ఢిల్లీ కబుర్లు -కె.కైలాష్

‘అధికరణల’ గ్రహణం వీడిన కశ్మీర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ జనజీవన స్రవంతిలో కలసిపోయి, కశ్మీర్ ప్రాంతం అభివృద్ధి బాటలో పయనించేందుకే ఆర్టికల్ 35ఏ, ఆర్టికల్ 370లను మోదీ ప్రభుత్వం రద్దు చేసింది. రాజ్యాంగంలోని ఈ రెండు అధికరణలను కొనసాగించినంత కాలం జమ్మూ కశ్మీర్ భారత్‌లో అంతర్భాగంగా కాకుండా పోతుందనేది కాదనలేని వాస్తవం. ప్రత్యేక ప్రతిపత్తి కొనసాగినంత కాలం కశ్మీర్ సమస్యకు పరిష్కారం అసాధ్యమని కూడా మోదీ ప్రభుత్వం భావించింది. దేశంలోని మిగతావారి కన్నా తాము ప్రత్యేకమనే భావన కశ్మీర్ ప్రజల్లో ఉన్నంత కాలం వారు జాతీయ స్రవంతిలో కలవలేరు.
మోదీ నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం కశ్మీర్‌కు సంబంధించిన రెండు ఆర్టికల్స్‌ను రద్దు చేస్తుందన్న ప్రచారం ఇటీవల ఊపుందుకొన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే జమ్మూ కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రులు ఒమర్ అబ్దుల్లా, మెహబూబా ముఫ్తీ సహా కొందరు నాయకులు రాష్ట్ర గవర్నర్ సత్యపాల్ మాలిక్‌ను కలిసి తమ ఆందోళన వ్యక్తం చేశారు. 2019 సార్వత్రిక ఎన్నికల సందర్భంగా భాజపా మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు ఆర్టికల్ 370, ఆర్టికల్ 35ఏలను కేంద్రం రద్దు చేయబోతోందా? అని కశ్మీర్ నేతలు గవర్నర్‌పై ప్రశ్నలు కురిపించారు. తనకున్న సమాచారం ప్రకారం అలాంటిదేదీ లేదంటూ గవర్నర్ వారి సందేహాలను నివృత్తి చేసేందుకు ప్రయత్నించారు. ఢిల్లీలోనూ ప్రతిపక్షాలు ఇదే అంశంపై ఆందోళన వ్యక్తం చేశాయి.
కశ్మీర్‌లోని ముస్లిం నేతలకు, విపక్ష నాయకులకు ముస్లింల హక్కులు మాత్రమే కనిపిస్తాయి తప్ప ఇతర ప్రాంతాల్లో తలదాచుకుంటున్న కశ్మీరీ పండిట్ల కష్టాలు కనిపించవు. వీరికోసం ఈ నేతలు ఎలాంటి ఉద్యమం చేపట్టరు. కశ్మీర్‌లోని ప్రాంతీయ పార్టీల నాయకులు తమ రాష్ట్రానికి సంబంధించి మోదీ ప్రభుత్వం ఏదో పెద్ద చర్య తీసుకోబోతోందనే అనుమానాలు వ్యక్తం చేయటం అర్థరహితం. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీని అమలు చేసే దిశగా మోదీ కఠిన నిర్ణయం తీసుకుంటారని ఈ నాయకులు మానసికంగా సిద్ధపడాలి. కొద్ది రోజులుగా శ్రీనగర్ లోయ, దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో భద్రతా దళాలను కేంద్రం భారీగా మోహరించింది. దాదాపు 35వేల మంది సైనికులతో అదనపు బలగాలను కశ్మీర్‌కు రప్పించడంతో కేం ద్రం కచ్చితంగా ఏదో చర్య తీసుకోబోందని ఎవరికైనా ఇట్టే అవగతమవుతుంది. ఉ గ్రవాదులు దాడి జరిపే ప్రమాదం ఉన్నట్లు నిఘా వర్గాలు తెలపడంతో అమర్‌నాథ్ యాత్రను కేంద్రం రద్దు చేసింది. యాత్రికులను, శ్రీనగర్‌లో చదువుతున్న ఇతర ప్రాంతాల విద్యార్థులను వెనక్కి పంపారు. శాంతిభద్రతలను కాపాడేందుకు పెద్ద ఎత్తున భద్రతా దళాలను మోహరించినట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఉగ్రవాదులు 2017లో అమర్‌నాథ్ యాత్రికులపై దాడి చేసి ఏడుగురిని బలితీసుకొన్న సంగతి తెలిసిందే. అలాంటి సంఘటనలు మళ్లీ జరగకూడదనే ముందస్తు చర్యలు తీసుకున్నట్టు గవర్నర్ తెలిపారు. కాగా, అమర్‌నాథ్ యాత్రికులపై ఉగ్రవాదులు దాడి జరపకుండా చూసేందుకు ఇంత పెద్దఎత్తున అదనపుభద్రతా దళాలను కశ్మీర్‌కు తరలించాల్సిన అవసరం లేదు. ఎప్పటిలాగే ఈ ఏడాది కూడా నలభై వేల మందితో యాత్రికులకు భద్రత కల్పించవచ్చు. ఈ నలభైవేల మందికి తోడు మరో నలభైవేల మంది సీఆర్‌పీఎఫ్ జవాన్లను మోహరించారు. ఈ పరిణామాలన్నీ కశ్మీర్‌పై మోదీ తీసుకోబోయే నిర్ణయాన్ని చెప్పకనే చెప్పాయి.
పదిహేను రోజుల క్రితం శ్రీనగర్‌లో ఒక సీనియర్ రైల్వే అధికారి తన సిబ్బందికి ఒక లేఖ రాశారు. కశ్మీర్ లోయలో అతి త్వరలో పెను మార్పులు జరుగనున్నందున నెలన్నర రోజులకు సరిపడా ఆహార పదార్థాలు, ఇతర వస్తువులను ఉద్యోగులు సమకూర్చి పెట్టుకోవాలన్నది ఆ లేఖ సారాంశం. ఈ లేఖ కశ్మీర్‌లో మోదీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి ముందస్తు సంకేతంగా నిలిచింది.
జమ్ము కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని ఇస్తున్న 35ఏ, 370 ఆర్టికల్స్‌ను రద్దు చేస్తామని ఎప్పటి నుంచో చెబుతున్న భాజపాకు ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో అనూహ్య మెజారిటీ లభించింది. దీంతో మోదీ ప్రభుత్వం తన హామీని నిలబెట్టుకునేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తుందనేది తెలిసిందే. ఎంతో వ్యూహాత్మకంగా అడుగులు వేసిన మో దీ ప్రభుత్వం సోమవారం నాడు రాజ్యసభలో ఈ మేరకు విజయం సాధించిం ది. రాజ్యసభలో ఓటింగ్‌కు ముందే జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్స్‌ను రద్దు చేస్తూ రాష్టప్రతి కోవింద్ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేశారు.
అలనాడు జవహర్‌లాల్ నెహ్రూ ప్రభుత్వం ఆర్టికల్ 370ని తాత్కాలిక ఏర్పాటుగా రాజ్యాంగంలో పొందుపరిస్తే, 35ఏ రాష్టప్రతి ఆదేశం ద్వారా అమలులోకి తెచ్చింది. నిజానికి ఈ రెండు ఆర్టికల్స్ వల్ల కశ్మీర్‌కు లాభం కంటే నష్టమే ఎక్కువ జరుగుతోంది. కశ్మీర్‌లో పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు ముందుకు రావటం లేదు. దీంతో యువతకు ఉపాధి అవకాశాలు పూర్తిగా మృగ్యమయ్యాయి. ఖాళీగా ఉంటున్న యువకులు ఇస్లామిక్ ఉగ్రవాదం వైపుఆసక్తి చూపుతున్నారు. పాకిస్తాన్ ప్రభుత్వం పెంచి ప్రోత్సహిస్తున్న ముస్లిం మతోన్మాద ఉగ్రవాద సంస్థలు నిరుద్యోగులైన కశ్మీర్ యువతకు గాలం వేస్తున్నాయి. కశ్మీర్‌ను జాతీయ స్రవంతిలో కలిపేస్తే రాష్ట్రం పారిశ్రామికీకరణ వైపు అడుగులు వేస్తుంది.
వ్యాపారం, వాణిజ్యం పెంచుకునేందుకు అవకాశం కలుగుతుంది. ఇతర రాష్ట్రాలతో సరిసమానంగా కశ్మీర్ ముందుకు సాగేందుకు వీలు కలుగుతుంది. ఇతర రాష్ట్రాలతో సమానమైనప్పుడే జమ్ము కశ్మీర్ సర్వతోముఖాభివృద్దికి అవసరమైన పరిస్థితులు నెలకొంటాయి. దేశ స్వాతంత్య్రానికి పూర్వం బ్రిటీష్ పాలకులు, వారి తాబేదారులు కశ్మీర్‌లో ఇతర ప్రాంతాల వారు భూములు కొనుగోలు చేయకుండా, అక్కడ స్థిరపడకుండా చట్టాలు చేశారు. కశ్మీర్ ప్రజలు దేశంలోని ఏ ప్రాంతంలోనైనా నివసించవచ్చు, ఆస్తిపాస్తులు కొనుగోలు చేయవచ్చు. కానీ భారతీయులు మాత్రం అలా చేయకూడదనడం సమర్థనీయం కాదు.
*

-కె.కైలాష్ 98115 73262