క్రీడాభూమి

వ్యూహాత్మక యుద్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆసీస్‌తో డే/నైట్ టెస్టుకు సిద్ధమన్న కివీస్ కోచ్
పెర్త్, నవంబర్ 23: ఆస్ట్రేలియాతో అడెలైడ్‌లోని ఓవల్ మైదానంలో శుక్రవారం నుంచి ప్రారంభం కానున్న చారిత్రిక డే/నైట్ టెస్టు మ్యాచ్‌కి తాము సిద్ధంగా ఉన్నామని న్యూజిలాండ్ క్రికెట్ జట్టు కోచ్ మైక్ హెసన్ అన్నాడు. ఇరు జట్ల మధ్య వ్యూహాత్మక యుద్ధం కొనసాగుతుందని చెప్పాడు. టెస్టు క్రికెట్ చరిత్రలోనే మొట్టమొదటిసారి గులాబీ రంగు బంతిని మొదటిసారి ఉపయోగిస్తున్న ఈ మ్యాచ్ తొలి డే/నైట్ టెస్టుగానూ రికార్డు పుస్తకాల్లో స్థానం సంపాదించనుంది. అత్యంత కీలకమైన ఈ టెస్టులో ఆధిపత్యం కోసం రెండు జట్లు కృషి చేస్తాయని సోమవారం నెట్స్ తర్వాత విలేఖరులతో మాట్లాడుతూ హెసన్ అన్నాడు. ఫలితంగా పోరాటం తీవ్రంగా ఉంటుందని జోస్యం చెప్పాడు. రాత్రి సమయాల్లో గులాబీ బంతి ఏ విధంగా స్వింగ్ అవుతుందో చెప్పలేమని అన్నాడు. పిచ్ ఎలాంటి బౌలింగ్‌కు సహకరిస్తుంది? అన్న ప్రశ్నకు కూడా సమాధానం లభించాల్సి ఉందన్నాడు. చివరి సెషన్‌లో బ్యాటింగ్ కష్టం కావచ్చని అనుమానం వ్యక్తం చేశాడు. పగటితో పోలిస్తే రాత్రి సమయాల్లో కొత్త బంతి బాగా స్వింగ్ అవుతుందని హెసన్ తెలిపాడు. మొట్టమొదటిసారి డే/నైట్ టెస్టు జరగనున్న తరుణంలో అన్ని కోణాల్లోనూ ఆలోచించి, వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఏర్పడుతుందని చెప్పాడు. ఇది ఒక ప్రయోగమని, ఇలాంటి చారిత్రక ఘట్టంలో భాగస్వాములం అవుతున్నందుకు ఎంతో సంతోషిస్తున్నానని కివీస్ కోచ్ అన్నాడు. మ్యాచ్‌కి అన్ని విధాలా సిద్ధంగా ఉన్నామన్నాడు.