిపింది. అయినా మన దేశపు అడవులలోని పులులను చైనా వేటాడడం మానలేదు! ఎఱ్ఱ చందనం కలపను చైనాకు ఇతర దేశాలకు తరలిస్తున్న చైనీయ నేరస్థులు అనేకసార్లు పట్టుబడినారు. చైనా వస్తువులు మన దేశంలోని దాదాపు అన్నింటిలోకి చొరబడిపోయి ఉండడం చైనావారి వాణిజ్య బీభత్సకాండకు ప్రత్యక్ష నిదర్శనం. ‘చైనా బజారు’లు ‘చైనీస్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్’లు మన ఆర్థిక, సాంస్కృతిక సార్వభౌమ అధికారాన్ని వెక్కిరిస్తున్న ‘కేతనాలు’.... ఆర్థిక బీభత్స నికేతనాలు! మన ముఖ్యమంత్రులు ‘‘చైనాను చూసి మనం ఎంతో నేర్చుకోవాలి....’’ అన్న చారిత్రక ప్రకటనలు చేసి ఉన్నారు! ఏం నేర్చుకోవాలి??
రాహుల్‌గాంధీ రాజకీయాలలోకి చేరినప్పటినుంచి ‘విదూషక’ పాత్రను పోషించాడనడానికి, ‘ఆషామాషీ’గా వ్యవహరించాడనడానికి ఉదాహరణలు కోకొల్లలు. కానీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడి హోదాను పొందిన తరువాత కొంత హుందాగా ప్రవర్తిస్తున్నాడన్న సందేహం పొడసూపింది. కానీ ‘‘అఝార్ మసూద్‌జీ’’ అని ఆయన పేర్కొనడం దృశ్యమాధ్యమాలలో తిలకించిన వారికి ఈ సందేహం పటాపంచలయింది. ‘‘ఆయన నోరు తెరిస్తే’’ ప్రత్యర్థులకు మాత్రమే కాదు స్వపక్షీయులు సైతం హడలిపోవడం చరిత్ర.... ఎందుకంటే ‘‘తెరచిన నోటిలో కాలుపెట్టుకోవడం’’ ఆయనకు అలవాటు. ‘‘అఝార్‌జీ’’ అని ఆయన అనడం ఈ చరిత్రకు పునరావృత్తి! కానీ కశ్మీర్‌కు వెళ్లినప్పుడల్లా హురియత్ ‘ముదురు’ ముఠా నాయకుడు సయ్యద్ అలీషా జిలానీని దర్శించి గౌరవం ఘటించి వస్తున్న ‘పరిణతి’ చెందిన రాజకీయవేత్తల మాటేమిటి??