ఢిల్లీ కబుర్లు -కె.కైలాష్

‘రాఫెల్ రచ్చ’తో సభాపర్వం వృథా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజకీయ పార్టీలు నేడు ఓటుబ్యాంకు కోణంలో పార్లమెంటును బలి తీసుకుంటున్నాయి. కాంగ్రెస్, అన్నా డీఎంకే, డీఎంకే, తెలుగుదేశం సహా మరి కొన్ని ప్రతిపక్షాలు తమ స్వార్థ రాజకీయాల కోసం పార్లమెంటు సమావేశాలను స్తంభింపజేస్తూ ప్రజాస్వామ్య వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్నాయి. ప్రజా సంక్షేమం పేరుతో పార్టీ ప్రయోజనాలు, అధికారం కోసం పార్లమెంటును దుర్వినియోగం చేస్తున్నాయి. కాంగ్రెస్‌తో పాటు మరికొన్ని విపక్ష పార్టీలు అసాధ్యమైన, అసంబద్ధమైన అంశాలను పరిష్కరించాలనే డిమాండ్‌తో ఉభయ సభలను స్తంభింపజేస్తున్నాయి. ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీ రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు అంశంపై లోక్‌సభలో గందరగోళం సృష్టించింది. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలులో అవినీతి చోటుచేసుకున్నదంటూ ప్రభుత్వంపై పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తున్నారు. లోక్‌సభ ఎన్నికలకు ముందు ఈ అంశాన్ని దేశ ప్రజలకు భూతద్దంలో చూపించటం ద్వారా రాజకీయ ప్రయోజనం సాధించేందుకు ఆయన పెద్దఎత్తున ప్రయత్నించారు. దేశ భద్రత, సైనిక దళాలకు నష్టం కలుగుతుందనే విషయాలను సైతం పట్టించుకోకుండా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ‘రాఫెల్ ఒప్పందం’లో అవినీతికి పాల్పడ్డాడంటూ కేంద్ర ప్రభుత్వ ప్రతిష్టను దిగజార్చేందుకు రాహుల్ ప్రయత్నం చేస్తున్నారు.
ప్రధాని నరేంద్ర మోదీ గతంలో ఒకానొక సందర్భంగా తనను తాను ‘చౌకీదారు’ (కాపలాదారు)గా అభివర్ణించుకోటం తెలిసిందే. రాహుల్ గాంధీ మాత్రం పట్టువిడవకుండా ‘చౌకీదార్.. చోర్ హై’ (కాపలాదారే దొంగ ) అంటూ మోదీని అప్రతిష్టపాలు చేసేందుకు ప్రయత్నిస్తునే ఉన్నారు. ఏదోఒక వంకతో ప్రధాని మోదీని దొంగ అని సంబోధించటం ద్వారా ప్రజల దృష్టిలో చులకన చేసేందుకు రాహుల్ తపన పడుతున్నారు. రాఫెల్ వ్యవహారంలో మోదీ అవినీతికి పాల్పడ్డారనే అభిప్రాయం కలిగించేందుకు రాహుల్ చేయని ప్రయత్నం లేదు. అయితే ఆయన తన ప్రయత్నంలో విజయం సాధించిన సూచనలు కనిపించటం లేదు. రాఫెల్ ఆఫ్‌సెట్ ఒప్పందాన్ని రిలయన్స్ సంస్థ అధినేత అనిల్ అంబానీకి ఇప్పించటం ద్వారా ముప్పై వేల కోట్ల లాభం కలిగించారని రాహుల్ గాంధీ ప్రధాన మంత్రిపై దుమ్మెత్తిపోస్తున్నారు.
గతంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం రాఫెల్ యుద్ధ విమానాన్ని 560 కోట్ల రూపాయల చొప్పున కొనుగోలు చేసేందుకు ఒప్పందం కుదుర్చుకోగా, మోదీ ప్రతి విమానం ధరను 1,600 వందల కోట్లకు పెంచారంటూ ఆరోపిస్తున్నారు. 18కి బదులు 36 యుద్ధ విమానాలను ఫ్రాన్స్ నుండి కొనుగోలు చేయటంతోపాటు ఆఫ్‌సెట్ ఒప్పందాన్ని అనిల్ అంబానీకి ఇప్పించటం ద్వారా హిందుస్తాన్ ఏయిరోనాటిక్స్ సంస్థకు అన్యాయం చేశారని రాహుల్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాహుల్ సహా ఇతర ప్రతిపక్ష నాయకులు, యశ్వంత్ సిన్హా లాం టి భాజపా అసమ్మతి వాదు లు చేసిన ఆరోపణలను సుప్రీం కోర్టు కొట్టివేసింది. రాఫెల్ ఒప్పందంలో అవినీతి జరిగినట్లు తమకు ఎక్కడా కనిపించలేదంటూ తీర్పు ఇవ్వటం ద్వారా మోదీ ప్రభుత్వంపై వచ్చిన ఆరోపణలను ఉన్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. సుప్రీం కోర్టు ఇంత స్పష్టంగా తీర్పు ఇచ్చిన తరువాత కూడా రాహుల్ గాంధీ- రాఫెల్ ఒప్పందంలో అక్రమాలు జరిగాయని, చౌకీదార్ చోర్ హై, ముప్పైవేల కోట్ల ప్రజాధనాన్ని అనిల్ అంబానీ జేబులో పోశారంటూ ఆరోపణలు కురిపించారు.
రాహుల్ గాంధీ లోక్‌సభలో చేసిన ఈ ఆరోపణలకు ఆర్థికశాఖ మంత్రి అరుణ్ జైట్లీ సుదీర్ఘమైన వివరణ ఇచ్చారు. రాహుల్ చేసిన ఏ ఒక్క ఆరోపణలోనూ నిజం లేదని అంకెలతో ఆయన నిరూపించారు. రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కూడా లోక్‌సభలో రెండున్నర గంటల పాటు గుక్కతిప్పుకోకుండా సమాధానం ఇస్తూ రాహుల్ ఆరోపణలను చీల్చి చెండాడారు. రాఫెల్ యుద్ధ విమానం షెల్ ధర, ఆయుధాలతో కూడిన ధరలపై ఆమె ఇచ్చిన వివరణ రాహుల్ ఆరోపణలలోని డొల్లతనాన్ని ప్రజల ముందు పెట్టంది. యూపీఏ ప్రభుత్వం యుద్ధ విమానం ధరను 520 కోట్లుగా ఒప్పందం చేసుకున్నట్టు ఎక్కడా లేదని ఆమె ప్రకటించారు. యూపీఏ ప్రభుత్వం నిర్ణయించిన విమానం ధర 737 కోట్లు. దీంతో పోలిస్తే తమ ప్రభుత్వం తొమ్మిది శాతం తక్కువ ధర అంటే 672 కోట్లకు కొనుగోలు చేస్తోందని చెప్పటం ద్వారా రాహుల్ ఇంతకాలం చేస్తున్న ధరల బండారాన్ని ఆమె బహిర్గతం చేశారు. ఆయుధాలతో కూడిన రాఫెల్ యుద్ధ విమానం ధరను వెల్లడించేందుకు ఆమె నిరాకరించారు. ఆ వివరాలను బహిరంగ పరచడం అంటే దేశభద్రతకు ముప్పు తెచ్చినట్లేనని ఆమె స్పష్టం చేశారు.
అటల్ బిహారీ వాజపేయి ప్రధాన మంత్రిగా ఉన్నప్పుడు 2001లో యుద్ధ విమానాల కొనుగోలు ప్రతిపాదనను ప్రభుత్వం ఆమోదించింది. శత్రు దేశాలైన చైనా, పాకిస్తాన్‌లతో పోలిస్తే మన వద్ద అతి తక్కువ యుద్ధ విమానాలు, అందునా ఆధునిక యుద్ధ విమానాలు చాలా తక్కువగా ఉన్నాయి. వీటి సంఖ్యను వెంటనే పెంచుకోకపోతే దేశ భద్రత ప్రమాదంలో పడిపోతుందని రక్షణ శాఖ అధికారులు ఆందోళన వ్యక్తం చేయటంతో యుద్ధ విమానాల కొనుగోలు అనివార్యమైంది. అందుకే వాజపేయి యుద్ధ విమానాల కొనుగోలుకు ఆమోదం తెలిపారు. ఆయన తరువాత అధికారంలోకి వ చ్చిన యూపీఏ ప్రభుత్వం ఫ్రాన్స్‌కు చెందిన దస్సాల్ట్ సంస్థ నుండి యుద్ధ విమానాలను కొనుగోలు చేయాలనే నిర్ణయానికి వచ్చింది. 18 యుద్ధ విమానాలను ‘ఫ్లైఎవే’ అంటే యుద్ధానికి సిద్ధంగా ఉండే విమానలను కొనుగోలు చేసి మిగతా 126 యుద్ధ విమానాలను స్వదేశంలో తయారు చేయాలనే ఒప్పందానికి వచ్చినా అంతుపట్టని కారణాల మూలంగా పది సంవత్సరాల పాటు ఆ ఒప్పందాన్ని ఖరారు చేయలేకపోయింది. 2014లో నరేంద్ర మోదీ ప్రధాన మంత్రి పదవిని చేపట్టిన తరువాత యుద్ధ విమానాల కొనుగోలు వ్యవహారం ఊపందుకొంది.
మన వాయుసేన 2001లో యుద్ధ విమానాలు కావాలని కోరితే పధ్నాలుగు సంవత్సరాల తరువాత కూడా వాటిని కొనుగోలు చేయడం సాధ్యం కాలేదంటే- రక్షణరంగంలో మన బలం ఏ స్థాయిలో తగ్గిపోయిందో అంచనా వేసుకోవచ్చు. ఈ మధ్య కాలంలో శత్రుదేశాలతో యుద్ధం జరిగి ఉంటే ఏం జరిగేదనేది ఎవరైనా ఊహించుకోవచ్చు. వాయుసేన సామర్థ్యాన్ని యుద్ధ ప్రాతిపదికపైన పెంచేందుకు 38 యుద్ధ విమానాలను ఫ్లైఎవే స్థితిలో కొనుగోలు చేసి మిగతా 90 యుద్ధ విమానాలను మన దేశంలోనే ఉత్పత్తి చేయాలని మోదీ ప్రభుత్వం నిర్ణయించింది. రాహుల్ గాంధీ మాత్రం ఈ వివరాలేవీ పట్టించుకోకుండా రాఫెల్ ఒప్పందం అంశాన్ని రాజకీయం చేశారు. విమానం ధరలను వెల్లడించాలంటూ రాద్ధాంతం చేయటం వల్ల శత్రుదేశాలకు ప్రయోజనం కలుగుతుందనే అవగాహన కూడా లేకపోవడం శోచనీయం. హెచ్‌ఏఎల్ విషయంలో నిర్మలా సీతారామన్ ఇచ్చిన వివరణ కూడా సమర్థనీయమే. హెచ్‌ఏఎల్ విషయంలో కాంగ్రెస్ పార్టీ మొసలి కన్నీరు కార్చేబదులు దాని పటిష్టతపై దృష్టి పెడితే బాగుండేది. కాంగ్రెస్ సభ్యులు లోక్‌సభలో స్పీకర్ పోడియం వద్ద గొడవ చేస్తూ చిన్నపిల్లల మాదిరిగా పేపర్ విమానాలు చేసి విసిరివేయటం సిగ్గు చేటు. తమ పార్టీ సభ్యులను సోనియా గాంధీ వారిని వారించకపోవటం 120 సంవత్సరాల ఘన చరిత్ర ఉన్న కాంగ్రెస్‌కు పట్టిన దుర్గతికి అద్దం పడుతోంది.
లోక్‌సభలో ఐదురోజుల పాటు సస్పెండైన అన్నా డిఎంకే సభ్యులు వ్యవహరించిన తీరు గర్హనీయం. వారి వ్యవహారాన్ని ఎంత కఠిన పదజాలంతో విమర్శించినా తక్కువే. ఇద్దరు అన్నా డిఎంకే సభ్యులు సీట్లపైకి ఎక్కి గొడవ చేయటం, కాగితాలు చింపి గాలిలోకి ఎగురవేయటం ఎంత మాత్రం సమర్థనీయం కాదు. కర్నాటక ప్రభుత్వం కావేరీ నదిపై నిర్మిస్తున్న నీటిపారుదల ప్రాజెక్టును ఆపాలన్న వారి డిమాండ్‌ను కేంద్ర ప్రభుత్వం ఎలా తీర్చగలదు? రేపుకర్నాటక ఎంపీలు లోక్‌సభలో స్పీకర్ పోడియం వద్దకు వచ్చి తమిళనాడులో చేపట్టిన ఏదైనా పథకాన్ని ఆపేయాలంటూ వత్తిడి తెస్తే కేంద్రం ఆమోదించాలా? రాష్ట్రాలకు సంబంధించిన వ్యవహారాల్లో కేంద్రాన్ని జోక్యం చేసుకోమనటం రాజకీయం కాదా? ఇక తెలుగుదేశం ఎంపీలు ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ రోజూ గొడవ చేయటం ఎంతవరకూ సమంజసం? ప్రత్యేక హోదా ఇవ్వటం అనేది ఇప్పుడు మూసిన పుస్తకం లాంటిది. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ లోక్‌సభలో గొడవ చేయటం వెనక రాజకీయం తప్ప మరొకటి లేదు. రాజ్యసభ అధ్యక్షుడు, ఉప రాష్టప్రతి ఎం.వెంకయ్య నాయుడు చెప్పినట్లు- పార్లమెంటులో ఎంపీలు అనవసరంగా గొడవ చేయటం పట్ల దేశ ప్రజలు నవ్వుకుంటున్నారు. ప్రజల దృష్టిలో ఎంపీలు నవ్వుల పాలవుతున్నారని వెంకయ్య నెత్తీనోరూ బాదుకుని చెప్పినా మన రాజకీయ పార్టీలకు మాత్రం జ్ఞానోదయం కావటం లేదు.
*

-కె.కైలాష్ 98115 73262