Others

ప్యాకేజీలే పరమావధి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గతంలో సినిమా దర్శకుడిని -కెప్టెన్ ఆఫ్ ది షిప్‌తో పోల్చేవారు. నౌకలు నెలల తరబడి సముద్రంలో ప్రయాణం చేస్తాయి. నౌకలో ప్రయాణిస్తున్న వందలాది ప్రయాణికులు, వేలాది టన్నుల సరుకుని సురక్షితంగా తీసుకెళ్లాల్సిన బాధ్యత కెప్టెన్‌దే. అదేవిధంగా ఒక సినిమా నిర్మాణం పూర్తకావాలంటే మొత్తం 24 విభాగాలకు చెందినవారు సమన్వయంతో పనిచేయాలి. వీరందరూ సమష్టిగా పనిచేయడం వల్లనే చిత్ర నిర్మాణం పూర్తవుతుంది. వీరందరికీ మధ్య సమన్వయం కుదర్చాల్సిన బాధ్యత చిత్ర దర్శకుడిదే. అంతేకాకుండా, 24 విభాగాలపై ప్రాథమిక విషయ పరిజ్ఞానాన్ని దర్శకుడు కలిగి ఉండాలి. అందువల్లే -దర్శకుడికి కెప్టెన్ ఆఫ్ ది షిప్ హోదా ఆపాదించారు.
అయితే దురదృష్టవశాత్తూ నేడు దర్శకుడంటే ఒక ఈవెంట్ మేనేజర్‌గా మారిపోయాడు. ఎటువంటి కార్యక్రమమైనా ఈవెంట్ మేనేజర్‌కు అప్పగించి, తగినంత డబ్బు చెల్లిస్తే చాలు. వాళ్లే సదరు కార్యక్రమానికి అవసరమైన అన్ని ఏర్పాట్టూ చేస్తారు. మనం కేవలం గెస్ట్‌లు మాదిరిగా వెళ్తే చాలు. కార్యక్రమం ఎటువంటి ఆటంకంలేకుండా బ్రహ్మాండంగా జరిగిపోతుంది. అందువల్లే, ఈమధ్య కాలంలో ఈవెంట్ మేనేజర్లకు డిమాండ్ పెరిగింది. ఈవెంట్ మేనేజర్లు కార్యక్రమాన్ని బట్టి ప్యాకేజీలు నిర్ణయిస్తారు. ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలోనూ ఇటువంటి ప్యాకేజీల సంస్కృతి పెరిగిపోతోంది.
గతంలో చిత్ర నిర్మాణంలో నిర్మాతలదే కీలక భూమిక. చిత్ర నిర్మాణానికి సంబంధించిన అన్ని వ్యవహారాలూ వారే దగ్గరుండి చూసుకొనేవారు. అయితే మారుతున్న పరిస్థితులతోపాటు, సినీ పరిశ్రమలో నిర్మాతల పాత్ర తగ్గిపోతూ వస్తోంది. నిర్మాత అంటే చిత్ర నిర్మాణానికి అవసరమైన డబ్బు సమకూర్చేవాడు మాత్రమేనన్న భావన పరిశ్రమలో పెరిగిపోయింది. తుళుకులీనే ఆకర్షణలతో మాయకు గురిచేసే చిత్రపరిశ్రమకు -రియల్ ఎస్టేట్ తదితర వ్యాపారాల్లో కోట్లాది రూపాయలు గడించిన పలువురు నిర్మాతలుగా వస్తున్నారు. వీరిలో పలువురు తమ కుమారులనే హీరోలుగా పెట్టి చిత్ర నిర్మాణం చేస్తున్నారు. సినిమా ప్రేక్షకాదరణ పొందితే డబ్బులు వస్తాయి. తమ వారసుడు సినిమా హీరోగా కొనసాగుతాడు. సినిమా ఫ్లాప్ అయితే సమాజంలో నిర్మాతగా తనకు, సినిమా హీరోగా కుమారుడికి గుర్తింపు. ఈ భావన పలువురిలో పెరిగిపోయింది. దీంతో పలువురు దర్శకులు నిర్మాతలతో ప్యాకేజీలను మాట్లాడుకొంటున్నారు. నిర్మాత తాను ఒప్పుకొన్న ప్యాకేజీ ప్రకారం దర్శకుడికి డబ్బు చెల్లిస్తారు. సినిమాకు సంబంధించిన సాంకేతిక నిపుణులు ఎంపిక, వారికి పారితోషికాలు ఇవ్వడం, వారిచేత పని చేయించుకోవడం మొత్తం దర్శకుడిదే బాధ్యత. దీంతో దర్శకుడు చిత్ర నిర్మాణంపై పూర్తిస్థాయిలో తన దృష్టిని కేంద్రీకరించలేక పోతున్నారు. కొందరు దర్శకులు గతంలో నాటక సమాజ నిర్వాహకుల మాదిరిగా అసిస్టెంట్ డైరెక్టర్లు, కథా, మాటల రచయితలను సినిమా నిర్మాణంతో సంబంధం లేకుండా నెలవారీగా జీతాలిచ్చి తమను వదలి వెళ్ళకుండా జాగ్రత్తలు పడుతున్నారు.
గతంలో సినిమా కథ, మాటలను ఒక్కొక్కరు రాసేవారు. కొన్ని సందర్భాల్లో సమయానుకూలంగా హీరో సూచనల మేరకు కొన్ని డైలాగ్‌లు మార్చేవారు. అయితే, ప్రస్తుతం పలు సినిమాల కథలను ఎంతమంది రాస్తున్నారో అర్థంకాని పరిస్థితి. సినిమా కథకుడి పేరు కొన్ని చిత్రాల్లో కనిపించకపోవడమే ఇందుకు నిదర్శనం. ఇక మాటల విషయానికి వస్తే సెంటిమెంట్ సీన్లు ఒకరు వ్రాస్తే, కామెడీ సీన్లు మరొకరు రాస్తున్నారు. మొత్తానికి సినిమా కథ, మాటలను కిచిడి మాదిరిగా పలువురు వండి వార్చుతున్నారు. అందువల్లనే పలు సినిమాల్లో సినిమా కథకు, కామెడీ సీన్లకు మధ్య సంబంధం ఉండటం లేదు.
ప్యాకేజీ ప్రకారం, చిత్ర నిర్మాణాన్ని దర్శకులు పూర్తి చేస్తున్నారు. సినిమా విజయవంతమైతే నా గొప్ప, పరాజయం పాలైతే నిర్మాత ఖర్మ అన్న చందాన ఈవెంట్ మేనేజర్లుగా మారిన పలువురు దర్శకులు వ్యవహరిస్తున్నారు. సినిమా అనేది ఫక్తు వ్యాపారమే. అందులో ఎవరికీ సందేహం లేదు. అయితే ఇతర వ్యాపారాలకు, సినిమా వ్యాపారానికి మధ్య నక్కకూ నాగలోకానికీ మధ్య ఉన్నంత తేడా ఉంది. మిగిలిన వ్యాపారాల్లో నష్టం వస్తే, పెట్టుబడిలో కొంత మొత్తమైతే చేతికొస్తుంది. పెట్టుబడి మొత్తం నష్టపోవడం చాలా అరుదుగా జరుగుతుంది. అయితే, సినిమా వ్యాపారం మాత్రం అందుకు పూర్తిగా భిన్నం. సినిమా ప్లాప్ అయితే పెట్టిన పెట్టుబడిలో పైసా తిరిగి రాకపోగా, మరింతగా ఎదురుపెట్టుబడి పెట్టాల్సి వస్తుంది. అందువలన, సినిమా నిర్మాతగా గుర్తింపు పొందాలి లేదా తమ కుమారుడిని వెండితెర మీద హీరోగా చూసుకోవాలి అన్న కోరిక ఉన్నవారు దర్శకులతో ప్యాకేజీలు మాట్లాడుకొని, చిత్ర నిర్మాణం ప్రారంభిస్తున్నారు. దీంతో దర్శకుడు చిత్ర నిర్మాణంకన్నా, చిత్ర నిర్మాణ వ్యయం ఏవిధంగా తగ్గించాలి అన్న అంశంపైనే ఎక్కువగా దృష్టిని కేంద్రీకరిస్తున్నారు. చిత్ర నిర్మాణ వ్యయం ఎంత తగ్గితే, దర్శకుడికి అంత ఎక్కువ డబ్బు మిగులుతుంది. తెలుగు చిత్ర పరిశ్రమలో పెరుగుతున్న ఇటువంటి విపరీత ధోరణులు చివరికి పరిశ్రమను ఏదిశకు నడిపిస్తాయో వేచి చూడాల్సిందే.

- పి.మస్తాన్‌రావు