సంపాదకీయం

‘చివరి’ సమావేశం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పదహారవ లోక్‌సభ ‘చివరి’ సమావేశాలు జరిగాయి! కాలచక్రం ‘గిర్రున’ తిరిగిందన్నదానికి ఇది మరో ఉదాహరణ కాకపోవచ్చు. గిర్రున తిరగడంలో సహస్రాబ్దులు సైతం చల్లగా జారిపోతున్నాయి, చరిత్రగా మారుతున్నాయి. అందువల్ల కేవలం ఒక ‘అర్ధ దశాబ్ది’ గడచిపోవడం పెద్ద విషయం కాదు.. అయినప్పటికీ ఐదేళ్లు ఇట్టే గడచిపోవడం కాలగమనంలో భాగం. పదహారవ లోక్‌సభ ఇలా ఐదేళ్లపాటు గడచిపోవడం కలియుగం 5051-క్రీస్తుశకం 1950-వ సంవత్సరం నుంచి నడుస్తున్న ‘బ్రిటన్ విముక్త’ భారత నూతన రాజ్యాంగ చరిత్రలో మాత్రం గణనీయమైన పరిణామక్రమం. యుగాల చరిత్రలో ‘ఐదేళ్ల’కు ప్రాధాన్యం లేకపోవచ్చు.. అరవై తొమ్మిదేళ్ల ‘నూతన’ రాజ్యాంగ చరిత్రలో మాత్రం ఐదేళ్లకు ప్రాధాన్యం ఉంది. భావితరాలకు ఈ ‘ఐదేళ్లు’ ఆసక్తికరమైన అధ్యయన అంశం కానుంది. ఈ ఐదేళ్ల ‘కాల ఖండం’ వర్తమానంలో రాజకీయ పరిణామాలకు, రాజకీయ విభేదాలకు మాత్రమే పరిమితమన్న భావం లేదా భ్రాంతి కలుగుతూ ఉండవచ్చు. ‘రాజకీయం’ తాత్కాలిక సమయ స్వరూపం. కానీ జాతీయ ప్రజాస్వామ్య రాజ్యాంగ రథ ప్రస్థానం ప్రగతిని సాధిస్తున్నకొద్దీ ఈ ‘‘వర్తమానం’’ శాశ్వత చారిత్రక స్మృతుల సమాహారంగా పరివర్తన చెందుతుంది, చెందనుంది! ఇదీ కాలక్రమం. మొదటి లోక్‌సభ 1952లో మొదలైంది! మొదటి లోక్‌సభలో లేదా 1957లో మొదలైన రెండవ లోక్‌సభలో, 1962లో మొదలైన మూడవ లోక్‌సభలో, 1967లో మొదలై నాలుగేళ్లు గడవకముందే రద్దయిన నాలుగవ లోక్‌సభలో సభ్యులెవరు? సభాపతులెవరు? ఏయే రాజకీయ పక్షానికి ఎనె్నన్ని స్థానాలుండేవి? ఏయే ‘బిల్లుల’ను ఏయే రాజ్యాంగ సవరణలను ఆయా ‘సభలు’ ఆమోదించాయి??- ఇలాంటివి ఇంకా మరెన్నో సంగతులు రాజ్యాంగ చరిత్రను అధ్యయనం చేసేవారికి ఆసక్తికలిగించే అంశాలు! అలాగే 2014లో మొదలై 2019లో పరిసమాప్తం అవుతున్న ఈ పదహారవ లోక్‌సభ చరిత్ర కూడ భవిష్యత్ పరిశోధకులను ‘ఊరించక’ మానదు. ‘‘యుద్ధం’’ జరిగిన సమయంలో యుద్ధం చేస్తున్నవారికి కలిగే కష్టం, ఆందోళన, భయం, శ్రమ భవిష్యత్తులో ఆ ‘‘యుద్ధం’’ గురించి వినేవారికి ఉండదు. ఆ వినేవారికి, తెలుసుకునే వారికి ఈ ‘‘యుద్ధం’’ ఆసక్తికరంగాను ఆనందకరంగానూ ఉంటుందన్నది ‘మహాభారత కారుడు’ వేదవ్యాసుడు చెప్పిన మాట! అందువల్ల సమావేశాలను ముగించుకున్న, మరో మూడున్నర నెలల్లో ‘ముగింపు’ను సంతరించుకోనున్న పదహారవ లోక్‌సభ గురించి అనేక ఆసక్తికర అంశాలు భవిష్యత్ తరాలకు ఆనందం కలిగించవచ్చు! బుధవారం చివరి సమావేశంలో ప్రసంగించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ‘‘ఈ పదహారవ లోక్‌సభ’’ అని చెప్పదలచి ‘‘ఈ పదహారవ విధాన్ సభ- శాసన్‌సభ’’- అని పలకడం ఇలాంటి ఆసక్తికరమైన అంశాలలో ఒకటి మాత్రమే! ప్రస్తుత లోక్‌సభలో మహిళల సంఖ్య గతంలో మరే ‘సభ’లో కంటె కూడ అధికంగా ఉందన్నది మోదీ ఆవిష్కరించిన మరో వాస్తవం. మహిళా సాధికార గరిమ పెరిగిందనడానికి ఈ పదహారవ లోక్‌సభ ఇలా మరో చారిత్రక ప్రతీక!!
మానవీయ మూల్యాలను పరిరక్షించడంలో ఈ ‘లోక్‌సభ’ కాల వ్యవధిలో మన దేశం సాధించిన అనేక విజయాలను నరేంద్ర మోదీ తన ప్రసంగంలో ఉటంకించాడు. గాంధీ మహాత్మునికి అత్యంత ప్రియమైన ‘‘వైష్ణవ్ జన్‌తో’’అన్న గీతాన్ని దాదాపు నూట యాబయి దేశాలలోని ఆయా దేశాల స్థానిక కళాకారులు ఆలపించడం ఈ లోక్‌సభ కాలవ్యవధిలో జరిగిన మరో అద్భుతమన్నది మోదీ చెప్పిన మరో మంచి మాట! భారతీయుల తరతరాల ‘యోగం’, - ‘‘యుగాలనాటి సాంస్కృతిక భోగం’’- అంతర్జాతీయ ‘యోగ దినోత్సవం’గా ప్రపంచ ప్రజలకు భౌతిక మానసిక బౌద్ధిక సాంస్కృతిక ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుండడం ఈ పదహారవ ‘లోక్‌సభ’ కాల వ్యవధిలో సంభవించిన శుభ పరిణామం. ‘అంతర్జాతీయ సౌరశక్తి సంఘటన’- ఇంటర్ నేషనల్ సోలార్ అలియన్స్- మన దేశం నాయకత్వంలో ఏర్పడడం ఈ ‘లోక్‌సభ’ కాలవ్యవధిని ‘‘సముజ్వలం’’ చేసిన మరో చారిత్రక సంఘటన! 2014 జూన్ నాలుగవ తేదీన ప్రస్తుత లోక్‌సభ మొదటి సమావేశం జరిగింది. అందువల్ల రానున్న జూన్ మూడవ తేదీవరకూ ఈ సభ కాలవ్యవధి కొనసాగనుంది. సాధారణ సమావేశాల ‘లాంఛనం’ బుధవారం పరిసమాప్తమైనప్పటికీ మరో ప్రత్యేక సమావేశం జరుగరాదన్న నిబంధన లేదు. కానీ అలాంటి ప్రత్యేక సమావేశం జరుపవలసిన అవసరం ఏర్పడకపోవచ్చు! ఈ ఐదేళ్లలో లోక్‌సభ నల్లడబ్బును నిరోధించడానికి దోహదం చేయగల అనేక బిల్లులను ఆమోదించింది. ‘‘ఒకే దేశం - ఒకే పన్నుల విధానం’’- వన్ నేషన్ వన్ టాక్స్- అన్న ఆర్థిక ఆదర్శానికి ఆకృతి లోక్‌సభ ఆమోదించిన ‘‘వస్తుసేవల పన్నుల వ్యవస్థ’’- గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్- జిఎస్‌టి బిల్లు!
పౌరసత్వం చట్టానికి లోక్‌సభ చేయగలిగిన సవరణ మానవీయ స్వభావానికి అద్దం. ఈ మానవీయ స్వభావం సర్వమత సమభావం! అఫ్ఘానిస్థాన్, పాకిస్తాన్, బంగ్లాదేశ్ సమాజాలలో ఈ ‘సర్వమత’ సమభావం వికసించడం లేదు. అందువల్లనే 1947 నుంచి కూడ ‘జిహాదీలు’ ఆయా దేశాల నుంచి ఇస్లామేతర మతస్థులను తరిమివేశారు, తరిమివేస్తున్నారు. ఇలా ఈ మూడు దేశాలలోను జిహాదీ బీభత్సకాండకు గురి అయిన, గురి అవుతున్న ఇస్లామేతర మతాలవారిలో అత్యధికులు అనాదిగా అఖండ భారతదేశంలో వికసించిన హైందవ జాతీయ మతాలవారు.. శైవ మతస్థులు, వైష్ణవ మతస్థులు, శాక్తేయులు, సనాతన మతస్థులు, ఇతర వేదమతాల వారు.. బౌద్ధులు, జైన మతస్థులు! విదేశాల నుంచి అఖండ భారత్‌కు వ్యాపించిన క్రైస్తవం, పారశీక వంటి మతాలకు చెందిన వారిని కూడ అఫ్ఘానిస్థాన్ నుంచి పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ నుంచి ‘జిహాదీ’లు తరిమివేస్తున్నారు. ఇలా తరిమివేతకు గురి అవుతున్న ఇస్లామేతర మతాలవారు సహజంగా- అఖండ భారత విభజన జరుగుకపోయి ఉండినట్టయితే- భారతీయ పౌరులు. అందువల్ల తరిమివేతకు గురి అయిన దాదాపు రెండు లక్షల మందికి కొన్ని ఏళ్లకు పూర్వమే భారతీయ పౌరసత్వం లభించి ఉండాలి, లభించలేదు. అలా ఈ శరణార్థులకు భారతీయ పౌరసత్వం కల్పించగల ‘బిల్లు’ను ఈ లోక్‌సభ గత నెలలో ఆమోదించడం మానవీయ స్వభావ చరిత్రకు మరో నిదర్శనం. ఈ బిల్లును రాజ్యసభలో వ్యతిరేకిస్తున్నవారు ఈ మానవీయ స్వభావం లేనివారు! దుర్జన స్వభావం కల కొందరు పురుషుల దురహంకారానికి ఇస్లాం మతానికి చెందిన మహిళలను బలిచేస్తున్న ‘‘ముమ్మారు తలాక్’’ పద్ధతిని రద్దుచేయడం మహిళా సాధికార సాధనకు దోహదం చేయగల మరో మాధ్యమం. ఇలా రద్దుచేయడానికి ఉద్దేశించిన బిల్లును కూడ గత డిసెంబర్‌లో ఆమోదించడం పదహారవ లోక్‌సభలో ప్రస్ఫుటించిన మానవత్వం.. రాజ్యసభ శాశ్వత సభ! అయినప్పటికీ లోక్‌సభతో సమాంతరంగా ప్రతి ఐదేళ్లకోసారి రాజ్యసభ చరిత్రలో సరికొత్త అధ్యాయం ఆరంభం కావడం మన పార్లమెంటరీ ప్రజాస్వామ్య రాజ్యాంగ వ్యవస్థలో భాగం.. 1946లో నూతన రాజ్యాంగం రచించడానికి శ్రీకారం జరిగింది, బ్రిటన్ దురాక్రమణ ముగియకముందే ‘రాజ్యాంగ పరిషత్’కు ఎన్నికలు జరిగాయి. కానీ ఆ ఎన్నికలలో ‘వయోజన’ భారతీయులందరికీ వోటు హక్కు లభించలేదు. ఆర్థిక స్థాయి, వ్యవసాయ భూమి యాజమాన్యం ప్రాతిపదికగా ‘వోటు’హక్కు పొందిన పరిమిత సంఖ్యలోని ప్రజలు మాత్రమే ‘రాజ్యాంగ సభ’ను ఎన్నుకున్నారు! అలా 1952 వరకు ఆరేళ్లపాటు ఈ పరిమిత ప్రజాస్వామ్య ‘సభ’ప్రాతిపదికగా ప్రభుత్వం నడవడం రాజ్యాంగ వైపరీత్యం! అందువల్లనే 1952 నుంచి మాత్రమే మన ప్రజాస్వామ్య రాజ్యాంగ చరిత్ర మొదలైంది. ఈ చరిత్రలో ఇది పదహారవ లోక్‌సభ!
మొదటి లోక్‌సభలో మూడింట రెండు వంతుల స్థానాలను పొందగలిగిన ‘కాంగ్రెస్’ పక్షానికి పదవ వంతు స్థానాలు సైతం లభించకపోవడం పదహారవ లోక్‌సభలో ప్రస్ఫుటించిన చారిత్రక విపరిణామం! మొదటి లోక్‌సభలో భారతీయ జనతాపార్టీకి పూర్వ రూపమైన ‘్భరతీయ జనసంఘాని’కి రెండు స్థానాలు మాత్రమే ఉండేవి. ‘ భాజపా’కు పదహారవ లోక్‌సభలో రెండువందల ఎనబయి మూడు స్థానాలు లభించడం ఈ ‘దశాబ్దుల’ సమాంతర పరిణామ క్రమం....