వర్మకు దావూద్ దొరికాడు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
సంచలన దర్శకుడు వర్మ ఎప్పుడూ ఏదో సంచలనంతో వార్తల్లో నిలవడం ఆనవాయితీగా మారింది. ఇటీవలే ‘వంగవీటి’ పేరుతో సినిమా చేస్తానంటూ విజయవాడలో హంగామా చేసిన వర్మ ‘కిల్లింగ్ వీరప్పన్’ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నాడు. సంచలన వ్యక్తుల బయోగ్రఫీలను తీయడంలో సిద్ధహస్తుడిగా పేరుతెచ్చుకున్న వర్మ ఇప్పుడు మరో సంచలన సినిమాకు తెర లేపాడు. అండర్‌వరల్డ్ మాఫియా డాన్‌గా పేరుమోసిన క్రిమినల్ దావూద్ఇబ్రహీం, చోటారాజన్లకు సంబంధించిన నేర చరిత్రను వారిద్దరూ విడిపోయిన తర్వాత ముంబైలో మారిన పరిణామాలను చర్చిస్తూ సినిమా తెరకెక్కించనున్నాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ప్రీప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. దావూద్ పాత్రలో నటించే నటుడికోసం అనే్వషించిన వర్మకు ఆ పోలికలతో ఉన్న వ్యక్తి దొరికేశాడన్నారు. ఆ నటుడికి సంబంధించిన వివరాలేవీ ప్రకటించకుండా కేవలం ఫొటోలను విడుదల చేశాడు. ‘కిల్లింగ్ వీరప్పన్’ సినిమాలో నిజమైన వీరప్పన్ని చూపించిన వర్మ ఈసారి దావూద్‌ని కూడా ఒరిజినల్‌గానే చూపించే ప్రయత్నం చేస్తున్నాడని అన్నారు. మొత్తానికి ఈ సినిమా విడుదలైతే మరెన్ని సంచలనాలు రేకెత్తుతాయో చూడాలి.