జాతీయ వార్తలు

గుండెపోటుతో దోశకింగ్ కన్నుమూత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: హత్యకేసులో జీవిత ఖైదు శిక్ష అనుభవిస్తున్న శరవరణ్ భవన్ హోటల్స్ అధినేత పీ. రాజగోపాల్ గుండెపోటుతో చనిపోయారు. వెంటలేటర్‌పై చికిత్స తీసుకుంటున్న రాజగోపాల్ చెన్నైలోని ఓ ఆసుపత్రిలో మృతిచెందాడు. అనారోగ్య కారణాల రీత్యా తాను లొంగిపోవటానికి మరింత గడువు కావాలని కోరగా సుప్రీం కోర్టు తిరస్కరించిన విషయం విదితమే. జ్యోతిష్యంపై నమ్మకున్న రాజగోపాల్ రెండు పెళ్లిల్లు చేసుకున్నాడు. మూడో పెళ్లి చేసుకుంటే అదృష్టం కలిసివస్తుందని జ్యోతిష్కుడు చెప్పటంతో తన వద్ద పనిచేసే అసిస్టెంట్ మేనేజర్ కుమార్తెను పెళ్లిచేసుకోవాలని భావించాడు. ఆ యువతి తిరస్కరించి వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. కాగా రాజగోపాల్ 2001లో ఆమె భర్తను హత్య చేయించటం జరిగింది. ఈ కేసులో స్థానిక కోర్టు రాజగోపాల్‌తో పాటు మరో ఎనిమిది మందిని దోషులుగా తేల్చి పదేళ్ల జైలుశిక్ష విధించింది. హైకోర్టు అప్పీలు చేయగా యావజ్జీవ శిక్షగా మార్చింది. సుప్రీం కోర్టును ఆశ్రయించినప్పటికీ ఫలితం దక్కలేదు.