ఆదివాసీల కోసమే దండకారణ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆర్.నారాయణ మూర్తి ప్రధాన పాత్రలో స్నేహ పిక్చర్స్ పతాకంపై రూపొందించిన చిత్రం ‘దండకారణ్యం’. ఈ చిత్రానికి సంబంధించిన అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి ఈనెల 18న విడుదలకు సిద్ధం చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆర్.నారాయణమూర్తి మాట్లాడుతూ, ప్రభుత్వం చేపట్టే గనులు, బాక్సైట్ తవ్వకాలవలన ఆదివాసీల మనుగడ లేకుండా పోతోందని, తద్వారా పర్యావరణమంతా కాలుష్యం బారిన పడుతోందని, వారి హక్కుల కోసం చర్చించే చిత్రమే దండకారణ్యం అని తెలిపారు. ఇటీవల విడుదల చేసిన పాటలకు మంచి ఆదరణ లభిస్తోందని, పాటలు పాడిన ప్రజా కవులు గద్దర్, వందేమాతరం శ్రీనివాస్‌లకు కృతజ్ఞతలు తెలుపుతున్నానన్నారు. త్వరలో విడుదల కానున్న ఈ చిత్రం అందరికీ నచ్చుతుందని ఆయన అన్నారు. ఈ చిత్రానికి కెమెరా:శివకుమార్, కథ, మాటలు, చిత్రానువాదం, ఎడిటింగ్, కొరియోగ్రఫి, కెమెరా, సంగీతం, నిర్మాత, దర్శకత్వం:ఆర్.నారాయణమూర్తి.