క్రీడాభూమి

ఢిల్లీలో ప్రో రెజ్లింగ్ ఫైనల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 23: ప్రో రెజ్లింగ్ లీగ్ (పిడబ్ల్యుఎల్) ఫైనల్ వచ్చేనెల 27న ఢిల్లీలో జరుగుతుంది. సెమీ ఫైనల్ మ్యాచ్‌లను 25, 26 తేదీల్లో అక్కడే నిర్వహించాలని నిర్ణయించారు. వివిధ నగరాల్లోని వౌలిక వసతులు, ఇతర అంశాలను పరిశీలించిన తర్వాత సెమీ ఫైనల్స్, పైనల్ మ్యాచ్‌లను ఢిల్లీలోనే నిర్వహించాలని తీర్మానించారు. న్యూఢిల్లీలోని కెడి జాధవ్ స్టేడియంలో డిసెంబర్ 10న పిడబ్ల్యుఎల్ ప్రారంభమవుతుంది. మరో రెండు రోజుల పాటు అక్కడే పోటీలు జరుగుతాయి. అనంతరం లూథియానాలో డిసెంబర్ 13 నుంచి 15 వరకూ పోటీలు ఉంటాయి. అక్కడి నుంచి పోటీలకు గుర్గావ్ వేదికవుతుంది. అక్కడ 16 నుంచి 18 వరకు పోటీలు ఉంటాయి. ఉత్తర ప్రదేశ్‌లోని నోయిడాలో డిసెంబర్ 19, 20 తేదీల్లో ఫైట్స్ జరుగుతాయి. 21, 22 తేదీల్లో ముంబయి, 23, 24 తేదీల్లో బెంగళూరు నగరాల్లో పోటీలను నిర్వహిస్తారు. డిసెంబర్ 25, 26 తేదీల్లో సెమీ ఫైనల్స్, 27న ఫైనల్ మ్యాచ్‌లకు న్యూఢిల్లీ ఆతిథ్యమిస్తుంది.