డైలీ సీరియల్

విలువల లోగిలి-2

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అప్పటికే పావుగంట దాటింది. అలా క్షణాలు దొర్లిపోతున్నాయి. ఆ భయాన్ని పోగొట్టుకోవటానికి ఆలోచనలను ప్రక్కదారి పట్టించింది.
నిన్నటిదాకా ‘చలి’తో చచ్చిపోయాం. ఈరోజు ఇంత ఎండగా ఉందేం? అప్పుడే ఎండాకాలం వచ్చేసిందా? ఇంట్లో ఉంటే తెలియటంలేదా? ఏమో? క్షణాల్లో వాతావరణం మారిపోయినట్లు అనిపిస్తోంది.
‘‘మీరు భోంచేసి బయలుదేరారా?’’ అడిగాడు అతను.
‘‘ఆఁ! తినే బయలుదేరాను’’’
‘‘నేను చేయలేదు. ఆగితే మీకు ఆలస్యమైపోతుందేమో’’-ఎటూ చెప్పలేని పరిస్థితి. అయినా తోటి మనిషిని ఆకలితో ఉంచలేదుగా.
"ఫరవాలేదండి.. మీరు తినండి’’ అనటంతో వౌనం వహించాడు కాసేపు.
‘‘బంధువులింటికి వెళ్లివస్తున్నాను’’ అన్నాడు కాసేపటి తర్వాత.
‘‘మరి అక్కడ భోజనం చెయ్యలేదా?’’
‘‘లేదు.. అలాచేయటం నాకిష్టముండదు’’.
ఎందుకో తెలిసినా ‘అదేం?’ అని అడిగాను.
‘‘అదంతే. ఎవరూ మనస్ఫూర్తిగా ఆదరించటంలేదు. అది సొంత కూతురయినా. అందుకే నేను బయటే తింటాను’’
‘‘ఆత్మాభిమానం వున్న మనిషన్నమాట’’ మనసులో అనుకోకుండా ఉండలేకపోయింది.
చల్లని గాలి, దూరంగా బొమ్మలా కదిలిపోతున్న రైలూ, చుట్టూ పచ్చ పచ్చని చెట్లూ, పలకరించకపోయినా వెళుతూ వస్తూ కనిపిస్తూన్న మనుషులూ, లారీలు, బస్సులు, ఆటోలూ, సైకిళ్ళూ..ఒకటేమిటి అన్నిటినీ అలా గమనిస్తూ కాలక్షేపం చేస్తోంది.
ఆమె ఆలోచనలకు బ్రేక్ పడినట్లు ఒక హోటల్ ముందు బండిని ఆపాడు.
‘‘రండి లోపలకు’’ అనటంతో-
‘‘నేను రాను.. మీరు వెళ్లి తినేసిరండి.. నేనిక్కడే ఉంటాను’’
"భలేవారే! మిమ్మల్ని వదిలేసి నేనెలా తింటాను. రండి’’ అనటంతో రోడ్డుమీద బెట్టుచేయడం బాగోదని అతన్ని అనుసరించాను. కౌంటరులో ముందుగానే బిల్లు చెల్లించాడు.
అంతా బఫే సిస్టం. రెండు రవ్వ దోసెకు ఆర్డరిచ్చాడు. తనే వెళ్లి తీసుకువచ్చాడు.
ఈ పద్ధతిలో బిల్లు కట్టకుండా పారిపోయే వాళ్ళను అరికట్టవచ్చు అనుకున్నాను మనసులో.
ఎవరైనా చూస్తారేమో అనే శంక పీడిస్తున్నా, తినాలని అనిపించకపోయినా అతనికోసం తినక తప్పలేదు.
కొన్ని ఇష్టం లేకపోయినా చేయాలంటారు ఇదేనేమో అనుకోకుండా ఉండలేకపోయింది.
‘‘టీ, కాఫీ ఏమైనా తాగుతారా’’ అని అడిగాడు మళ్లీ.
‘‘వద్దండీ.. నాకు అలవాటులేదు’’ అన్నాను.
‘‘సరే.. మధ్యలో కొబ్బరి బోండాం తాగుదాంలెండి’’ అన్నాడు. ఇద్దరం బయటకు వచ్చాం. బండి ఎక్కాం.
ఈసారి కాస్త ఇబ్బందిగా అనిపించింది. అతను కాస్త వెనక్కి వచ్చినట్లున్నాడు. నాకు ఒక కాలు ఫెడల్ మీద పడుతోంది. మరొకటి పడటంలేదు. అలా కూర్చొని బ్యాలెన్స్ చేసుకోవడం కష్టంగానే వుంది.
ముఖమాటాన్ని వదిలి ‘కాస్త ముందుకు జరగండి’ అన్నాను. ‘‘మీరు చివరకు వెళ్లిపోతున్నారు, అలా అయితే పడిపోతారు’’ అంటున్నాడు ఏమీ తెలియనట్లే.
అందుకే కదా ముందుకు జరగమంది. ఇక విశ్వరూపం చూపిస్తాడా ఏం అన్నట్లు ఆమెలో అనుమానం మొదలయ్యింది.
ఇంతకుముందు సరిపోయిన స్థలం ఇపుడు ఎందుకు సరిపోవడంలేదు. కావాలనే చేస్తున్నాడా? కోరి తెచ్చుకున్న కష్టం. ఏదో కాస్త కదిలినా కష్టంగానే ఉంది. ఏం చేయాలో తెలియటంలేదు. దిగితే బస్సు ఎక్కలేం. తన అసహాయతను అతను క్యాష్ చేసుకోవాలని చూస్తున్నాడా?
తను అలాంటిది కాదని ఇతనికి ఎలా చెప్పాలి? ఒకసారి అతని బండి ఎక్కాక ఏం చెప్పినా అతను నమ్మడు అంది అంతరాత్మ.
‘మీరు కొద్దిగా ముందుకు జరగండి’ అంది మొండిగా. సరే అంటూ కాస్త కదిలాడు. అది తనకు చాలదు.
‘ఇంకొంచెం’ మొహమాటపడితే లాభం లేదని.
బండి ఎక్కేటప్పుడే ఆలోచించాలి. ఎక్కాక నడుము పట్టుకుని కూర్చోవాలి. లేదంటే ఇద్దరికీ ప్రమాదం.
ఇతను మంచిగా చెబుతున్నాడా? చెడుగా చెబుతున్నాడా? అసలు మంచివాడైతే తనను ఇలా ఇబ్బంది పెడతాడా?
ఏమో ఏమీ అర్థం కావటంలేదు.
పోని ఆపేసి దిగేస్తే బస్సు ఎక్కటానికి డబ్బుల్లేవు. అది ఇతనికి అర్థమై ఇలా ప్రవర్తిస్తున్నాడా?
ఏది ఏమైనా ఇతనికి తను చెప్పాల్సింది చెప్పెయ్యటమే.
‘‘నేను అందరినీ నా సహోదరులు అనుకుంటాను. భారతీయులంతా మన సహోదరులు అన్నట్లు అన్నమాట’’- ఈ దెబ్బతో తనపైన ఏదైనా చెడు భావం ఉంటే పోవాలని.
‘‘పద్ధతిగానే మాట్లాడుతున్నారు’’ అన్నాడు.
‘‘అంటే ఏమిటి ఇతని ఉద్దేశ్యం? మాటల్లోనే గానీ, చేతల్లో పద్ధతి లేదని దెప్పిపొడుస్తున్నాడా? అవసరానికి ‘లిఫ్ట్’ ఎక్కానని తక్కువగా చూస్తున్నాడా?’’
వౌనం వహించడం మంచిదనిపించింది.
మళ్లీ కొబ్బరిబోండాలకు ఆపాడు.
త్రాగి బయలుదేరాం. మళ్లీ సమస్య. ఈసారి కావాలని చేస్తున్నట్లనిపించింది. బురదలోకి దిగాక కాళ్ళు కడుక్కోవటం తప్పదు అన్నట్లుంది పరిస్థితి.
అతనికి తెలుసు, తను ఇబ్బందిగా కూర్చుంటోందని. తనే ముందుకు జరగాలని చూస్తున్నాడు. ఇలా అయితే తను పడిపోతుందేమో. ఏమిటీ తిప్పలు. అసలు ఎక్కకపోయినా బాగుండేది. ఏదోలా వెళ్లి ఇంటర్వ్యూ అటెంట్ అవగలుగుతున్నానన్న ఆనందం ఆవిరవుతోంది. తోటివాళ్లలో అక్కని చెల్లిని చూసుకోలేరా? ఇలా చూసుకోగలుగుతారని అనుకోవటం కూడా భ్రమేనా?
‘‘మొదట్లో బాగానే వుంది. ఇప్పుడేంటి కూర్చోవటానికి ఇబ్బందిగా ఉంది’’ అంది ఏమీ తెలియనట్లే.
అప్పుడు మళ్లీ కొంచెం ముందుకు జరిగి సర్దుకూర్చున్నాడు. అప్పుడప్పుడు చుట్టూ చూస్తున్నాడు.
అలా ఎందుకు చూస్తున్నాడు?
మనసులో శంక మొదలైంది.
‘‘మీ మెడలో బంగారం ఉంది. ఇప్పుడు లిఫ్ట్ ఎక్కితే ఎక్కారు కానీ ఇక ముందు ఎక్కకండి’’ అన్నాడు.
‘‘బాబోయ్! ఇది కూడా గమనిస్తున్నాడా? మైగాడ్. ఇది నకిలీదని పిచ్చివాడికి తెలియదు. అంత బంగారం తన ఒంటిమీద వుంటే తాకట్టు పెట్టి బస్సు ఎక్కుతుంది కానీ ఇలా ఇబ్బందిపడుతూ ఇతని వెంట వెళ్తుందా? ఆ మాత్రం అతనికి తెలియలేదా?’’
‘‘అవును.. కరెక్టుగానే చెప్పారు. ఇంకెప్పుడూ ఎక్కనులెండి’’ అన్నా. దారిలో ఏదో యాక్సిడెంటయినట్లుంది.
- ఇంకా ఉంది

-యలమర్తి అనూరాధ 9247260206