ఢిల్లీ కబుర్లు -కె.కైలాష్

వోటుబ్యాంకే ముద్దు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బంగ్లాదేశీ చొరబాటుదారుల వల్ల దేశ సమగ్రతకు ముప్పు వాటిల్లుతుంటే రాజకీయ పార్టీలు మాత్రం ఓటు బ్యాంకు కోణంలోనే వ్యవహరిస్తున్నాయి. అస్సాంలో ‘జాతీయ పౌర రిజిష్టర్’ (ఎన్‌ఆర్‌సీ) వ్యవహారాన్ని అధికార, ప్రతిపక్షాలు తమ రాజకీయల ప్రయోజనాల కోసం ఉపయోగించుకోవడం సిగ్గుచేటు. ఎన్‌ఆర్‌సీ వ్యవహారం పార్లమెంటు వర్షాకాల సమావేశాలను కుదిపివేస్తోంది. కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం నలభై లక్షల మంది పౌరసత్వం రద్దు చేసి, అమానుషంగా వ్యవహరిస్తోందంటూ ప్రతిపక్షాలు పార్లమెంటును స్తంభింపజేశాయి. ప్రతి అంశాన్ని రాజకీయం చేసే పార్టీలు బంగ్లాదేశ్ చొరబాటుదారుల అంశంపై బాధ్యతతో వ్యవహరించాలి. ఇది దేశ భద్రత, సమగ్రతకు సంబంధించిన అంశం కాబట్టి రాజకీయం కంటే దేశ ప్రయోజనాలకు పెద్దపీట వేయాలి. అస్సాంలోని ప్రస్తుత పరిస్థితి యావత్ దేశాన్ని ప్రభావితం చేయబోతోంది.
బంగ్లా చొరబాటుదారుల సమస్య ప్రస్తుతానికి అస్సాం, ఈశాన్య రాష్ట్రాలతోపాటు పశ్చిమ బెంగాల్‌కే పరిమితమైనా కొన్ని సంవత్సరాల్లో ఈ సమస్య మొత్తం దేశాన్ని అతలాకుతలం చేస్తుంది. అస్సాంలో ఉన్న బంగ్లాదేశీ ముస్లిం చొరబాటుదారల విషయంలో కాంగ్రెస్ కొంత ఆచితూచి మాట్లాడుతున్నా, బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మాత్రం అత్యంత దూకుడుగా మాట్లాడుతున్నారు. ‘చొరబాటుదారులను వెనక్కి పంపేలా ఏ మాత్రం ప్రయత్నించినా దేశంలో రక్తపాతం జరుగుతుంది, పరిస్థితి అంతర్యుద్ధానికి దారి తీస్తుంది’ అంటూ ఆమె హద్దు మీరి మాట్లాడుతున్నారు. దేశ ప్రయోజనాలకు ప్రాధాన్యత ఇచ్చే ఏ నాయకుడు కూడా మమతలా మాట్లాడరు. ముస్లిం చొరబాటుదారులను ఆమె వెనకేసుకురావటంలో ఓటు బ్యాంకు రాజకీయం ఉంది. బెంగాల్‌లోని మాల్డా చుట్టూ ఉన్న రెండు,మూడు జిల్లాల్లో చొరబాటుదారుల జనాభా చాలా అధికంగా ఉంది. అస్సాంలోని చొరబాటుదారుల గురించి ప్రతికూలంగా మాట్లాడితే దాని ప్రభావం తమ రాష్ట్రంలోని ముస్లింపై పడి, తన పార్టీకి ఓట్లు రాకుండాపోతాయనేది మమతా బెనర్జీ భయం. చొరబాటుదారుల పట్ల ఆమెకు నిజంగా దయ, సానుభూతి ఉన్నాయని ఎవరైనా అనుకుంటే పప్పులోకాలేసినట్లే.
2019 లోక్‌సభ ఎన్నికల్లో మెజారిటీ సీట్లు గెలుచుకునేందుకు ఆమె ముస్లిం ఓటు బ్యాంకు రాజకీయం చేస్తోంది. ఆమె గతంలోనూ ఈ అంశంపైనే ఓటు బ్యాంకు రాజకీయం చేసింది. 2005లో వామపక్షాలు అధికారంలో ఉన్నప్పుడు ఆమె బంగ్లా చొరబాటుదారుల సమస్యను పెద్ద ఎత్తున ప్రస్తావించారు. వి చిత్రం ఏమిటంటే అప్పట్లో ఆమె చొరబాటుదారులకు వ్యతిరేకంగా పోరాటం చేశారు. ఇప్పటి మాదిరిగానే అప్పుడు కూడా బాధ్యతారహితంగానే వ్యవహరించారు. చొరబాటుదారుల మూలంగా దేశ సమగ్రతకు ముప్పు వాటిల్లుతున్నా కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ నాయకత్వంలోని యూపీఏ ప్రభుత్వం పట్టించుకోవటం లేదంటూ ఆమె అప్పటి లోక్‌సభ స్పీకర్ సోంనాథ్ చటర్జీపైకి సభలో పేపర్లు విసిరారు. అంతటితో ఆగకుండా తన లోక్‌సభ సభ్యత్వానికి రాజీనామా చేసి ప్రజల్లోకి వెళ్లారు. బెంగాల్‌లో విస్తృతంగా పర్యటించి, చొరబాటుదారుల వల్ల ఎదురవుతున్న శాంతిభద్రతల సమస్యను ప్రజలకు వివరించారు. మమత తన రాజకీయావసరాల కోసం 2005లో తాను చెప్పినదంతా ఇప్పుడు మరిచిపోయారు. బంగ్లా చొరబాటుదారులను దేశం నుండి గెంటివేసేందుకు ప్రయత్నిస్తే రక్తపాతం తప్పదని, అది దేశంలో అంతర్యుద్ధానికి దారితీస్తుందని ప్రజలను రెచ్చగొట్టేందుకు ఆమె ప్రయత్నించటం సమర్థనీయం కాదు. అధికారం తప్ప దేశ సమగ్రత గురించి ఆమెకు పట్టింపులేదా?
అస్సాంలో 27 జిల్లాలుండగా, వాటిలో తొమ్మిది జి ల్లాల్లో బంగ్లా ముస్లిం చొరబాటుదారులు ‘మెజారిటీ’ వర్గంగా ఆవిర్భవించారు. దుబ్రి, గోల్పానా, బర్పేటా, మోరీగావ్, దర్రంగ్, బోంగ్యాగావ్, కరీంగంజ్, హైలాఖంతీ, నౌగావ్, లఖ్మిపూర్, దేమాజీ, కర్బి ఆంగ్లాంగ్, చాచర్, కామ్‌రూప్ జిల్లాల్లో చొరబాట్ల వల్ల ముస్లింలు మెజారిటీలోకి వచ్చారు. వీరంతా ఓటర్ల జాబితాలో తమ పేర్లను నమోదు చేసుకోవటంతో శాసనసభకు, లోక్‌సభ సభకు ఎన్నికవుతున్నారు. అస్సాంలోకి వచ్చిన ముస్లిం చొరబాటుదారులు ఎంతమందనే అంశంపై ఇప్పటికీ స్పష్టత లేదు. ‘జాతీయ పౌర రిజిష్టర్’ ప్రకారం నలభై లక్షల మంది చొరబాటుదారులున్నారని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ సంఖ్య మరింత అధికంగా ఉన్నా ఆశ్చర్యపోనవసరం లేదు. జాతీయ పౌర రిజిష్టర్‌ను 1971 జనాభా లెక్కల ప్రకారం రూపొందించారు. 1951 జనాభా లెక్కల ప్రకారం చొరబాటుదారుల సంఖ్యను అంచనా వేస్తే గనుక- వీరి సంఖ్య కోటికి చేరినా ఆశ్చర్యపోకూడదు. 1997లో అప్పటి కేంద్ర హోం మంత్రి ఇంద్రజీత్ గుప్తా లోక్‌సభలో అడిగిన ఒక ప్రశ్నకు బదులిస్తూ- బంగ్లాదేశ్ నుండి వచ్చిన ముస్లిం చొరబాటుదారుల సంఖ్య దాదాపుకోటి ఉంటుందని ప్రకటించారు. ఇదే నిజమైతే గత ఇరవై సంవత్సరాల్లో వీరి సంఖ్య గణనీయంగా పెరిగే ఉంటుంది.
బంగ్లాదేశ్ చొరబాటుదారులు అస్సాం, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో స్థిర నివాసాలు ఏర్పాటు చేసున్నారు. వీరి సంతానాన్ని కూడా లెక్కలోకి తీసుకుంటే చొరబాటుదారుల సంఖ్య గణనీయంగా పెరిగి ఉంటుంది. స్థానికుల జనాభా పెరగటంతోపాటు ఈ మధ్యకాలంలో కొనసాగిన చొరబాట్ల మూలంగా అస్సాం జనాభా అనూహ్యంగా పెరిగింది. బంగ్లా ముస్లిం చొరబాటుదారుల వల్ల అస్సాం జనాభా 1951 నుండి సాలీనా 35 శాతం చొప్పున పెరుగుతోంది. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే మరో పది సంవత్సరాల్లో అస్సాంలో చొరబాటుదారులు అధికారాన్ని హస్తగతం చేసుకోవటంతోపాటు పార్లమెంటులోనూ పాగా వేస్తారు. చొరబాట్ల ఫలితంగా అస్సాంలో ఓటర్ల సంఖ్య యాభై శాతం పెరిగింది. చొరబాటుదారుల ప్రయోజనాల పరిరక్షణకు ఒక ప్రత్యేక రాజకీయ పార్టీ పుట్టుకురావటంతో పాటు లోక్‌సభలో వారికి ప్రాతినిధ్యం కూడా లభించింది. స్థానికులపై ఆధిపత్యం చెలాయించే స్థాయికి ముస్లిం చొరబాటుదారులు చేరుకోవటం వల్లనే 1951లో అస్సాంలో ఉద్యమం ప్రారంభమైంది.
రాజీవ్ గాంధీ ప్రధాన మంత్రిగా ఉన్న సమయంలో అస్సాం ఉద్యమం తారస్థాయికి చేరుకుంది. అస్సాం గణ సంగ్రామ పరిషత్ నాయకులతో రాజీవ్ కీలక ఒప్పందం చేసుకుని జాతీయ పౌర రిజిష్టర్ రూపకల్పనకు అంకురార్పణ చేశారు. ఆయన ఆ చారిత్రక ఒప్పందాన్ని చిత్తశుద్ధితో అమలు చేసి ఉంటే ఇప్పుడీ పరిస్థితి ఎదురై ఉండేది కాదు. అస్సాంలో చాలాకాలం అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ చొరబాటుదారులతో ఓటు బ్యాంకు రాజకీయం చేసి స్థానికులను మరిచిపోయింది. అందుకే సుప్రీం కోర్టు జోక్యం చేసుకుని జాతీయ పౌర రిజిష్టర్‌ను రూపొందించాలని ఆదేశం జారీ చేయవలసి వచ్చింది. ఈ రిజిష్టర్ రూపకల్పన తమ వల్లనే జరిగిందని కాంగ్రెస్ నాయకులు ఇప్పుడు చంకలు గుద్దుకుంటుంటే, తమ ప్రభుత్వం ధైర్యంగా వ్యవహరించింది గనుకనే రిజిష్టర్ వెలుగు చూసిందని భాజపా నాయకులు గొప్పలు చెప్పుకుంటున్నారు. ఏటా లక్షలాది మంది బంగ్లా చొరబాటుదారులు అస్సాంలోకి యథేచ్ఛగా వస్తూ ఉండటం వలన ఆ రాష్ట్రం రూపురేఖలు పూర్తిగా మారిపోతున్నాయి. ఈ సమస్యను అధిగమించని పక్షంలో- అస్సాం మరొక కశ్మీర్‌గా మారిపోవటం ఖాయం. ముస్లిం చొరబాటుదారుల వెనుక ఐఎస్‌ఐతోపాటు కొన్ని మతసంస్థల మద్దతు ఉందనే ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలో మన రాజకీయ నాయకులు బాధ్యతతో వ్యవహరించకపోతే చరిత్ర వీరిని ఎంత మాత్రం క్షమించదు.
*

-కె.కైలాష్ 98115 73262