జాతీయ వార్తలు

కాలుష్య నియంత్రణకు సరి-బేసి విధానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో వాహన కాలుష్యం పెరిగిపోతుండటంతో మళ్లీ వాహనాలకు సరి-బేసీ సంఖ్యా విధానాన్ని ప్రవేశపెట్టనున్నారు. ముఖ్యంగా శీతాకాలంలో నగరంలో ఏర్పడే వాహన కాలుష్య నియంత్రణకుగాను ఈ విధానాన్ని మళ్లీ ప్రవేశపెడుతున్నట్లు సీఎం కేజ్రీవాల్ తెలిపారు. గతంలో ఈ విధానాన్ని అమలు చేసిన విషయం విదితమే. ఒకరోజు సరి సంఖ్య నెంబర్ ప్లేట్ ఉన్న కార్లు, మరోరోజు బేసి సంఖ్య ఉన్న వాహనాలు రోడ్లపైకి రావాలనే నిబంధనను అమలుచేశారు. ఈ విధానాన్ని ఎన్టీటీ కోర్టు కూడా సమర్ధించటంతో పాటు అమలుచేయాలని ఆదేశాలు సైతం జారీ చేయటం జరిగింది. కాగా దీపావళి సమయంలో బాణసంచా కూడా పేల్చవద్దని సీఎం కేజ్రీవాల్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.