సంపాదకీయం

సౌదీ ‘సౌహార్దం’..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బీభత్సకాండకు వ్యతిరేకంగా మన దేశం జరుపుతున్న పోరాటానికి మద్దతునివ్వగలమని సౌదీ అరేబియా ‘ఉప అధిపతి’- క్రౌన్ ప్రిన్స్- మొహమ్మద్ బిన్ సల్మాన్ బుధవారం కొత్త ఢిల్లీలో హామీఇవ్వడం ఆశ్చర్యకరం కాదు. సౌదీ అరేబియా ప్రభుత్వం దశాబ్దుల తరబడి బీభత్సకాండను ఆధికారికంగా నిరసిస్తూనే ఉంది. కానీ ఈ దశాబ్దుల తరబడి జిహాదీ బీభత్సకారులకు సౌదీ అరేబియా స్ఫూర్తి కేంద్రం కావడం సమాంతర విపరిణామం! మన దేశంలోకి చొరబడుతున్న జిహాదీ బీభత్సకారులను భౌతికంగా ఉసిగొల్పుతున్నది పాకిస్తాన్ ప్రభుత్వం! కానీ ఈ ‘జిహాదీ’ వ్యవస్థకు ఆర్థిక సహకారం ‘‘సైద్ధాంతిక’’ అవగాహన లభిస్తున్నది సౌదీ అరేబియా దేశం నుండి మాత్రమేనన్నది అంతర్జాతీయ సమాజం గుర్తించిన వాస్తవం! అందువల్ల సౌదీ అరేబియా ప్రభుత్వం తోడేళ్లతో కలసి తరుముతూనూ ఉంది, కుందేళ్లతో కలసి పారిపోతూనూ ఉంది! సౌదీ అరేబియా ప్రభుత్వ ‘ఉప అధిపతి’- యువరాజు- మన దేశంలో జరిపిన పర్యటనకు ఇది సుదీర్ఘ నేపథ్యం! మన జమ్మూకశ్మీర్‌లోని పుల్వామా జిల్లా అవన్తిపురా సమీపంలో నలబయి మంది మన కేంద్ర పోలీసులను పాకిస్తానీ జిహాదీలు హత్యచేయడం ఈ పర్యటనకు తక్షణ నేపథ్యం. అవన్తిపురావద్ద పాకిస్తాన్ జరిపిన ఈ బీభత్సకాండను ఇరాన్ ప్రభుత్వం తీవ్రంగా నిరసించింది, పాకిస్తాన్ ప్రభుత్వాన్ని బహిరంగంగా అభిశంసించింది. సౌదీ అరేబియా ప్రభుత్వం పుల్వామా బీభత్సకాండను ఇలా తీవ్రంగా నిరసించలేదు, పాకిస్తాన్ ప్రభుత్వాన్ని పేరుపెట్టి అభిశంసించలేదు. సౌదీ ‘యువరాజు’ పాకిస్తాన్‌లో తాను జరుప తలపెట్టిన పర్యటనను ఒకరోజు మాత్రం వాయిదా వేసుకున్నాడు. రద్దుచేసుకోలేదు. పాకిస్తాన్ సందర్శన సందర్భంగా మొహమ్మద్ బిన్ సల్మాన్ యథావిధిగా వాణిజ్య చర్చలు కొనసాగించాడు. పాకిస్తాన్‌లో లక్షా నలబయి వేల కోట్ల రూపాయల పెట్టుబడులను పెట్టడానికి ఈ పాకిస్తాన్ పర్యటన సందర్భంగా సౌదీ యువరాజు అంగీకరించాడు. ఈమేరకు ఉభయ దేశాలమధ్య ఒప్పందాలు కుదిరాయి. పాకిస్తాన్‌నుంచి మొహమ్మద్ బిన్ సల్మాన్ మన దేశానికి వచ్చాడు. మన దేశంలో కూడ సౌదీ అరేబియా ప్రభుత్వం ఏడు లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులను నిక్షిప్తం చేయనుందట. బుధవారంనాడు ఈమేరకు ఒప్పందం కుదరడం సౌదీ అరేబియా ప్రభుత్వంవారి ‘సమదృష్టి’కి నిదర్శనం. జిహాదీ బీభత్సకాండను కొనసాగిస్తున్న పాకిస్తాన్ ప్రభుత్వానికీ, జిహాదీ బీభత్సకాండకు బలి అవుతున్న మన దేశానికి మధ్య సౌదీ అరేబియా ప్రభుత్వం ‘‘సమాన దూరాన్ని’’ కొనసాగిస్తోందన్నది, సమాన మైత్రిని పాటిస్తోందన్నది సల్మాన్ మొహమ్మద్ పర్యటనవల్ల మరోసారి ధ్రువపడిన సత్యం...
దాదాపు 850 మంది భారతీయులను తమ దేశంలోని జైళ్లనుంచి విడుదల చేయాలని సౌదీ అరేబియా ప్రభుత్వం నిర్ణయించడం మొహమ్మద్ బిన్ సల్మాన్ పర్యటన సందర్భంగా సంభవించిన మరో పరిణామం. భారతీయులను నిర్బంధించి విచారణ లేకుండా వారిని కారాగృహాలపాలు చేసిన దేశాలలో సౌదీ అరేబియా అగ్రస్థానంలో ఉండడం ‘అసలు విషయం!’ నెలల తరబడి, సంవత్సరాల తరబడి భారతీయులు ఇలా సౌదీ అరేబియా జైళ్లలో మగ్గుతుండడానికి కారణం ‘యజమానుల’ అమానుష ప్రవర్తన. తమవద్ద ఉద్యోగాలుచేస్తున్న భారతీయులను, ప్రధానంగా తమ ఇళ్లలో పరిచారికలుగాను, తమ వాహన చోదకులుగాను, తమ దుకాణాలలో సహాయకులుగాను పనిచేస్తుండిన సౌదీ అరేబియాలోని సంపన్నులు చిత్రహింసలకు గురిచేశారు, చేస్తున్నారు. ఈ చిత్రహింసలు భరించలేక పారిపోయిన భారతీయులను ‘యజమానుల’ ఫిర్యాదులు ప్రాతిపదికగా సౌదీ ప్రభుత్వ భద్రతా దళాలవారు నిర్బంధించారు, నిర్బంధిస్తున్నారు. ఇలా నిర్బంధించిన సమాచారం మన దేశంలోని బంధితుల బంధువులకు కుటుంబ సభ్యులకు సౌదీ అధికారులు తెలియచేయకపోవడం మరో వైపరీత్యం. సౌదీ అరేబియాలోని తమ బంధువుల ఆచూకీ నెలలతరబడి తెలియక మన దేశంలోని ఆయా కుటుంబాలవారు ఆందోళనకు గురికావడం ప్రచారంకాని వాస్తవం. ‘సౌదీ’లోని మన రాయబార కార్యాలయంవారు, దౌత్యకార్యాలయాల వారు పదేపదే అభ్యర్థించిన తరువాత మాత్రమే ఈ ‘సమాచారం’ వెల్లడి అవుతోంది! గత నెలలో ‘రియాధ్’లో ముగ్గురు భారతీయ వాహనచోదకులను ఒక ఘరానా వ్యాపారి హత్యచేయించాడు. ఈ హంతకుడిని సౌదీ ప్రభుత్వం నిర్బంధించిన సమాచారం లేదు. తనవద్ద ఉద్యోగం మానేసినందుకు ప్రతికారం తీర్చుకొనడానికై ఆ వ్యాపారి ఈ భారతీయులను హత్యచేశాడు. భారతీయ పరిచారికలను ఇళ్లలోని పై అంతస్థులలో నిర్బంధించి తిండి లేకుండా మాడ్చడం, వారిని పై అంతస్థులనుంచి కిందికి నెట్టివేయడం, వారిని కాల్చిన ఇనుప కడ్డీలతో వాతలు పెట్టడం వంటివి సౌదీ అరేబియాలో కొనసాగిన, కొనసాగుతున్న సామాజిక బీభత్సంలో కొన్ని వైపరీత్యాలు మాత్రమే!!
పాకిస్తాన్‌లో ఈ మొహమ్మద్ బిన్ సల్మాన్‌కు ఘన సన్మానం జరిగింది. పుల్వామాలో పాకిస్తాన్ జరిపించిన పైశాచిక కాండ గురించి ప్రపంచ దేశాలలో నిరసన వ్యక్తమవుతుండిన సమయంలోనే. ఈ మొహమ్మద్ బిన్ సల్మాన్ పాకిస్తాన్ ప్రధానిపై ప్రశంసల జల్లు కురిపించాడు. పాకిస్తాన్ అధ్యక్షుడు ఆరిఫ్ అల్వీ తమ దేశపు అత్యున్నత పౌర పురస్కారం ‘‘నిశాన్ ఏ పాకిస్తాన్’’- పాకిస్తాన్ గౌరవ చిహ్నం- ను సల్మాన్‌కు ప్రదానం చేయడం ‘పర్యటన’ సందర్భంగా ప్రచారం పొందిన ప్రధాన అంశం. ఈ ‘‘గొప్ప గౌరవాన్ని’’, సౌదీ యువరాజునకు కట్టబెట్టడం ద్వారా పాకిస్తాన్ కీలకమైన ‘జిహాదీ బీభత్సకాండ’ గురించి చర్చ జరుగకుండా నిరోధించ గలిగింది. ఇరాన్ ప్రభుత్వం మన దేశానికి వ్యతిరేకంగా పాకిస్తాన్ జరిపించిన అవన్తిపురా బీభత్సకాండను నిరసించిన సమయంలోనే సౌదీ అరేబియా విదేశాంగ మంత్రి ఆడెల్ బిన్ అహ్మద్ అల్ జుబీయార్ పాకిస్తాన్ రాజధానిలో ఇరాన్ ప్రభుత్వాన్ని దుయ్యబట్టాడు. ఇరాన్ ప్రభుత్వం అంతర్జాతీయ బీభత్సకాండకు ప్రధానమైన ప్రేరకమని సౌదీ మంత్రి చెప్పడం ‘అసలు సమస్య’నుంచి దృష్టి మళ్లించడం మాత్రమే! అవన్తిపురాలో హత్యాకాండ జరిపించినది పాకిస్తాన్ ప్రభుత్వమేనన్నది, ‘‘జరిపిన’’ జాయ్‌ష్ ఏ మొహమ్మద్’ ముఠావారి ప్రకటన ద్వారా మరింతగా ధ్రువపడింది. ఈ సంగతిని ‘అరేబియా’ యువరాజు కాని, మంత్రి కాని పాకిస్తాన్‌లో ప్రస్తావించక పోవడం ‘దృష్టిని మళ్లించే వ్యూహం’- ఎర్రర్ ఆఫ్ ఒమిషన్-! అసందర్భంగా ‘‘ఇరాన్ ప్రేరిత బీభత్సకాండ’’ను ప్రస్తావించడం అత్యాచారం- ఎర్రర్ ఆఫ్ కమిషన్-!’’ భారత పాకిస్తాన్ దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలను సడలించడానికి తమ ప్రభుత్వం కృషిచేస్తుందని’’మాత్రమే ఇస్లామాబాద్‌లో సౌదీ అరేబియా యువరాజు, మంత్రి ప్రకటించారు. ఈ ప్రకటన ద్వారా బీభత్సకాండను నిర్వహిస్తున్న పాకిస్తాన్‌ను, బీభత్సకాండను ప్రతిఘటిస్తున్న మన దేశాన్ని సౌదీ ప్రభుత్వం ఒకే గాట గట్టింది....
మన దేశానికీ సౌదీ అరేబియాకు మధ్య కొనసాగుతున్న సంబంధాలలో సౌదీ దౌత్య దౌర్జన్యం నిహితమై ఉండడం ప్రచారంకాని వ్యవహారం. ఢిల్లీలోని సౌదీ రాయబారి కార్యాలయానికి చెందిన ఉద్యోగి ఒకడు గురుగావ్‌లోని తన ఇంటిలో ఇద్దరు నేపాలీ మహిళలను నిర్బంధించి మూడునెలలపాటు వారిని సామూహిక లైంగిక అత్యాచారాలకు బలిచేశాడు. 2015 సెప్టెంబర్‌లో ఈ ఘోరం వెల్లడైంది. మన ప్రభుత్వం ఆ లైంగిక బీభత్సకారుడిని నిర్బంధించలేకపోయింది. వాడు మన దేశంనుంచి దర్జాగా విమానమెక్కి సౌదీకి వెళ్లాడు. కానీ కేవలం యజమానుల ఫిర్యాదుల ప్రాతిపదికగా సౌదీ ప్రభుత్వం నిస్సహాయులైన మన వందల మందిని నెలల తరబడి నిర్బంధించింది. ఇదీ ద్వైపాక్షిక సంబంధాలలో నిహితమై ఉన్న సౌదీ దౌర్జన్యం. ‘జమాల్ ఖషోగీ’ అన్న పత్రికా రచయితను సౌదీ అరేబియా యువరాజు చంపించినట్టు గత అక్టోబర్‌లో ధ్రువపడింది. సౌదీ అరేబియాలో పుట్టిన ఈ పత్రికా రచయిత అమెరికాలో స్థిరపడినాడు. టర్కీలోని ఇస్తాంబుల్ నగరంలోని తమ దౌత్యకార్యాలయానికి ఖషోగీని పిలిపించిన సౌదీ ప్రభుత్వం అక్కడ ఆయనను ముక్కలుగా నరికి చంపించింది! ఇదంతా సౌదీ ప్రభుత్వం నిర్వాహకుల స్వభావంలో నిహితమై ఉన్న బీభత్సం...