రివ్యూ

దూకుడెక్కడ?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* వీడికి దూకుడెక్కువ (బాగోలేదు)

తారాగణం:
శ్రీకాంత్, కామ్న జఠ్మలానీ, చంద్రమోహన్, ఎమ్మెస్ నారాయణ, అజయ్, కృష్ణ్భగవాన్ తదితరులు
సంగీతం: చక్రి
నిర్మాత:
బెల్లం రామకృష్ణారెడ్డి
దర్శకత్వం: సత్యనారాయణ ద్వారపూడి

‘కమర్షియల్’ ఫార్ములాని జనం దాదాపుగా మర్చిపోయారు. రొటీన్ డైలాగ్స్‌తో.. ఫైట్స్‌తో - అర్థంపర్థంలేని రొమాన్స్ సీన్లతో విసుగెత్తి.. వెరైటీ కోసం వెతుకులాట మొదలెట్టారు. ఆ కథలో కొద్దిపాటి ‘స్పెషల్’ కనిపించీ.. ‘కనెక్ట్’ అయితే చాలు - సినిమాకీ.. సగటు ప్రేక్షకుడికీ మధ్య ‘కెమిస్ట్రీ’ వర్కవుట్ అయిపోతుంది. ఈ సినిమాకి ‘కమర్షియల్’ టచ్ వచ్చిందీ అంటే ఆనాటి ట్రెండ్‌ని బట్టి - శ్రీకాంత్ ఇమేజ్‌నిబట్టి కథ అలా యాక్షన్ థ్రిల్లర్‌గా మారింది. కాబట్టి - వెరైటీ గురించి ఇక్కడ మాట్లాడుకోకూడదు.
కథ: క్రాంతి (శ్రీకాంత్) దూకుడు మనస్తత్వం కల్గిన పోలీస్ ఆఫీసర్. సమాజంలో అన్యాయాన్ని రూపుమాపాలని ఆకాంక్ష. ఈ సిన్సియర్ ఆఫీసర్ చూపు ఎప్పుడూ కిరాయి గూండాల వైపూ.. అసాంఘిక శక్తుల వైపే. ఈ నేపథ్యం ఓ పక్క నడుస్తూండగానే తన చిన్ననాటి ఫ్రెండ్ చాముండేశ్వరి (కామ్న జెఠ్మలానీ)ని కలవటం.. వారిద్దరి మధ్య ప్రేమ చిగురించటం జరుగుతుంది. చాముండేశ్వరికి పరిశోధనలంటే ఇష్టం.
మలేషియాలోని పురాతన ఆలయాలపై పరిశోధన నిమిత్తం అక్కడికి వెళ్లిన ఆమెను ఓ కిడ్నాప్ ముఠా బంధిస్తుంది. అమ్మాయిల్ని వేశ్యా గృహాలకు అమ్మే ముఠా అది. తన ప్రియురాలు కిడ్నాప్‌కి గురైందని తెలుసుకొన్న క్రాంతి మలేషియా వెళ్లి ఆ కిడ్నాప్ ముఠాని ఎలా అంతమొందించాడు? అన్నది మిగతా కథ.
కమర్షియల్ ఫార్ములాకి కావల్సిన అన్ని హంగులూ ఈ చిత్రంలో ఉన్నాయి. కాకపోతే - ఈనాటి పరిస్థితులకు అతకదు. కొన్నాళ్ల క్రితం నుంచీ హుందా అయిన పాత్రల్లో కనిపిస్తున్న శ్రీకాంత్‌ని మళ్లీ హీరోగా చూట్టానికి ప్రేక్షకుడు కొద్దిగా ఇబ్బంది పడతాడు. అదీగాక - కామ్న జెఠ్మలానీ పక్కన. ‘కెమిస్ట్రీ’ కుదరలేదని సింపుల్‌గా రాసేద్దాం. కమర్షియల్ సినిమా కాబట్టి కమర్షియల్ ‘లుక్’తోనే చూశామంటే మాత్రం లాజిక్‌కి కూడా దొరకకుండా సినిమా వేగంగా నడిచేస్తుంది. సినిమా అంతా ఒక పద్ధతి ప్రకారం - ఈక్వేషన్ ప్రకారం వెళ్లిపోతుంది. ఫస్ట్‌హాఫ్‌ని కామెడీతో నడిపించేశారు. ప్రీ క్లైమాక్స్‌కి వచ్చేప్పటికి అమ్మాయిల అమ్మకం - కానె్సప్ట్‌లో కొద్దిగా సెంటిమెంట్‌నీ... ఎమోషన్‌నీ కలిపి ఫర్వాలేదనిపించారు. సెకండ్ హాఫ్ యాక్షన్‌తో ముగుస్తుంది.
కథలో ఉన్నది కొద్ది విషయమే. ఇటువంటి సాదాసీదా కథకి ‘సైడ్ ట్రాక్’ రీళ్లని కలిపినట్టు కామెడీని జోడించారు. కొన్ని సీన్లయితే ఎందుకు వస్తాయో? ఎందుకు వెళ్తాయో తెలీదు. కథని మలేషియా పంపిన తర్వాత - ప్రేక్షకుడు కూడా ఏదీ ఆలోచించే స్థితిలో ఉండడు. ఇక్కడ ‘సెన్సార్ కట్’ (?) పోస్టర్‌లో ‘కామ్న’ మధ్యప్రదేశ్ చూసి వచ్చి ఉంటే- మాత్రం సింపుల్‌గా కథకి బలై పోతారు. పోనిద్దాం. శ్రీకాంత్ ఉన్నాడు కదా! అనుకుంటే - సినిమా అంతా తన భుజస్కంధాలపైనే లాక్కొచ్చాడు.
శ్రీకాంత్ డైలాగ్ డెలివరీ కానీ.. యాక్షన్ సన్నివేశాలు కానీ ప్రేక్షకుల్ని కట్టిపడేస్తాయి. వాటి కోసం మాత్రం వెళ్లొచ్చు. ఐతే ఈ సాగతీత కథని రెండున్నర గంటలపాటు భరించాలంటే - తలనొప్పి మాత్రలు తెచ్చుకోవాలి.
శ్రీకాంత్ వైపు మాత్రమే చూస్తే- సినిమా తెగ నచ్చేస్తుంది. అదొక్కటే భరోసా. ఐతే - విసుగు పుట్టించే సన్నివేశాలు.. కమర్షియల్ ఫార్మేట్ మరీ ఎక్కువై.. అనవసరమైన సన్నివేశాల హోరు.. ముందు చూసిన సన్నివేశానికీ.. తర్వాత వచ్చే సన్నివేశానికీ పొంతన లేకపోవటం - చక్రి సంగీతం బాగున్నప్పటికీ - పాటల్ని ఎక్కడబడితే అక్కడ ఇరికించటం -ఎడిటింగ్ శాఖ ఉన్నది కట్ చేయటానికే కాదు.. కథని అర్థవంతంగా తయారు చేయటానికి కూడా మరి.. దర్శకత్వంలో మెరుపులేం లేవు. మాటలు అక్కడక్కడ పేలాయి.. ఇలా మాట్లాడుకుంటే - వీడికి దూకుడెక్కువే అనిపిస్తుంది.

-ప్రనీల్