జాతీయ వార్తలు

బిహార్‌లో ఓడినందుకే మెట్టు దిగారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సోనియా, మన్మోహన్‌తో చర్చలు జరిపిన ప్రధాని మోదీపై దిగ్విజయ్ వ్యాఖ్య

భోపాల్, నవంబర్ 28: బిహార్ శాసనసభ ఎన్నికల్లో బిజెపి ఘోర పరాజయం పాలవడం వల్లనే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వస్తు, సేవల పన్ను (జిఎస్‌టి) బిల్లుపై మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీతో చర్చల ప్రక్రియను ప్రారంభించారని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్ వ్యఖ్యానించారు. శనివారం ఆయన భోపాల్‌లోని తన నివాసంలో విలేఖర్లతో మాట్లాడుతూ, బిహార్ ఎన్నికల్లో బిజెపిని మట్టికరిపించి నరేంద్ర మోదీని ఆకాశం నుంచి భూమీదికి దించిన ఆ రాష్ట్ర ప్రజలు ఎంతో అభినందనీయులని ప్రశంసించారు. ‘బిహార్‌లో బిజెపికి ఓటమి ఎదురవడం వల్లనే మోదీ జిఎస్‌టి బిల్లుపై సోనియా, మన్మోహన్‌తో చర్చలకు శ్రీకారం చుట్టారు. లేకపోతే దేశాన్ని మెజార్టీతో కాకుండా ఏకాభిప్రాయంతో ముందుకు నడపాలని ఆయన చెప్పేవారు కాదు. ఇదంతా బిహార్ ప్రజలతో పాటు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్, రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్‌జెడి) అధినేత లాలూ ప్రసాద్ యాదవ్, సోనియా గాంధీల వల్లనే సాధ్యమైంది’ అని దిగ్విజయ్ సింగ్ అన్నారు.
ఇంతకాలం ఎందుకు నిరీక్షించారు
ప్రతిపక్ష నాయకులతో సమావేశమయ్యేందుకు మోదీ 18 నెలల సుదీర్ఘ కాలం పాటు ఎందుకు వేచి ఉన్నారని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ టీమ్‌లోని కీలక సభ్యుడైన కౌశల్ కె.విద్యార్థి ప్రశ్నించారు. బిహార్ ఎన్నికల్లో బిజెపి ఓటమిపాలవడం, ఆర్థిక వ్యవస్థ మందగమనం వల్లనే మోదీ విపక్ష నేతలతో చర్చలు ప్రారంభించారని ధ్వజమెత్తారు.