రాష్ట్రీయం

లింగ నిర్ధారణపై డేగకన్ను!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏపిలో అన్ని స్థాయిలలో అడ్వయిజరీ కమిటీలు

కాకినాడ, డిసెంబర్ 19: చట్టవిరుద్ధంగా గర్భస్థ శిశు లింగ నిర్ధారణ నిర్వహించే స్కానింగ్ కేంద్రాలపై ఇక కఠినంగా వ్యవహరించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఆడపిల్లల పట్ల వివక్షను నిర్మూలించాలన్న ధ్యేయంతో తీసుకువచ్చిన ఈ గర్భస్థ శిశు లింగ నిర్ధారణ చట్టాన్ని పటిష్టంగా అమలుచేసే దిశగా చర్యలు తీసుకుంటోంది. ఇందులోభాగంగానే ఈ చట్టాన్ని నిర్వీర్యం చేస్తున్న వారిపై కఠినంగా వ్యవహరించేందుకు అవసరమైన కఠిన చర్యలు తీసుకోవాలంటూ ఆయా జిల్లాల కలెక్టర్లను ప్రభుత్వం ఆదేశించింది. చట్టం అమలుకు రాష్ట్ర, జిల్లా, డివిజన్ స్థాయిల్లో మల్టీమెంబర్ అప్రాప్రియేట్ అడ్వయిజరీ కమిటీలను ఏర్పాటుచేసి, ఈ కమిటీల ఆధ్వర్యంలో తరచూ ప్రత్యేక సమీక్షా సమావేశాలు నిర్వహించనున్నది. అలాగే స్కానింగ్ కేంద్రాలపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించడం, చట్ట ఉల్లంఘనకు పాల్పడేవారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయడం, అక్రమార్కులపై కఠినంగా వ్యవహరించేలా ఈ కమిటీలకు ప్రభుత్వం అధికారాలిచ్చింది. ఈ చట్టాన్ని పటిష్ఠంగా అమలుచేయడం ద్వారా సమాజంలో ఆడ పిల్లల పట్ల వివక్షను తగ్గించేందుకు కలెక్టర్లు ప్రత్యేక చొరవ తీసుకోవాల్సిందిగా ప్రభుత్వం కోరింది. దీనిపై రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పట్టణాలు, గ్రామాల్లో విస్తృత రీతిలో ప్రచార కార్యక్రమాలు చేపట్టాలని స్పష్టం చేసింది. కాగా, తూర్పు గోదావరి జిల్లాలో 21 ప్రభుత్వ పరంగాను, 272 ప్రైవేట్ పరంగాను స్కానింగ్ కేంద్రాలున్నాయి. ఈ కేంద్రాలన్నీ రిజిస్టర్ అయి ఉన్నప్పటికీ, అనేక చోట్ల స్కానింగ్ కేంద్రాల్లో చట్టవ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నట్టు స్పష్టమవుతోంది. పలు స్కానింగ్ కేంద్రాల్లో గర్భస్థ శిశు లింగ నిర్ధారణ నిర్విఘ్నంగా జరుగుతున్నట్టు ఆరోపణలున్నప్పటికీ సంబంధిత శాఖల అధికారులు బాధ్యులపై చర్యలు తీసుకున్న దాఖలాల్లేవని పలువురు వాపోతున్నారు. లింగ వివక్షణ చూపే వారిపై కఠిన చర్యలు తీసుకోవడంతోపాటు స్కానింగ్ నిర్వహించే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి, సదరు స్కానింగ్ కేంద్రాలను సీజ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. లింగ నిర్ధారణ నిరోధక చట్టం 1994 నుండి అమలులోకి రాగా, ఇంతవరకు పూర్తిస్థాయిలో చట్టం అమలు కాకపోవడం పలు విమర్శలకు దారి తీస్తోంది. ఈ దశలో సంబంధిత అధికారులతోపాటు జాతీయ ఆరోగ్య మిషన్ కూడా అక్రమ లింగ నిర్ధారణపై కఠినంగా వ్యవహరిస్తే చాలా వరకు ప్రయోజనం ఉంటుందని వైద్య వర్గాలు సైతం సూచిస్తున్నాయి.