Others

కొత్తవారికి ప్రోత్సాహం కష్టం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డైరెక్టర్స్ ఛాయిస్..

- త్రికరణ్ రెడ్డి
సినిమామీద తలంపు పుడితే -మరో రంగంలో స్థిమితంగా ఉండలేం. అలాంటిది అమెరికాలో సినిమా వ్యాపార సంస్థలో ఉద్యోగం చేస్తున్న కుర్రాడికి నిర్మాణంపై ఆసక్తి పెరిగింది. అంతే.. అన్నపూర్ణ స్టూడియోస్ ఫిలిం స్కూల్‌లో సినిమా విద్య అభ్యసించి, దర్శకుడి అవతారం ఎత్తాడు. ఆ కుర్రాడే -త్రికరణ్ రెడ్డి. తన బ్యాచ్‌మేట్స్‌తో కలిసి ‘చిరుగొడవలు’ పుట్టించాడు. ఫస్ట్ ఎక్స్‌పీరియన్స్‌పై త్రికరణ్ రెడ్డితో చిట్‌చాట్..

మీ గురించి?
మాది హైదరాబాద్. పదిహేనేళ్ల క్రితమే అమెరికా వెళ్ళాను. అక్కడ జాబు చేశాను. సినిమాలంటే ఆసక్తితో వచ్చేసి అన్నపూర్ణ ఫిలిం స్కూల్‌లో చేరాను.
సినిమా ఎలా తీశారు?
నిజానికి సినిమాను మొదట ట్రైల్స్‌కోసం తీయాలనుకున్నాం. కొత్త నటీ నటులకోసం చాలారోజులు వెయిట్ చేయాల్సి వచ్చింది. మా బ్యాచ్‌లోని 11మందితో కలిసి సినిమా తీశాం. ఇందులో అన్నిరకాల టెక్నీషియన్లు ఉన్నారు.
చిరు గొడవలంటే?
ఇది ఇంటర్మీడియట్ ఏజ్ గ్రూప్‌లోని నాలుగు జంటల కథ. నేటి యువత, వారి ప్రేమవ్యవహారాలపై సాఫ్ట్ డిస్కషన్.
మొదటి సినిమా అనుభవం?
నిజానికి పరిశ్రమలో సినిమా తీయడం బాగానే ఉంటుంది. కాని దాన్ని మార్కెట్ చేసుకోవడమే కష్టం. పైగా కొత్తవారికి అంత త్వరగా ప్రోత్సాహం ఉండదు. ఈ సినిమా విడుదల విషయంలో చాలా కష్టాలు పడాల్సి వచ్చింది.
మరి నెక్స్ట్ ప్రాజెక్టు?
తీయాలనే ఉంది. కానీ, కొంచెం టైం పడుతుందేమో. చూడాలి.

-శ్రీ