రాష్ట్రీయం

ప్రాజెక్టులపై వైకాపా విషప్రచారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జలవనరుల మంత్రి దేవినేని

హైదరాబాద్, డిసెంబర్ 21: ఆంధ్రప్రదేశ్‌లో ఐదేళ్లలో కరవు రహితంగా తీర్చిదిద్దుతామని, ప్రధాన ప్రాజెక్టులను ప్రాధాన్యత దృష్ట్యా పూర్తిచేస్తామని జలవనరుల మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు. నీరు-ప్రగతి అంశంపై సోమవారం నాడు శాసనసభలో జరిగిన సుదీర్ఘ చర్చ జరిగింది. ఆర్ధిక ఇబ్బందులతో ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నా ప్రాజెక్టుల పూర్తికి సిఎం కృషి చేస్తుంటే వైకాపా నేతలు మాత్రం అర్ధం లేని ఆరోపణలు చేస్తున్నారని, ప్రాజెక్టులు పూర్తికాకూడదనే విషప్రచారం చేస్తోందని ఆరోపించారు. గతంలో కాంగ్రెస్ పార్టీ నేతలు ప్రాజెక్టులను అడ్డంపెట్టుకుని ఇష్టారాజ్యంగా దోపిడీకి పాల్పడుతున్నారని పేర్కొన్నారు. జీవో-22, జీవో -63లను స్పష్టమైన మార్గదర్శకాలతో ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేయాలని జారీ చేశామని చెప్పారు. ప్రాజెక్టులను పూర్తి చేయడంలో రైతులు ఎంతో సహకరిస్తున్నారని, గతంలో భూములు ఇవ్వడానికి నిరాకరించిన వారు సైతం నేడు ముందుకు వచ్చి భూములను ఇచ్చేందుకు ఆసక్తి చూపుతున్నారని అన్నారు. ప్రాజెక్టుల విషయంలో కాంగ్రెస్ పార్టీ నిర్లక్ష్యం వహించిందని, నదుల అనుసంథానానికి సమగ్ర నివేదికలను తయారుచేస్తున్నామని అన్నారు.
అవసరమైన మేర విద్యుత్‌ను అందించి పంటలను కాపాడే బాధ్యత తీసుకున్నామని పేర్కొన్నారు. రాష్ట్రంలో భూగర్భ జలాల పెంపునకు ‘పంటసంజీవని’ పేరుతో కొత్త కార్యక్రమం చేపడుతున్నట్టు చెప్పారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో వ్యవసాయాభివృద్ధికి, భూగర్భ జలాల పెంపునకు, ప్రాజక్టుల పనితీరు, నిధుల విడుదల అంశంపై వివరణ ఇచ్చారు. ఎక్కడా పెండింగ్ బిల్లులు లేవని , ఎప్పటికపుడు కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లిస్తున్నామని చెప్పారు. ఐదు సంవత్సరాల్లో రాష్ట్రాన్ని కరవు రహితంగా తయారుచేయడం ప్రభుత్వ దార్శనీకంగా ఉందని అన్నారు.
చక్కటి నీటి సంరక్షణ ద్వారా పేదరికాన్ని నిర్మూలించి, ఆర్ధిక అసమతుల్యతను తగ్గించడమే లక్ష్యంగా ఉందని చెప్పారు. పేదరిక నిర్మూలన ప్రధాన లక్ష్యంగా వృద్ధి చోధకాలను బలోపేతం చేయడం కోసం ఏడు మిషన్లలో ఒకటైన ప్రాధమిక రంగం మిషన్ కింద నీటి సంరక్షణ మిషన్ ఏర్పాటు చేశామని చెప్పారు. కాల్వశ్రీనివాసులు, బి. రమణమూర్తి, డాక్టర్ నిమ్మల రామానాయుడు, ఎస్ వి ఎస్ ఎన్ వర్మ తదితర్లు మాట్లాడారు. ప్రభుత్వ చొరవను వారు హర్షించారు.