ధనం మూలం

మార్వాడీల విజయ రహస్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘ఈ రోజుల్లో కూడా కులాలు ఉన్నాయా? కులాలు, మతాలు మనం సృష్టించుకున్న కృత్రిమ గోడలు. నిజానికి ఇవేమీ లేవు.’’ చాలా మంది మేధావుల నుంచి ఇలాంటి మాటలు తరుచుగా వినిపిస్తుంటాయి. ఒకవైపు కుల సంఘాలకు నాయకత్వం వహిస్తూ మరోవైపు ఈ రోజుల్లో కూడా కులాలా? అని మనం నిర్మొహమాటంగా చెప్పగలం. కులాలు లేని సమాజం ఏర్పడాలని కోరుకుందాం తప్పు లేదు. కానీ అవి ఉన్నాయి అనేది వాస్తవం. మన ఆర్థిక అలవాట్లు, సంపాదన, మనం పెట్టుబడి ఆలోచన వీటన్నిటిపైన మన కుటుంబ వాతావరణం ఆధారపడి ఉంటుంది. సామాజిక వర్గాలు ఉన్నాయి. ఆర్థిక వ్యవహారాల్లో ఒక్కో సామాజిక వర్గం ఆలోచన ధోరణి ఒక్కో రకంగా ఉంటుంది. ఇది వాస్తవం. రాజస్థాన్ అనగానే తాగునీటి కోసం కూడా కిలోమీటర్ల దూరం వెళ్లే ఆడవారు గుర్తుకు వస్తారు. అదో ఇసుక ఎడారి. భౌగోళిక పరిస్థితుల దృష్ట్యా దేశంలో అత్యంత వెనుకబడిన ప్రాంతంగా రాజస్థాన్ ఉండాలి.
కానీ దేశంలో ఏ మూలకు వెళ్లినా సక్సెస్‌ఫుల్ రాజస్థానీ మార్వాడీలు కనిపిస్తారు. మొఘలాయిల కాలంలో వీరు మొఘలాయిలకు బ్యాంకర్లు. మార్వాడి జగత్ సేఠీ కుటుంబం మొఘలాయిలకు బ్యాంకర్లు. మొఘలాయిలు, బ్రిటీష్ పాలకులు సైతం వీరికి వ్యాపార రంగంలో అండగా నిలిచారు. చివరకు వీరు స్వాతంత్య్ర ఉద్యమ కాలంలో కాంగ్రెస్‌కు సైతం సహాయ సహకారాలు అందించే వారు. 1991లో దేశంలో ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టేంత వరకు దేశ ఆర్థిక వ్యవస్థ వీరి చేతిలో ఉండేది. ఆర్థిక సంస్కరణల తరువాత విదేశీ పెట్టుబడులు పెరగడం వల్ల వీరి వాటా తగ్గింది.
ఆర్థికంగా మాత్రం ఇప్పటికీ వీరే బలవంతులు. వ్యాపారులు కనిపిస్తారు.
ఇదేమీ సామాజిక వర్గాల గురించిన చర్చ కాదు. ఒక సామాజిక వర్గం గొప్పది, మరోటి కాదు అని చెప్పడం కాదు. దేశంలోనే అత్యంత విజయవంతమైన వర్గంగా ఉన్న వారి విజయానికి కారణం ఏమిటో తెలుసుకోవాలి. ఎవరు విజయం సాధించినా దానిలో మంచిని స్వీకరించడం తప్పేమీ కాదు. ఒక విజేతను స్ఫూర్తిగా తీసుకుని ఆదే మార్గంలో పయనించి మనం కూడా విజయం సాధించాలి అనుకోవడం తప్పేమీ కాదు. కరువుకు, ఇసుక ఎడారికి కేరాఫ్ అడ్రస్ లాంటి రాజస్థాన్‌లో ఒక ప్రాంతానికి చెందిన వారు మార్వాడి. ఈ పేరు సక్సెస్‌కు, సంపదకు మారుపేరుగా నిలిచిపోయింది. ఎడారి ప్రాంతానికి చెందిన వారు దేశమంతా విస్తరించడం, విజయం సాధించడం అంటే కచ్చితంగా వారి గురించి తెలుసుకోవాలి, మంచి ఉంటే నేర్చుకోవాలి.
మహానగరంలోని మన కాలనీలో సక్సెస్‌ఫుల్ షాప్ ఎవరిది అంటే మార్వాడిలదే, పట్టణాల్లోనూ వారే... ఉపాధి కోసం మన వాళ్లు ఎక్కడో గల్ఫ్ దేశాలకు, ఇతర రాష్ట్రాలకు, విదేశాలకు వెళుతుంటే వాళ్లేమో మన నగరంలోనే కాదు దేశమంతా విస్తరించారు. విదేశాల్లోనూ వ్యాపారంలో దూసుకువెళుతున్నారు.
డబ్బుకు సంబంధించి వారి గురించి మనకున్నవి ఎక్కువగా అపోహలే. కానీ డబ్బుకు విలువ ఇవ్వడం అనేది వారి జీవన విధానంలోనే ఉంటుంది. అదే వారి విజయ రహస్యం అంటారు ఆర్థిక రంగ నిపుణులు. మార్వాడీల విజయ రహస్యం, ఆర్థిక అంశాలపై వారి ఆలోచనా దోరణి గురించి ఇటీవల పుస్తకాలు వచ్చాయి. అదే విధంగా కొన్ని వీడియోలు కూడా రూపొందించారు. అందులో డబ్బుకు సంబంధించి వారి ఆలోచనా ధోరణి ఎలా ఉంటుందో వివరించారు.
సాధారణంగా మార్వాడీలు పిసినారులు అని ఇతరులు విమర్శిస్తారు. డబ్బుకు విలువ ఇవ్వడం పిసినారి తనం ఎలా అవుతుంది. తాను ఒక రూపాయి పెట్టి ఒక వస్తువు కొన్నా, రూపాయిని ఎక్కడైనా ఇనె్వస్ట్ చేసినా దానికి తగిన ప్రయోజనం ఉంటుందా? లేదా అని మార్వాడి ఆలోచిస్తారు. కష్టపడి సంపాదించిన డబ్బును విచ్చల విడిగా దుబారా చేయాలా? నెలకు 20వేల రూపాయల జీతంతో పని చేసే ఉద్యోగి కూడా ఐ ఫోన్‌కు 60వేల రూపాయలైనా ఖర్చు చేస్తారు. వాయిదాలపై లక్ష రూపాయల టీవీనైనా కొంటారు. ఇలాంటి ఆలోచనా ధోరణిలో ఉన్నవారు కచ్చితంగా జీవిత కాలమంతా అప్పుల్లోనే మునిగిపోతారు. నీ జీతం 20వేలు అయినప్పుడు సెల్‌ఫోన్ కూడా ఆ స్థాయిలోనే ఉండాలి కానీ అప్పు చేసి ఖరీదైన టీవీలు, సెల్‌ఫోన్‌లు కొనడం ఎందుకు? మార్వాడీలు తమ పెట్టుబడికి తగిన రిటర్న్స్ ఉండాలని కోరుకుంటారు. అదే విధంగా తాము పెట్టే ఖర్చు విషయంలో ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తారు. ఈ ఖర్చు అవసరమా? మనం పెడుతున్న ఖర్చుకు తగిన విలువైన వస్తువునే కొంటున్నామా? అని ఆలోచిస్తారు.
చిన్నప్పటి నుంచే వారికి మనీ మేనేజ్‌మెంట్ గురించి అవగాహన ఉంటుంది. ఒక ఎం.బి.ఏ. విద్యార్థి తరగతి గదిలో వ్యాపారంలో నేర్చుకున్న దాని కన్నా ఇంట్లోనే వ్యాపారి కుటుంబంలోని వ్యక్తికి అనుభవ పూర్వకంగా వ్యాపారం గురించి ఎక్కువ తెలుస్తుంది.
మార్వాడి నిరంతరం తన వ్యాపారాన్ని, సంపదను పెంచుకుంటాడు. సంపన్నులు కావడమే కాదు నిరంతరం సంపన్నులుగా ఉండాలి అనేది మార్వాడీలు చిన్నప్పటి నుంచి అనుభవంతో నేర్చుకుంటారు. ఇది మనకు కొంత చిత్రంగా అనిపించవచ్చు. ఇది మనకు కొంత చిత్రంగా అనిపించవచ్చు. ఒకసారి సంపన్నుడు అంటే సంపన్నుడే కదా? నిరంతరం సంపన్నుడిగా ఉండడం ఏమిటనిపించవచ్చు. ఎన్టీఆర్, ఏయన్‌ఆర్‌లు నెల జీతంపై నటిస్తున్న కాలంలోనే సూపర్‌స్టార్‌గా సినిమాకు లక్ష రూపాయలు తీసుకున్న చిత్తూరు నాగయ్య సంపదకు కొదవ లేదు. అలాంటి వారు చివరి దశలో తిండికి సైతం కష్టపడాల్సిన దుస్థితి ఎదుర్కొన్నారు. ఒకసారి సంపన్నులు అయితే శాశ్వతంగా ఉండాలనేమీ లేదు. దాన్ని నిలుపుకోవడం మన చేతుల్లోనే ఉంటుంది. ఈ విషయం మార్వాడీలకు బాగా తెలుసు, అందుకే వారు సంపద అనే దానికి అంతు ఉండదని, నిరంతరం సంపద పెంచుకుంటూ పోవాలనుకుంటారు. మన చేతిలో ఉన్న డబ్బు శాశ్వతంగా మన వద్దే ఉంటుందని చెప్పలేం, అది పోవచ్చు అనే భావనతో వారు సంపాదించడం అనేది నిరంతరం సాగాలని కోరుకుంటారు. సంపాదించడం, ఇనె్వస్ట్ చేయడం ఈ రెండూ ఎప్పుడూ నిలిపివేయవద్దు కొనసాగించాలి అనేది వీరి నమ్మే సిద్ధాంతం. వ్యాపారంలోనైనా, పెట్టుబడుల్లో నైనా వీళ్లు తక్షణ లాభాల కోసం చూడరు. దీర్ఘకాలిక లాభాలకు ప్రాధాన్యత ఇస్తారు. ఎప్పటికప్పుడు వీరు లెక్కలు వేసుకుంటారు. దీని వల్ల వ్యాపారంలో మోసాలు ఉండవు, లెక్కలు వేసుకోవడం వల్ల తాము వెళుతున్న దారి సరైనదేనా, తప్పటడుగులు పడుతున్నాయా? అనేది ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇలాంటి ఆలోచనా ధోరణే మార్వాడీలను దేశంలో వ్యాపార రంగంలో ముందు వరసలో నిలబెట్టింది. మార్వాడీ వ్యాపారులకే కాదు డబ్బుకు విలువ ఇవ్వడం అందరికీ అవసరమే!

-బి.మురళి