Others

డైరెక్టర్స్ ఛాయిస్..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎవరూ చేయక
నేనే దర్శకత్వం చేశా

-రామ్మోహన్

నానీని హీరోగా పరిచయం చేస్తూ అష్టాచమ్మా చిత్రాన్ని నిర్మించాడు రామ్మోహన్. తరువాత ఉయ్యాల జంపాల నిర్మించిన ఆయన దర్శకుడిగా మారి నిర్మించిన చిత్రం ‘తను నేను’. సంతోష్ శోభన్, అవికాగోర్ జంటగా నటించిన సినిమా ఇటీవలే
విడుదలైంది. రామ్మోహన్‌తో చిట్‌చాట్..

డైరెక్టర్‌గా మారడానికి కారణం?
నిజానికి ఈ కథ వేరే కుర్రాడిది. అతను కథ చెప్పినపుడు నచ్చడంతో సినిమా చేయాలనుకున్నాను. వేరే దర్శకులతో చేయాలని చాలామందిని కలిశాను. కానీ ఎవరూ చేయక నేనే చేయాల్సి వచ్చింది.
సినిమాలోకి ఎంట్రీ ఎలా?
నేను ఎంబిఏ చేసి బిజినెస్ చేసేవాణ్ణి. ఆ సమయంలో సురేష్‌బాబుతో పరిచయం అవ్వడం, ఆయన మా స్టూడియో కోసం హెల్ప్ చేయొచ్చు కదా అని పిలవడంతో పరిశ్రమలోకి వచ్చా.
మొదటి సినిమా ఎలా సెట్ అయింది?
సినిమాకు సంబంధించిన మెలకువలను సురేష్‌బాబు దగ్గర నేర్చుకున్నాను. 2008లో సినిమా చేయాలనుకున్నపుడు మోహన్‌కృష్ణ చెప్పిన కథ నచ్చడంతో నానీని హీరోగా పరిచయం చేస్తూ అష్టాచమ్మ చిత్రాన్ని చేశా. తరువాత గోల్కొండ హైస్కూల్, ఉయ్యాల జంపాల సినిమాలు వచ్చాయి.
కొత్త హీరోలను పరిచయం చేయడం?
అది అనుకోకుండా చేశాం. కథ ప్రకారం కొత్తవారైతేనే బాగుంటుందని అష్టాచమ్మ సినిమాకు నానీని, అలాగే ఉయ్యాల జంపాలతో రాజ్‌తరుణ్‌ని పరిచయం చేశాం. ‘తను నేను’ సినిమాతో దర్శకుడు శోభన్ తనయుడిని పరిచయం చేశాం.
సోగ్గాడే చిన్నినాయన
కథ కూడా మీదేనట?
ఔను. ఈ కథను కల్యాణకృష్ణ చెబితే నేనే డెవలప్ చేసి ఇచ్చా.
నెక్ట్స్ ప్రాజెక్ట్స్
విశ్వదేవ్ అనే కొత్త హీరోతో పిట్టగోడ నిర్మిస్తున్నాను. ఇకపై నిర్మాతగానే కొనసాగుతా.

-శ్రీ