రాష్ట్రీయం

అసహనమే లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మోదీకి పెరుగుతున్న ఆదరణ చూడలేకే
విపక్షాల విమర్శలు: బండారు దత్తాత్రేయ
మహబూబ్‌నగర్, నవంబర్ 28: దేశంలో అసహనమే లేదని, అది ఉండకూడదని, అసహనం ఉంటే మనిషి బతకలేడని భారతదేశమంటేనే ప్రజలు జీవించడానికి విశాలమైన హృదయంతో భారతీయత ఉంటుందని కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ అన్నారు. దేశంలో కొందరు పదవుల కోసం పాకులాడే వారు, పదవులు లేకుంటే ఇంకెవరికీ పదవులు రాకూడదని వారే అసహనానికి గురై ఆ ప్రభావం అందరిపై రుద్దడానికి కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. శనివారం మహబూబ్‌నగర్ బిజెపి జిల్లా కార్యాలయం నూతన భవనం ప్రారంభోత్సవానికి ఆయన ముఖ్య అతిధిగా హాజరయ్యారు. పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో దత్తాత్రేయ మాట్లాడుతూ ముఖ్యంగా ప్రదానమంత్రి నరేంద్రమోదీకి ప్రపంచదేశాల్లో పేరు ప్రఖ్యాతులు ఆదరణ పెరిగిపోవడంతో జీర్ణించుకోలేనివారు మాత్రమే దేశంలో అసహనం నెలకొందని తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. బిజెపి అంటే జాతీయత, దేశభక్తి అనే విధానంతో ముందుకెళ్తోందని, దేశాన్ని ప్రాణంగా భావించే నాయకులు, కార్యకర్తలు ఈ పార్టీలో ఉంటారని తెలిపారు. దేశంలో మతకలహాలు జరిగాయంటే అది కాంగ్రెస్ పాలనలోనే అని ఆరోపించారు. కుహనా లౌకికవాద సిద్ధాంతాలను దేశ ప్రజలపై రుద్దడంతో పలు సందర్భాల్లో మతకలహాలు చోటుచేసుకున్నాయని అందుకు ప్రధాన సూత్రధారి కాంగ్రెస్ అని విమర్శించారు. బిజెపి సిద్ధాంతం, తత్వం అభివృద్ధి, సుపరిపాలన, ప్రపంచదేశాల్లో భారతదేశమే గొప్పగా ఉండాలని కోరుకునే పార్టీ అన్నారు. కేంద్రం నుండి రాష్ట్ర ప్రభుత్వానికి సంపూర్ణ సహకారం అందుతుందని తెలిపారు. ఇటీవల తెలంగాణ రాష్ట్రంలోని 11 పట్టణాలకు రూ.416 కోట్ల నిధులను కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందని వెల్లడించారు. దేశవ్యాప్తంగా 40 కోట్ల మంది భవన నిర్మాణ కార్మికులకు స్మార్ట్‌కార్డు ద్వారా సామాజిక స్ఫూర్తితో ఇఎస్‌ఐ సదుపాయం కల్పించనున్నామని తెలిపారు. రాజకీయ పార్టీలకు ఓటమి, గెలుపులు సహజమని, ఓ రాష్ట్రంలో ఓడితే మరో రాష్ట్రంలో గెలవవచ్చని కానీ భారతీయ జనతా పార్టీ నాయకత్వం మాత్రం ఓటమి చెందినా గెలిచినా దేశభక్తి, సహనంతో భరతమాత కోసమే పనిచేస్తుందని దత్తాత్రేయ అన్నారు. ఏ మతాన్ని బిజెపి వ్యతిరేకించదని, అందరినీ కలుపుకునిపోయే ఏకైక పార్టీ బిజెపి అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి నాగం జనార్దన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే రావుల రవీంద్రనాథ్‌రెడ్డి, బిజెపి నాయకుడు నాగురావు నామాజీ, పద్మజారెడ్డి, ఆచారి, రతంగ్‌పాండురెడ్డి, బాల్‌రాజ్, శ్రీనివాస్‌రెడ్డి, శ్రీవర్థన్‌రెడ్డి, కొండయ్య పాల్గొన్నారు.