ధనం మూలం
డబ్బు- హీరో- థ్రిల్
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
అభిమాన హీరో సినిమా మొదటి రోజు మొదటి ఆట చూడడంలో ఉన్న థ్రిల్ ఎందులోనూ ఉండదు. మీరు చదువుకునే రోజుల్లో అలా మొదటి రోజు మొదటి ఆటకు వెళ్లిన అనుభవాలు మీకున్నాయా? చదువుకునే రోజుల్లో కొంత మంది ఇలా మొదటి రోజు మొదటి ఆటకు వెళ్లడమే కాదు కొందరు ఏకంగా తమ అభిమాన హీరో సినిమా విడుదలకు ముందు రోజు సినిమా హాలును కడిగి, అలంకరించే వారు. హీరో కటౌట్‌ను పాలతో కడిగి పూల మాలలు వేసేవారు. తమ తల్లిదండ్రులు మెడికల్ షాపుకు వెళ్లి మందు గోలీలు తెమ్మన్నా వినని కుర్రాళ్లు కూడా సినిమా హాలును కడిగి అలంకరించడం పవిత్ర కార్యంగా భావించే వాళ్లు. కాలం మారింది .. అభిమానులతో అలంకరించుకున్న సినిమా హాళ్లు ఎన్నో ఇప్పుడు మూత పడ్డాయి. ఇది మల్టీఫ్లెక్స్‌ల కాలం. ఆ కాలం నాటి స్థాయి అభిమానులు లేకపోవచ్చు కానీ మొదటి రోజు మొదటి ఆట సినిమా చూడక పోతే అభిమానానికి అర్థం లేదు, తమ జీవితానికి విలువ లేదు అని భావించే వారి సంఖ్య తక్కువేమీ కాదు.
మహేశ్‌బాబు, పవన్ కళ్యాణ్, జూనియర్ ఎన్టీఆర్ వంటి హీరోల సినిమాలు మొదటి రోజు మొదటి ఆటకు ఎంత ఖర్చయినా భరించి వెళ్లే అభిమానులకు కొదవ లేదు. మల్టీఫ్లెక్స్‌లో సినిమా అంటే ఒక్కోక్కరికి దాదాపు ఐదు వందల రూపాయల ఖర్చు.
హీరోలు కోట్ల రూపాయల పారితోషకాలు తీసుకుంటారు. దీపం ఉండగానే ఇళ్లు చక్కదిద్దుకోవాలి అన్నట్టు పారితోషకాన్ని రియల్ ఎస్టేట్‌లో, సినిమా హాళ్ల నిర్మాణంలో, హోటల్స్ నిర్మాణం, ఇతర రంగాల్లో పెట్టుబడులు పెడుతున్నారు. ఇటు సినిమాల్లో ఆదాయం మరోవైపు తమ పెట్టుబడులపై ఆదాయం. అది వారి వృత్తి చట్టబద్ధంగా సంపాదించిన డబ్బు వారు ఎక్కడైనా పెట్టుబడి పెట్టుకోవచ్చు.
హీరో సినిమా అభిమానికి రెండు గంటల పాటు బోలెడు సంతోషాన్న ఇస్తుంది. సినిమా భాషలో చెప్పాలి అంటే బోలెడు కిక్ ఇస్తుంది. అదే హీరోకు పాపులారిటీ, కోట్ల రూపాయల సంపాదన, ప్రజల్లో అభిమానం. వయసు మీరిన తరువాత ఈ అభిమానాన్ని రాజకీయాల్లోకి కూడా మళ్లీంచి ప్రయోజనం పొందవచ్చు. మరి అభిమాని రెండు గంటల కిక్ తరువాత లెక్కలు వేసుకుంటే జేబులో ఐదు వందలు మైనస్ తప్ప ప్లస్ అంటూ ఏమీ ఉండదు.
నిజమే ఇది అందరికీ తెలిసిందే... ధనం- మూలంకు అభిమానుల కిక్కు సంబంధం ఏమిటి? అనే కదా? సందేహం.
ఐదు వందలు ఖర్చు పెట్టి రెండు గంటల కిక్‌ను కొంటున్నాం కదా? ఇదే ఐదు వందల రూపాయలతో జీవిత కాలమంతా ఉండే కిక్‌ను కొనుక్కునే అవకాశం వస్తే మీరేం చేస్తారు. ఎగరి గంతేస్తారు కదూ! నిజానికి ఎగిరి గంతేయాల్సిందే కానీ చాలా మంది ఇది తెలియక అలా చేయడం లేదు.
చాలా మంది యువతకు వారానికి ఒక సినిమా చూసే అలవాటు ఉంటుంది. అంటే నెలకు నాలుగు సినిమాలు. ఇప్పటి నుంచి ఒక పని చేయండి. నాలుగు వారాల్లో ఒక వారం సినిమాకు వెళ్లకండి. అదే సినిమా నెల గడిస్తే టీవిలో వస్తుంది. అప్పుడు టీవిలో చూడండి. ఆ ఐదు వందల రూపాయలను స్టాక్మార్కెట్లో పెట్టుబడి పెట్టవచ్చు.
డబ్బు ఇచ్చిన కిక్ మరేదీ ఇవ్వదు. స్టాక్ మార్కెట్ గురించి అవగాహన లేదు. అదో అర్థం కాని సబ్జెక్ట్ ఇప్పుడు దాని గురించి తెలుసుకునే ఓపిక లేదు అంటున్నారు. అవసరం లేదు. స్టాక్ మార్కెట్ గురించి తెలుసుకోవలసిన అవసరం లేదు. ఇలాంటి వారి కోసమే మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి. మన తరుఫున వాళ్లు స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెడతారు. స్టాక్ మార్కెట్లో పెట్టుబడి అంటే లక్షల రూపాయలు అవసరం అనే అపోహతో ఉన్నారేమో! చాలా మందికి తెలియదు కానీ ఇళ్లల్లో పని చేసే పని మనుషులు సైతం ఈజీగా పెట్టుబడి పెట్టవచ్చు. అంతే నెలకు కనీసం ఐదు వందల రూపాయలు కూడా మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టవచ్చు. మీరు కొత్తగా ఉద్యోగంలో చేరిన వారు కావచ్చు. కనీసం నెలకు ఐదు వందల రూపాయలు పొదుపు చేయలేరా? మీరు నెలకు నాలుగు సినిమాలు చూసే విద్యార్థి కావచ్చు మీ భవిష్యత్తు కోసం ఒక సినిమాను తగ్గించుకుని మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టవచ్చు. సిప్ విధానంలో బ్యాంకు ముందే ఆదేశాలు ఇవ్వ వచ్చు. మీ ఖాతా నుంచి ప్రతి నెల మీరు పేర్కొన్న తేదీ నాడు ఐదువందల రూపాయలు మ్యూచ్‌వల్ ఫండ్స్‌లోకి వెళతాయి. రెండు గంటల పాటు వినోదాన్ని ఇచ్చే సినిమా ఖర్చు ఐదు వందలు. మీ భవిష్యత్తు అవసరాలు తీర్చే ఇనె్వస్ట్‌మెంట్ వ్యయం కూడా అంతే. ఐతే ఈ ఐదు వందల రూపాయలు క్రమ పద్దతిలో ప్రతినెలా ఇనె్వస్ట్ చేయడం వల్ల మీరు ఊహించని విధంగా పెట్టుబడి లాభాలు సమకూరుస్తుంది. ఈ రోజు ఇనె్వస్ట్ చేసి తెల్లవారగానే ఎంత లాభం వచ్చిందని చూసుకుంటే నిరాశ కలగవచ్చు. అలా కాదు ఇనె్వస్ట్‌మెంట్ అనేది దీర్ఘకాలంగా ఉండాలి. మార్కెట్ ఎంత అధ్వాన్న పరిస్థితిలో ఉన్నా ఒక దశాబ్ద కాలం చూసుకుంటే మ్యూచువల్ ఫండ్స్ దాదాపు పనె్నండు శాతం వరకు లాభాలను ఇస్తున్నాయి.
సినిమాకు పెట్టిన ఖర్చు ఎంత కాలం అయినా మీకు తిరిగి ఇవ్వడం అంటూ ఉండదు కదా? కేవలం నెల రోజులు నిరీక్షిస్తే అదే సినిమాను ఇంట్లో కూర్చోని టీవిలో చూడవచ్చు. కానీ ఆ ఐదు వందల రూపాయలు మీ కోసం మార్కెట్లో పని చేస్తుంది. మీకు రేపటి కోసం ఉపయోగపడుతుంది. చుక్క చుక్క నీరే సముద్రం అయినట్టు ఐదేసి వందల రూపాయలే పెద్ద మొత్తంగా మారుతాయి. మీరు పెట్టుబడి పెట్టిన మ్యూచువల్ ఫండ్స్ మార్కెట్ విలువను ఏ రోజుకు ఆ రోజు చూసుకోవచ్చు. మీ పది రూపాయల పెట్టుబడి పదకొండు రూపాయలుగా మారడం వంటి అంకెలు రోజూ చూస్తుంటే సినిమాకు మించిన థ్రిల్ ఇస్తుంది. మీ కోసం మీరు కష్టపడడం కాదు. మీ కోసం మీ డబ్బు కష్టపడడం చిన్న వయసులోనే అలవడితే అంతకు మించిన థ్రిల్లింగ్ ఉండదు. ఐదు వందల రూపాయలు అంటే ఈ రోజుల్లో పిల్లల వారం రోజుల పాకెట్ మనీ. పాకెట్ మనీతో మనీ సంపాదించడం చదువుకునే రోజుల్లోనే అలవాటు ఆయితే జీవితంలో వారికి డబ్బు పట్ల పూర్తి అవగాహన ఏర్పడుతుంది. భవిష్యత్తు జీవితానికి ఉపయోగపడుతుంది. పాకెట్ మనీనే కాదు ఒకవేళ మీరు ఉద్యోగులు అయితే పన్ను ఆదా సదుపాయం ఉన్న మ్యూచువల్ ఫండ్స్‌లో సిప్ విధానం ద్వారా పెట్టుబడి పెట్టవచ్చు. ఒకవైపు పన్ను రాయితీ మరోవైపు డబ్బు డబ్బును సంపాదించడంలో థ్రిల్ అనుభవించడం. అనేక బ్యాంకులు మ్యూచువల్ ఫండ్స్‌ను నిర్వహిస్తున్నాయి. ఇంకెందుకాలస్యం.