ఢిల్లీ కబుర్లు -కె.కైలాష్

ప్రతిపక్షాల వ్యూహం ఫలిస్తుందా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని అప్రతిష్టపాలు చేయటం ద్వారా రాజ్యాధికారం సాధించుకునేందుకు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, ఇతర ప్రతిపక్ష పార్టీల నాయకులు చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తాయా? లేక బెడిసికొడతాయా? ముఖ్యంగా రాహుల్ ప్రధాన మంత్రిని లక్ష్యంగా చేసుకుని భీకరదాడి కొనసాగిస్తున్నారు. ‘మోదీ దొంగ’ అంటూ అనునిత్యం ఆరోపణలు గుప్పిస్తున్నారు. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాహుల్ సహా ఇతర విపక్ష నేతలు రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందంలో అవినీతి జరిగిందంటూ విమర్శలు చేస్తున్నారు. పార్లమెంటు బడ్జెట్ సమావేశాలను ఇందుకు వేదికగా ప్రతిపక్షాలు బాగా ఉపయోగించుకున్నాయి.
రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు వ్యవహారంలో ప్రధాన మంత్రి కార్యాలయం (పీఎంవో) జోక్యం మంచిది కాదంటూ అప్పటి రక్షణ శాఖ కార్యదర్శి రాసిన ‘నోట్’ వెలుగులోకి రావడంతో మోదీపై రాహుల్ పదునైన విమర్శనాస్త్రాలు సంధించారు. ఇంతకాలం ‘చౌకీదార్ చోర్ హై’ అంటూ మోదీపై దాడి కొనసాగించిన రాహుల్ , ఇతర ప్రతిపక్ష నాయకులు ఇప్పుడు ప్రత్యక్ష దాడికి దిగారు. ప్రధాని మోదీ ‘చోర్ హై’ అంటూ బజారున పడ్డారు. ‘చౌకీదార్’ (కాపలాదారు) పదానికి బదులు ఏకంగా ‘ప్రధాన మంత్రి దొంగ అనే నినాదంతో వీరు ఇపుడు దుమ్మెత్తిపోస్తున్నారు. మోదీని రాజకీయంగా దెబ్బతీయటం ద్వారా భాజపా నాయకత్వంలోని ఎన్డీఏ కూటమిని మట్టికరిపించాలన్నది ప్రతిపక్షాల వ్యూహం. అందుకే విపక్ష నాయకులందరి దృష్టి కేవలం మోదీపైనే కేంద్రీకృతమైంది. వీరు అప్పుడప్పుడు భాజపా అధ్యక్షుడు అమిత్ షా, కొందరు కేంద్ర మంత్రులపై విమర్శలు గుప్పించినా- ప్రధాన దాడి మాత్రం మోదీపైనే. మోదీని ప్రజల్లో అప్రదిష్టపాలు చేసేందుకు రాహుల్ గాంధీ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఎన్‌సిపి అధినాయకుడు శరద్ పవార్ తదితర విపక్ష నాయకులు సర్వశక్తులనూ ఒడ్డుతున్నారు.
మొదట్లో ‘సూట్ బూట్ కీ సర్కార్’ (సూటూ బూటూ ప్రభుత్వం) అంటూ ఎన్‌డిఏ ప్రభుత్వంపై దాడికి రాహుల్ శ్రీకారం చుట్టారు. ఆ తరువాతి కాలంలో ఆయనతోపాటు ఇతర ప్రతిపక్ష నాయకులు సైతం మోదీపై దాడి చేసేందుకే దృష్టి సారించారు. రాహుల్, ఆయన వ్యూహకర్తలు ఒక పథకం ప్రకారం మోదీని టార్గెట్ చేస్తున్నారే తప్ప భాజపాపై గానీ, దాని అనుబంధ సంస్థలపై గానీ విమర్శణాస్త్రాలు సంధించంటం లేదు. మోదీని ఈసారి ఓడించకపోతే తమ మనుగడకే ప్రమాదం వస్తుందనేది రాహుల్ గాంధీ, చంద్రబాబు వంటి ఇతర నాయకులకు బాగా తెలుసు. వారు తమ లక్ష్యాన్ని సాధించగలరా? విపక్ష నాయకులు చేస్తున్న ప్రచారాన్ని దేశ ప్రజలు విశ్వసిస్తారా?
మోదీపై ప్రతిపక్షాలు ప్రధానంగా చేస్తున్న ఆరోపణ రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలులో భారీ కుంభకోణం జరిగిందని. ప్రముఖ పారిశ్రామికవేత్త అనిల్ అం బానీకి రాఫెల్ యుద్ధ విమానాలకు సంబంధించిన 30 వేల కోట్ల రూపాయల విలు వ చేసే కాంట్రాక్టును మోదీ ఇప్పించారని ప్రతిపక్షాలు కోడై కూస్తున్నాయి. మోదీ స్వయంగా జోక్యం చేసుకుని ఫ్రాన్స్ ప్రభుత్వాధినేతలతో మాట్లాడి అనిల్ అంబానీకి కాంట్రాక్టు ఇప్పించారని వారు ప్రధానంగా ఆరోపిస్తున్నారు. ఇంతకుమించి మరే ఆరోపణలను వారు మోదీపై చేయలేక పోతున్నారు.
యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందంలో మోదీ స్వయంగా ముడుపలు అందుకున్నట్టు గానీ, భాజపాకు నిధులను మళ్లించారని గానీ విపక్ష నాయకులు ఆరోపించటం లేదు. రక్షణ సామగ్రి ఉత్పత్తుల రంగంలో ఎలాంటి అనుభవం లేని అనిల్ ఆంబానికి చెందిన కొత్త సంస్థకు రాఫెల్ విమానాల కాంట్రాక్టును మోదీ ఇప్పించారని మాత్రమే ప్రతిపక్షాలు పదే పదే ఆరోపిస్తున్నాయి. బోఫోర్స్ తదితర కుంభకోణాల్లో అప్పటి ప్రధాన మంత్రి రాజీవ్ గాంధీ, కొందరు కాంగ్రెస్ నాయకులకు ముడుపులు ముట్టాయన్నది ప్రధాన ఆరోపణ అనేది అందరికి తెలిసిందే. రాఫెల్ కుంభకోణంలో మోదీకి ముడుపులు ముట్టాయనేది ఆరోపణ కాదు. అనిల్ అంబానీకి భారీ కాంట్రాక్టు ఇప్పించటంలో అవినీతి జరిగిందనేది ప్రతిపక్షాల ఆరోపణ. ఓటర్లు ఈ ఆరోపణలను నమ్ముతారా?
రాఫెల్ కుంభకోణం గురించి ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలు, మీడియా చేస్తున్న ప్రచారంతోపాటు మోదీ, రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్, ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ చేస్తున్న ఎదుడుదాడి, ఇస్తున్న వివరణలు కూడా ప్రజల దృష్టికి వెళుతున్నాయి. దేశంలో సగం మంది వోటర్లు గ్రామీణ ప్రాంతాలకు చెందినందున వారికి ఈ వివరాలు అంతగా తెలియవు. వారు ఇలాంటి విషయాలపై అంతగా ఆసక్తి చూపించరు. పట్టణ ప్రాంతాల్లో విద్యావంతులైన ప్రజలు ప్రభుత్వం, ప్రతిపక్షం పరస్పరం చేసుకొంటున్న ఆరోపణలు, ప్రత్యారోపణల గురించి తెలుసుకుంటారు. రాజకీయంగా చైతన్యవంతులైన వోటర్లు మాత్రమే రాఫెల్ కుంభకోణం గురించి వివరాలు తెలుసుకుని వాటిపై అవగాహన పెంచుకుంటారు. ఇలాంటి విషయాలను సగటు వోటర్లు పట్టించుకునే అవకాశం ఉండదు. మోదీ ప్రభుత్వం ఎంతోకొంత సమర్థంగా పని చేస్తోంది. మన్మోహన్ సింగ్ నేతృత్వంలో యూపీఏ ప్రభుత్వం పది సంవత్సరాల పాటు గందరగోళంలో నడిచినట్లు ఇపుడు మోదీ ప్రభుత్వం పని చేయటం లేదు. ఎన్‌డిఏ ప్రభుత్వం ఒక పద్ధతి ప్రకారం పని చేస్తోందా? సంక్షేమ పథకాలు లక్ష్యాన్ని చేరుతున్నాయా? లేదా? అనే పరిశీలన జనంలో ఎప్పటికప్పుడు జరిగిపోతోంది. మో దీ ప్రభుత్వం ఉజ్వల పథ కం కింద ఇంతవరకు ఆరు కోట్ల మంది మహిళలకు వంటగ్యాస్ కనెక్షన్లను ఇచ్చిం ది. లోక్‌సభ ఎన్నికల లోపు మరో ఎనిమిది లక్షల కనెక్షన్లను పంపిణీ చేయటం ద్వారా రాజకీయ లబ్ధి పొందేందుకు ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తోంది. స్వచ్ఛ భారత్ పథకం ద్వారా మరుగుదొడ్ల నిర్మాణం కోట్ల సంఖ్యలో కొనసాగుతోంది. ఉన్నత కులాల్లో ఆర్థికంగా వెనకబడిన వారికి విద్య, ప్రభుత్వ ఉద్యోగాల్లో పది శాతం రిజర్వేషన్లు, రైతులకు సాలీనా ఆరు వేల రూపాయల ఆర్థిక సహాయం వంటి పథకాలు రాఫెల్ రగడను నిలువరిస్తాయా?
తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు రైతుబంధు పథకం ద్వారా ఇటీవలి శాసనసభ ఎన్నికల్లో ఘన విజయం సాధించటం తెలిసిందే. రైతుబంధు పథకంతోపాటు పెన్షన్ పథకం, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, ఉచిత కంటివైద్య పరీక్షలు వంటి పథకాల ద్వారా నేరుగా ప్రజల వద్దకు వెళ్లారు. చెప్పింది చేసి చూపిస్తాననే విశ్వాసాన్ని ప్రజలకు కల్పించారు. మంత్రివర్గాన్ని ఏర్పాటు చేయకుండానే ప్రభుత్వాన్ని నెలల తరబడి నడిపించుకుపోతున్నా కేసీఆర్‌పై ప్రజలు అసంతృప్తిని వ్యక్తం చేయడం లేదు. నరేంద్ర మోదీ విషయంలో కూడా ఇలాంటి పరిణామమే చోటు చేసుకునే అవకాశం లేకపోలేదు. ప్రజాస్వామ్యం పేరుతో కుటుంబ పాలన కొనసాగించే రాహుల్ గాంధీ, చంద్రబాబు నాయుడు, మమతా బెనర్జీలు మోదీపై చేస్తున్న దాడి ఆశించిన ఫలితాలను ఇచ్చే సూచనలు కనిపించటం లేదు. తన తల్లితోపాటు ఇతర బంధువులందరినీ అధికార నివాసానికి దూరంగా పెట్టి కేవలం దేశాభివృద్ది దృష్టితో పని చేస్తున్న మోదీని సగటు ఓటరు ఓడిస్తాడని ఎలా ఊహించగలం?

- కె. కైలాష్, 9811573262