ఐడియా

చర్మసౌందర్యానికి ఖర్జూరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎంతో రుచికరంగా అనిపించే ఖర్జూరం చర్మ సంరక్షణకు దోహదపడుతుందని పరిశోధకులు తాజా అధ్యయనంలో కనుగొన్నారు. పలురకాల విటమిన్లు, ఖనిజాలు, పీచు, సుగర్ వీటిలో పుష్కలంగా లభిస్తాయి. వీటిలోని కాల్షియం, ఐరన్, పాస్ఫరస్, పొటాషియం, మెగ్నీషియం, జింకు వంటి ఖనిజాలు శక్తిమంతమైన పోషకాలుగా పనిచేస్తాయి. రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించేందుకు, శరీరంలో కొవ్వును నియంత్రించేందుకు విరివిగా ఖర్జూరం తీసుకోవాలి. ప్రోటీన్లు, పీచు కారణంగా ఎముకలకు దృఢత్వం వస్తుంది. రోజూ జిమ్‌కు వెళ్లి వ్యాయామం చేసేవారు వీటిని తింటే మంచి ఫలితం కనిపిస్తుంది. వీటిలోని విటమిన్ బి1, బి2, బి3, బి5, ఎ1, సి వల్ల శరీరంలో శక్తి పెరుగుతుంది. ఖర్జూరంలో గ్లూకోజ్, సుక్రోజ్, ఫ్రక్టోజ్ వంటి సహజ సిద్ధమైన సుగర్స్ వల్ల తక్షణ శక్తి అందుతుంది. వీటిలోని ఖనిజాల వల్ల కండరాలు, నరాల వ్యవస్థ మెరుగుపడుతుంది. దంత సంరక్షణకు, మెరుగైన రక్తప్రసరణకు అవకాశం కలుగుతుంది. రోజూ ఖర్జూరం తింటే జీర్ణక్రియ వృద్ధి చెందుతుంది. విటమిన్ సి, డి వల్ల చర్మం మృదువుగా ఉంటూ మంచి నిగారింపును సంతరించుకుంటుంది. చర్మ సంబంధ సమస్యల నుంచి నివారణకు తరచూ ఖర్జూరం తినడం ఉత్తమం. నానబెట్టిన ఖర్జూరం తింటే వెంటనే మానసిక ఉత్తేజం కలుగుతుంది. బరువు పెరగాలనుకున్నవారు కొన్నాళ్లపాటు వీటిని తింటే ఫలితం కనిపిస్తుంది. ఖర్జూరం పండ్ల నుంచి తీసిన రసాన్ని ఉదయానే్న అల్పాహారంగా తీసుకోవచ్చు. కేకులు, బ్రెడ్, బ్లాక్ కాఫీలో ఖర్జూరం ముక్కలు వేసుకుంటే మంచి రుచిని ఆస్వాదించవచ్చు.