నేనెప్పుడూ ట్యూన్స్ కాపీకొట్టలేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలుగుతోపాటు తమిళంలో కూడా రాకింగ్ సంగీతంతో సంగీతప్రియులను అలరిస్తూ దూసుకుపోతున్నాడు యువ సంగీత సంచలనం దేవిశ్రీప్రసాద్. తను చేసిన సినిమాల పాటలన్నీ మ్యూజికల్ హిట్లుగా నిలిచేందుకు తపనపడే దేవి, చేసిన కుమారి 21 ఎఫ్ చిత్రం ఇటీవలే విడుదలై మంచి టాక్‌తో రన్ అవుతున్న సందర్భంగా దేవిశ్రీప్రసాద్ చెప్పిన విశేషాలు..
కుమారి రెస్పాన్స్ ఎలా వుంది?
మొదటినుంచీ ఈ సినిమాపై మంచి నమ్మకంతో వున్నాం. సుకుమార్, రత్నవేలు, నేను ఇలా ముగ్గురం కలిసి ఎంతో ఇష్టంతో చేసిన సినిమాకి ఇంత మంచి రెస్పాన్స్ రావడం ఆనందంగా ఉంది. ముఖ్యంగా మేము అనుకున్నట్టుగానే మంచి హిట్ అవడంతో మా నమ్మకం మరింత పెరిగింది.
కుమారిలో మిమ్మల్ని
బాగా ఆకట్టుకున్న అంశం?
నిజానికి కుమారి సినిమాకు సుకుమార్ అందించిన కథే హైలెట్. కథ వినగానే ఆయనెంత కొత్తగా ఆలోచిస్తాడో అర్థమైంది. ఇలాంటి ఒక బోల్డు కథ తెలుగు తెరపై రావడం, దానికి ప్రేక్షకులు కూడా ఆదరించడం విశేషమని చెప్పాలి. మంచి కథను చెప్పడానికి ఈ చిత్రంలోని పాటలు, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ బాగా హెల్ప్ అయిందని చెప్పాలి.
మీకు పర్సనల్‌గా
ఎలాంటి కాంప్లిమెంట్స్ వస్తున్నాయి?
ఈ సినిమాకు బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ విషయంలో చాలామంచి కాంప్లిమెంట్స్ వస్తున్నాయి. ఇటీవలే ఎన్టీఆర్ ఫోన్ చేసి అభినందించారు. ఆయన ఇచ్చిన ఉత్సాహం అంతా ఇంతా కాదు. ఆ తరువాత మహేష్, రవితేజ, బన్నీ ఇలా అందరూ ఫోన్ చేసి అభినందిస్తున్నారు. నిజానికి ఈ క్రెడిట్ సుకుమార్‌దే.
ఈ సినిమాలో ఓ పాటకు కొరియోగ్రఫి కూడా చేశారని తెలిసింది?
అదంతా అనుకోకుండా జరిగిపోయింది. ట్యూన్స్ డిజైన్ చేసినపుడే కొన్ని మూవ్‌మెంట్స్ కూడా చెప్పాము. అది సుకుమార్‌కు, రత్నవేలుకు నచ్చడంతో పూర్తి కొరియోగ్రఫి చేయించారు.
దర్శకుడు సూర్యప్రతాప్ గురించి?
సూర్యప్రతాప్ రూపొందించిన ఈ చిత్రం ప్రేమకథల్లో కొత్త కోణాన్ని చూపించాడు. ముఖ్యంగా క్లైమాక్స్ సన్నివేశాల్ని అద్భుతంగా తెరకెక్కించాడు. ఎక్కడా కూడా ఎమోషన్ మిస్ అవ్వలేదు.
హీరో హీరోయిన్ల గురించి?
నిజంగా వారిద్దరూ ఈ పాత్రలకు కరెక్టుగా సూట్ అయ్యారు. సినిమా చూస్తుంటే ఇది నిజంగానే జరుగుతుందేమో అనిపించేలా చక్కని నటన కనబరిచారు.
పెద్ద సినిమాకు పనిచేసిన
మీరు చిన్న సినిమాలకు చేయడం ఎలా వుంది?
నిజం చెప్పాలంటే చిన్న సినిమాలకు నేనిచ్చిన పాటలు పెద్దసినిమాలకంటే కూడా పాపులర్ అయ్యాయి. ఇక్కడ చిన్నా పెద్ద సినిమా కాకుండా కథ నచ్చితేనే చేస్తా.
కాపీ ట్యూన్స్ ఎక్కువయ్యాయని విన్పిస్తోంది, దీని గురించి?
నేనైతే ఇప్పటివరకూ కాపీ కొట్టలేదు. మనం సంగీతం నేర్చుకొని కాపీకొడుతున్నామంటే మనం చేసే పనికి అర్థమే లేదని నా ఫీలింగ్. ఎక్కడైనా ఒక స్వరం కలిస్తే కలవొచ్చుకానీ, నేనెప్పుడూ వేరే ట్యూన్‌ను తీసుకోలేదు. నా దృష్టిలో కాపీ కొట్టడం పెద్ద నేరం.
ప్రస్తుతం చేస్తున్న సినిమాలు?
పవన్‌కళ్యాణ్ ‘సర్దార్ గబ్బర్‌సింగ్’, ఎన్టీఆర్ ‘నాన్నకు ప్రేమతో’ సినిమాలకు మ్యూజిక్ అందిస్తున్నాను.
ఖచ్చితంగా ఈ రెండు చిత్రాలు మ్యూజికల్ హిట్‌గా నిలుస్తాయి. గబ్బర్‌సింగ్ పాటల విషయంలో పవన్ చాలా ఎగ్జైట్ అయ్యారు.

-శ్రీ