ఢిల్లీ కబుర్లు -కె.కైలాష్

రాహుల్ గాంధీ స్వయంకృతాపరాధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ నోటి దురుసుతనం, దుందుడుకు వ్యవహారం, ఒంటెద్దు పోకడ మూలంగా ప్రతిపక్షం ఐక్యత దెబ్బ తింటోంది. ఈ సంవత్సరాంతంలో జరుగనున్న నాలుగు రాష్ట్రాల శాసనసభల ఎన్నికలతోపాటు 2019లో జరిగే లోకసభ ఎన్నికల కోసం కూడా ప్రతిపక్షాల మధ్య సయోధ్య, సీట్ల సర్దుబాటు కుదిరే అవకాశాలు మృగ్యమవుతున్నాయి. నాలుగు రాష్ట్రాల్లో కలిసి పోటీ చేసేందుకు ప్రతిపక్షాల మధ్య జరిగిన చర్చలు ఇది వరకే విఫలమయ్యాయి. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే లోకసభ ఎన్నికల్లో బి.జె.పిని సమర్థంగా ఎదుర్కొనేందుకు ఏర్పాటు చేయాలనుకుంటున్న మహా కూటమి కూడా ఏర్పడకపోవచ్చు. శాసన సభలు, లోకసభ ఎన్నికల్లో ప్రతిపక్షాల మధ్య సీట్ల సర్దుబాటు జరగకపోతే లాభపడేది బి.జె.పినే. ప్రధానమంత్రి నరేంద్ర మోదీని మాట, మాటకు దొంగ అంటూ రాహుల్ గాంధీ చేస్తున్న దురుసు ఆరోపణలు ప్రతిపక్షాలతో పాటు స్వపక్షానికి చెందిన సీనియర్ నాయకులు సైతం ఆందోళన చెందుతున్నారు. రాఫెల్ నేపథ్యంలో నరేంద్ర మోదీపై హద్దులు లేని దాడి ప్రారంభించే ముందు రాహుల్ గాంధీ ప్రతిపక్షాలు ముఖ్యంగా మిత్రపక్షాలతో చర్చించి ఉంటే బాగుండేది. నరేంద్ర మోదీపై దాడి చేసేందుకు ప్రతిపక్షం సమిష్టి వ్యూహాన్ని అమలు చేస్తే బాగుండేది. సమిష్టి వ్యూహానికి విరుద్ధంగా రాహుల్ గాంధీ ఏకపక్ష వ్యూహాన్ని అమలు చేయటం, హద్దులు లేని ఆరోపణలు కురిపించటం ప్రతిపక్ష సమైక్యతను దెబ్బ తీసింది. ఫ్రాన్స్ నుండి రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలు వ్యవహారంలో కాంగ్రెస్, ముఖ్యంగా రాహుల్ గాంధీ అతివేగంతో ముందుకు సాగిపోవటం, ప్రధాని నరేంద్ర మోదీ, రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, ఆర్థిక శాఖ మంత్రి అరుణ్‌జైట్లి, బి.జె.పి అధ్యక్షుడు అమిత్ షాపై ప్రశ్నల వర్షం కురిపించటం కొంత వరకు కలిసి వచ్చింది. నరేంద్ర మోదీ కాపలాదారు (చౌకీదార్)గా వ్యవహరించకుండా దొంగగా మారిపోయాడు, దేశాన్ని దోచివేస్తున్నాడు, అతనొక దొంగ అంటూ రాహుల్ గాంధీ ఇటీవల చేసిన ఆరోపణలు ప్రతిపక్షాన్ని స్వయరక్షణలో పడవేశాయి. అందుకే నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు శరద్ పవార్ ప్రధాని నరేంద్ర మోదీని వెనకేసుకు వచ్చాడనే అనుమానం కలుగుతోంది. శరద్ పవార్ ఇటీవల ఒక మరాఠీ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో నరేంద్ర మోదీ రాఫెల్ యుద్ధ విమానాల ఒప్పందంలో అవినీతికి పాల్పడ్డారని భావించటం లేదన్నారు. నరేంద్రమోదీ నిష్టాగరిష్టతను ప్రశ్నించలేమంటూ శరద్ పవార్ చేసిన వ్యాఖ్యలు ప్రతిపక్షం ముఖ్యంగా కాంగ్రెస్‌ను స్వీయరక్షణలో పడవేశాయి. శరద్ పవార్ ఎంతో ఆలోచించిన తరువాతనే రాఫెల్ ఒప్పందంలో మోదీకి మద్దతు ఇచ్చి ఉంటారు. రాఫెల్ యుద్ధ విమానాలకు సంబంధించిన సాంకేతికపరమైన అంశాలను గోప్యంగా ఉంచటాన్ని కూడా సమర్థించటం ద్వారా శరద్ పవార్ రాహుల్ గాంధీ వాదనను పరోక్షంగా ఖండించారని చెప్పకతప్పదు. రాహుల్ గాంధీతోపాటు కాంగ్రెస్ సామాజిక మాధ్యమాల విభాగం అధ్యక్షురాలు స్పందన కూడా నరేంద్ర మోదీని దొంగ అంటూ సంబోధించటం కొందరు ప్రతిపక్షాలకు ఆగ్రహం తెప్పించింది. కాంగ్రెస్‌కు చెందిన జూనియర్ నాయకులు సైతం దుర్భాషలాడటం, తమ ఇష్టానుసారం ఆరోపణలు చేయటం, రాహుల్ గాంధీ వీరి వ్యవహారానికి అడ్డుకట్టవేయకపోవటం ప్రతిపక్షాలతో పాటు కాంగ్రెస్‌కు చెందిన సీనియర్ నాయకులకు సైతం రుచించటం లేదు. రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు వ్యవహారంపై రాహుల్ గాంధీ ఆయన అనుచర వర్గం మితిమీరి మాట్లాడుతున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. రాహుల్ గాంధీ రాఫెల్ కుంభకోణం పేరుతో ప్రతిపక్షంలోతిరుగులేని నాయకుడుగా ఎదిగిపోయేందుకు ప్రయత్నిస్తున్నాడనే భావన వ్యక్తమవుతోంది. రాహుల్ గాంధీ రాఫెల్ ఓప్పందం విషయంలో అనుసరిస్తున్న దుందుడుకు విధానం చివరకు బెడిసికొడుతుందనే భయాందోళన కూడా ప్రతిపక్షంలో వ్యక్తమవుతోంది. నరేంద్ర మోదీని దొంగ, దొంగ అని పలుమార్లు ఆరోపించినా, దూషించిన తరువాత రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలు నిలబడకపోతే దాని వలన ప్రతిపక్షం ప్రతిష్ట మరింత దిగజారే ప్రమాదం లేకపోలేదు. రాహుల్ గాంధీ జాతీయ వేదికలతోపాటు అంతర్జాతీయ వేదికలపై నరేంద్ర మోదీని దొంగ అంటూ ఆరోపించటం ప్రజలకు ముఖ్యంగా ఓటర్లకు నచ్చకపోవచ్చు. శరద్ పవార్ అభిప్రాయపడినట్లు నరేంద్ర మోదీ వ్యక్తిగతంగా ఆవినీతికి పాల్పడతానని ప్రజలు కూడా విశ్వసించటం లేదు. బి.జె.పి పరంగా ఏదైనా అవినీతి జరిగితే జరిగి ఉండవచ్చు కానీ నరేంద్ర మోదీ వ్యక్తిగతంగా అవినీతికి పాల్పడతాడని ప్రజలు భావించటం లేదు. గాంధీ కుటుంబానికి ఉన్న అవినీతి ముద్ర లాంటిది ఏ విధంగా కూడా నరేంద్ర మోదీకి పడలేదు. మోదీ జీవితం తెరిచిన పుస్తకం లాంటిది. దానిని ఎవరైనా చదువుకోవచ్చు. మోదీకి కుటుంబమంటూ ఏదీ లేదు, అతనికి తన తల్లితో కొంత సంబంధ బాంధవ్యాలు ఉన్నా, సోదరులు, ఇతర బంధువులతో ఎలాంటి సంబంధ బాంధవ్యాలు లేవనేది జగమెరిగిన సత్యం. నరేంద్ర మోదీ సోదరులు గుజరాత్‌లో చిన్న, చిన్న వ్యాపారాలు చేసుకుంటూ జీవిస్తున్నారు. ఒక సోదరుడు ఇటీవలనే అఖిల భారత రేషన్‌షాప్ డీలర్ల సంఘం అధ్యక్షుడుగా ఎంపికయ్యాడు. అతనొక రేషన్‌షాపు నడిస్తున్నాడు కాబట్టే సదరు సంఘానికి అధ్యక్షుడు కాగలిగాడు. నరేంద్ర మోదీ బంధువులతో పోలిస్తే గాంధీ కుటుంబం, వారి బంధువులు, ఇతర అధికార, ప్రతిపక్షం నాయకులు, వారి బంధువులు ఏ స్థాయిలో కోట్లకు పడగలెత్తారనేది విడిగా చెప్పనక్కర లేదు. ఈ నేపథ్యంలో నరేంద్ర మోదీని మాట, మాటకు దొంగ అనటం వలన రాహుల్ గాంధీ, ఆయన నాయకత్వంలోని కాంగ్రెస్‌కు నష్టమే తప్ప ఎలాంటి లాభం ఉండదు, రాజకీయంగా ఎలాంటి ప్రయోజనం కలుగదు. రాఫెల్ ఒప్పందంపై రాహుల్ గాంధీ చేస్తున్న ఆరోపణల వెనక విదేశీ హస్తం ఉన్నదంటూ రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన ఆరోపణల్లో నిజం లేకపోలేదు. రాఫెల్ యుద్ధ విమానాలు తయారు చేసే దస్సాల్ట్ సంస్థకు యుద్ధ విమానాల కాంట్రాక్టు లభించినందుకు ఆగ్రహంతో ఉన్న కొన్ని అంతర్జాతీయ ఆయుధ సంస్థలు కాంగ్రెస్ ద్వారా రాఫెల్‌పై యుద్ధం కొనసాగిస్తున్నాయన్నది ఆరోపణ. తమకు కాంట్రాక్టు లభించనందుకు ఆగ్రహంతో ఉన్న ఈ ఆయుధ వ్యాపారస్తులే కాంగ్రెస్ అధినాయకత్వాన్ని రెచ్చగొడుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. శరద్ పవార్ చెప్పినట్లు దేశ భద్రతకు సంబంధించిన అంశాల్లో అధికార, ప్రతిపక్షం నాయకులు ఎంతోబాధ్యతతో వ్యవహరించవలసి ఉంటుంది. దేశ భద్రతకు సంబంధించిన అంశాల్లో ప్రతిపక్షం అర్థరహిత ఆరోపణలు చేయటం వలన రాజకీయంగా ఎలాంటి ప్రయోజనం కలిగినా దేశ ప్రయోజనాలకు మాత్రం తీరని నష్టం కలుగుతుంది. శరద్ పవార్ అభిప్రాయపడినట్లు రాఫెల్ ఒప్పందంపై ప్రభుత్వం జె.పి.సిని ఏర్పాటు చేయటం ద్వారా ప్రతిపక్షానికి ఉన్న అనుమానాలను నివృత్తి చేయవలసిన బాధ్యత మోదీపై ఉన్నది. లోకసభ ఎన్నికలకు ముందు జె.పి.పి.ని ఏర్పాటు చేసేందుకు అధికారంలో ఉన్న ఏ పార్టీ ఒప్పుకోదు. లోకసభ ఎన్నికలు మరో ఆరేడు నెలల్లో జరుగవలసి ఉన్న తరుణంలో జె.పి.సిని ఏర్పాటు చేస్తే బి.జె.పితోపాటు నరేంద్ర మోదీ పరువు, ప్రతిష్ట దెబ్బ తింటుంది. ఈ నేపథ్యంలో రాఫెల్ యుద్ద విమానాల కొనుగోలు, మన దేశంలో రాఫెల్ యుద్ధ విమానాల తయారీకి సంబంధించిన కాంట్రాక్టును అనీల్ అంబానీ నాయకత్వంలోని రిలయన్స్ రక్షణ ఉత్పత్తుల సంస్థకు ఇవ్వటంపై నరేంద్ర మోదీ ఒక స్పష్టమైన ప్రకటన చేయటం మంచిది. రాఫెల్ వ్యవహారంపై ఒక స్పష్టమైన ప్రకటన చేయటం ద్వారా ప్రధాన మంత్రిగా తనపై ఉన్న గురుతర బాధ్యతలను నరేంద్ర మోదీ నిర్వహించటం మంచిది. రాఫెల్ యుద్ధవిమానాల తయారీ బాధ్యతను హిందుస్తాన్ ఏరోనాటికల్ లిమిటెడ్‌కు అప్పగించకుండా రిలయన్స్ లాంటి అనుభవం లేని సంస్థకు ఎందుకు ఇచ్చారనేది చెప్పటం మోదీ బాధ్యత. రిలయన్స్‌కు ఇవ్వాలన్నది దుస్సాల్ట్ సంస్థ స్వంత నిర్ణయమని చెప్పి తప్పించుకునేందుకు ప్రయత్నించటం విజ్ఞత అనిపించదు. రాఫెల్ ఒప్పందంపై నిర్మలా సీతారామన్, అరుణ్‌జైట్లి ఎన్ని వివరణలు ఇచ్చినంత మాత్రాన సరిపోదు. రాహుల్ గాంధీ తన బాణాలను నరేంద్ర మోదీపై ఎక్కుపెట్టారు. ఎంత లేదనుకున్నా రాహుల్ గాంధీ ప్రధాన జాతీయ ప్రతిపక్షమైన కాంగ్రెస్‌కు అధ్యక్షుడు. దీనికితోడు అతను మరీ దుందుడుకుగా వ్యవహరిస్తున్నాడు. రాహుల్ గాంధీ దుందుడుకు విధానం ప్రతిపక్షాలకు సైతం రుచించటం లేదు. ఈ నేపథ్యంలో నరేంద్రమోదీ రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు, రిలయన్స్ కాంట్రాక్టుపై ఒక స్పష్టమైన ప్రకటన చేయటం మంచిది. ఇలా చేయటం వలన నరేంద్ర మోదీ, బి.జె.పికి రాజకీయంగా కలిసి వస్తుంది తప్ప నష్టం ఉండదు.

-కె.కైలాష్ 98115 73262