ఢిల్లీ కబుర్లు -కె.కైలాష్

రజాకార్లు మళ్లీ పుడుతున్నారా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భారత్ మాతాకీ జై నినాదాన్ని వివాదాస్పదం చేయటం వెనక మతపరమైన ఓటు బ్యాంకు రాజకీయ కుట్ర ఉన్నదనే అనుమానం కలుగుతోంది. భారత్ మాతా కీ జై అని నినదించేందుకు నిరాకరించటం వెనక రజాకార్ల మనస్తత్వం కనిపిస్తోంది. స్వాతంత్రానికి పూర్వం తెలంగాణాలో మారణ హోమం సృష్టించిన రాజాకార్లు మళ్లీ పడుతున్నారా? ఎం.ఐ.ఎం అధినాయకుడు, లోక్‌సభ సభ్యుడు అసదుద్దీర్ ఒవైసీ ఒక పథకం ప్రకారం భారత్ మాతా కీ జై అంశాన్ని వివాదాస్పదం చేయటం ద్వారా రాజకీయ లబ్దిపొందేందుకు ప్రయత్నించటం సిగ్గు చేటు. అసదుద్దీన్ ఒవైసీ వ్యవహారం ఖాసిం రజ్వీని గుర్తు చేస్తోంది.
హైదరాబాద్ సంస్థానం భారత దేశంలో విలీనానికి ముందు తెలంగాణలో మారణ హోమం సృష్టించిన రాజకార్ల నాయకుడు ఖాసిం రజ్వీ మజ్లిసె ఇత్తహాదుల్ ముస్లిమీన్ (ఎం.ఐ.ఎం) వ్యవస్థాపకుల్లో ఒకరు. కేవలం ముస్లిం సామ్రాజ్యాన్ని కాపాడేందుకు 1927లో ఏర్పాటైన ఎం.ఐ.ఎంకు ఖాసిం రజ్వీ 1944లో అధ్యక్షుడయ్యాడు. దేశానికి స్వాతంత్రం వచ్చిన తరువాత హైదరాబాద్ సంస్థానం భారత దేశంలో విలీనం కాకుండా చూసేందుకు ఒక లక్షా యాభై వేల మంది రజాకార్ల సైన్యంతో తెలంగాణలో మారణ హోమం సృష్టించిన ఖాసిం రజ్వీని భారత దేశం 1948లో అరెస్టు చేసి జైలుకు పంపించింది. 1957లో జైలు నుండి విడుదలైన ఖాసిం రజ్వీ పాకిస్తాన్ వెళుతూ ఎం.ఐ.ఎంను న్యాయవాదిగా పని చేస్తున్న అబ్దుల్ వాహిద్ ఓవైసీకి అప్పగించాడు. అబ్దుల్ వాహిద్ ఒవైసీ ఎం.ఐ.ఎంకు ముందు అఖిల భారత ఎం.ఐ.ఎంగా పేరు మార్చుకుని రాజకీయం ప్రారంభించాడు. అతగాడి కుమారుడైన సుల్తాన్ సలావుద్దీన్ ఓవైసీ 1975లో ఎం.ఐం.ఎం అధ్యక్షుడయ్యాడు. ఆయన ప్రాతినిధ్యం వహించిన హైదరాబాద్ లోక్‌సభ నియోజకవర్గానికి ఇప్పుడు అసదుద్దీన్ ఓవైసీ నాయకత్వం వహిస్తున్నాడు.
1927లో స్థాపించినప్పుడు ఎం.ఐ.ఎం ప్రధాన లక్ష్యం భారత దేశంతో కలిసి పోకుండా ముస్లిం ఆధిపత్యాన్ని కొనసాగించటం. ఇస్లాం మతానికి కట్టుబడి పని చేసేందుకు ఏర్పాటైన ఎం.ఎం.ఎం 1957 తరువాత తమ మూల సిద్ధాంతాన్ని మార్చుకుని భారత రాజ్యాంగానికి కట్టుబడి పని చేసేందుకు సిద్ధమయ్యారు. ఇలాంటి పునాదులు కలిగి ఉన్న ఎం.ఐ.ఎం అధినేతలు భారత్ మాతాకీ జై అని నినదించేందుకు నిరాకించటాన్ని సులభంగానే ఊహించుకోవచ్చు. ఆర్.ఎస్.ఎస్ సర్ సంఘ్ చాలక్ మోహన్ భాగవత్ భారత్ మాతా కీ జై అని నినదించటం దేశ ప్రజలకు ఉద్భోదించాలని నాగపూర్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో సూచించారు. మోహన్ భాగవత్ ఒక కార్యక్రమంలో చేసిన ఉద్భోదను అసదుద్దీన్ ఓవైసీ అత్యంత వివాదాస్పద అంశంగా మార్చివేశాడు. గొంతుపై కత్తిపెట్టి అడిగినా భారత్ మాతా కీ జై అని నినదించనని చెప్పటం ద్వారా అసదుద్దీన్ ఓవైసీ మెజారిటీ మైనారిటీ ప్రజల మధ్య చిచ్చుపెట్టేందుకు ప్రయత్నించాడు.
జె.ఎన్.యులో ఇటీవల కొందరు విద్యార్థులు దేశ వ్యతిరేక నినాదాలు చేయటం తెలిసిందే. పార్లమెంటుపై దాడికి సంబంధించిన కుట్రలో ఉరి కంభం ఎక్కిన అఫ్జల్ గురుకు సంతాపం తెలిపేందుకు జె.ఎన్.యులో జరిగిన ఒక సభలో కొందరు విద్యార్థులు దేశ వ్యతిరేక నినాదాలు ఇచ్చారు. భారత దేశం ముక్కలై పోవాలనే నినాదాలు ఇవ్వటాన్ని దృష్టిలోపెట్టుకుని మోహన్ భాగవత్ భారత మాతా కీ జై ప్రజలందరి చేత అనిపించాలని మోహన్ బాగవత్ సూచించారు. ప్రజల్లో దేశ భక్తి నింపేందుకు భాగవత్ ఈ సూచన చేశారు. మోహన్ భాగవత్ చేసిన ఈసూచనకు మీడియాలో పెద్దగా ప్రాచుర్యం లభించలేదు కానీ అసదుద్దీన్ ఓవైసీ వివాదం చేసిన తరువాత భారత్ మాతా కీ జై నినాదం ప్రజల్లోకి చొచ్చుకుపోయింది. ఒక రకంగా చెప్పాలంటే అసదుద్దీన్ ఓవైసీ తెలిసో, తెలియకనో భారత్ మాతా కీ జై నినాదానికి అత్యధిక ప్రచారం, ప్రాచుర్యం కల్పించారు.
బిహార్ ఎన్నికల్లో బాగా దెబ్బతిన్న ఎం.ఐ.ఎం ఇటీవల జరిగిన జి.హెచ్.ఎం.సి ఎన్నికల్లో రాజకీయంగా బాగా దెబ్బ తిన్నారు. దేశంలోని ముస్లింలకు జాతీయ స్థాయి నాయకుడుగా ఎదగాలని కలలు కంటున్న అసదుద్దీన్ ఒవైసీకి బిహార్, జి.హెచ్.ఎం.సి ఎన్నికల్లో ఓటమి బాగా దెబ్బతీసింది. 2017లో జరుగునున్న ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో తన సత్తా చూపించాలనుకుంటున్న ఒవైసీ ఉత్తర ప్రదేశ్‌తో పాటు ఇతర రాష్ట్రాల ముస్లిం ఓటర్లను ఆకర్షించేందుకు ఏదో ఒకటి చేయాలనే ఆలోచనతో భారత్ మాతా కీ జై నినాదాన్ని రాజకీయం చేస్తున్నారని భావించ వలసి ఉంటుంది. ఆర్.ఎస్.ఎస్ బూచిని చూపించటం ద్వారా ముస్లిం మైనారిటీల్లో అభద్రతా భావాన్ని పెంచటం ద్వారా తన రాజకీయ లక్ష్యాన్ని సాధించాలని ఒవైసీ ఎత్తులు వేస్తూండ వచ్చు. అయితే ఆయన వ్యూహం ఆశించిన రాజకీయ ఫలితాలు ఇస్తుందనే గ్యారంటీ కనిపించటం లేదు.
భారత్ మాతా కీ జై నినాదం విషయంలో ఓవైసీ చేసిన వ్యాఖ్యలను ముస్లిం మేధావులందరు ముక్త కంఠంతో ఖండిస్తున్నారు. ప్రముఖ సాహితీవేత్త జావేద్ అక్తర్ రాజ్యసభలో తన వీడ్కోలు ప్రసంగం చేస్తూ ఒవైసీ ప్రకటనను తీవ్రంగా ఖండిస్తూ మూడు సార్లు ఆవేశంతో భారత్ మాతా కీ జై అని నినదించారు. భారత్ అమీకీ జై అని నినదించేందుకు అంగీకరించవా? అంటూ ప్రముఖ హిందీ నటి షబానా ఆజ్మీ ఎం.ఐ.ఎం అధినేతను నిలదీయటం గమనార్హం. ఉర్దులో అమ్మన అమీ అని పిలుస్తారనేది అందరికి తెలిసిందే. అమ్మ తుజే సలాం అంటూ వందేమాతరం పాటకు ముస్లిం మైనారిటీ సొగసులు నింపిన ప్రఖ్యాత సంగీత దర్శకుడు ఏ.ఆర్.రహమాన్ నుండి ఒవైసీ నేర్చుకోవలసింది ఎంతో ఉన్నది. భారత దేశంలో మత రాజకీయం పెద్దగా రాణించదనే వాస్తవాన్ని అసదుద్దీన్ ఓవైసీ ఎంత త్వరగా గ్రహిస్తే అంత మంచిది.